ఇసుక తుఫానూ చిన్న దొరసాని

ఈ షెహనాయీలో సర్పం దూరి, బుసలు కొడుతోంది. ఈ నదిని ఏ కవి కౌగిలించుకొన్నాడో, పులకించి మెలికలు తిరుగుతోంది. వర్షం కురిసినపుడు, ఎవరిదో పుస్తకం తడిసి వుంటుంది. చెరిగిన అక్షరాలు, లేచే పక్షుల గుంపవుతోంది. చెట్టు మీద దాగి, ఆకాశం, బట్టలు మార్చుకొంటోంది. ఈ చంద్రుడూ, కోటానుకోట్ల తారలూ, ఏ సౌందర్యరాశి పెదాల్నో కొరికి వుంటాయి. మిణుగుర్లు, ఒయాసిస్సుల వద్ద రాలిన, కర్జూరపు పండ్లు. గిటారు తీగల మీద మరణించినవాడిదే గొప్ప జీవితం. దొరసాని చేయి పట్టుకొని, గడి మీది నుంచి దూకిన పాలేరుదే చరిత్ర గర్వపడే ప్రేమ.

ఎంత దూరం, అడుగుల్లో ఆశను తాగి మత్తెక్కుతావు. ఆ తల్లి, ఒంటరిగా వెళ్తూ పిడికెడు ప్రేమనూ, చిటికెడు ధైర్యాన్ని, ఈ రాళ్ళూ రప్పల మీద మంత్రించి చల్లింది. దోసిలి చాచినవాడికి, పల్లేరుకాయలు దొరికాయి. నటించినవాడికి, వజ్రాలు అందాయి. ఆమెకు తెలుసు, పల్లేర్లూ, వజ్రాలూ శునకాలు కూడా ముట్టుకోవనీ. బతకటానికి, అన్నం మెతుకులు కావాలి. కళ్ళు మూసుకొని, అమె నవ్వుని వింటే, యుగాల వరకూ ఆకలి వేయదు. నీ కన్నొకటి పీకి, నీ వేలొకటి కోసి, నిప్పుల్లో కాల్చి, క్షీరాభిషేకం చేయగలవా! దేహంలోని, నరాల్ని తెంపి, అరికాలికీ, దవడ పన్నుకీ బిగించి కట్టి, పహాడిరాగం ఆలపించగలవా! జెర్రులు పారుతున్న బ్రెడ్డు ముక్కను దాచుకొన్న వయోలిన్ కళాకారుడు, బతికే వున్నాడు. జామకాయను కొరికి, ప్రియురాలు పంచిన ఎంగిలే, ఈ సెలయేరు.
 
ఇంకా ఎదురుచూద్దాము. ఈ ఎండ, కాళ్ళు సుర్రుమనే ఇసుకదారి, చివ్వున గుచ్చుకొన్న ఈ తమ్ముళ్ళు, గరుకుగా రాసుకొనే, ఎండిన చెట్టు మొద్దు, ఇంకా, ఎంత కవిత్వం చెబుతాయో విందాము. కాలి కింద పడిన మొగ్గ, ఎలా వికసిస్తుందో ఓపిక పడదాము. చిన్న ముద్దుపెట్టి, ఇంత బలవంతుడ్ని చేసిన రాక్షసీ, ఎప్పుడో, నీ కళ్ళలో దాగిన స్వప్నాలు ఎత్తుకుపోతాను. నీ ఉంగరాన్ని కొరికీ, నీ చెంపని కొరికీ, నా నాలుక కొరుక్కొని, శాశ్వతంగా మూగవాడ్నయాను. ఒక గజల్ పాడి, నిలువునా చంపేదానా, నీ పాదం, నా గొంతు మీద పెట్టి, గట్టిగా తొక్కు. పాట వినకుండా చచ్చేవాడు, యుగయుగాల అనాథ.
 
కరచాలనం చేసి విడిపోయాము. ఖడ్గాలు, పక్కన విసిరేసి, ఒకరి ప్రేమను ఒకరం చూసుకొన్నాము. సుడిగాలిలో ప్రత్యక్షమయిన ఒక అరబ్ కన్య చిలిపిగా కవిత్వం చల్లింది.

ఈ మేడలెందుకూ, కోటలెందుకూ! చావడానికి, బాదం పలుకురంగు, నాగుపాము లాంటి సముద్రం చాలు. ఈ గాలి ఎక్కడి నుంచి వీచినా, మనిషి శ్వాస నుంచే వస్తోంది. శ్వాస ఆడని మనిషి, ప్రేమించటానికి పనికిరాడు. ఎవరైతే గానుగ మరలో నలిగిపోరో, ఎవరైతే పరిమళం పరిభాషని గుర్తించరో వాళ్ళు యుద్ధానికి పనికిరారు. వెచ్చని ముద్దుకు నోచుకోరు.

Share/Save/Bookmark

కవితలు

2 అభిప్రాయాలు

  1. bollojubaba మే 2008 1

    అద్బుతమైన్ పదచిత్రాలు కావాలంటే ఆశారాజు గారి కవితలలో చూడాల్సిందే. ఎన్నెన్ని పదచిత్రాలు. దీన్నే ఓ పది కవితలుగా విరగొట్టి ఆనందించొచ్చు, ఆనందింపచెయ్యచ్చు . కాదంటారా?

    బొల్లోజు బాబా

  2. desaraju మే 2008 2

    Beautiful………..

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో