తెలంగాణ జాతి

ఆకలి! అని ఆర్యులొచ్చి అడుక్కుంటే
రొండు సేతుల దోసిలితో బియ్యం పెట్టింది
బూక్ ! బూక్ !! అని ఆకలితో నోరు తెరిసినోల్లకు
ఇంత బుక్కవెట్టింది తెలంగాణ
వందల వడ్ల రకాలని ప్రపంచం మీద సల్లింది
వడ్ల వేట కోసం ప్రపంచమంతా
తరతరాలుగా ఈడనే అడ్డ జమాయించింది తెలంగాణల
ఆర్యులయినా ఔరంగజేబైనా
బ్రిటిసోల్లైనా అమెరికోల్లైనా
వొడ్ల సొమ్ములే వడ్డీలుగా గుంజి
సామ్రాజ్యవాదులైన్రు
పెండ్లికైనా బియ్యం అక్షింతలే
సావుకైనా బియ్యం ప్యాలాలే
పాములకైనా ప్యాలాలే
బిచ్చమెయ్యాలన్నా బియ్యమే
ఎవ్వరింటి ముందు నిలవడి అడిగినా
దోసెడు బియ్యమో, అన్నమో
గోల్కొండా! మన గొల్లకొండే … బియ్యం బండ్ల
తొవ్వల కట్టిండ్రు !! తెలంగాణోల్లు
ఫలక్ నుమా! బియ్యం బండ్ల బాటల కట్టిండ్రు !!
బ్రిటిసోని అడ్డలయినా కలకత్తా ! మద్రాసు!!
బియ్యం బండ్ల బాట అడ్డలనే!
ఇంటోల్లు కాలం దీరి కాలంజేస్తే
సావుకు బంగారు వెండి పువ్వులు జల్లుకున్నది తెలంగాణ తల్లి
ఆల రుణం తీర్చుకోనీకె
ఇండో యూరోపియన్లు బట్టలు లేకుండా
క్ల్యాన్లుగా వచ్చినోల్లకు
అయ్యో బట్టలేదని మగ్గంనేత బట్టలిచ్చింది తెలంగాణతల్లి 
వారి పక్కన జేరి జై ఆంధ్ర అన్న వారి మత్లబేందని
ఆరా తీసింది
‘ఆంధ్ర’ అన్నది తెలుగేనా?
మరి ‘ఆండ్రె’ యాడ్కెల్లొచ్చె దేవులాడుండ్రి పురమాయించింది తెలంగాణ తల్లి
ఆంధ్ర తెలుగుభాష ఉద్దండులూ,
విశాలాంధ్ర కమ్యూనిస్టులూ మిమ్లనే అడిగేది!
తెలంగాణ ఒక జాతి ! జంబూ ద్వీపం
తెలంగాణ ప్రజలంటే ఈ మూలవాసులే!
వీరికి టెరిటరి ఉంది!
సొంత నాగరికత ఉన్నది!
సొంత భాష ఉన్నది!
సొంత అక్షరాల దండ ఉన్నది!
సొంత ఉనికి చైతన్యమున్నది!
వీటన్నింటినీ ఈ కండపు మూలవాసులే నిర్మించుకున్నరు
ఎట్లా ….
ఇక్కడి భూములన్నీ మూలవాసులవే
భూమిలో పన్జేసే నైపుణ్యం …. వారిదే!
పనిముట్లు ….  వారివే
చెమటను తీసేది … మూలవాసులే !
వారే ఈ భూమి బిడ్డలు!!
ఈల్లే గద!
జీనోసైడ్ సంపుడువంజం చేయబడుతున్నరిపుడు.
వెయ్యి సంవత్సరాలు జిజియా పన్నుల పాలనజేసిండ్రు బయటోల్లు
తోలు తీసి డోలు కొట్టి పన్నులు వసూలు జేసే పాలన నడ్పిండ్రు
సొతంత్రమైనంక గుండు కొట్టి నిల్వుదోపిడీ జేసే
మతకల్లోలాల మతపాలనొచ్చింది.
మనువు రాజకీయ పార్టీలన్ని మూలవాసులను
జీనోసైడు సంపుడు వంజం జేస్తనే ఉన్నరు.
సాయుధ పోరాటం, జమ్మిచెట్టు తొర్రల పుట్టిన కథలు
సంస్థానులుగా ఉన్న తుర్కరాజులను జాగిర్లను ఎల్లగొట్టి
మూలవాసుల నుండి గుంజుకున్న భూములకు యజమానులమైదమని,
పార్లమెంటు అసెంబ్లిల జొర్రుదమని
పార్లమెంటరి పందాకు పుట్టిన ‘వీర తెలంగాణ విప్లవ పోరాట పంధా’
అసెంబ్లి, పార్లమెంటులో పొదుగుడు వడ్డది
మీరు రాజకీయంగా కుడుగ్గూసోని
ఇక్కడి మూలవాసులను సంపుడెందుకు?
తెలంగాణ అడ్దుకునుడెందుకు?
బుక్కల నడుక్క తిని
మా భూముల గుంజుకున్నరు
జీనోసైడు సంపుడు వంజం జెస్తున్నరు
పార్లమెంటు అసెంబ్లీ మీడియాల
జుడీషియరీల, సక్రేటేరియట్ల
ఒకటీ! రెండే ! కులాలు పొదుగుడు వడ్దయి
పరాన్నబుక్కు కులాలు పొదుగుడు వడ్డయ్
పరాన్నబుక్కు కులాలోల్లు మూలవాసులను
ఈడ్చి తంతుండ్రు
వాల్లను ఈడ్చి తన్నే తెలంగాణ కావాలి!
తెలంగాణకు మేమే రాజులం మాదే భూమి అనే వామనులు
రాకముందు ఈ భూమంతా మూలవాసులదే!
భూమికి యజమానులు
మూలవాసుల భూములు గుంజుకున్న దొంగలు తెలంగాణ
గూర్చి మాట్లాడుడేంది?
పనిజెయ్యని కులాలు పనిముట్లు లేని కులాలు
ఇండో యూరోపియన్ యాస క్లాన్ల కోసమే
భాషాప్రయుక్త రాష్ట్రాలా?
భాషా విశాలాంధ్ర వీరి సిద్ధాంతాలా?
ఈ సిద్ధాంత సాధన కోసం పోరాటాలా?
పోరాటానికి ప్రాణాలు నెత్తురు తెలంగాణది కావాల్నా?
తెలంగాణలో, దేశంలో మూలవాసుల భూములని బిగవట్టిన వాల్లు
తెలంగాణకూ, దేశానికీ ఎప్పుడూ శత్రువులే!
తెలంగాణ ఎప్పుడూ భూమి బిడ్దలదే!!
హైద్రాబాదుతో సహా!!
అరేయ్ .. తెలంగాణ
ఒక జాతిరా!!!

9 అభిప్రాయాలు »కవితలు

9 Responses to “తెలంగాణ జాతి”

  1. 1
    Ravikumar Says:

    అంత క్లాస్ గా లేదు. మరీ నేర్చుకుంటున్న వాళ్ళు రాసినట్లుంది. రాయాలని రాయకుండా, హృదయంలోంచి పుట్టినపుడే రాస్తే మంచిది కదా?

  2. 2
    తాడేపల్లి Says:

    అవునవును, తెలంగాణ ఒక జాతి. కరీమ్ నగర్ ఒక జాతి. వరంగల్లొక జాతి. ఖమ్మం ఒక జాతి. అందులో కోయలూ, చెంచులూ రెండు జాతులు. హైదరాబాదు పాతబస్తీ ఒక జాతి. అందులోని మతగూండాలొక జాతి. ఆదిలాబాదొక జాతి. అందులో గోండులొక జాతి.

  3. 3
    Shashi Says:

    మల్లచ్చినవా….. తాడేపల్లీ…

    నువ్వు కావాలని రాసిన కొత్తకొత్త జాతుల ముచ్చటెర్కలేదుగాని… నీదైతె ఎర్కైపాయె!
    Internet ల ఎవ్వలెవలు తెలంగాణ ముచ్చటెత్తినా, ఉర్కుర్కి… సొర్రి..సొర్రి.. రాస్తవాయె!!

    మరి నీది “తెలంగాణ వ్యతిరేక జాతి” అనొచ్చా?

  4. 4
    pravallika Says:

    old city hyderabad people ni goondaluga cheppadam thadepalli gariki manchidi kadu please withdraw your words and telangama meeda, jaathi meeda chesina comments ni kuda, kobbari chettu needana kusunna manishiki valasapothinna manushulu arthamkadu, lopatiki poyyi chuste thelustadi, telangana jaathi kashtalu

  5. 5
    vasu Says:

    తెలంగాణా వాదాన్ని వ్యతిరేకిస్తే “తెలంగాణ వ్యతిరేక జాతి” అవుతారా. మరి మీరు “ఆంధ్ర వ్యతిరేక జాతా” ?

  6. 6
    తాడేపల్లి Says:

    అసలు తెలంగాణ ఒక జాతి అనడం యాంటి-ఇండియా ప్రచారం కిందికొస్తుంది. ఇది స్పష్టంగా భారత రాజ్యాంగం ప్రసాదించిన పత్రికాస్వేచ్ఛనీ వాక్ స్వాతంత్ర్యాన్నీ దుర్వినియోగం చెయ్యడం కిందికొస్తుంది. ఇది అందరి దృష్టికీ రాకముందే ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి క్షమాపణ చెప్పుకుని ఈ కవితని ఉపసంహరించుకోండి.

  7. 7
    vasu Says:

    తాడేపల్లి గారు,ఇది మరీ ఎక్కువగా స్పందించినట్టుగా ఉంది.పరవాలేదు బ్లాగ్ లోనేకదా వ్రాసింది.అసలు సమస్య ఏమంటే ఈ తెలంగాణ వాదులంతా (ఎక్కువగా బుర్రతక్కువ నిరుద్యోగ రాజకీయులు) తమదే (తెలంగాణ వాదం) సరియినది మిగతావారి వాదం తప్పు అనే బ్రమలోవున్నారు. మిగాతవారు మాట్లాడితే గగ్గోలు పెడతారు.మీ బాషలో సినిమా తియ్యండి, ఎవరువద్దు అంటారు.మీ తెలంగాణ హోటల్,దిన పత్రికలూ, విజయవాడ లేదా ఆంధ్రా అంతటా పెట్టండి.ఎవరువద్దు అంటారు.ఉడిపి,అయ్యరు వాళ్లు పెడితే ఆదరించలేదా ఆంధ్రా వాళ్లు.ఏ రంగంలో అయిన సరుకు వున్నవే నిలబడతాయి అన్నది,జగమెరిగిన సత్యం.మరి మన తెలుగు బిడ్డ శ్రీ పి.వి నరసింహారావు గారికి నంద్యాలలో, ఆంధ్రావాళ్ళు సీటు ఇచ్చి గెలిపించినప్పుడు (తెలుగు దేశం వాళ్లు పోటీ లేకుండా గెలిచేదానికి సహకరించారని గమనించాలి !!!) ఈ తెలంగాణా వాదులందరికి గుర్తులేదా ఆత్మగౌరవం.ఒక్కరయిన అందుకు కృతజ్ఞతలు చెప్పారా??? తమ తెలంగాణలో మరి ఎందుకు గెలిపించుకోలేదు??????????? ఒక్క రాజ్యాదికారమొస్తే తెలంగాణా సమస్యలన్నీ మాయమయి పోతాయా. ముందు తప్పుడు రాజకీయ నాయకుల మాటలు వినడం మానివేస్తే సమస్య ఇంత పెద్దదిగా కనిపించదు.

  8. 8
    kumar Says:

    తెలంగాణా వాదం పక్కన పెడితే ఈ కవిత ఉత్త వ్యాసంలా ఉంది. అనవసరమైన చెత్తంతా ఇవాళ కవిత్వంగా చెలామణి అవుతున్నట్లుగా ఉంది. సాహిత్యం ఉద్యమాలను నెత్తికెత్తుకోవడంవల్ల వచ్చిన విపత్తు ఇదేనేమో. చవకబారు రాజకీయాల పూనకమంతా కవిత్వమా..

  9. 9
    vasu Says:

    కుమార్ గారి అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. –వాసు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో