రేప్‌ చేయబడ్డ నగరం

నగరం, కర్ఫ్యూలో కాల్చిన మాంసం సీకు
నగరం, వెన్నుపోటు పొడిచే మిత్రుడి బాకు
నగరం, అనుమానాల పుట్ట
మానవ కళేబరాల గుట్ట
ఇక్కడ తరతమ భేదాలు లేవు
మత పట్టింపులు రావు, కులప్రసక్తి లేదు
రాజకీయమొక వ్యూహం
ఎవరు ఎప్పుడు ఎక్కడ
బల్లినోట్లో ఈగవుతారో తెలియదు

సామాన్యుడిక్కడ బలౌతాడు గానీ, అయోధ్య రాముడికేం? బతికొస్తాడు
వానరుడు డాబాల మీద తిరిగొస్తాడు
సంప్రదాయం రక్షింపబడుతుంది
సత్‌ శీలం మాత్రం భక్షింపబడుతుంది
దేవతలారా మీరంతా ఎక్కడ?
ఆకాశమార్గాన పయనిస్తున్నారా?
పూలవర్షాలు కురిపించండి
ఈ భూమి ధర్మభూమి -
ఖర్మభూమి -

ఖడ్గాల పెదాల మీద నవ్వులు వికసిస్తున్నాయి
కత్తిపోట్లతో సమైక్యత నిలబడుతుంది
దొంగలెవరు దొంగలెవరని
దొంగలే ప్రశ్నిస్తున్నారు
గుడ్లన్నీ పాములు తినిపోతున్నాయి
చిన్నారుల తలలు వేటగాళ్లకు
హారమవుతున్నాయి! హారతులవుతున్నాయి!!

రక్త సముద్రపు చెలియలికట్ట తెగింది
కాల్లు, చేతులూ కొట్టుకొస్తున్నాయి
కుళ్ళిన మానవత్వం వాసన
భరింపరాకుండా ఉంది -
గాలి బెదిరిపోయింది
భూమి అదిరిపోయింది

కుత్తుకలు కత్తులతో కత్తిరించి
పాదుపాదుకూ రక్తం పారించి
పెంచిన వనం నందనవనం?
పునాదులు కూలదవ్వుతున్నారు గానీ,
ఇదెంత అందమైన భవనం?
మత రాజకీయమా? ఇది రాజకీయ మతమా?
చెల్లిపోయిన బడాబాబుల నల్లధనమా?
కిరాయి కసాయి
నరికిపోయిన శీలమా?

రోజుకూలీల నగరం సొమ్మసిల్లిపోయింది
కార్మికుల నగరానికి డొక్కలు ఎండుకుపోయాయి
ఇక్కడ ప్యూజులు పీకిందెవరూ?
ఇదేమిటి కలహాల చీకటి?
పట్టపగలే వదంతుల అంధకారం
కళ్లుతెరిచి నిద్రించే నగరం ఊపిరిలో
క్షణానికో డైనమైట్‌ -
ఈ రోడ్ల వెంట చెట్లన్నీ
అశోకుడు నాటించినవే
ఈ దారిన బావులన్నీ బాబర్‌ కాలం నాటివే

నగరం, భయమై హడలి ఛస్తోంది
నగరం, మౌనమై కుళ్లు కుంటోంది
నగరం, అసహ్యమై నగ్నమౌతుంది
జవసత్వాలు క్షీణించి – రెక్కలు తెగి
నిషేధపుటుత్తర్వుల ముందు
కుళ్లిన మాంసం ముద్దలా కూలింది
ఇప్పుడిక రేప్‌ చేయబడ్డ నగరం గూర్చికాదు మన బాధ…
పుట్టబోయే బిడ్డ గూర్చి –

4 అభిప్రాయాలు »కవితలు

4 Responses to “రేప్‌ చేయబడ్డ నగరం”

  1. 1
    maharaju Says:

    ఆహ ఎంత చెత్తగానున్నది కవిత.ఎవరక్కడ మాకు ఈ కవితను విడమరచి చెప్పుడు…

  2. 2
    రాకేశ్వర రావు Says:

    బావుంది

  3. 3
    pallinti sudhakar Says:

    It’s verygood

  4. 4
    S DHANESHWAR Says:

    మీరు వ్రాసిన కవిథలు చలా బాగున్నాయి, మీరు ఇలాంటి కవితలు మర్రెన్నొ వ్రాయగలరని ఆసిస్థున్నను.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో