Feb2008
వెనకడుగు
ఆ అడుగు ముందు కేస్తే
అంతా శూన్యమై పోతుందనుకున్నప్పుడు
భూమంతా అడుగు నేలకు
సరిపోతుంది.
శూన్యాల్ని కోరుకుంటూ
వేలు, లక్షల అడుగులు రోజూ…
చైతన్యం నిరర్ధకం అవుతున్నా
మనసు, మమతా,
మిత్రులు, బంధాలు,
ప్రేమలు, ఆత్మీయతలు
అన్నీ విడిచి
అనవసర త్యాగాలతో
ముందుకెడుతున్న అడుగులు
క్షణం ఆగితే…
క్షణం ఆలోచిస్తే…
శూన్యంలోకి జారుతున్న
అడుగును వెనక్కు తీసుకుంటే
గాయాలు నయమవుతాయి
నిర్మితమవుతున్న వాళ్ళే
నిర్మాణాలు చేస్తారు.
శూన్యం ముందు
వెనకడుగు వేయాల్సిందే
మళ్ళీ మళ్ళీ
చిగురించటానికి.