మనిషంటే పని కదా

మాధుర్యం కావాలి
జీవితమూ స్నేహమూ
మాధుర్యం నిండాలి
కాని ప్రతి నెత్తుటిచుక్కా చక్కెరముక్కయినప్పుడు
ఇది కన్నీటి కాలం
ఇది భయం కాలం
ఇది నిరాశ కాలం
 
ఇదివరకెప్పుడూ భయపడలేదు
వేలసూదులతో చర్మమంతా జల్లెడ అయినప్పుడూ
రక్తబిందువులన్నీ పెటిల్లున పగిలి
దేహం ఒణికిపోయినప్పుడూ
లోలోపలి తీపితయారీయంత్రం
లోలకంలా అటుకొసకూ ఇటుకొసకూ
ఉధృతంగా ఊగుతూ
అస్తిత్వాన్ని చిగురుటాకు చేసి
సుడిగాలిలో ఎగరేసినప్పుడూ
ఎప్పుడూ భయపడలేదు

అనారోగ్యానికి కాదు
శయ్యకు ఖైదీని చేసినందుకూ కాదు
దినచర్యంతా శరీరరక్షణే అయినందుకు
పనిమీద ఆంక్షల కటకటాలు నిర్మిస్తున్నందుకు
ఇది కన్నీటికాలం భయాలకాలం నిరాశలకాలం

మనిషంటే ఆలోచన కదా
మనసుమీద మంచుకప్పమంటే ఎట్లా?
మనిషంటే మాట కదా
పెదాలు కుట్టేసుకోమంటే ఎట్లా?
మనిషంటే రాత కదా చదువు కదా
హాసం కదా స్నేహం కదా
మనిషంటే పని కదా
సెలవు పలకమంటే భయం
మనిషితనాన్ని వదులుకొమ్మంటే భయం

- జనవరి 22, 2008

Share/Save/Bookmark

కవితలు

4 అభిప్రాయాలు

  1. kris మార్చ్ 2008 1

    me kavetha bagundi …

  2. Telangana Saahitya Abhimaanulu మార్చ్ 2008 2

    రామ చంద్రాపురం - హైదరాబాదు లో జరిగిన ‘తెలంగానం’ కలాల గుండె చప్పుడు ప్రాణహిత లో వివరంగా ఇవ్వగలరు.

    ఇట్లు
    ప్రవాస తెలంగాణ సాహిత్య అభిమాని

  3. shankersharma మార్చ్ 2008 3

    sitye loi aksharadoshalu chala akuuvaga unnai.sarichayandi

  4. ప్రాణహిత » మార్చ్ 2008 సూచిక ఏప్రిల్ 2008 4

    […] మనిషంటే పని కదా - ఎన్ వేణుగోపాల్ […]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో