“మరో చరిత్ర”

చరిత్ర తెలుసుకోవడం నాకున్న వ్యాపకాల్లో ఒకటి. అందునా భారతదేశ వాతావరణంలోకి కొత్త సంస్కృతిని, తమ ఆచార వ్యవహారాలని మిళితం చేసిన మొగలుల (మంగోల్ –తుర్క్ లేదా టర్కీ సంతతి) పాలన మీద ప్రత్యేక ద్రృష్టి ఉండటం వల్ల “జోధా -అక్బర్” సినిమా విడుదల గురించి ఆసక్తిగా ఎదురు చూసాను. 16వ శతాబ్దంలో ఓ ముస్లిం చక్రవర్తికి, హిందూ రాకుమారికి పెళ్ళి జరగటం అంటే, “ఫస్ట్ జనరేషన్” మతాంతర వివాహంగా తీసుకోవచ్చు కనుక ఆనాటి సామాజిక, రాజకీయ, చారిత్రక అంశాల మీద కొద్దో గొప్పో అవగాహన పెంచుకోవచ్చుననేది నా ఆశ. కాకపోతే, సినిమా విడుదలకి ముందే, అనేక వివాదాలు జరుగుతుండటం గురించి తెలిసినపుడు, కోట్ల మంది ప్రజల దగ్గరకు చరిత్రను తీసుకెళ్ళాలనుకునే వాళ్ళు చరిత్రకి మసి బూసి మారేడుకాయ చేసే దుస్సాహసం చెయ్యగలరని అనుకోలేదు.

సినిమా మొదట్లో, “అక్బర్ ని పెళ్ళాడిన రాజ పుత్ర రాకుమారి పేరుకు సంబంధించి అనేక కధనాలు ప్రచారంలో ఉన్నాయి. చరిత్రలో అసలామె లేదని కొందరంటే, అక్బర్ కోడలని మరి కొందరంటారు. కానీ సామాన్య ప్రజలకు అక్బర్ భార్యగా తెలిసిన జోధా బాయి పేరును వాడుతున్నామనే” డిస్క్లయిమర్ అర్ధమయ్యేలోపల తెరపై నుంచి షేడ్ అవుట్ అవుతుంది. వివాదాల్ని తగ్గించుకునే ఉద్దేశంతో మొక్కుబడిగా వెయ్యాలని ఈ వివరణను జోడించడం తప్ప, సామాన్య ప్రేక్షకులకు ఇది చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నారనేది ఇక్కడ గుర్తించాల్సిన కోణం. ఇక ఆఖరులో, “జోధా -అక్బర్ల ని పెద్దగా గుర్తుచేసుకోం, ప్రేమకి ప్రతీకలుగా చెప్పుకోం… చరిత్ర ఈ కలయికకు అంత ప్రాధాన్యతని ఇవ్వకపోవడమే బహుశా దీనికి కారణం కావొచ్చు. కానీ సత్యం ఏమిటంటే, జోధా-అక్బర్ ఇద్దరూ కలిసి నిశ్శబ్దంగా ఒక చరిత్రని నిర్మించుకుంటూ పోయారు.” అనే అమితాబ్ చెప్పిన భావోద్వేగమైన వ్యాఖ్యానంతో సినిమా ముగుస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఓ వైపు అక్బర్ భార్య జోధా అవునో కాదో నమ్మకంగా చెప్పలేం అంటూనే, చరిత్రలో జోధా పేరు స్థిరపరిచే జోక్యం లేదా చొరబాటు ప్రయత్నం చేశారు.

జోధా పేరుకి సంబంధించి అనేక కధనాలున్నాయన్నారు… బాగానే ఉంది. కానీ, “జోధా –అక్బర్” సినిమా కధ, కధనాల authenticity గురించి కూడా సదరు బాధ్యతగల దర్శక నిర్మాతలు తెరపైనే చెప్పి ఉంటే, వారి నిబద్ధతని శంకించాల్సిన పని ఉండేది కాదు. “అశ్వధామ హతః, కుంజరః “ లాగా ఇటీవల ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా కధలో 80 శాతం కల్పితమేనని, 20 శాతం మాత్రమే (వ్యక్తుల పేర్లు, రాజ్యాల పేర్లు, ఉద్యోగస్తుల పేర్లు…..వగైరాలన్నమాట !) వాస్తవాలని దర్శకుడు చెప్పినప్పుడు, ఆ ఇంటర్వ్యూనో, లేదా ఈ వాస్తవమో చేరని ప్రేక్షకుల అవగాహనను సినిమా తప్పుత్రోవ పట్టించదా?! అనే ఊహకు నేను ఎంత ప్రయత్నించినా సమాధానమిచ్చుకోలేక పోయాను. సినిమా తీసినంత మాత్రాన అసలు చరిత్ర అయితే మారదు కదా… పెద్ద విచారించాల్సిన అవసరం లేదు అనే వారి వాదనని ఖండించక పోవచ్చు కానీ, సినిమాకి ఉన్న సమ్మోహన శక్తి ముందు, చారిత్రక వాస్తవాలు అడుగుకి వెళ్ళే ప్రమాదం ఉందని మాత్రం విశ్వాసంగా చెప్పగలను. అందునా ‘పిరియడ్’ సినిమాలు తీయడం ఫ్యాషన్ గానో, ట్రెండ్ గానో ఉన్న నేటి వాతావరణంలో బ్రాండ్ వాల్యూ కోసమో, ఆర్భాటంగా ఉండటం కోసమో, భార్యని కోడలిగా, లేక కోడలిని భార్యగా కూడా కన్విన్సింగ్ గా ప్రజంట్ చెయ్యగలరు… అదేమంటే… చిన్నపాటి క్రియేటీవ్ లిబర్టీకి ఇంత రాద్దాంతమా…? పైగా కోట్లు కుమ్మరించామంటూ వాపోగలరు లేదా గొప్ప ప్రయోగం చేశామని తెగ ముచ్చట ప్రదర్శించగలరు.

ఇక జోధా-అక్బర్ల జంట నాలాంటి సామాన్య భారతీయురాలికి ఎక్కడ, ఎలా పరిచయం అయ్యింది అనే ప్రశ్న వేసుకుంటే, స్కూల్లో చదివిన హిస్టరీ పుస్తకాల కంటే, అనార్కలి(1953)లో, ‘మొగల్ –ఎ-ఆజమ్’ (1960) సినిమాల్లో గుర్తొచ్చారు. చదివిన దాని కంటే చూసిన దాని ప్రభావం ఎక్కువ అంటారనే కోణం ఒకటయితే, మన పాఠ్యపుస్తకాల్లో, చరిత్ర అంటే: ఫలానా రాజు లేదా చక్రవర్తి పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ, యుద్ధం చేసిన తేదీ అలాగే… చెట్లు నాటడం, కళాపోషణ చేశారని చెప్పడం తప్పించి పిల్లలకి చదువుకునేది గుర్తుండేట్టు పాఠాలు రాయాలనే ధ్యాస రాసేవాళ్ళకి లేదు. ఇక ఆలాంటిదేదో మార్పు తీసుకువొచ్చి విధ్యావిధానాన్ని బాగు చేయాలనే శ్రద్ధ మన ప్రభుత్వాలకు లేదు కనుక మనం నిట్టూర్పులతో సరిపెట్టుకోవాల్సిందే. ప్రభుత్వమంటే గుర్తొచ్చింది….మన రాజకీయ పార్టీలకి కూడా చరిత్ర చాలా ప్రస్టేజియస్ ఇష్యు. తమ భావజాలాలకి, రాజకీయాలకి అనుకూలంగా లేని చోటల్లా వీలయితే మార్చాలని ఉబలాట పడుతుంటారు. ఇందుకు కాంగ్రెస్, బిజెపి, కమ్యూనిస్టులు ఎవరూ మినహాయింపు కాదు. చరిత్ర ఒక శాస్త్రం…! వీలయితే దాని Accuracy ని పెంచేందుకు సహకరించాలి, అందుకు అవసరమయిన పరికరాల్ని, పరిశోధనా పరిధిని విస్తృతం చేసుకోవాలి తప్ప దానిపై గోరీ కట్టి కలుపు మొక్కలు నాటాలనుకోవడం కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే అనే ఇంగితజ్ఞానం వీళ్ళకి వొస్తుందనే ఆశ కూడా అనవసరం. ఏది ఏమయినప్పటికీ రాజకీయాలు ప్రస్తుతం మనకి ప్రధానాంశం కాదు కనుక. చరిత్ర వైపే నడుద్దాం.
 

Satish Acharya - http://desicartoonist.blogspot.com
Satish Acharya - http://desicartoonist.blogspot.com
జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ కి, హిందూ రాజకుమారి మూడవ భార్య. ఈ వివాహం జరిగే నాటికి అక్బర్ కి రుఖయ్య, సలీమా అనే భార్యలున్నారు. రెండవ భార్య సలీమాని ఆమె భర్త భైరంఖాన్ (అక్బర్ చిన్నతనం నుంచి అండగా నిలిచిన సైన్యాధికారి) మరణానంతరం అక్బర్ వివాహం చేసుకున్నాడు. ఆమెర్ రాకుమారి హీరా (అక్బర్ పెళ్ళాడిన రాజ పుత్ర భార్యల్లో మొదటిది (ప్రస్తుతం జోధాగా చెప్పుకుంటోంది ఈమెనే) అక్బర్ కన్నా 22 రోజులు పెద్ద అయిన ఆమె ఇస్లాం మతం పుచ్చుకున్న అనంతరం వివాహమయింది. వివాహానంతరం పేరుని “మారియమ్ – ఉజ- జమాని” గా మార్చినట్టు మొగల్ చరిత్ర చెపుతోంది. ఆమె మరణానంతరం పాకిస్తాన్ లోని లాహొర్ లో మసీదు నిర్మించారు. ఆమె తరువాత అనేక మంది రాజపుత్ర వంశ రాకుమార్తెలతో అక్బర్ వివాహం జరిగింది. దాదాపు 300 మందికి పైగా “గుర్తించిన” భార్యలున్నారు. మొదటి భార్యకి సంతానం లేకపోవడం, మూడవ భార్యకి తొలి సంతానం అయిన రాజపుత్ర రక్తం కలిసిన జహంగీర్ (సలీమ్ ) అక్బర్ వారసుడయ్యాడు. జహంగీర్ మొదటి ముగ్గురు భార్యల్లో ఇద్దరు రాజపుత్ర రాకుమార్తెలున్నారు.
 
సినిమా విషయానికి వొస్తే, జోధా ఇస్ల్లాం పుచ్చుకుందని కానీ, పేరు మార్చడం జరిగిందని కానీ ఎక్కడా గట్టిగా అనలేక పోయారు. అక్బర్ కి అప్పటికే ఇద్దరు భార్యలున్నారంటే ఒక అద్భుతమయిన కలయిక పై ఉండే అంచనాలకి భంగం కలుగుతుందని భావించి ఉండొచ్చు. అందుకే ‘జోధా’ కధని హిందూ ప్రేక్షకులు నొచ్చుకోకుండా ఉండేట్లు మార్చారు. “ఏ వర్గం వారూ నొచ్చుకోకుండా తీయడమే నా లక్ష్యం” అని దర్శకుడు అశుతోష్ గోవర్కర్ స్వయంగా చెప్పుకున్నాడు కూడా. మరలాంటప్పుడు ఇవే మాటల్ని సినిమాలో వేసిన “వివరణ”కు జోడించి ఉండాల్సింది. ఎందుకంటే, ఆధారాలు లేని చరిత్రని లేదా కాల్పనిక రచనలని కూడా చరిత్రలో వ్యక్తులుగా బలంగా నాటగల సత్తా అదివరలో అయితే సాహిత్యానికి, ప్రస్తుతం మీడియాకి ఉంది. అయితే, సినిమా కేవలం వినోదం కోసం తీసేది కనుక ఆనందించి ఒదిలెయ్యాలి కానీ, అందులో చరిత్రని కరెక్ట్ గా అప్పచెప్పారా లేదా అని వెతకడం భావ్యమా? సినిమా బాగుంటే దర్శకుడి స్రృజనాత్మక చొరబాట్లని క్షమించెయ్య వొచ్చనే అభిప్రాయాలను నేను కొట్టిపారెయ్యను కానీ అన్ని సందర్భాల్లో ఇది ఆచరణీయం కాదు. ఈ నాటి మన తాత్కాలిక వినోదం రేపటి తరపు అజ్ఞానానికి నాంది కాకూడదనేది నా ఆందోళన.

అక్బర్ వివాహాలకి సంబంధించి చరిత్ర పాఠంలో ఓ ఆసక్తికరమైన కధనం:
A Muslim can have a ‘Mutta’ marriage with a free woman of other religion. A ‘Mutta’ marraige involves no ceremony, but is a private pact between a man and a woman for, officially, ‘a limited period time (as short as one night)’ agreed between them. Akbar used ‘Mutta’ principle to justify his 300 wives. But the Sunni Ulemma (Islamic scholars) from his court disagreed. The arguments between Akbar and Ulemma raged back and forth, until -completing the parallel with Henry VIII- Akbar dismissed the Kazi, the highest religious officer from his court, and replaced him with another who did agree with him!

Later, Akbar had effrontery to decree that ‘it was best for ordinary men to have only one wife’!

4 అభిప్రాయాలు »చౌరస్తా, సాహిత్య వ్యాసాలు

4 అభిప్రాయాలు

  1. prasanna Nov 3, 2008 1

    చల బంగుంది

  2. ashok Nov 10, 2008 2

    హిమబిందు, పేరు బావుంది
    one thing
    oka muslim oka hindu ammaini chesukovachu kani ade oka muslim woman
    oka hindu abbaini pelli chesukovachu ani kuda cheppavachu kada
    i like equality , i cant say anything more than this.
    inka chala adagalani vundi
    for that u can contact through ur personnel mail id

    i am fond of history
    anyway u have done a good job
    dont bother about others(like films) watever u want u do that

  3. ashok Nov 10, 2008 3

    if u want new culture then go anywhere around the world.
    plz. dont try to ipure our indian culture with others.

  4. Rohiniprasad Apr 8, 2009 4

    సినిమాలని (అందులోనూ వ్యాపారసినిమాలని) చరిత్ర విషయంలోగాని, సంస్కృతి విషయంలోగాని సీరియస్ గా తీసుకోవడం అనవసరం. అక్బర్ లేదా మరొక రాజు హిందూ ముస్లిం ఐక్యత కోసం ఏం చేశాడన్నది ఒక పొలిటికల్ మెసేజ్ ఇస్తుందేమోగాని ఆ కాలంలో సామాన్యప్రజల మధ్య ఏ రకమైన మతసామరస్యం ఉండేదనేది ముఖ్యం.

    ఆనాటివాడైన కబీర్ ను ఇప్పుడు ముస్లిమ్ అంటున్నారు. అప్పట్లో అతన్ని జులాహా (నేతగాడు) అనేవారు. వృత్తిపరమైన గుర్తింపే ఉండేది; మతపరమైనది కాదు. బీజేపీ మార్కు విభజనలు ఇప్పటికాలానివి. ముగల్ సేనలతో తలపడి దక్కన్ సుల్తానులు ఓడినప్పుడు స్థానిక హిందువులు కనీరు కార్చారు. ముస్లింలూ, ముస్లింలూ కొట్టుకున్నారులే అని నిర్లక్ష్యం చెయ్యలేదు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో