తీర్మానం

అల్గువారుపురమని అదొక పల్లె. సుట్టుముట్టు ఉర్లల్ల ఆ ఊరే పెద్దది. అక్కడ ఏ అక్కరొచ్చినా పదిమంది జమై మాట్లాడుకుంటరు. కష్టసుఖాలు పంచుకుంటరు సీన్మాల లొల్లిగాని, ఫైవ్‌స్టార్ల రద్దిగాని ఆ వూల్లె లేనే లేవు. వారం రోజుల సంది పోలీసోల్ల అడావుడే ఎక్కువ కనిపిస్తున్నది. ఎలచ్చన్లు గదా! నాలుగైదు పార్టీల జీబులొచ్చిపోయే వరకు పాతపగల తోటి యాడ తల్కాయలు పలగ్గొట్టుకుంటరోనని ముందే బందవస్తు జేస్తున్నరు. అయినా గా పోలీసోల్ల అవుసరం ఆ ఊరికి లేదు.

మధ్యరంగం కాడ మేజర్‌ గ్రామ పంచాయతి ఆఫీసు యెన్క ఒక పెద్ద చింత చెట్టున్నది. దాని నీడ సంగంవాడకు ఆసరైతది. ఆ చెట్టు కింద వడ్ల మల్లయ్యవి కొన్ని మొద్దులున్నాయ్‌. ఆ మొద్దులను వేదిక చేసుకొని ఒకరొకరు పిల్లలు పెద్దలు మసలోల్లన్నట్టుగ గుమిగూడ వట్టిండ్రు. ఊరిని కొత్తక జూసెటోల్లకు అదొక జాతరోలె అనిపిస్తది.

”మీరంతా మీమీ మాటలు మానుకుంటె ఇయాలటి సంగతి మాట్లాడుకుందాం”. చంద్రం గట్టిగ మాట్లాడిండు. వానవడి యెలిసినట్టు అందరు కామూశయిండ్రు. చంద్రం తన మాట మొదలు పెట్టిండు.

”ఊల్లెకు ఐదు రకాల జీపులొచ్చి ఎన్నికల ప్రచారం జేస్తున్నరు. మనందరం చూస్తున్నదే. ఒకటి నక్కగుర్తు, రెండోది పిల్లి గుర్తు, మూడోది గద్ద గుర్తు, నాల్గోది తోడేలు గుర్తు, ఐదోది ఊర పిచ్చుక గుర్తు. వాల్ల మనుషులు అచ్చుకుంట మర్యాదగ జెపెటోల్లు మర్యాదగ జెప్తున్నరు. జబర్దస్తిగ జెప్పెటోల్లు జబర్దస్తిగ జెప్తున్నరు. ఇది ప్రజాస్వామ్యం కనుక మనకాడ ఉండాలె. మరి మీరేమంటరు? పెద్దమనుషులు ఒక్కోలు జెప్పుండ్రి. ఊరికైన మంచి పనులేంటివి? మనకు ఎవరు జెసిన ఉద్దార్కం ఎంత? గది జూసుకుంట మాట్లాడాలె”…

ఒక్క నిముషం నిశబ్దమయిం తర్వాత రామయ్య రుమాలు దులుపుకొని మొకాళ్ళ మీద నిలబడి ”గా పిట్టగుర్తు పెట్టుకున్న పెద్దోల్ల రాజంను ఇడ్రా వెట్కోమన్నరంటిరి గదనే? పెట్టుకున్నడ లేదా! పైసలాశ జూపుతరన్నంగ ఇన్న”..

రామయ్య పూర్తిగ అడగకముందే లచ్చవ్వ అందుకొని ”పైసలిస్తమన్న ఇడ్రా వెట్టుకోకుంటె సప్తం, నరుక్తం దాకొచ్చింది వరస. ఐనా ఆయన మొదటి సంది పైస మొకం జూడకుంట సుట్టుముట్టోల్లకు ఏ ఔస్రమున్నా నిలవడ్తడు గద! ఈ రామయ్య ఏలోకంల నిద్రలుంటడో గని పపంచంల ఏమైతన్నదో క్యాల్‌ వెట్టేటట్టు లేడు.

”కాదవ్వ తెల్వకడుగుతున్న”… రామయ్య అమాయకంగ మొకం పెట్టిండు.

‘మరి అంత బాగనే గని అసలు సర్పంచి రాలేదేమే’ అడిగిండు లింగయ్య. అందరి దృష్టి సర్పంచి మీదకి మల్లింది.

‘ఐదేళ్ల నుంచి సర్పంచి దండిగ సంపాయించుకున్నడు. ఆడ ఇన్ని అరటి గెలలు పాటపాడి ఈడ ఇల్లు ముంగిలి కొన్నడు. ఐదు పది వేలు ఎన్ని కర్సు జేసిండో గని, పొలాలాయె… టాక్టర్లాయె.. కోత మిషన్లు టీ.వీ.లు పట్నంల బంగ్లాలు దాస దాసి జనం ముంగట కూసోంగ మోటరు సైకిళ్ళు, కార్లు, ఎన్నెన్నో… అంత ఇంటికాడనే సభగావట్టె ఇంక ఈడికెందు కొస్తడు!’ వెటకారంగా అన్నది రామవ్వ.

నారాయణకు మాత్రం కొంచెం మాట్లాడాలనిపించింది. ఆయన ఆ ఊరి మెంబరు సర్పంచుకు ఆయనకు అన్ని విషయాలల్ల సన్నీతమే. కాని సర్పంచును యెన్కపిలవాలని లొల్లయినసంది జర తగ్గిండు.

‘ఎందుకమ్మా! బరద గాకుంట వూల్లె బండి బాటకు మొరం బోయించిండు. నల్లాల టాంకిల కెల్లి ఇండ్లకు నీళ్ళు వెట్టించ్చిండు పెలయినయో, పాసయినయోగాని ఐదారు బోర్లేయించిండు…’ ఇంకా చెప్పబోతుండకనే నారాయణ మాటను యతిరారజ్‌ జేసిండ్రు.

‘బండ్ల బాటమీద మొరంబోసి రోడ్డని రాసుకున్నరు అదిగొప్పనే? నల్లా టాకి నీళ్ళకు ఇంటికి ఐదు వందలు వసూలు జేసిడ్రు… బోర్లకు లక్షల బిల్లులు రాసిండ్రు ఒకటే గది, సన్నగ పోస్తన్నది! ఇగ లోన్లిప్పిస్తమని పైరవీలు చేసి ఖర్చులయినయని కోసుకొసిరి, ఐదువేలతోని పాలిచ్చే బర్రెలిప్పించి పదివేల కొకటని దొంగలెక్కలు జూపిచ్చిరి. అంతా గొప్పనే… గొప్ప… ఏం మాట మాట్లాడ్తరయ్య, మాట మాట్లాడితే గింత ఇంగిత ముండాలె”! నర్సింలు మాట అందరికి నూట్లకో మాటోలె తోచింది.

మాట మాటల కల్లుబండి చెట్టుదగ్గరి కొచ్చింది. బండితోనే జీతగాడు సాములు నక్క జండాను సవరించి కిందికి దిగిండు. జనంల మల్ల గుసగుసలు మొదలైనై. కొందరు కోపం జెయ్యవట్టిండ్రు. కొందరు బీరిపోయిండ్రు. ఇంకొందరు మాట ఎత్తుకోనీకి ఎదురు జూస్తున్నరు. ఇంతట్ల చంద్రమే నోరు మెదిపిండు. ”ఎలచ్చన్లు రాంగనె కల్లు, సారాలు జూపి మన బతుకుల తోటి ఆటలాడుతున్నరు. అటువంటి పెద్దలను ఇకనించయినా ఇడిచిపెడ్తాం. ఎలచ్చన్ల నిలబడ్డోళ్ళు సంపాదన సార్దమే జూసుకుంటున్నరు. మన బాగోగులు జూస్తలేరు. ఇవాల వచ్చిన ఆ నాయకులే మల్లా ఎన్నికలదాకా రారు. చచ్చినా బతికినా పట్టిచ్చుకోరు. మనం, మన పిల్లలూ ఇట్లనే ఉందామా! కల్లు బండి కనబడంగనే సల్లబడకుండ ఆలోచన చేసుకోండ్రి”.

ఒక్క నిముషం ఆ చింత టచెట్టు చుట్టూ ఆలోచనలు కమ్ముకున్నయి. కలుమీదా, స్వార్దం మీద సమాజంలో వేళ్ళూనుకున్న కంపుమీద అందరికీ చెప్పరానంత అసయ్యం కల్గింది. రోజూ చూసే కల్లు ఐదేళ్ళ చీకటికి తోడయితదంటే ఎవరూ ఇష్టపడలేదు.

అటే మల్పుకపో… సాములు…. బండి ఇడ్వకు….! ఎలచ్చన్లయేదాక రావొద్దు… అటే మల్పు… అందరి గొంతులూ అదమాయించినయ్‌.

‘పటేల్‌ పంపించిండు… పటేల్‌’… అని సాములు నచ్చజెప్తుండగనే అందరి చీదరింపులు సాములు బండిని తరిమేసినయ్‌.

‘ఔనయ్య! నాకు తెల్వకడుగుత ఐద్గురు, ఆర్గురు చొప్పున ఓట్లకు నిలవడుతున్నరు, గండ్ల ధరావతు దక్కించుకునేటోల్లు ఎందరు? అసలు గీవీల్లంత ఎందుకిట్ల పొత్తులు పొత్తులని పెట్టుకుంటరు? కత్తులెందుకు దూసుకుంటరు? మా తల్కాయలెందుకు పలగ్గొడ్తరు? వాల్లు వాల్లు మంచోల్లే అయితరుగని నడిమిట్ల మన పానాలేనా అల్కగదొరికినయి! వీల్ల సంగతేందో నాకు దెల్వదు.. పజలకు సేవ జేయాలని ఉంటెనేను జెప్తున్న ఒకటేమాట ముందుకొచ్చి మంచి జెయ్యాలెగని గీతంతేందయ్యా! అరె..రె.. మాసుంటి పజలకు బాగబాగ జేసెటందుకే ఇంతమంది పోటీ పడ్తన్నరా? లేక ఐదేండ్లల్ల బాగా సంపాయించుకోవచ్చని పెట్టుబడిలు పెట్టుకుంట పోటీలు పడ్తున్నర? ఎలచ్చన్లూ ఓ యాపారమైపాయె…’ సుజాతమ్మ ఆవేశాన్ని ఆపుకోలేకపోయింది.

‘పెట్టుబడి పెట్టినంక లాభం రావాలని చూడరానే యక్క! నువ్వోటి బాగనే మాట్లాడుతవుగని’ రాములు లేచి నిలబడి రొంటికంటిన దుమ్ము దల్పుకుంటు ఎడ్లకు నీళ్ళు పెట్టొస్తనని కదిలిండు. పక్కన చిన్న హోటల్‌ పెట్టుకున్న విక్రం చేతిల గ్లాసుల సప్పుడయింది. అందరి చూపు చాయ్‌ మీద పడ్డది. కేట్లీల చాయి వొంపుకొని విక్రం రానే వొచ్చిండు.

ఆ ఊళ్ళ ఆ చింతచెట్టు కింద ఎన్నో పంచాయితీలు తీర్పులు జరిగినై. ఆ తాడ కులమతాలు లేవు. అందరు ఒక్క దగ్గర చేరి చర్చ పెట్టుకుంటరు. కోర్టులకు పోలీసులకు అక్కడ పనే లేదు. తప్పు చేసినోల్లకు మాట మందలింపు శిక్షలు జరిమానలు ఉంటయి. దండుగ పైసలు ఊరికే కర్చుజేస్తరు. ఆ ఊర్ల సర్కారుదంటే ఒక బడి ఉన్నది. అదీ పంచాయితి ఆపీసుకు కేక దూరంలనే ఉంటది. పనులకు పోతున్న తల్లిదండ్రుల మీద గార్వంతోటి పిల్లలు మంకుకాలేసి బడిరాంగనే విడిపోతరు. రాంగ, పోంగ అన్నట్టు పల్లె పాటలు లిగా వినిపిస్తయ్‌. పండగ పబ్బాలకు యేషాలు కడ్తరు. బతుకమ్మ బోనాలు పోటీల మీద జేస్తరు. యగుసం చుట్టూతా అల్లుకున్న అన్ని కులకశ్పిల మనుషులు ఒక్క సంగంగ ఉంటరు. ఒక్క మాటల జెప్పాలంటె ఆడి ఉమ్మడి పంటపొలాల సేద్యంల అందరూ కష్టపోతులే. కుచోని తినేటోడు ఆ ఊల్లనే లేరుగని బతుకు తీరుల గిప్పుడస్తున్న మార్పులను ఈ చింత చెట్టుకాడనే పసిగట్టి రూపుమాపుతన్నరు. రాత్రయిందంటే తలెల ఇంత బువ్వ పెట్టుకొని తినుకుంటూ ఈ ముచ్చట ఆ ముచ్చట చెప్పుకొని నిద్రకు జారుకుంటరు. పంట పొలాలు, పిల్లలు ఆ ఊరి తొలిసంజ కాంతులు. మల్లా అదే గ్లాసుల చప్పుడుతో విక్రం తిరిగి పోయిండు. జరంత సేపు పార్టీల మీద జోకులు పేలినయ్‌.

‘చెల్కలల్ల చేన్లల్ల పడుకుంట లేసుకుంట గా రాజుగాడు జూడే చంద్రం ఎట్లస్తున్నడో’! దృష్టి మల్పిండు పోచయ్య. రాజు ఇంకా జంగలు పెద్దగజేసి చింతచెట్టుకాడి కొచ్చిండు చెమటలు కారంగ.

”అన్ని వూల్లోల్లు ఒక్కొక్క పార్టీకి అభయమిచ్చిండ్రంట. మనూరోల్లు ఎటుదేల్చి చెప్పుతలేరని మండలంకాడ గా పెద్దమనుషులు గరమైతున్నరు. ఈ పంచాయితి చెట్టుకాడ మన మాట ముచ్చట ఎందాకొచ్చింది! కల్లువోయిస్తమని ఒకడు… పైసలు పంచితమని ఒకడు.. చీరలు పంచాలని ఒకడు… బొట్టు కాట్కెలు పెట్టాలని ఒకడు ఆలోచన జోస్తున్నరే”!.

”ఇంతదానికే గంత ఆగంబట్టుకొని అత్తన్నావురా రాజు! ఇదిట్ల కాదు… నేను జెప్త దీని సంగతి” సైనుబట్ట బనీను ఇడిచి ఝూడించి భజంమీద ఏసుకున్నడు బూదయ్య. ”ఏం లేదే…! ఒక పన్జేతం. సాతంత్ర మొచ్చి గిన్నేళ్ళుయింది. మన కింత ఇల్లులేదు. ఊరు పెరిగింది గని బత్కు భూమి పెరగలేదు. కట్టు బట్ట కరువున్నది. నీల్లు లేక కరంటులేక గొడగొడ ఏడ్సున్నది. అన్ని ప్రైవేటుటయితున్నయిర మొర్రో అని ఏడుస్తుంటె గీ వలస యాసొక్కటి యెక్కిరియ్య వట్టింది. పదిల పదకొండన్నట్లు తెలంగాణ సారమంత పిండి దారవోసి బొక్కతోలు మిగల వడ్తిమి. అందరి పానాలు ఒక్కటే ఈ దోపిడి పోవాలె.

ఈ ఐదు గుర్తులోల్లను ఈ చింతచెట్టు కాడికి పిల్చి కూకోబెట్టి మన ఎజెండంతా ముదుపెడ్తాం. అన్న ఒప్పుకుని పని జేసేటందుకు ముందుకొచ్చినోల్లు కాయితం రాసియ్యాలె మన మాటకు కట్టుబడినోడే ఆయె. ఇండ్ల నిజాయితిగ మనసు మార్చుకుంటే సరే వాడు మనోడే.

ఇంకో మాట కూడ జెప్తున్న కాయితం మీద ఒప్పందాలు రాసిందొకటి చేసేదొకటైతే ఊరు ఊరంతా ఈ చెట్టుకిందనే నిలదీసి యెన్కకు ఊడుస్తురు. ఈ ఊరు ప్రజలకుంటది. సుజాతమ్మ చెప్పినట్టు పైసలాసకే పోటిపడేటోల్లు ఇగ మనకొద్దు. మనం పొలాల్ల గుడ్డాలల్ల చెమట పట్టినట్టే వాల్లూ అంతే. ఊర్లకూర్లు అన్యాయమైతన్నయని నిలబడి చాపలిల్లోలే ఎదురీదాలెగని తెల్లబట్టలేసుకొని మన జుట్టు పట్టుకొని ఆడ్తమంటే ఊకోం. మన తోటి ఉండి మన కష్టసుకాలల్ల మెదిలి మన మనిషనిపించుకోవాలె. మల్లా ఓట్లడిగేటందుకు మొకముంచుకునేటోడే మనకు కావాలె”.

‘గీ మాట బాగన్నవే బూదన్న… మా మాట కూడ అదే… ”మరేందిరా! సాయక్క సాయక్కనుకుంట సుతారం జేస్తే మనమింతే”

బాగున్నదే!.. బాగున్నది….

మంచిగన్నవే… నూట్లకొక్క మాటంటే గిదే. అందరి ఒప్పందంతోటి చింత చెట్టు ఎంతో బరువు దించుకున్నట్టు చల్లని గాలి వీచింది. బాదలబందీ అంతా కొట్టుకుపోయినంత ఉషారుగ అందరూ కొత్తగాలి పీల్చిండ్రు.

”ఇగ తీర్మానం రాయిండ్రీ”.. సుజాతమ్మ గిట చంద్రం దిక్కు చూసిండ్రు.

తీర్మానం రాసి చదివి ఇనిపించిన చంద్రం చేతి రాతను అన్ని పత్రికలు అనుసరించినై.

కండ్లు నలుచుకొని తేరిపార చదివిన ఊళ్లన్నీ గతం పీడకలనించి ఆలోచనలను ఆకురాయి మీద నూరి ఆడుగు ముందుకేసినయి.


కథలు

2 అభిప్రాయాలు

  1. praveeen Apr 2008 1

    చాల బావుంది

  2. ashok Nov 2008 2

    నచింది, అందరు ఇలాగె అలోచిసెతె బావుంటుంది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో