Mar2008
ఉతికి ఆరేస్తా
తరతరాల చరిత్ర పుటల్లో
తగలెయ్య బడ్డ వాస్తవాన్ని
అమాయకత్వపు అంచున నిలిచి
సమాజపు చీత్కారానికి
దగాకోరుల దర్పానికి
మగ అహంకారానికి
బలైన దళితురాలిని
కారు చీకటిలోని నల్లని తారునై
వెండి వెలుతురులోని మండే మంటనై
వానలో వరదనై
వాగులో బురదనై
ఎటు తోస్తే అటు
గమ్యం తెలియని వెర్రి దాన్నైన నన్ను
అక్షరాలకు దూరం చేసి
నన్ను వెక్కిరించారు
ఉప్పెన వచ్చినా
ఊర్లే కొట్టుకు పోయినా
ఈ బతుకు నేలపై
తలెత్తుకొని నిలిచే
పిడికెడు చైతన్యాన్ని
ఎన్నెన్ని అగచాట్లు ఎదురైనా
ఎంతెంత అవమానం చేసినా
తలొంచక ఎదురు నిలిచే
మాదిగ బతుకు నుంచే
తిరుగుబాటు ప్రకటిస్తున్నా
కుటుంబం లోని కుళ్ళును కడిగి
సమాజంలోని దురహంకారాన్ని
ఇక ఉతికి ఆరేస్తా…
March 14th, 2008 at 5:24 am
మంచి కవితకు అభినందనలు. మీ తిరుగుబాటుకు మా సంపూర్ణ మద్దతు.
March 18th, 2008 at 3:32 pm
బాగుంది.నాకు ఇదె మొదటీ సారి తెలుగు వ్రయటాం.
March 21st, 2008 at 3:26 am
సాహిత్య వార్తలు తాజాగా జరిగినవి చేర్చడంలేదు ఉదాహరణ కు తెలంగాణ సాహిత్య సమాఖ్య ‘తెలంగానం’ కార్యక్రమం గురించి విన్నాం కానీ ఏ సంచిక లో కూడా ఇవ్వలేదు.
సేకరించి తప్పక ఇవ్వ గలరు.
March 24th, 2008 at 5:08 am
అర్ధం చేసుకోవాల్సిన ఆవేదనే, సందేహం లేదు. సందేహమల్లా, ఇది ఎలా కవిత్వమైందనే! అయ్యా పసునూరి రవీందర్ గారు, ఇది మంచి కవిత అన్నారు, ఇందులో కవిత్వాత్మకమైన ఒక్కటంటే ఒక్క వాక్యం చూపండి.
March 25th, 2008 at 2:51 pm
అయ్యా విశ్వ గారూ
కవిత్వాత్మకమైన వాక్యాన్ని ఎట్లా నిర్వచిస్తారు మీరు? మీ దృష్టిలో కవిత్వాత్మకమైన వాక్యమంటే ఏమిటి? అది ఎలా ఉండాలి? ఒక వాక్యం కవిత్వాత్మకమో కాదో మీరెలా చెప్తారు? కవిత్వాన్ని తూచే తూనికరాళ్ళు తన దగ్గర లేవు అనుభవించి పలవరించమన్నారు చలం.
కవిత్వం పట్ల మంచి అవగాహన, అభిరుచి మీకున్నాయని మీ టపా ల వల్ల తెలుస్తోంది. కాబట్టి మీరు కొంచెం సోదాహరణంగానైనా ఏది కవిత్వమో ఏది కవిత్వం కాదో, ఏ వాక్యం కవిత్వమో ఏ వాక్యం కాదో వివరిస్తే ఉపయోగకరంగా ఉంటుందని నా మనవి.
సత్యనారాయణ
April 10th, 2008 at 10:35 pm
[...] ఉతికి ఆరేస్తా – జాజుల గౌరి [...]