కల

నీటి బాధలు మీకు తెలియవ్
కూటిబాధలు మీకు తెలియవ్
బావులు కొట్టాం, బావురుమన్నాం
అనుక్షణం ఆహుతించు అంతులేని సెగలు
ప్రతిక్షణం పరీక్షించు అసమానపు దగలు
ఊళ్ళేలే ఊహల్లేవ్
ఉన్నత వ్యూహాల్లేవ్
నీళ్ళే-
గుక్కెడు నీళ్ళే-
జపం నీళ్ళకే
జవం నీళ్ళకే-
కాలిపోతున్న గుడిసెలు మావి
మాడిపోతున్న గుండెలు మావి
వ్యధాకలిత గాథల హక్కుదారులం
సుధారహిత వ్యాధుల పక్కదారులం
దూరాన
నీలినీడలు మబ్బుతెరలుగా మారాలని వాంఛ
అంబరాన
అణుధారలు మువాలని కాంక్ష
రెప్పలు అలసి
రెక్కలు సొలసి
చేలన్నీ బీళ్లైతే
కల; యెద లోపల కల-
ప్రాణాపాయస్థితిలో సంజీవని లాంటి కల-
ఊరి చెరువుల
గలగల గంటల గంగావడి
తురంగ తరంగాల తళుకుల సవ్వడి
తెలి నురగల తీరవ్యాప్తం
బాధల బంధనాల విముక్తం
వాళ్ళ
పేర్లేవైతేనేం?
ఊర్లేవైతేనేం?
ఇక్కడివాళ్ళు అక్కడ పరిమళిస్తూ ప్రతిఫలిస్తూ-
ఎక్కడివాళ్ళైతేనేం?
చక్కనివాళ్ళైతే చాలు,
గుణగణాల చిక్కనివాళ్ళైతే చాలు-
పరువు బతుకు కోసం రాజ్యంగాని రాజ్యంలో
బతుకుదెరువు కోసం దేశంగాని దేశంలో-
వాళ్ళక్కడ కోటి అభిలాషల్తో
వాళ్ళక్కడ శతకోటి అభిష్టాల్తో-
వలసవాదుల మీద పన్నిన వల
దాచుకున్న కలల వెలవెల
అగ్రరాజ్యం
క్షుద్రముఠాల కొలువైతే
కుట్రకోణాల నెలవైతే
ఇక భద్రత గాలిలో దీపం?
అయ్యో! దేవుడా
ఎగిరొచ్చిన పిట్టలన్నీ
స్థానిక వేటగాళ్ళ ఉండేలుదెబ్బలకి బలేనా?
ఈదొచ్చిన చేపలన్నీ
స్థానిక బెస్తగాళ్ళ గాలాలకి చిక్కేనా?
హింసోన్మాద శక్తుల మధ్య స్తంభించిన హంసల నడకలు
శరవేగపు శరాఘాతమున గతి తప్పిన జింకల నడతలు

అభిప్రాయాలు లేవు »కవితలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో