Apr2008
ప్రాణహిత
బాబ్ డిలాన్ప్రాణహిత ఏప్రిల్ సంచికకు స్వాగతం. ఎప్పటిలాగే ఈ సంచికలో కూడా తెలుగు నేల నుండి వీస్తున్న ప్రజల సాహిత్యపరిమళాల్ని మీకందించే ప్రయత్నం చేస్తున్నాం.
అమెరికాలో ప్రతిఏటా ప్రింట్ జర్నలిజం, సంగీతం, సాహిత్య రంగాల్లో నిష్ణాతులకు పులిట్జర్ బహుమతి ప్రకటిస్తారు. జోసెఫ్ పులిట్జర్ అనే ఒక ప్రచురణకర్త పేరు మీద న్యూ యార్క్ లోని కొలంబియా విశ్వ విద్యాలయం ప్రతి ఏటా ఈ బహుమతిని ఆయా రంగాల్లో ఉన్నత విలువలు సాధించిన వారికి ప్రకటిస్తారు. ఈ సారి సంగీతంలో పులిట్జర్ బహుమతి ప్రఖ్యాత సంగీతకారుడు బాబ్ డిలాన్ కు ప్రకటించారు. మొత్తం చదవండి »
సంపాదకీయం
Apr2008
ప్రాణహిత
- బాబ్ డిలాన్
ఎన్నెన్ని బాటలు నడవాలి మనిషి
మనిషిగా నిలిచేందుకు?
అవును, మరెన్ని సముద్రాలీదాలి గువ్వలు
ఇసుక తిన్నెలమీద రెక్క వాల్చేందుకు?
అవును, ఎన్ని సార్లు పేలాలి మరఫిరంగులు
అవి ఇంక శాశ్వతంగా రద్దయిపోవడానికి? మొత్తం చదవండి »
అనువాదాలు, కవితలు
Apr2008
కోటం చంద్రశేఖర్
నీటి బాధలు మీకు తెలియవ్
కూటిబాధలు మీకు తెలియవ్
బావులు కొట్టాం, బావురుమన్నాం
అనుక్షణం ఆహుతించు అంతులేని సెగలు
ప్రతిక్షణం పరీక్షించు అసమానపు దగలు మొత్తం చదవండి »
కవితలు
Apr2008
కోటం చంద్రశేఖర్
రాళ్ళు మోయడమేనా?
మోసి మోసి భుజాలు రాళ్ళయ్యాయి
రాళ్ళు కొట్టడమేనా?
కొట్టికొట్టి చేతులు రాళ్ళయ్యాయి- మొత్తం చదవండి »
కవితలు
Apr2008
ఆశారాజు
ఈ షెహనాయీలో సర్పం దూరి, బుసలు కొడుతోంది. ఈ నదిని ఏ కవి కౌగిలించుకొన్నాడో, పులకించి మెలికలు తిరుగుతోంది. వర్షం కురిసినపుడు, ఎవరిదో పుస్తకం తడిసి వుంటుంది. చెరిగిన అక్షరాలు, లేచే పక్షుల గుంపవుతోంది. చెట్టు మీద దాగి, ఆకాశం, బట్టలు మార్చుకొంటోంది. ఈ చంద్రుడూ, కోటానుకోట్ల తారలూ, ఏ సౌందర్యరాశి పెదాల్నో కొరికి వుంటాయి. మొత్తం చదవండి »
కవితలు
Apr2008
జానా పోశెట్టి
కన్నుల్లో అమాయకత్వం
చెంపల్లో పాలతడి ఆరిపోలేదింకా
చిగురు చేతులపై భాగ్యరేఖ లేదని
బడి అడుగులను కూడలి వద్దకు లాగుతున్న-
హస్తరేఖ నిపుణుడెవరో కాని… మొత్తం చదవండి »
కవితలు
Apr2008
గోగు శ్యామల
ఆకలి! అని ఆర్యులొచ్చి అడుక్కుంటే
రొండు సేతుల దోసిలితో బియ్యం పెట్టింది
బూక్ ! బూక్ !! అని ఆకలితో నోరు తెరిసినోల్లకు
ఇంత బుక్కవెట్టింది తెలంగాణ
వందల వడ్ల రకాలని ప్రపంచం మీద సల్లింది మొత్తం చదవండి »
కవితలు
Apr2008
కందుకూరి శ్రీరాములు
చూపుండాలిగాని
ఏ దిక్కు చూసినా అందం ఆనందం
ఈ ఆకాశం
నవరసాల సువిశాల స్వతంత్ర సుక్షేత్రం
అందుకుందామంటే అందదు
అణగదొక్కుదామంటే కుంగదు మొత్తం చదవండి »
కవితలు
Apr2008
జ్వలిత
సరోజమ్మ మగతుగా కళ్ళు మూసుకొని పడుకొని వుంది. మధ్యలో తెలివొచ్చిపోతుంది. మంచం చూట్టూ వున్న వాళ్ళు చాలా ఆతురతగా చూస్తున్నారు వాళ్ళలో ఆమెకంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరి ముఖాల్లో విచారం. రేపటి గురించి భయం లేదు. కాని ఒక ఆత్మీయురాలు అప్పుడే తమ నుండి దూరమయిపోతుందా అని బాధ. మధ్య మధ్య అమ్మా పండ్లరసం తాగమ్మా అంటున్నారు ఒకరు అమ్మా వేడివేడి పాలు రెండు చంచాలు తాగమ్మా అంటున్నారు మరొకరు. మొత్తం చదవండి »
కథలు
Apr2008
పెద్దింటి అశోక్ కుమార్
ఎండకాలం.
తెల్లారేజామున మత్తుగా నిద్రపట్టింది ఉప్పలికి, పక్కనే జగన్ యాపచెట్టుగాలి దడదడ, డప్పుల సప్పుడుకు ఇద్దరికీ మెలుకవయింది.
“మామా… ఏదో సప్పుడు… ?” జగన్ మత్తుగా.
“ఏదో జాటింపు వేస్తండ్రు.” ఉప్పలి.
“ఏంటిదో…?”
”ఏంటిదో!” మొత్తం చదవండి »
కథలు, మానేటి కథలు
Apr2008
బెల్లంకొండ సంపత్ కుమార్
అల్గువారుపురమని అదొక పల్లె. సుట్టుముట్టు ఉర్లల్ల ఆ ఊరే పెద్దది. అక్కడ ఏ అక్కరొచ్చినా పదిమంది జమై మాట్లాడుకుంటరు. కష్టసుఖాలు పంచుకుంటరు సీన్మాల లొల్లిగాని, ఫైవ్‌స్టార్ల రద్దిగాని ఆ వూల్లె లేనే లేవు. వారం రోజుల సంది పోలీసోల్ల అడావుడే ఎక్కువ కనిపిస్తున్నది. ఎలచ్చన్లు గదా! నాలుగైదు పార్టీల జీబులొచ్చిపోయే వరకు పాతపగల తోటి యాడ తల్కాయలు పలగ్గొట్టుకుంటరోనని ముందే బందవస్తు జేస్తున్నరు. అయినా గా పోలీసోల్ల అవుసరం ఆ ఊరికి లేదు. మొత్తం చదవండి »
కథలు
Apr2008
ఎ. కె. ప్రభాకర్
(అల్లం రాజయ్య నవలలపై (కొలిమంటుకొంటుకొన్నది, ఊరు, అగ్నికణం) సమీక్షా వ్యాసం)
నేను కాలానికి, చరిత్రకు… సాక్షిని, సహచరున్ని, టైంకీపరును. ఈ పని నేను ఇష్టపూర్వకంగా ఎంచుకున్నదేమీ కాదు. నా కాలం, నా తరం నాకు వొప్పజెప్పిన కర్తవ్యమిది. గుబగుబలాడే గుండెతో ఇంత బరువును… పంచుకోకుండా, చెప్పకుండా ఉండజాలని తీవ్రమైన మానసిక స్థితి నుండే నేను రాయడం ఆరంభించాను… నేను అక్షరాలుగా పేర్చిన ఈ అనుభవాలన్ని నాతరపు అనుభవాలు – రక్తసిక్తమైన అనుభవాలు.
- అల్లం రాజయ్య (వెనక్కి తిరిగి చూసుకుంటే) మొత్తం చదవండి »
పుస్తక సమీక్షలు
Apr2008
హెచ్చార్కె
“తీరా గాల్లో
ఎగరడం ప్రారంభించాక గాని
భూమ్మీద ఏమి
వదలి వచ్చామో
తెలియదు”
అంటూ తానిప్పుడు నిరంతర, ప్రత్యక్ష సంబంధంలో లేని జీవితాన్ని, స్థల కాలాల రీత్యా కొంత పరాయిదయిపోయిన జీవితాన్ని గొప్ప ఆర్ద్రతతో వ్యక్తం చేసిన నారాయణ స్వామి కవితా సంపుటి ‘సందుక’. మొత్తం చదవండి »
పుస్తక సమీక్షలు
Apr2008
సుంకోజి దేవేంద్రాచారి
భారతీయ భాషా పరిషత్, కలకత్తా – యువ పురస్కారం 2007కు స్పందన
పరిచయం:
పేరు: సుంకోజి దేవేంద్రాచారి
జననం: 24-07-1974
తల్లిదండ్రులు: ఈశ్వరమ్మ, రెడ్డెప్పాచారి
భార్య, కూతురు: దేవిక, యుక్త మొత్తం చదవండి »
ఉపన్యాసాలు
Apr2008
ఎన్. వేణుగోపాల్
- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
కావడానికి అవి అంత ప్రాముఖ్యం లేని సంగతులే గాని వాటి ఫలితంగా మారియో హిమేనెజ్ జీవితం కొత్త పుంతలు తొక్కింది. అదృష్టం కొద్దీ ఆ పరిస్థితులవల్లనే జూన్ 1969లోమారియో కొత్త ఉద్యోగంలో కుదురుకోవలసి వచ్చింది.
మారియోకు చేపలుపట్టడం అంటే మాచెడ్డ చిరాకు. నిజం చెప్పాలంటే తెల్లవారకముందే పక్కమీదినుంచి లేవడమంటే మరీ చిరాకు. అవును గదా, తెలతెలవారేటప్పుడు నిద్ర ఎంత మజాగా ఉంటుంది! అప్పుడేగదా శాన్ ఆంటోనియో మూవీ థియేటర్ లో తెరమీద కనబడి కళ్లు జిగేలుమనిపించే అమ్మాయిలతో ఎన్నెన్నో సాహసకార్యాలు చేస్తున్నట్టు కలలు కనొచ్చు. మొత్తం చదవండి »
అనువాదాలు, ద పోస్ట్ మాన్, ప్రపంచ సాహిత్యం
Apr2008
మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత
1972 వేసవి చివరలో రోజ్ బడ్ లో సూర్యనృత్యం (సన్ డాన్స్) నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎ.ఐ.ఎమ్. లీడర్లు చాలా మంది సూర్యనృత్యంలో పాల్గొనడానికి క్రౌడాగ్ దగ్గరికి వచ్చారు. పవిత్ర పొగ గొట్టంతో ప్రార్థనలు చేస్తూ, గద్ద ఎముకతో చేసిన ఈల వూదుతూ, సూర్యుడి వైపు చూస్తూ, ఆచారం ప్రకారం తమకు తాము నొప్పి కలిగించుకుంటూ మా జాతి చాల పవిత్రం అని భావించే సూర్య నృత్యంలో మమేకమయి పాల్గొన్నారు అందరూ. మొత్తం చదవండి »
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం