వెదురువిల్లు

నేనొక సూదంటు రాయిని
నన్నెన్ని ముక్కలు జేసినా
ఉత్తర, దక్షిణ ధృవాలుగానే విడిపోతా !

కొన్ని తాబేళ్ళకిపుడు చలి వణుకు
నా రక్తం పీల్చి ఎరుపెక్కిన కొన్నిగొంతులకు
వామ పక్షవాతం 

***

ఈ ఆకాశ నక్షత్రాలెపుడూ
కొడిజివునంతో మిణుకు మిణుకు మంటయ్‌
ఇక్కడి తూర్పున సూర్యుడెపుడూ
నెత్తుటి సముద్రం నుంచే నిద్రలేస్తడు.
చంద్రుడెపుడూ ఆకలి పీక్కతిన్న ముఖం తో
పడమటి గుడిసె చూరుకింద అస్తమిస్తడు
ఇది తెలుగు పాలస్తీనా! తెలంగాణ 

కరువు కనుల నుంచి కురిసే వాన
కాలువయింది, వరదయింది, వాగయింది
ఇక్కడి వాగులో చెలిమె తోడే పిల్లలకు
మొనదేలిన జంపన్న ఖడ్గం దొరుకుతుంది.
మేడారం కంకవనం నిండా
సమ్మక్క సారక్కల వెదురు విల్లులు వేలాడుతయ్‌. 
జోడెన్‌ ఘాట్‌ ఇప్పచెట్ల కొమ్మకొమ్మకు
కొమురం భీము కనుల పూలు పూస్తయ్‌

‘ఇమ్మనుజేశ్వరాధముల’ ను ధిక్కరించే
పోతన గొంతు వేయిస్తంభాల్లో నినదిస్తుంది.
పాలు, తేనె కలిపిన అచ్చ తెనుగు గానాన్ని
పాల్కుర్తి సోమనాథుడు వినిపిస్తడు.

***

నేను బాపు గీసిన బొమ్మను కాదు.
చిత్తప్రసాద్‌ చిత్రించిన
నా రేపటి చరిత్ర ముఖచిత్రాన్ని
బందగి జిందగీతో మొలిచి
దొడ్డి కొమురయ్య ఎదురొడ్డిన ప్రాణవాయువును పీల్చి
చాకలి ఐలమ్మగా శిరమెత్తిన
తడి తడి మట్టి గీతాన్ని నేను
తరగని అమ్ముల పొదిని నేను.

Share/Save/Bookmark

కవితలు

3 అభిప్రాయాలు

  1. pasunoori ravinder మార్చ్ 2008 1

    నీ దండం పెడితే….,
    ఏం కవిత రాసినవు సారు.
    పాణం ఒక్క తీరుగ దిల్ ఖుష్ అయ్యిందంటె నమ్ము.

  2. thimsa మార్చ్ 2008 2

    Congrats to taidala anjaiah for giving us a powerful poem. but the title of the poem is not opt, because the bow(villu) anedi veduruthone chesthaaru. kanuka “veduru villu” anadam thappu… villu ante saripothundi….

  3. mano మార్చ్ 2008 3

    మీ కవిత చాలా బాగు.అదరగొత్తింద్రు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో