ఏప్రిల్ 2008 సంపాదకీయం

బాబ్ డిలాన్
బాబ్ డిలాన్
ప్రాణహిత ఏప్రిల్ సంచికకు స్వాగతం. ఎప్పటిలాగే ఈ సంచికలో కూడా తెలుగు నేల నుండి వీస్తున్న ప్రజల సాహిత్యపరిమళాల్ని మీకందించే ప్రయత్నం చేస్తున్నాం.

అమెరికాలో ప్రతిఏటా ప్రింట్ జర్నలిజం, సంగీతం, సాహిత్య రంగాల్లో నిష్ణాతులకు పులిట్జర్ బహుమతి ప్రకటిస్తారు. జోసెఫ్ పులిట్జర్ అనే ఒక ప్రచురణకర్త పేరు మీద న్యూ యార్క్ లోని కొలంబియా విశ్వ విద్యాలయం ప్రతి ఏటా ఈ బహుమతిని ఆయా రంగాల్లో ఉన్నత విలువలు సాధించిన వారికి ప్రకటిస్తారు. ఈ సారి సంగీతంలో పులిట్జర్ బహుమతి ప్రఖ్యాత సంగీతకారుడు బాబ్ డిలాన్ కు ప్రకటించారు. ఇప్పటిదాకా కేవలం శాస్త్రీయ సంగీతకారులకు, జాజ్ సంగీతకారులకు ప్రకటించిన పులిట్జర్ బహుమతి ఈ సారి ఫోక్ – రాక్ సంగీతకారుడు, గాయకుడు, కవి అయిన బాబ్ డిలాన్ కు ప్రకటించడం ఒక విశేషం. ఒక రాక్ సంగీతకారుడికి ఈ బహుమతి ప్రకటించడం ఇదే మొదటి సారి కూడా! పులిట్జర్ కమిటీ తరఫున బహుమతి ప్రకటిస్తూ ‘బాబ్ డిలాన్ అమెరికన్ పాపులర్ సంగీతాన్ని తన అత్యంత ప్రతిభావంతమైన కవిత్వం తొణికిసలాడే పాటలతో తీవ్రంగా ప్రభావితం చేసాడు’ అని సిగ్ గిస్లర్ అన్నారు.

రాబర్ట్ అలెన్ జిమ్మర్ మేన్ గా అమెరికా మధ్య పడమటి రాష్ట్రాల్లో ఒకటైన మిన్నెసోటా లో జన్మించిన బాబ్ డిలాన్ 1961 జనవరి లో న్యూ యార్క్ నగరం లో అడుగు పెట్టాడు. న్యూ యార్క్ లోని గ్రీన్విచ్ విలేజి అప్పటికే ఒక బ్రహ్మాండమైన ప్రత్యామ్నాయ సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతుండింది. బీట్నిక్కులు జాక్ కెరాక్, అలెన్ గిన్స్‌బర్గ్ తదితరులు తమ నిరసన స్వరాలను బలంగా వినిపిస్తున్నారు. పీట్ సీగర్ లాంటి ప్రజా జానపద గాయకులు తమ పాటల్లో అద్భుతమైన ప్రత్యామ్నాయ సంస్కృతిని గానం చేస్తున్నారు. పౌర హక్కుల ఉద్యమాలు నిరసనలై, ప్రదర్శనలై, వెల్లువెత్తుతున్న కాలం. కవులూ, రచయితలూ, కళాకారులూ, గాయకులూ, సంగీతకారులూ, విద్యార్థులూ ఒకరేమిటి సమాజంలో మార్పు కోరుకునే వాళ్ళు, ఆధిపత్య విలువలని, చట్రాలని, వ్యవస్థలని వ్యతిరేకించే వాళ్ళు అంతా ఒక్క గొంతుకతో తమ నిరసనని ఎలుగెత్తుతున్న కాలమది. బాబ్ డిలాన్ తన కాలానికి గొంతు కలిపాడు. ఉవ్వెత్తున ఎగస్తున్న నిరసనలకు, ప్రత్యామ్నాయ సంస్కృతికి కొత్త గొంతు నిచ్చాడు. తన తరానికే కాదు భవిష్యత్ తరాలకూ ఒక అద్భుతమైన, బలమైన కంఠస్వరాన్నిచ్చాడు. బాబ్ డిలాన్ రాసిన ‘హౌ మెనీ రోడ్స్ మస్ట్ ఏ మేన్ వాక్ డౌన్ ’, ‘టైమ్స్ దే ఆర్ చేంజింగ్’ గీతాలు నిరసనోద్యమాలకు, యుద్ధ వ్యతిరేక ఉద్యమాలకూ జాతీయగీతాలైనవి (anthems). ‘మాస్టర్స్ ఆఫ్ వార్’ యుద్ధోన్మాద పాలకుల్లో కలకలం పుట్టిస్తే, ‘హార్డ్ రేన్ ..’ తన అపూర్వమైన కవితా శక్తితో ఆనాటి సామాజిక స్థితిగతులని కళ్ళకు గట్టింది. 1961 నుండి 67 దాకా డిలాన్ కలం నుండి జాలువారిన ప్రతి పాట, ఆయన గొంతులో ఊపిరి పోసుకున్న ప్రతి పాట ఆనాటి నిరసన తరానికి, ప్రత్యామ్నాయ సాంస్కృతికోద్యమానికి బాసటగా, ఆలంబనగా నిల్చి అమెరికా మొత్తం మార్మోగి పోయినయి. డిలాన్ అతి త్వరలోనే ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఐకన్ గా మారిపోయాడు. న్యూ యార్క్ నుండి సాన్ ఫ్రాన్సిస్కో దాకా డిలాన్ నిరసన స్వరం బలంగా వీచింది. జోన్ బయాజ్ లాంటి అద్భుత జానపద గాయకులు డిలాన్ పాటలకు కొత్త ఊపిరి పోసారు. వాటిని మరింతగా ప్రజల్లోకి తీసికెళ్ళారు. అట్లా అమెరికా 1960 వ దశాబ్దం లో వుధృతంగా ముందుకొచ్చిన యుద్ధ వ్యతిరేకోద్యమానికి, నిరసన ఉద్యమాలకు, పౌర హక్కుల ఉద్యమాలకూ డిలాన్ పాటలు ప్రతీకలుగా నిల్చాయి. ఈనాడు కూడా న్యూ యార్క్ లోనో, వాషింగ్టన్ లోనో, శాన్ ఫ్రాన్సిస్కో లోనో, షికాగోలోనో యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలేవి జరిగినా డిలాన్ పాటలు మారుమోగుతాయి. ఇరాక్ మీద అమెరికా దురాక్రమణ యుద్ధం ప్రారంభించి ఐదేళ్ళు దాటుతున్న ఈ సందర్భంలో కవిత్వానికి యుద్ధ వ్యతిరేకతనూ, యుద్ధ వ్యతిరేక ఉద్యమానికి కొత్త కవిత్వం గొంతునూ ఇచ్చిన బాబ్ డిలాన్ కు పులిట్జర్ రావడం ఎంతో హర్షణీయం.

ప్రముఖ రచయిత అల్లం రాజయ్య సాహిత్యాన్ని పర్స్పెక్టివ్స్ ప్రచురణ సంస్థ ప్రచురించబూనుకుని మొదటి సంపుటంగా అతని నవలలు తీసుకొచ్చింది. వాటిని పరిచయం చేస్తూ విమర్శకుడు ఏ.కే. ప్రభాకర్ రాసిన వ్యాసం ప్రాణహిత ఈ సంచికలో చదవండి. అట్లే నారాయణస్వామి కవితా సంపుటి ‘సందుక’ ని సమీక్షిస్తూ హెచ్చార్కే రాసిన సమీక్షను చదవండి. జ్వలిత రాసిన కథ ‘మానస సరోవరం’ నూ, పెద్దింటి అశోక్ కుమార్ మానేటి కథల్లో ‘లోను’ నూ చదవండి. అట్లే బెల్లంకొండ సంపత్ కుమార్ కథ ‘తీర్మానం’ ఈ సంచికలో ప్రాణహిత మీ కందిస్తున్నది.

భారతీయ భాషా పరిషత్ యువ పురస్కారాన్ని అందుకున్న కథకుడు సుంకోజి దేవేంద్రాచారి స్పందనను, బి. హెచ్ . ఇ. ఎల్ లో తెలంగాణ రచయితల సమావేశపు వివరాలను, అల్లం రాజయ్య సాహిత్యం పై విరసం సిటీ యూనిట్ నిర్వహించిన సదస్సు వివరాలనూ, చదవండి.

తన శీర్షిక ‘చౌరస్తా’ లో హిమబిందు ఈసారి ‘జోధా అక్బర్’ గురించి రాసిన వ్యాఖ్యలని, మేరీ బ్రేవ్ బర్డ్ ‘లకొట వుమన్’ కి మమత ధారావాహిక అనువాదం తరువాయి భాగాన్ని, కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ శాస్త్రీయ వ్యాసాన్ని చదవండి.

ఈ నెల నుండీ ప్రాణహిత ‘పోస్ట్ మాన్’ నవలకు ఎన్ . వేణుగోపాల్ ధారావాహిక అనువాదాన్ని అందిస్తున్నది.

కవితల్లో బాబ్ డిలాన్ కవిత అనువాదం ‘గాలిలో జవాబు తేలివస్తోంది విను’, కోటం చంద్రశేఖర్ రెండు కవితలు ‘కల’, ‘రాళ్ళు మోయడమేనా’, ఆశారాజు ‘ఇసుక తుఫానూ చిన్న దొరసాని’, జానా పోశెట్టి ‘ఇండియన్ జిమ్నాస్టిక్ తారా’, గోగు శ్యామల ‘తెలంగాణ జాతి’, కందుకూరు శ్రీరాములు ‘గగన కళ’ ను చదవండి.

ఎప్పటిలాగే ప్రాణహిత ను ఆదరిస్తారని మీ అభిప్రాయాలని, విమర్శలనూ, సూచనలనూ తెలియజేస్తారని మా విజ్ఞప్తి.

Share/Save/Bookmark

సంపాదకీయం

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో