మార్చ్ 2008 సంచిక

మార్చ్ 2008 : సంపాదకీయం

International Women’s Day
International Women’s Day

ప్రాణహిత మార్చి సంచికకు స్వాగతం. మార్చి నెలలో 8 వ తారీకును అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. మార్చి నెల అంతర్జాతీయ మహిళాదినోత్సవం అందరిలో ఉత్సాహం నింపుతుంది. 1911 లో కోపెన్ హేగన్ లో మార్చి 8ని ప్రపంచ మహిళాదినంగా జరుపుకోవాలని క్లారా జట్కిన్ చేసిన ప్రతిపాదన ఆమోదం పొందింది.1908లో న్యూ యార్కులో బట్టల మిల్లుల కార్మికురాండ్రు తమ పనికి వేతనం పెంచాలని, పని గంటలు తగ్గించాలని ‘బ్రెడ్ అండ్ రోజెస్’ కావాలనే డిమాండుతో రోడ్లమీదకు వచ్చి పోరాటాలు జరిపారు. వీరి పోరాటాలకు గుర్తింపుగా మార్చి 8ని జట్కిన్ ఎంచుకోవడం జరిగింది. ఈ అతి సామాన్య పేద స్త్రీలు సృష్టించిన చరిత్రే అంతర్జాతీయ మహిళాదినం మార్చి 8. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సంపాదకీయం

మార్చ్ 2008 సూచిక

సూచిక:

కవితలు:

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సూచిక

మనిషంటే పని కదా

మాధుర్యం కావాలి
జీవితమూ స్నేహమూ
మాధుర్యం నిండాలి
కాని ప్రతి నెత్తుటిచుక్కా చక్కెరముక్కయినప్పుడు
ఇది కన్నీటి కాలం
ఇది భయం కాలం
ఇది నిరాశ కాలం మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కవితలు

స్మృతి గీతం

అడవికీ మైదానానికీ మధ్య
ఉద్యమం పరిచిన వారధి

ఊరు వాడకి చాచిన స్నేహ హస్తం

దుఃఖపు లోయల్లో
ఆసరాగా నిలిచిన ఆత్మీయ స్పర్శ మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కవితలు

జ్ఞాపకాల ఖజాన

ఏ దిక్కు లేని ఒంటరి ముసల్ది- సందుక
విసిరేసినట్టో…
పారేసినట్టో…
ఇంట్లో ఓ మూలన
అలిగిన పిల్లిలా నిద్రపోతున్నది.
సందుకంటే ఇంటి జ్ఞాపకాల ఖజాన! మొత్తం చదవండి »

9 అభిప్రాయాలు »కవితలు

వెదురువిల్లు

నేనొక సూదంటు రాయిని
నన్నెన్ని ముక్కలు జేసినా
ఉత్తర, దక్షిణ ధృవాలుగానే విడిపోతా ! మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కవితలు

గుర్రపు చెవిలో పురుగు

కదులుతున్న ఆకాశం మీదికి
ఆశను విసిరి
బతుకుల చుట్టూ
నడుముల్లోతు నీటిపూలు కలగంటానికీ
ఒక సుఖ నిద్ర కావాలి కదా! మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కవితలు

ఉతికి ఆరేస్తా

తరతరాల చరిత్ర పుటల్లో
తగలెయ్య బడ్డ వాస్తవాన్ని
అమాయకత్వపు అంచున నిలిచి
సమాజపు చీత్కారానికి
దగాకోరుల దర్పానికి
మగ అహంకారానికి
బలైన దళితురాలిని మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »కవితలు

కార్యకర్త

కొత్త బస్టాండుల దిగి ఏడడుగులు ఎనుకకు నడిచినా, పాత బస్టాండుల దిగి పదడుగులు ముందుకు నడిచినా, కాదుపోదంటే కోటగడ్డ ఎక్కి మైసమ్మ గుడి ముందు నుంచి బురుజు పక్కకు తిరిగి కిందకి దిగినా ఒక జెండా గద్దె కనిపిస్తది. గద్దెకు తాటిచెట్టంత ఇనుపపైపు, పైపుకు ఎగురుతున్న జెండా కనిపిస్తది పచ్చపచ్చగా… మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కథలు, మానేటి కథలు

తాయిమాయి

ఎల్లవ్వా, చెంపకేమైందే.

దెబ్బతాకింది.

దెబ్బతాకిందా, మొగుడు కొట్టిండా.

ఏదో ఒకటయింది. ఖరాబయిన నల్ల ఏదో చెప్పు. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కథలు

వరదల్లో గజ ఈతరాలు

ముందుమాట చదివి పుస్తకాన్ని మూస్తున్న కాలం ఇది. ఈ విషయం తెలిసి కూడా కథలకు, కథా నేపధ్యం రాసి ప్రచురించడం ఒక సాహసం. మరో రకంగా నిజాయితి. ‘గజ ఈతరాలు’ అనే తన కథా సంపుటిలో గొరుసు జగదీశ్వర్‌ రెడ్డి తన కథలన్నిటికి, కథా నేపధ్యం పేరున కథ రాయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించాడు. అవి చదివితే కథలన్నీ ఊహించవచ్చు కుతూహులం కొద్ది కథలోకి తొంగి చూశామా, కథ మనల్ని అరెస్ట్‌ చేసి తన వెంట తీసుకెళుతుంది. కథల్లో వస్తు వైవిధ్యం ఉంది. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు

నల్లకలువలు పూయించిన ప్రజాసాహితి

ప్రపంచ వ్యాప్తంగా రచయితలు తమ తమ దేశాల్లో ఏం జరుగుతుందో రాయాలనుకుంటారనేది నిజం. అయితే ఆధునిక ప్రపంచం గురించి విపరీతమైన విషయం ఏమిటంటే తాము పుట్టిన దేశంలో ఏమి జరుగుతుందో వ్యాఖ్యానించడానికి ఎంతో మంది రచయితలు ఇంకొక దేశానికి వలస పోవలసి వచ్చింది. ఈ విషాదం మనం ఆఫ్రికా దేశాలలో చూస్తాం. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »ప్రపంచ సాహిత్యం, సాహిత్య వ్యాసాలు

ఒక కవిత్వ ప్రేమికుడి ఉద్విగ్న గాథ - ద పోస్ట్ మాన్

ఆంటోనియో స్కార్మెటా స్పానిష్ నవల ఎల్ కార్టెరో డి నెరూడా కు ఇంగ్లిషు అనువాదం ద పోస్ట్ మాన్.

ఈ ఆత్మీయ పుస్తకం గురించి రాయాలంటే అందులోని ఇతివృత్తం నాకు పరిచయమయిన దగ్గర మొదలుపెట్టాలి. అసలు అలాంటి పుస్తకం ఒకటి ఉన్నదని తెలియడానికి చాలముందే ఆ ఇతివృత్తంతో నా ప్రేమ మొదలయింది గనుక ఆ ఎనిమిదేళ్ల కథ చెప్పాలి. మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »ద పోస్ట్ మాన్, పుస్తక సమీక్షలు, ప్రపంచ సాహిత్యం

తెలంగాణ బతుకులకు “మూలకం”

హృదయాన్ని స్పందింపచేసే కవులు కొందరే ఉంటారు. వారిలో కొందరు మాత్రమే ప్రత్యేక భావజాలంతో, నూతన అభివ్యక్తితో కవిత్వాన్ని రాస్తారు. వారు మనుషులను జాగృతం చేస్తారు. వారి లక్ష్యం సమ సమాజ నిర్మాణం. విశ్వమానవ కళ్యాణం. ఈ రకం కవులలో చెప్పవలసిన కవి ఎస్.హరగోపాల్. నిశితమైన చూపు, పదునైన భావజాలం ఉన్నవాడు. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »పుస్తక సమీక్షలు

పరదా!

”మీ గురించి మాకు, అంటే… అమెరికన్లకి ఉండె అపోహ ఏమిటో చెప్పండి?.” అంటూ ఎబిసి ఛానల్ జర్నలిస్టు ఒకరు అరబ్ ఎమిరెట్స్ కి చెందిన ముగ్గురు యువతులతో ఇటీవల జరిపిన ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. వారిలో ఇద్దరు యువతులు బ్రెస్ట్ కాన్సర్ ని జయించినవారైతే ఒకరు డాక్టర్. ఇంతకీ ఈ ప్రశ్నకి వారిచ్చిన సమాధానం….’మేము రాతి యుగంలోనో, చీకటి లోకంలోనో లేము” అని. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »చౌరస్తా, సాహిత్య వ్యాసాలు

అపరాజిత 6: జీవితానికి అర్థాన్నిచ్చిన ఎ.ఐ.మ్

వాళ్లు మమ్మల్ని కొత్త ఇండియన్లంటున్నారు.
కానీ, మేము పాత ఇండియన్లమే.
ఈ ఖంఢానికి అసలు సిసలు వారసులం.
అద్దె వసూలు చేసుకోవడానికి వచ్చాం.
- డెనిస్ బ్యాంక్స్ (ఏ. ఐ. ఎమ్ నాయకుడు)

అమెరికన్ ఇండియన్ ఉద్యమం మా రిజర్వేషన్ ను పెద్ద గాలి దుమారంలా చుట్టుముట్టింది, ఎక్కడి నుంచో కొత్త గాలిలా మమ్మల్ని స్పృశించింది. రాను రాను దగ్గరవుతున్న డప్పు మోతలా మమ్మల్ని తాకింది. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం

ప్రాణుల మెదడు

మనుషులతోబాటు కనబడేవీ, కనబడనంత సూక్ష్మమైనవీ ఎన్నెన్నో ప్రాణులు సహజీవనం చేస్తున్నాయి. అయితే ఇటువంటివి భూగ్రహానికి వెలపల ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఇంతవరకూ జరిగిన జీవపరిణామంలో మనలాగా బుద్ధిజీవితానికి అలవాటుపడ్డ మరే ప్రాణీ కనబడదు. ఇటువంటి పరిణామానికి మూలకారణమైన మనిషి మెదడు ప్రాణికోటిలోనే ఎంతో ప్రత్యేకమైనది. మన పాలపుంత గేలక్సీలోని తక్కిన ప్రాంతాలమాట ఏమోగాని, మనకు తెలిసినంతవరకూ దీన్ని పోలినది మన సౌరవ్యవస్థలో కనబడదు.

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »ప్రత్యేక వ్యాసాలు

Impotence Drugs and treatment It`s no secret that like to take Viagra? buy viagra here.
Family pharmacy there are many different ways to store your cheap generic viagra
New reviews of the cheap did you know that gel tab viagra so what exactly is a buy viagra cheap