నమ్మిక

గడీలు వొయినయి… బురుజులు వొయినయి - పల్లెలిడ్శిన దొరలంత పట్నంగడ్డెక్కిండ్రు. గాడ గడీలు లెవ్వుగని అంత్రాల బంగ్లాలచ్చినయి. సందులు గొందులు వొయి పెద్ద డాంబర్‌ రోడ్లయినయి… తీరొక్క మోటర్లచ్చినయి బుర్రు..బుర్రు.. రోడ్డు దాటనీకి ఎప్పుడూ సందే ఉండది. ఇగ ఎసుంటోల్లు గీ పట్నం తొవ్వనేవట్టవట్రి. అందరోలె అన్మంత్రావు దొర పట్నం కచ్చి బంగ్ల  గట్టిండు.. జాగలు గొన్నడు.. ప్యాట్రీల్ల పొత్తుల్వెట్కున్నడు.
ఎంత పనున్నా మొన్నటిదాంక దసురకో ఉగాదికో ఊర్లెకచ్చి పండుగ జేస్తుండె. పని బాటలోల్లకు ఇనాము దొర్కుతదని దొర ఎప్పుడస్తడాని ఎదిరిజూశెటోల్లు - ఊల్లె నర్శిగాడు దొరకు నమ్మిన బంటు. అన్నిట్కి ముందట్కచ్చి ఏది తక్కవడకుంట, కోడంటె కోడి.. శాపలంటే శాపలు దెచ్చిపెట్టేటోడు. శేస్తందుకు పనిల రెక్కలు దాస్కునెటోడు గాదు. ఏలోతుపాతులు దెల్వనోడు, మాయ మర్మాలు దెల్వనోడు. దొరంటే పానమిస్తందుకుగ్గూడ తయారుంటడు.
గీ పట్నంల కోటగట్టుకున్నట్టె అన్మంత్రావు దొరది పేద్ద బంగ్ల. సుట్టూ నిలువెత్తు గోడ, పేద్ద గేటు.. తొవ్వ పొడ్త చమన్‌ చెట్లు… మక్మలే బట్ట వర్సినట్టు గనపడే పచ్చటి గడ్డి వాకిలంతా. మొకం గానచ్చె బండల మీద తెల్లటి కారు !
తోట్ల ఏదో సగవెట్టుకుంట పనోల్లు ఇటుఅటు మసుల్లాడుతుండ్రు. మీది బంగ్లల ఉయ్యాల మీద గూకొని ఆకు ఇడెం దవుడకు వెట్టింది దొర్సాని. ఇరాము దొర్కని దొర పుర్సత్‌జేస్కున్నట్టుండు…     ఊరు జూశచ్చి యాడాదయ్యింది! ఊరు సంగతి గుర్తుకచ్చి ఏదో జెప్తుండు. దొర్సాని రాణెమ్మ ముచ్చటైతె ఇంటుంది గని సూపైతె తోటదిక్కువెట్టింది. సట్టుక్కున లేశి ముంగట్కచ్చి ‘ముంగటున్న పూల తోటకు నీల్లస్తున్నయా? అసలే మనకు నీల్లకు కటకటగావట్టే, బోర్లు వోస్తనేలేవుఇగ శెట్లెండితె పూలు పూస్తయా? తోటేమన్న సూడబుద్దైతదా?’ శేతులు దింపుకుంట దొర్సాని వల్లిస్తనే ఉంది. ”గదేమల్ల.. ఆడోల్ల దిమాకంటే! నేను నీకంటే నాల్గిమ్మాలెక్కజద్విన. గాడ నీళ్ళు గుంజేది మన మోటరే గాదు, ఏరాత్రో ఏ పగలో పెద్దపోశిగాన్ని జూస్కొమ్మన్న. దసరకు బట్టలు గుట్టిస్త వారీ! అని జెప్పిన” గుడ్లు పెద్దగ జేశి మీసాలు సగవెట్కుంట పక్కకు జర్గిండు-
నర్శిగాడు బంగ్ల కిందికి జేరిండు. ‘దొర్సానీ… ఓ దొర్సానీ… దొర లేడవ్వ?’ అన్కుంట తంతెలకాడికి జేరిండోలేదో ఎదురొచ్చిన దొరకు దండం బెట్కొని, ‘దొరా.. దొరా…! గాలోల్లో కొత్తోల్లచ్చిండ్రు, తోటెన్క తావులన్ని జూశిండ్రు… ఏమిట్కో పన్కస్తయని మాట్లాడుకుంటుండ్ర’ని నర్శిగాడు జాగమాటెత్తంగనే దొర మొకం ఎన్నీలపంతైంది! ఖుషి తోటి ముశి ముశి నగిండు. అద్దంల మొకం జూసుకొని, పట్టుశెల్ల బుజాలమీదేశి రయ్‌న దొర్సాని దిక్కు దిర్గిండు. ‘గీనడ్మ జాగలకు మంచి గీరాకున్నది ఏర్కెన?’ అవునన్నట్టు తల్కాయూపిన దొర్సాని సప్పుడుజెయ్యక్‌  మన్నట్టు సైగ జేసి పక్కరూంలకు దొల్కపోయింది. దొర్సాని పిల్సుడుతోటి ఎన్కకు దిర్గి చూడకుంట లోపటర్రలకు తొవ్వవట్టిండు - దొరను ఉశారుజేశే ముచ్చట్లు సురువెట్టింది. ‘జాగలు ఎవలు జూడచ్చిండ్రో జర మంచిగ జూడు… వోపికవట్టి జూడు… నడీతల్కెల్లి రింగు రోడ్డు వోతోందట. రొండు దిక్కుల మంచిగా దరవల్కుతది..!’ ‘అవుమల్ల’! తల్కాయూపిండో లేదో మల్లందుకుని ‘ప్యాట్రీల కోసం అడుగుతరు… అపార్టుమెంట్లని అంత్రాల బంగ్లలుగడ్తరు! ఆపక్క ఈపక్క అంగూర్‌తోట వోనియ్యకు, అది మాఅమ్మగారిచ్చింది. మనకు అన్నిట్కి కల్శచ్చింది. మామిడి తోట మాట దీశేవు, అది మందుల కంపినోల్లకు మాటైంది గుర్తున్నది గద? ఇగ శెరువుముంగటి రాళ్ళ గుట్టం సంగతేమన్నుంటే గదిగూడజూపియ్యి…’
‘ఇంటున్న.. ఇంటున్న.. అంత మన్సునవట్టింది. నేనేమన్న గాలికెగవోస్తనాయే? దీనికి ఇంకో తరీకున్నది. మనమే అంత్రాల బంగ్లలు గడ్దాం..! ఒగ దావఖాన వెడ్దాం.. గండ్లనే పెద్ద ఇస్కూల్‌
గట్టిద్దాం.. ఇగ మనదే ఓగల్లైతది.. పట్నమైతది..! మన పతార మనకుంటది.. మన పెత్తనం మనతానుంటది!’. నాల్గాకులు ఎక్కజద్విన దొర మన్సుల్లున్నది బైటగక్కిండు శీకటివొయ్యి
తెల్లార్తున్నట్టుంది. పొద్దుపొడుపు సుక్కలచ్చి శానశేపైంది. బంగ్లాల పనోళ్ళ చప్పుడు మొదలైంది. దొర్సాని తిట్ల బారతం శురువైంది.
లచ్చి బాసన్లు దోమి వంటింటి దిక్కు మోస్కపోతుంది. ఎర్రటి ఎల్గు తూర్ప దిక్కుల కెల్లి. చాయిగిలాస శేత్లవట్కోని కుర్చీల గూకుంది దొర్సాని. పొద్దు జూస్కుంట ఆగమాగం నర్శిగాడు బంగ్లకు జేరిండు.’రాకడ తోనె దొరకు దండం బెట్టి దొర్సాని తానికచ్చిండు.. దొర్సానీ! మీ ఇలాకల ఎంతోమందికి జాగలిస్తిరి.. ఆళ్ళంత పైసగల్లోలైన్రు..! నాగ్గూడా గింత భూమిజూపిస్తె మీ కాళ్ళకాడ వడుంట బాంచెన్‌,! కాళ్ళ మీదవడ్డడు. ‘జర్రంత దయజూపియ్యరాదవ్వ..? బాంచెన్‌ గులాపోన్ని! నర్శిగాడు గదే ముచ్చట మల్లమల్ల అడ్గినట్టు ఇనవడంగనె, దొర్సాని కండ్లు దొరదిక్కు జూశినయి. ‘భూమి నీకిస్తె గీ పట్నంల మాకు కూలోడు దొర్కుతాడు..? అడ్డమైన గాయిదు పనికెవలు దొర్కుతరు..?’ దొర మన్సులున్న గీమాట బైటవెట్టక ‘వారీ…నర్శిగా! నడీడు
కచ్చినవు, ఇగ ఏం కష్టం జేస్తవుబిడ్డా..? ఊల్లె నీ పేరుమీద ఏమన్నుంటె యోల్లకన్న ముడివెట్టు. గీడ నీకు బూమిస్తే నీళ్ళుంటయా పంటస్తదా..? గీడ యాడ జీతమున్నా పొట్టెల్తది.. శెప్పిన పనల్ల జేస్కుంటవో..నీకు.. నీ పెండ్లాం పిల్లలకు పొట్టకు బట్టకు తక్కువడకుంట జూతాం!’ అని బుద్గిచ్చినట్టు జెప్పంగనె నర్శిగాని కండ్లల్ల ఎక్కడ లేని సంబూరం…
ఇన్నాళ్ళ కొలె దొర ఉప్పుదిని బత్కినం దొర జూడక పోతడా! మన్సులనుకోని ఇంకో మాటనకుంట గట్లనే దొరా’ అని ఒప్పుకున్నడు. రుమాలుతోటి మెడలమీది శెమ్టతుడ్సుకోని బాదాంశెట్టు నీడకు జర్గిండు. ‘నారీ..నర్శీ! రాత్రి మాలస్తది.. తెల్లారెకల్ల పోంచావు గావాలె! ఇనామిస్తరు…తీస్కొమ్మని’ దొర పనప్పజేప్పిండు. ‘దొరా! నాత్రి ముచ్చటంటున్నవు దలిద్రం పనైతే నాతోని గాదు’ బయపడ్కుంట అనుమానం ముంగటేశిండు. ‘బయపడేదేందిరో.. అన్నిట్కి నేను లేనా?’ మీసాలు పునుక్కుంట దైర్నం జెప్పిండు-దొరమీది బరోసతోని తెల్లారెకల్లా శెప్పినట్టు మాలు పోంచావయ్యింది. నూరు రూపాల నోట్లు రొండు శేత్లకచ్చినయి. మన్సుకు పైస జూడంగనె పండుగ జేశినట్లైంది.
బూమియ్యకున్నా దొర మంచి పనిల వెట్టిండన్కొని దొర పెండ్లాం పిల్లలు సల్లగుండాలని తొవ్వలున్న నర్సిమ్మసామికి దండం బెట్టిండు - ఎన్ని జన్మలకైనా గీ దొరతాన్నే పని దొర్కాలని మల్ల మల్ల మొక్కుకున్నడు. లారీల్లకెల్లి దిగచ్చి బస్టాండ్ల ఊల్లె బస్సెక్కిండు-తొవ్వల యాడ సల్లవడ్డడో ఏమో… ఆగమాగమైతుండు. జంగిడి యాల్ల ఊల్లెకడ్గువెట్టిండు. రొండు కల్లు సీసలు దీస్కోని శివ్వవ్వతాడ నాల్గు మిరపకాయబుడాలు గొన్కున్నడు. ఇల్లు మొకం జూడక బగ్గదినాలాయె. మల్లికి దావత్‌జేశిండు. మస్కు మస్కున్నే నీద్రలేశి మొకం తానం జేస్కున్నడు ‘పట్నం బొదాం’ మూట ముల్లె ‘సదురమని జేప్పి’ పుట్టి పెర్గిన ఊరు… మంచి శెడ్డకు అదుకున్న ఊరు. వర్సకు విల్సుకునే శిన్నయ్యల, బామ్మర్దుల కల్శచ్చిండు. పగటాల్ల కల్ల పట్నం తొవ్వ వట్టిండు.
శీటి బస్సుదిగి ఆటోరిచ్చ మాట్లాడుకోని బంగ్ల గేటుకాన దిగిండొ లేదో దొర బంగ్లకాడ సుట్టు పోలీసోల్లు..! నర్శిగానికి పాణం బొయినంత పనయింది. నర్శిగాడు గానచ్చుడాల్శం అప్పటి
దాకా కాలుగాలిన పిల్లోలె శేతులెన్కకువట్టుకోని ముంగట్కి ఎన్కకు దిర్గినోడు, సటుక్కున ముంగట్కి ఉర్కుతచ్చి ”ఇగో.. ఇగో.. గీడేసారు! గీ లుచ్చ దందకంత.! నమ్మి ఆన్కి నాతాన నౌకిర్కి
పెట్టుకున్న గని, గిట్లసుంటి బద్దుమాశితనముంటదన్కోలే!.” ఒక్క మాటతోనే నర్శిగాని దిక్కు పోలీసోళ్ళు. శెప్పినపని… బుద్గిచ్చిన ముచ్చట్లు.. దొర ఏశాలు… ఏం సమజైందో గాని కండ్లల్ల నీళ్ళు దిర్గినయి.-’దొర పల్లిడ్శిండు గానీ మామ్ల ఇడ్వలేదన్కున్నడు’ ఈ రొమ్ముల గుద్దుకుంట పెడబొబ్బలు వెడ్తున్న మల్లి ”గిసుంటి సంగతులు మాతాన యాడియి దొరా..! మమ్ల బత్కనియ్యి దొరా!” అన్కుంట కాల్ల మీదవడి బొలబొల ఏడుస్తోంది.-దొర తల్కాయూపిండు.గంతే-
మల్లి కండ్లల్ల దుమ్ముగొట్కుంట రయ్య్‌న్న జీపుకార్ల నర్శిగాడు. కుతకుత ఉడ్కినట్టు మొకం.. కండ్లల్ల కారం జల్లినట్టు ఒక్కతీర్గ మంట-

కథలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో