ఇండియన్ జిమ్నాస్టిక్ తారా

కన్నుల్లో అమాయకత్వం
చెంపల్లో పాలతడి ఆరిపోలేదింకా
చిగురు చేతులపై భాగ్యరేఖ లేదని
బడి అడుగులను కూడలి వద్దకు లాగుతున్న-
హస్తరేఖ నిపుణుడెవరో కాని…

రోడ్డు పక్కన
లేత వెన్నును రబ్బరుబంతిలా
కోలాటపు చిందులు వేయిస్తుంటే
గరుకు నేలపై కందిపోతున్నవి పాద మొగ్గలు

ఆడిపాడే జడపువ్వుల తలపై కుండ మీద కుండబెట్టి
ఆకాశంలో బతుకు తారుపై పరుగుపందెం నిర్వహిస్తుంటే
చూసే ప్రతి రెండు కళ్ళల్లో జిమ్నాస్టిక్ తార మెరుస్తుంది

కుడి ఎడమైతే
రెప్పపాటులో ప్రమాదం ప్రత్యక్షమవుతుందన్నా
ఆకలి బాధ అద్భుత రసాన్ని చిలికిస్తుందిక్కడ

చివరకు చిల్లర కోసం
తట్టి పట్టుకోని అలలా అలా కన్నీళ్ళ జాతి కళా!
ప్రేక్షక పాదతీరాన్ని తాకుతుంటె
ఈ సిరుల తీరమెందుకో తనకు దూరమవుతుంది
తిరిగి తన హృదయాన్ని తానే దుఃఖంతో తడుపుకుంటుంది!!

Share/Save/Bookmark

కవితలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో