మాట్లాడుతున్న శరీరం

ఈ ప్రపంచంలో
పుట్టడమే నీ ఘనత
నిన్ను మోసి, కని, లాలించి, ప్రేమించి
నీ చేతే ఛీత్కరింప బడటం స్థితి

రెందు హృదయాల
రెండు జీవితాల
రెండు సూత్రాల కలయిక పెళ్ళి
ఆ పెళ్ళప్పుడే నువ్వు నేర్చుకున్న మొదటి మంత్రం
యూజ్ అండ్ త్రో
ఉపయోగించుకో -
ఆనక
విసిరి పారేసుకో -
అన్ని చట్టాల, చుట్టాల అండదండలు నీకున్నాయ్
నువ్వేం చేసినా – నిన్ను మోసే మహామహులున్నారు.

(1)
ఆ – శరీరం
నిన్ను కొనుక్కున్నా
గుత్తాధిపత్యమంతా నీదే-
‘దిస్ ఏరియా బిలాంగ్స్ టు మి’
అనుకునే అధికారపు పట్టా
సమాజం నీకెప్పుడో ఇచ్చేసింది.
అందుకే చాన్నాళ్ళుగా
పుడుతూ, పుడుతూ, మళ్ళీ పుడుతూ
నువ్వు స్త్రీ- శరీరాన్నీ, బుద్ధినీ ఏలుతూనే వున్నావు.

(2) మరి, ఇప్పుడో-
విసిరి పారేస్తే మూలన పడివుండదు
అంతే వేగంగా ప్రశ్నతో మొలకెత్తిన
శిరసెత్తిన నారి కనిపిస్తుంది
ఈ శరీరాన్ని అనుభవిస్తాను
కాల్చి, కూల్చి వేసే హక్కు నాదే అన్న నీ కేకకి
జవాబిస్తున్న పొలికేకలు
ఈ శరీరం మీద సమస్తహక్కులూ నాకే
ఈ మనసు నాదే
నా ఊహల రూపశిల్పిని నేనే
నువ్వూ నేనూ కలిసుందామంటేనే
సమభాగస్తులమంటేనే
నీకూ నాకూ సంధి
లేకుంటే-
నువ్వూ నేనూ విడివిడి రూపాలం, దేహాలం
డబ్బే విలువనుకొని
మనిషి విలువ
తెలీని అజ్ఞానాహంకారంలో వున్నంతకాలం
నువ్వంతే-

(3)
రక్త సిక్త దేహాలతో మొరపెట్టుకోవడం లేదిక
స్వేచ్చా విత్తనంలో మొలకెత్తి నిలిచిన మహావృక్షాన్ని
ప్రశ్నించే చూపుడువేలు
ఇప్పుడు ప్రశ్నించే మొహాన్ని తొడుక్కుంది.
మాట్లాడుతోంది
అక్షరంతో మాట్లాడుతోంది.
వినబడటం లేదా? ఈ నారీ నాదం.

(4) నేను మనిషిని
వ్యక్తిత్వ స్థితీకృతరూపాన్ని
పరిపూర్ణ రూపాన్ని
శరీరమంతా కళ్ళు, చెవులు నిండివున్న దాన్ని
శరీరపు భాషను వినగలుగుతున్నాను
ప్రకంపనాలను చూడగలుగుతున్నాను
నువ్వు చెప్పిన ఆడదానిగా కాక,
మానసిగా, మానవిగా స్థిరపడినదాన్ని
ఇవ్వాల్టి నిజాన్ని నేను.

కవితలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో