గాలిలో జవాబు తేలివస్తోంది విను!

- బాబ్ డిలాన్

ఎన్నెన్ని బాటలు నడవాలి మనిషి
మనిషిగా నిలిచేందుకు?
అవును, మరెన్ని సముద్రాలీదాలి గువ్వలు
ఇసుక తిన్నెలమీద రెక్క వాల్చేందుకు?
అవును, ఎన్ని సార్లు పేలాలి మరఫిరంగులు
అవి ఇంక శాశ్వతంగా రద్దయిపోవడానికి?
 
జవాబు కావాలా నేస్తం, గాలి వీస్తోంది విను!
గాలిలో జవాబు తేలివస్తోంది విను!
 
ఎంతెంత పైకి ఎన్నెన్నిసార్లు చూడాలి మనిషి
నిర్మలాకాశం కనబడేందుకు?
అవునూ ఇంకెన్ని చెవులుండాలి మనిషికి
అగాథ జనాల అనంతఘోష వినేందుకు?
అవునూ ఇంకెన్ని చావులు కావాలి
మరీ ఎక్కువ మంది చచ్చి పోయారని తెలిసేందుకు?
 
జవాబు కావాలా నేస్తం, గాలి వీస్తోంది విను!
గాలిలో జవాబు తేలివస్తోంది విను!
 
ఎన్ని యేండ్లు నిలబడగలదు తలెత్తి  కొండ
కరిగి సముద్రంలోకి కొట్టుకుపోకుండా?
అవునూ మరెన్ని యుగాలు వేచి చూడాలి ప్రజలు
ఎగసి స్వేచ్ఛలో జీవించడానికి?
అవును గదా ఎన్నిసార్లు తల తిప్పుకోవాలి మనిషి
తనకేమీ కనబడడం లేదని నటించడానికి?
 
జవాబు కావాలా నేస్తం, గాలి వీస్తోంది విను!
గాలిలో జవాబు తేలివస్తోంది విను!

ఒక అభిప్రాయం »అనువాదాలు, కవితలు

One Response to “గాలిలో జవాబు తేలివస్తోంది విను!”

  1. 1
    narendra Says:

    Blowing in the Wind

    ఆనువాదం కంటే swechaanuvadam chestthe baguntundi. English loni rachana pakkane jathaparisthe sairpothundhi.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో