జ్ఞాపకాల ఖజాన

ఏ దిక్కు లేని ఒంటరి ముసల్ది- సందుక
విసిరేసినట్టో…
పారేసినట్టో…
ఇంట్లో ఓ మూలన
అలిగిన పిల్లిలా నిద్రపోతున్నది.
సందుకంటే ఇంటి జ్ఞాపకాల ఖజాన!
కాలం కడుపులో జరిగిన
తతంగాలన్నింటిని
నిశ్శబ్దంగా మోస్తున్న నిండుగర్భిని.
 
* * *

సందుకలో ఏమున్నాయని…
నాన్న జీవిత కాలపు నిరుద్యోగానికి
గుర్తుగా మిగిలిన ఎంప్లాయిమెంట్ కార్డ్,
ఆకలి ముఖంతో దిగిన
అమ్మ పెండ్లి నాటి ఫొటో,
ఆ సభయో, ఈ సభయో తెలిపే
చిత్తు, చిత్తు గా నలిగిన ఎర్రకరపత్రాలు,
పేదింటి అన్నా చెల్లెల్ల అనుబంధానికి
సంతకంలా పెరిగిన పాత రాఖీలు
ఒకటేమిటి…
చరిత్రనంత తలపోస్తున్న
పేదరాసి పెద్దమ్మ- సందుక.
 
* * *

దాన్ని తెరిచే వరకే
అదొక ప్రశాంత సముద్రం.
దాన్ని తెరిస్తే
నిండుగా రెక్కలు విప్పిన తుఫాను.
కరిగిపోయిన కలలకు
కన్నీటి ధారలకు
సాక్ష్యంగా మిగిలిన బతుకు చిత్రం- సందుక.
బతికి చెడ్డ తనాన్నో,
చెడి బతికిన తనాన్నో తెలిపే
సందుక లాంటి మనిషి కావాలిప్పుడు.
 
(సందుకంటే తెలంగాణ లో ఒక ఇనుప పెట్టె)

10 అభిప్రాయాలు »కవితలు

10 Responses to “జ్ఞాపకాల ఖజాన”

  1. 1
    krishna Says:

    మీ కవిత బగుంది .. కాని … సందుకలొ చెదు జ్ఞాపకాలు చెప్పె కమ్మని తీపి జ్ఞాపకాలు మరిచారు ……………………….. we need a sweet memories tooooooooooooo……

  2. 2
    vemuganti Says:

    nee poem bagunnadi thanks for sending this poem to pranahita

  3. 3
    venkatesh Says:

    కవిత బాగుంది.

  4. 4
    pradyumna Says:

    ఈ మధ్యే నారాయణస్వామి సందుక ప్రచురించారు. మళ్ళీ అదే విషయాన్ని ఎన్నుకొన్నప్పుడు ఇంకాస్త డిఫరెంట్ గా రాయాల్సింది. నాకైతే పెద్దగా నచ్చలేదు.

  5. 5
    Sowmya Says:

    “దాన్ని తెరిచే వరకే
    అదొక ప్రశాంత సముద్రం.
    దాన్ని తెరిస్తే
    నిండుగా రెక్కలు విప్పిన తుఫాను.”
    - ఈ లైన్లు చాలా నచ్చాయి నాకు….

  6. 6
    gogu shyamala Says:

    Gnapakala kajana chala bagundi.
    inkenni gnapakaluunnayoo chushanu.
    okko gnapakam gurinchi mundu mundu chaduvalani adiri chustanu.

  7. 7
    koresh Says:

    కొంచ0 పెస్సిమిస్తిక గా ఉంది

  8. 8
    ప్రాణహిత » మార్చ్ 2008 : సంపాదకీయం Says:

    [...] ‘స్మృతి గీతం’, పసునూరి రవీందర్ ‘జ్ఞాపకాల ఖజాన’, తైదల అంజయ్య ‘వెదురువిల్లు’, కోసూరి [...]

  9. 9
    సాయిసాహితి Says:

    సందుక ని personify చేసిన కవిత చాలా బాగుంది. సందుక పాత దే కావచ్చు కాని దాని కి కొన్ని మధురానుభూతులుండచ్చు..కొన్ని images చాలా బాగున్నాయి. ఉదా: పాతరాఖీలు, నిండు గర్భిణి ఇలా…

  10. 10
    Ramnarsimha Says:

    రవీందర్ గారు,

    మీ కవిత …. చాలా బాగుంది..
    అభినందనలు..

    ramuhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=8y88lH-5cX4TTBasXiVBhTJk-zmmUmSJ26ZWUSYFBpo=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.in

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో