మే 2008 సంపాదకీయం

ప్రాణహిత మే నెల సంచికకు స్వాగతం!

కార్మికుల దినోత్సవం మే డే
కార్మికుల దినోత్సవం మే డే
ప్రపంచవ్యాప్తంగా మే నెలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అంతర్జాతీయంగా జరుపుకునే కార్మికుల దినోత్సవం మేడే తో ప్రారంభమవుతుంది. పనిగంటలు తగ్గించడానికి మెరుగైన పని పరిస్థితుల, మెరుగైన జీవితమూ, సమాజమూ కోసం కార్మికుల జరిపిన, ఇంకా జరుపుతున్న అనేక పోరాటాలకు మేడే స్ఫూర్తి. రోజువారీ సమస్యలనుండి మొదలు అనేకానేక సామాజిక సంక్షోభాలను పరిష్కరించేందుకు ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు జరిపిన అనేకానేక పోరాటాలు ఎంతో విలువైన, ఉన్నతమైన సాహిత్యసృష్టికి కారణమయ్యాయి. అనేకమైన మహోజ్వలమైన రచనలు ఉద్భవించడానికి కారణభూతమయ్యాయి.

చలం
చలం
మే నెల 19 న ప్రఖ్యాత తెలుగు రచయిత చలం పుట్టిన రోజు. ప్రతి సంవత్సరం బుద్ధ పూర్ణిమ రోజున చలం పుట్టిన రోజును ఆయన అభిమానులు ప్రేమతో జరుపుకుంటారు. తెలుగు సాహిత్యంలో చలం లాంటి రచయిత న భూతో న భవిష్యతి అని చెప్పవచ్చు. అంతే కాదు. భారతీయ భాషలన్నింటిలోనూ చలం లాటి రచయిత మరొకరు కనబడరు. తానున్న కాలంకన్నా కనీసం ఒక శతాబ్ద కాలం ముందుకు ఆలోచించగలిగిన రచయిత చలం. నిస్సందేహంగా ఒక గొప్ప వైతాళికుడు. ఎంత సున్నిత హృదయుడో అంతకన్నా తీవ్రమైన భావాలున్న రెబెల్. ఆయన రాతలు ఎంత కవిత్వాత్మకమో, సమ్మెట దెబ్బల్లా అంతే శక్తివంతమైనవి కూడా! సమాజంలో అనేక రకాల అణచివేతలకు గురవుతున్న స్త్రీల విముక్తి కోసం ముఖ్యంగా లైంగిక విముక్తి కోసం చలం తన కలాన్ని ఎక్కుపెట్టి పదునైన బాణాల్లాంటి తన రచనలతో బ్రాహ్మణ, పితృస్వామిక సంప్రదాయాల మీద, కట్టుబాట్ల మీద తిరుగుబాటు చేసాడు చలం. స్త్రీని బానిసగా, ఒక మాంసపు ముద్దగా చూసే క్రూరమైన అమానవీయ ఛాందస సామాజిక చట్రాన్ని, విలువలను చీల్చి చెండాడి ‘స్త్రీకి హృదయం ఉంది, దానికి వ్యాయామం కావాలి’ అని ఎలుగెత్తి చాటాడు. స్త్రీలపైన లైంగిక అణచివేత, ఇంకా ఇతర అనేక రకాల అణచివేతలూ ఉన్నంత కాలం చలం రచనలు వాటి వాడినీ వేడినీ కోల్పోవు. మహానుభావుడు చలానికి ప్రాణహిత నివాళులర్పిస్తున్నది.

ఫ్రెంచి విద్యార్థుల ఉద్యమం, 1968 మే
ఫ్రెంచి విద్యార్థుల ఉద్యమం, 1968 మే
40 ఏండ్ల కింద పారిస్ లో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఫ్రెంచి విద్యార్థుల ఉద్యమం 1968 మే నెల లోనే తారాస్థాయికి చేరుకుంది. నాన్ టెరిలో పారిస్ విశ్వవిద్యాలయంలో కొద్దిమంది విద్యార్థుల ఆందోళన గా ప్రారంభమైన ఉద్యమం అతి కొద్ది కాలంలోనే పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉప్పొంగిన కార్మికుల ప్రతిఘటన కెరటమైంది. ఫ్రాన్సు లో ఒక కోటి మంది కార్మికులు విద్యార్థులకు మద్దతుగా, పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సమ్మె ప్రకటించి పారిస్ వీధుల్లో కదను తొక్కారు. డీ గాల్ ప్రభుత్వం ఎంత పాశవికంగా విద్యార్థులనణచి వేయజూస్తే ఉద్యమం అంత తీవ్రరూపం దాల్చింది. ‘ఆహారమే కాదు గులాబీలు కూడా కావాలి’ అని నినదించిన ఫ్రెంచి విద్యార్థి ఉద్యమంలో ఆనాడు పాల్గొన్న విద్యార్థులు ఎక్కువగా ధనవంతుల పిల్లలు. తమ తల్లిదండ్రుల వ్యవస్థను కాపాడుతున్న విలువలను ధిక్కరించి, సామాజిక చట్రాలను వ్యతిరేకించిన విద్యార్థులు బూజుపట్టిన సమాజపు గోడలను బద్దలు కొట్టే ప్రయత్నం చేసారు. ‘ఈ సమాజం ఒక ప్లాస్టిక్ పువ్వు – మెరుస్తున్నట్టు కనబడ్డా వేడికి కరిగిపోతుంది’ అని మాంసాహారిగా మారిన సమాజ పుష్పం మీద తిరుగుబాటు చేసారు. వ్యక్తిగత స్వేచ్ఛ, లైంగిక స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం తదితర విలువల కోసం సాగిన విద్యార్థి ఉద్యమం గొప్ప సామాజిక ఉద్యమంగా మారి, మహోధృతమైన కార్మిక పోరాటంగా రూపుదిద్దుకుంది. మొత్తం సమాజాన్ని పెకలించేందుకే సంసిద్ధమయింది. చివరకు డీ గాల్ ప్రభుత్వం పతనానికి దారి తీసింది. కార్మికుల ఆగ్రహానికి జడిసిన పెట్టుబడిదారీ వ్యవస్థ వారి కోసం అనేక రాయితీలు ప్రకటించింది. అనుకున్న లక్ష్యాలని సాధించలేకపోయినా 1968 ఫ్రెంచి విద్యార్థి ఉద్యమం ఫ్రెంచి సమాజాన్ని, మొత్తంగా ప్రపంచాన్ని పెను మార్పులకు గురిచేసింది. ఇవాళ్ళ యువత అనుభవిస్తున్న వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల వెనుక ఫ్రెంచి విద్యార్థి ఉద్యమం ఉందనేది చారిత్రిక వాస్తవం. అయితే అంతకు ముందే చైనా లో జరిగిన మే 5 విద్యార్థి ఉద్యమం, చైనా సాంస్కృతిక విప్లవం, మావో ఆలోచనలు ఫ్రెంచి విద్యార్థులపై ఎనలేని ప్రభావం నెరపాయన్నది కూడా వాస్తవం.

పాలస్తీనా
పాలస్తీనా
1948 మే లోనే, ప్రపంచ చరిత్రలో మొట్ట మొదటి సారి ఒక భూభాగం పైనున్న ప్రజలని తమ దేశంలోనే కాందిశీకులని చేసి నిరాశ్రయులని చేసిన ఒక ఆక్రమణ, ఇజ్రాయిల్ దేశంగా ఏర్పడింది. పాలస్తీనా ప్రజానీకాన్ని తమ దేశంలోనే నిలువనీడలేకుండా చేసి, కాందిశీకులని చేసి, చెట్టుకొకరిని పుట్టకొకరిని చేసి, అప్పటిన్నుండి ఇప్పటి దాకా కొన్ని లక్షల మందిని ఊచకోత కోసిన దురాక్రమణ, ఇప్పటికీ నిరాఘాటంగా కొనసాగుతూ రావణ కాష్టంలా రగులుతున్నది. ప్రతిరోజూ లెక్కకు లేనంత మంది పసిపిల్లలు, మహిళలు, వృధ్ధులూ హత్యలకు గురవుతూ పాలస్తీనా ప్రజల నెత్తురు ఏర్లు పారిస్తున్న ఈ సంఘర్షణ ప్రపంచ రాజకీయాలపైనే కాదు ప్రపంచ సాహిత్యం పైన కూడా అమితమైన ప్రభావాన్ని నెరపింది. మహమూద్ దార్వీష్, తాహా, అమిచాయ్ లాంటి గొప్ప కవులు, సాహిత్యకారులు కొన్ని ఏండ్లతరబడి సాగుతున్న ఈ సంఘర్షణకు అక్షర రూపమిచ్చి అద్భుత సాహిత్యాన్ని సృష్టించారు. పాలస్తీనా ప్రజల నెత్తురూ కన్నీళ్ళకు గొప్ప సాహిత్యమై ప్రవహిస్తున్నది.

సంఘర్షణ ఎక్కడ ఉంటే అక్కడ గొప్ప సాహిత్యం, సంస్కృతీ ఉద్భవిస్తాయని ప్రాణహిత భావిస్తున్నది. పాత విలువలమీద పోరాటం, అణచివేతమీద ధిక్కారం, సమాజాన్ని మార్చడానికి జరిగే ఘర్షణ అద్భుత సాహిత్యంగా అవతరిస్తాయని ప్రాణహిత అభిప్రాయపడుతున్నది.

మే సంచికలో ప్రాణహిత మీకు తెలుగు నేలపైనుండి బలమైన కంఠస్వరాలుగా వినబడుతున్న స్త్రీ ల కవిత్వాన్ని ప్రత్యేకంగా అందిస్తున్నది. ఈ సంచికలో ఘంటసాల నిర్మల ‘దాంపత్యం అలియాస్ పరస్పర హననం’, శిలాలోలిత ‘మాట్లాడుతున్న శరీరం’, సుజాతా పట్వారీ ‘నీడల మాటు’, మహెజబీన్ ‘ఫస్ట్ టెరరిస్టు నెక్స్ట్ కమ్యూనిస్టు’, జ్వలిత ‘ఒక జీవన్మరణ జీవదృశ్యం’,హెచ్చార్కె ‘రాతి పుస్తకం’ కవితలను చదవండి.

కథల్లో, కొండేపూడి నిర్మల ‘ ప్రేమ కాదా అయితే పిచ్చా??’, ప్రశాంత్ ‘ఉక్క’, పెద్దింటి అశోక్ కుమార్ మానేటి కథ ‘అసోయి దూలా’ లను చదవండి.

చల్లపల్లి స్వరూపరాణి కవితా సంకలనం ‘మంకెన పూవు’ ను తొలి దళిత స్త్రీవాద కవిత్వంగా పేర్కొన్న శిఖామణి సమీక్షావ్యాసాన్ని ఈ సంచికలో మీకందిస్తున్నాం. అట్లే ‘ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారుస్వామి సాహిత్య జీవితం’ వ్యాస సంకలనాన్ని స్థూలంగా పరిచయం చేస్తున్న బెల్లంకొండ సంపత్ కుమార్ వ్యాసాన్ని చదవండి.

అనువాదాల్లో ‘ద పోస్ట్ మాన్’ కి ఎన్. వేణుగోపాల్ ధారావాహిక అనువాదం తరువాయి భాగాన్ని, మేరీ బ్రేవ్ బర్డ్ ‘లకోటా వుమన్’ కి మమత అనువాదం తరువాయి భాగాన్ని చదవండి. ఈ సారి చౌరస్తా లో హిమబిందు రాసిన ‘నమ్మకానికిరువైపులా…’ లో టీకాల వెనుక రాజకీయాన్నీ మందుల కంపనీల వ్యవహారాన్ని చదవండి.

ఎప్పటిలాగే ప్రాణహితను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

సంపాదకీయం

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో