May 2008 సంచిక

మే 2008 సంపాదకీయం

ప్రాణహిత మే నెల సంచికకు స్వాగతం!

కార్మికుల దినోత్సవం మే డే
కార్మికుల దినోత్సవం మే డే
ప్రపంచవ్యాప్తంగా మే నెలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అంతర్జాతీయంగా జరుపుకునే కార్మికుల దినోత్సవం మేడే తో ప్రారంభమవుతుంది. పనిగంటలు తగ్గించడానికి మెరుగైన పని పరిస్థితుల, మెరుగైన జీవితమూ, సమాజమూ కోసం కార్మికుల జరిపిన, ఇంకా జరుపుతున్న అనేక పోరాటాలకు మేడే స్ఫూర్తి. రోజువారీ సమస్యలనుండి మొదలు అనేకానేక సామాజిక సంక్షోభాలను పరిష్కరించేందుకు ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు జరిపిన అనేకానేక పోరాటాలు ఎంతో విలువైన, ఉన్నతమైన సాహిత్యసృష్టికి కారణమయ్యాయి. అనేకమైన మహోజ్వలమైన రచనలు ఉద్భవించడానికి కారణభూతమయ్యాయి.

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సంపాదకీయం

మే 2008 సూచిక

కవితలు:

అభిప్రాయాలు లేవు »సూచిక

దాంపత్యం అలియాస్ పరస్పరహననం

ఎక్కడ పోగొట్టుకున్నాం
ఎవర్ని ఎవరమెలా కోల్పోయాం
స్నేహమహతిని నిర్భయంగా విరిచి
కక్షలూ కార్పణ్యాలూ పెంచి పోషించి మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కవితలు

మాట్లాడుతున్న శరీరం

ఈ ప్రపంచంలో
పుట్టడమే నీ ఘనత
నిన్ను మోసి, కని, లాలించి, ప్రేమించి
నీ చేతే ఛీత్కరింప బడటం స్థితి మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

నీడల మాటు

వాళ్ళు జీవితాన్ని
జీవితంలానే జీవించేవాళ్ళు
మెరిసే ఆకులలా
పరచిన నీడలా సంచరించేవాళ్ళు
తేనెటీగలకు రెక్క బలం నేర్పి
తేనె మూటగట్టటం తెలిసినవాళ్ళు మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

ఫస్ట్ టెర్రరిస్ట్ నెక్స్ట్ కమ్యూనిస్టు

టెర్రరిస్ట్ ఎవరు ?
The question continues…

ఆ ఏమి లేదు
ఊరికెనే అలా నిలబడ్డాను
ఏమి తోచడం లేదు
శ్వేతసౌధం బోర్ కొడుతుంది మొత్తం చదవండి »

10 అభిప్రాయాలు »కవితలు

ఒక జీవన్మరణ జీవదృశ్యం

ప్రతిసారి ప్రతి అణువు చూసుకోవాల్సిన అవసరం
మనకు తెలియకుండానే మనని మనం కోల్పోతున్నప్పుడు
మనలో మనకు అవసరమయినవి – అవసరముకానివి
తప్పనిసరయి త్యజింపచేయబడుతున్నాయి. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కవితలు

రాతి పుస్తకం

చెప్పలేను
కట్టు విప్పలేను
వరదలెత్తిన రోడ్డు
అందదు తాడు మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కవితలు

ప్రేమ కాదా? అయితే పిచ్చా??

పరమ చెత్తగా వుంది సినిమా. ఎలాగోలా ఇంటర్వెల్ దాకా చూసింది లావణ్య. రాజా రాడేమిటి? పదోసారి విసుక్కుంది.

జనాలు కాళ్ళు తొక్కుకుంటూ పోతున్నారు.

“హబ్బా అంత జాగా పెట్టుకొని కాళ్ళు తొక్కి పోతారెందుకు? కళ్ళు కనబడకా?” అరిచింది. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కథలు

ఉక్క

అర్ధరాత్రి కావస్తున్నది. చలి తీవ్రంగా వున్నది. చీకటి గాఢంగా అలుముకున్నది. కొద్ది దూరంలో చిన్న దీపం బుడ్డి వెలుగుతున్నది. మంచు కురుస్తుండడం వల్ల దీపపు వెలుతురు చిత్రంగా కనిపిస్తున్నది.

చుట్టుపక్కల మనుషుల ఛాయలేం లేవు. పాడుబడ్డ భవనం ముందు ఎండిపోయిన పెద్ద చెట్టొకటి నిలబడి ఉన్నది. మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కథలు

అసోయ్‌ దులా

పీరీల పండుగు. ఊరంత పండుగు.

నెలపొడుపునాడు పీరీలు నిలవెట్టిండ్రు. మొక్కినోళ్లు పక్కీర్లయితున్నరు. మటికీలు తీస్తున్నరు. మట్టి చిప్పల బిచ్చం అడుగుతున్నరు. మలీదలు చదివిస్తున్నరు. దమ్ము పిల్లలను ఇస్తున్నరు.

ఐదోనాడు సత్తె పీరి లేసింది సత్యం పక్కీరయిండు. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కథలు, మానేటి కథలు

తొలి దళిత స్త్రీవాద కవిత్వం – మంకెనపూవు

తెలుగులో స్త్రీ దళితవాద కవిత్వాల ఆవిర్భావంతో సాహిత్యపీఠాల కుదుళ్ళు కదలడం ప్రారంభమైంది. అంతవరకూ తెలుగు సాహిత్యాకాశాన్ని కమ్ముకున్న అరుణ వర్ణ మేఘాలు కాస్త పక్కకు తొలిగి నీలి మేఘాలకు, నల్ల గబ్బిలాలకు చోటు యివ్వాలిసిన అగత్యం ఏర్పడింది. మరొక ప్రక్క బహుజన, ముస్లిం, ప్రాంతీయవాదాలు మొత్తం సాహిత్యచరిత్ర నిర్మాణాన్ని ప్రశ్నించేస్థాయికి చేరాయి. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారుస్వామి సాహిత్య జీవితం వ్యాస సంకలనం స్థూల పరిచయం

తెలంగాణా సాహిత్య చరిత్రలో “ప్రజల మనిషి వట్టికోట సాహిత్య జీవితం, వ్యాస సంకలనం ఒక చారిత్రిక సందర్భం. ఎప్పుడూ గుర్తుంచుకోదగిన మైలురాయి.

చెట్టు చెడు కాలానికి కుక్కమూతి పిందెలు అన్నట్టు నైజాం నిరంకుశ అసమానతల వ్యవస్థ అంత్యకాలానికి నిజాం సర్కారు కౄరాతి కౄరమైన చర్యలకు వ్యతిరేకంగా తెలంగాణా సాహితీ సాంస్కృతిక రంగాలలో తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది. ఇక్కడి సామాజిక పరిస్థితులను పట్టించుకోకుండా సామాజిక బాధ్యతలు గల ఏ కవీ, రచయితా ఊహాలోకాలలో విహరిస్తూ పలాయనం చిత్తగించలేదు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »పుస్తక సమీక్షలు

ద పోస్ట్ మాన్ : (రెండవ భాగం)

- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)

(ప్రాణహిత ఏప్రిల్ 2008 సంచిక తరువాయి)
శాంత మహాసముద్రం తన అనంత సహనంతో సాధించలేకపోయిన మార్పులను ఆ చిన్న, ముద్దొచ్చే శాన్ ఆంటోనియో పోస్టాఫీసు తీసుకొచ్చింది. మారియో హిమేనెజ్ ప్రతిరోజూ పొద్దుపొడవకుండానే లేవడం మొదలుపెట్టాడు. లేచీలేవగానే హుషారుగా ఈలలు వేయడం కూడ మొదలుపెట్టాడు. ఇదివరకు లేచీలేవడంతోనే బాధించే ముక్కు దిబ్బడ ఇప్పుడు లేదు. తన ఉద్యోగబాధ్యతలను చాల కచ్చితంగా నెరవేర్చడం మొదలుపెట్టాడు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »అనువాదాలు, ద పోస్ట్ మాన్, ప్రపంచ సాహిత్యం

అపరాజిత 8: తెగలను కలిపిన పెయూట్ తాత

తెల్లవాడికి వాస్తవికత అంటే బ్యాంకులు, అంగళ్లు, నియాన్ లైట్లు, ట్రాఫిక్ తో నిండి వున్న వీధులు; ఎటు చూస్తే అటు పోలీసులు, ఒళ్లమ్ముకునేవాళ్లు, దిగులు మొహాల మనుషులు, అందరూ గడియారం ప్రకారం పనిచెయ్యడానికి తొందర పడుతూ వుండడం. కాని అదంతా అవాస్తవం. నిజమైన వాస్తవికత వీటన్నిటి అడుగున వుంటుంది. దాన్ని కనుక్కోవడానికి పెయూట్ తాత సహాయపడతాడు.
- క్రౌ డాగ్ మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం

నమ్మకానికిరువైపులా…

దాదాపు ఏడెనిమిది నెలల క్రితం, ఓ తెలిసిన అమ్మాయి ఫోన్ చేసినపుడు, “పిల్లలకి అన్ని టీకాలూ వేయించాలంటారా? అవసరం లేదు…” అని మాటల మధ్యలో అంది. ఆ క్షణంలో, అసలామె ఏం మాట్లాడిందో లేదా అడిగిందో కూడా నాకు అర్ధం కాలేదు…. కాబట్టి మౌనంగా వుండిపోయాను. కానీ ఫోను పేట్టేసిన తరువాత మాత్రం ఆమె చెప్పింది తలుచుకుని గుండె గుభేలుమంది. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »చౌరస్తా, సాహిత్య వ్యాసాలు

‘మెతుకు సీమ చరిత్ర – సంస్కృతి’ పుస్తకావిష్కరణ

14 మే 2008 రోజు సిద్ధిపేట ప్రెస్ క్లబ్ లో ‘మెతుకు సీమ చరిత్ర – సంస్కృతి’ అనే పుస్తకాన్ని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆవిష్కరించారు. ఈ సమావేశానికి టి.ఎన్.జి.వో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవీప్రసాద్ అధ్యక్షత వహించారు. పుస్తక పరిచయం చేస్తూ నాళేశ్వరం శంకరం మెదక్ జిల్లాకి చెందిన కొండాపురం శాతవాహనుల టంకశాలగా వెలిగొందిందని, మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »సాహిత్య వార్తలు