ఒక జీవన్మరణ జీవదృశ్యం

ప్రతిసారి ప్రతి అణువు చూసుకోవాల్సిన అవసరం
మనకు తెలియకుండానే మనని మనం కోల్పోతున్నప్పుడు
మనలో మనకు అవసరమయినవి – అవసరముకానివి
తప్పనిసరయి త్యజింపచేయబడుతున్నాయి.
మనిషిలో మనిషితనం – మనసులో మెత్తనితనం
మనలోని ఐక్యత – మనకు కావలసిన సమత
ప్రణాళికాబద్ధంగా తొలగించబడ్డాయి
శరీరపు సౌందర్యం – మనసులోని మాధుర్యం
వయస్సులోని వేగం – ఆలోచనల్లోని సోయగం
ఆకృతిలో అందం – ప్రకృతమైన పరవశం
యవ్వనంలో శక్తులు – పరిమళించే సూక్తులు
శీల సంవర్థనలు – దళిత సముద్ధరణలు
అవయవాలు – ఆస్తులు – ఆశయాలు – అనుకూలతలు అదృశ్యంగా దోచబడి
మనకేది అవసరమో మనకే తెలియనంత అయోమయంలో వుంది
మనకు కావలసినది మరెవరో నిర్ణయించి
ఇంకొకరు నిర్థారించి – మరికొందరు సమర్థించి
మన ప్రమేయం లేకుండానే – మనం ఏదో పొందుతూ – కోల్పోతూ-
ఆశిస్తూ – ఆనందిస్తూ – ఆక్రోశిస్తూ – రోధిస్తూ
అర్రులు చాస్తూ – అంగలారుస్తూ – గంగవెర్రులెత్తుతూ – వెర్రిగా వెంపర్లాడుతున్నాం
ఏం పొందుతున్నామో తెలియక – ఏం పోగొట్టుకొంటున్నామో తెలియక
పరుగులు పెడ్తూ – అందనివాటికి ఎగురుతూ రెక్కలిరిగి
శక్తులుడిగి – ఎత్తులు చిత్తయి – పైఎత్తు పారక
వంచన కుదరనపుడు – మంచివాళ్ళుగా మారి
ఒక్కక్షణం ఆగి వెనక్కి తిరిగిచూస్తే…
అనంతకాలం ఆవిరయి – మానవత్వం మంటకలిసి
విలువలన్నీ వలువలూడి వెలవెలపోయి
సఖ్యత సంకరమై – నైతికత నేతిబీరకాయై
క్షమాగుణం బిక్షాటన చేస్తూ
కళలన్నీ కల్లలనే కలలుగంటూ
పళ్ళూడి – కళ్ళు పూడి – మాట రాక – చెవులు వినక
కాళ్ళు నిలవక – చేతులు వణికి – నడుము వంగి, మెదడు కుంగి
కాడు రమ్మన్నా – ఊరు పొమ్మన్నా
అయినవాళ్ళు వద్దనా – కాని వాళ్ళు ఛీ! అంటున్నా
 
ఇది ఒక జీవన్మరణ సాదృశ్య సజీవ దృశ్యం
జీవితమంటే మరో వైపున్న మరణమే కదా!
మరణమంటే ఈ జీవితపు దోపిడే…?
దేహమైనా – దేశమైనా దోపిడంటే రాజకీయమే.

ఒక అభిప్రాయం »కవితలు

One Response to “ఒక జీవన్మరణ జీవదృశ్యం”

  1. 1
    సాయిసాహితి Says:

    మీ కవిత చా లా బాగుంది,
    జీవితం లో ఎన్నో అనుభవాలు మన ప్రమేయం లేకుండానే వచ్చి చేరిపోతుం టాయి. వాటిని అర్ధం చేసుకునే లోపు మన జీవితం అయిపోతుంటుంది.

    నిజమే…వంచన కుదరనప్పుడు మంచి వాళ్ళుగా మారి పోతుంటాం ..
    జీవితమంటే మరోవైపున్న మరణ మే కదా…
    మరణ్మంటే ఈ జీవితపు దోపిడి …..
    ఈ రెండు చక్కటి ప్రయోగాలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో