నమ్మకానికిరువైపులా…

దాదాపు ఏడెనిమిది నెలల క్రితం, ఓ తెలిసిన అమ్మాయి ఫోన్ చేసినపుడు, “పిల్లలకి అన్ని టీకాలూ వేయించాలంటారా? అవసరం లేదు…” అని మాటల మధ్యలో అంది. ఆ క్షణంలో, అసలామె ఏం మాట్లాడిందో లేదా అడిగిందో కూడా నాకు అర్ధం కాలేదు…. కాబట్టి మౌనంగా వుండిపోయాను. కానీ ఫోను పేట్టేసిన తరువాత మాత్రం ఆమె చెప్పింది తలుచుకుని గుండె గుభేలుమంది. ఏదో సనాతన కాలంలో, చదువుకోని వాళ్ళు, మారుమూల ప్రాంతాల వాళ్ళు, తెలియని వాళ్ళు టీకాలు వేయించి ఉండక పోవచ్చు కానీ, నాకు తెలిసిన ప్రపంచంలో ఇలా ఆలోచించే వాళ్ళు తారసపడటం నా జీవిత కాలంలో ఇదే మొదటి సారి. అలాగే అమెరికాలో ఇద్దరు పిల్లల్ని కన్న తరువాత కూడా నేను ఏనాడు వినని, నా దృష్టికి రాని విషయం ఇది. పైగా పిల్లలకి వేయించాల్సిన టీకాలతో పరాచికాలనేది… నేను కల్లో కూడా భరించలేని కాన్సెప్ట్. అందులోను, ఆఖరికి స్వర్గమైనా సరే… డాక్టరు- మందులు లేకపోతే వెళ్లడం వేస్టు… అనే బలమయిన నమ్మకాలున్న ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నాది కావడంతో, ఓ పసిపిల్ల తల్లి అన్ని టీకాలూ వేయించాల్సిన అవసరం లేదు అన్నట్టు మాట్లాడటం నన్ను చాలా టెన్షన్ పెట్టింది. పైగా ఒత్తయిన జుట్టుతో, బుజ్జిగా… భలే ముద్దుగా ఉన్న ఆ పాపని రోజుల పిల్లగా ఉన్నప్పుడు చూశానేమో, నిజం చెప్పాలంటే ఆ పాప కళ్లలో మెదిలింది. సాధారణంగా అయితే, ఎవరి నమ్మకం వాళ్ళది అని ఒదిలేసేదాన్ని, కానీ పిల్లలకి సంబంధించినది కావడంతో సెంటిమెంటల్ గా ఫీలయ్యాను.

అసలే మొదటి సంతానం… సగం తెలియనితనంతో, మరో సగం మేం భిన్నంగా ఆలోచిస్తామనే ఫ్యాన్సీలకి పోయి ప్రయోగాలేమైనా చేస్తున్నారేమోననే అనుమానం, విసుగు, కోపం…అన్నీ వొచ్చాయి. కొంచెం నిదానించిన తరువాత, పోనీ నాకు ఈ విషయంతో సరైన పరిచయం లేకపోవచ్చు, మరెవరికయినా ఉందా? అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో అమెరికాలో నా దగ్గర ఫోను నెంబర్లు ఉన్న, నాకు ఫోన్లు చేసిన స్నేహితులందరిని అడిగే ప్రయత్నం చేశాను. దాదాపు అందరు నా అభిప్రాయానికి దగ్గరగానే ఉండటంతో పాటు, నా పిల్లల డాక్టర్ తో కూడా మాట్లాడిన మీదట ప్రాణం కొంచెం కుదుట పడ్డట్టనిపించింది. కానీ ఏ విషయంలో? నా పిల్లల వరకు నేను జాగ్రత్తగా ఉన్నందుకు. కానీ… ఆ బుజ్జి పాప మాటేమిటి? ఆ పాప తల్లికి నా అభిప్రాయం చెప్పకుండా తప్పు చేశానా? అసలే ధైర్యంతో వాళ్ళు అలా ఆలోచించగలిగారు..?!. రేపటిని గురించిన అవగాహన వారికి ఎంత ఉంది? కనీసం ఆమెతో ఈ విషయం విపులంగా చర్చించి ఉండాల్సిందనే భావన నా మనసుని ఇప్పటికీ పట్టి పీడిస్తూనే ఉంది. పాపకి మూడునెలలు రాక ముందే వాళ్ళు ఇండియా వెళ్ళిపోవడంతో నాకు మళ్ళీ మాట్లాడే అవకాశం రాలేదు. అయినా సరే, “అన్ని టీకాలు అవసరం లేదు” అనే మాటల చుట్టూ నా ఆలోచనలు మాత్రం ఇంకా పరిభ్రమిస్తూనే ఉన్నాయి. సాధారణంగా ఏ తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండరు, అలాగే వారి ప్రేమానురాగాల్ని శంకించడం కూడా ఆరోగ్యకరమయిన పని కాదు అనే ఆలోచన వొచ్చినపుడు, అలాగే ప్రతి అంశానికి రెండవ కోణం ఉంటుందనే వాస్తవం గుర్తొచ్చినపుడు ఆమె అభిప్రాయంలో నాకు తెలియని నిజం దాగి ఉందేమోననే సందేహం…! నా పిల్లలకి నేను అనవసరమయిన టీకాలు (మందులు) ఇప్పించానా?! అదే వాస్తవమయితే, వాటి ప్రభావం ఏమిటి అనేది ఎప్పటికయినా తెలుసుకోవాలనేది ప్రస్తుతం నా ముందున్న లక్ష్యాలలో ఒకటి.

 ఏది ఏమయినప్పటికీ, ఇలా కొన్ని రోజుల పాటు అనేక తర్జనబర్జనలు పడ్డ తరువాత, నాకున్న preconceived notionsని నిస్పాక్షికంగా గుర్తించి, వాటి ప్రభావం పడనీయకుండా స్ట్రయిట్ గా, విషయాన్ని విషయంగా పరిశీలించాలని ఇంటర్నెట్ సహాయంతో వెతుకులాట ప్రారంభించాను.

నాకు అర్ధం అయినంత వరకు వాక్సినేషన్ అంటే, మసూచి, కలరా, టి. బి, పోలియో, (పిల్లల టీకాలకి సంబంధించి ప్రస్తుతం ఇటువంటివి 11 వ్యాధులు చెపుతున్నారు) లాంటి అనేక వ్యాధుల వల్ల ప్రాణం మీదకి రాకుండా ఆయా వ్యాధులకి చెందిన అటెనుయేటెడ్ లైవ్ వైరెస్‌ని (వ్యాధి కలిగించే శక్తి లేకుండా రూపాంతరం చేయబడిన లైవ్ వైరస్) లేదా చంపబడిన వైరస్‌ని లేదా వైరస్ లోని కొంత భాగాన్ని టీకాల రూపంలో శరీరంలో ప్రవేశపెట్టడం. ఈ టీకాల వల్ల ఆయా వ్యాధులకి వ్యతిరేకంగా ఆంటీబాడీలు (antibodies) తదితర వ్యాధినిరోధక శక్తులని శరీరం తయారుచేసుకుంటుంది. దానివల్ల ఆ వ్యాధులు రాకపోవడం, ఒక వేళ వచ్చినా వాటి ఉధృతి తక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంతేకానీ, సదరు వ్యాధులు అసలు రావు అన్న గ్యారంటీ లేదు. క్రీస్తు పూర్వం 1000 నాటి కాలం నుంచీ భారతీయులకి ఈ పధ్దతి పరిచయమే, 17వ శతాబ్దంలో టర్కీ దేశస్తులు మసూచి బారి నుంచి తప్పించుకునేందుకు, ఆ వ్యాధి తొలి దశలో ఉన్న వారి నుంచి వైరస్ ని తీసుకుని ఎక్కించుకునే వారట. తరువాత 17వ శతాబ్దం చివర్లో ఎడ్వర్డ్ జన్నర్ వ్యాధి సోకిన ఆవుల నుంచి వైరస్ తీసుకుని, ఇవాళ మనం ఇంగ్లీషు వైద్యంలో చెప్పుకుంటున్న “వాక్సిన్” కి తెరతీసాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, టీకాలు వేయించడానికి వ్యతిరేకించేవారి వాదన ఏమిటి అనే పార్శ్వానికి వెళితే, మొదటి వ్యతిరేకత మతపరమయినదిగా తేలింది. ఇది మనకు బాగా పరిచయం ఉన్న వాదనే కనుక నేను లోపలికి పోదలుచుకోలేదు. అయితే, మతపరంగా అంత పట్టింపులు లేక పోయినా, ఆ కారణం చెప్పి పిల్లలకు టీకాలు వేయించడానికి మినహాయింపు పొందే కుటుంబాలు కూడా అమెరికాలో అనేకం ఉన్నాయి. ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సిన మరో పాయింట్, మన దేశంలో అధికంగా వాడే హోమియో వైద్యంలో కూడా ఈ టీకాల వాడకాన్ని పెద్దగా ప్రోత్సహించరు.

ఇక తరువాతి అభ్యంతరాలని పరిశీలిస్తే, ఫలానా దేశం అని కాదు, ప్రపంచ ప్రజలందరూ అనుక్షణం వ్యాధుల భయంతో బతకాలనే వ్యూహంతో మందుల తయారీ కంపేనీలు పని చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం సున్నితమయిన అంశం కనుక వాళ్ళ లాబీయింగ్ తో తమకి అనుకూలమైన రీసెర్చ్ ఫైండింగ్స్ ని వెలుగులోకి తెస్తూ ప్రభుత్వ పాలసీలు అయా టీకాలు “తప్పనిసరి” చేసేట్టు మలుచుకుంటున్నాయి. Mumps, measles, rubella లాంటి వ్యాధులు బాల్యంలో సహజంగా వొచ్చే వ్యాధులు, అందులోను అభివృధ్ది చెందిన దేశాల్లో వీటి బారిన పడటం అసాధారణం. అటువంటప్పుడు లేనిపోని వైరెస్ లని పిల్లల శరీరంలోకి ఎందుకు ఎక్కించాలి? ఇందువల్ల శరీరంలో సహజంగా ఉండే రోగనిరోధకశక్తి తగ్గిపోదా? ప్రభుత్వాలు టీకాల తయారీకి ఇచ్చే కాంట్రాక్టులు, వాటిని పిల్లలకు వెయ్యటానికి వినియోగించే యంత్రాంగం ఖర్చులో సగం పరిసరాల పరిశుభ్రతకి, పరిరక్షణకి ఖర్చుపెడితే వైరెస్ లు ఎందుకు వ్యాప్తి చెందుతాయి?

 కేవలం మందుల తయారీ కంపెనీలని బాగు పరుద్దామనే ఉద్దేశంతో పాలించే ప్రభుత్వాలుంటున్నాయి. అందుకే పిల్లల టీకాల విషయంలో వ్యాధుల సంఖ్య పెరుగుతోంది. టీకాల తయారీలో అధికంగా వాడే మెర్క్యురీ, అల్యూమినియం వంటి ఫారెన్ పదార్ధాల వల్ల శరీరానికి నష్టం తప్ప లాభం ఏముంటుంది? ఎంత కాదని వాదించినా, టీకాల వల్ల ఆటిజం బారిన పడుతున్న పిల్లల సంఖ్య ముఖ్యంగా అమెరికాలో రోజు రోజుకీ పెరుగుతోంది. పిల్లలకి టీకాలు వేయించుకోవడం తప్పనిసరి చెయ్యడం వల్ల ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే హక్కుని వివిధ దేశాల ప్రజలు కోల్పోతున్నారనే భావనలతో పాటు, అసలీ వ్యవహారంలో రహస్యం ఎక్కువ, ప్రజలకి అందుతున్న వాస్తవాలు తక్కువగా ఉన్నట్టు అనేక మంది అభిప్రాయపడుతున్నట్టు అర్ధమయింది. టీకాల కారణంగా పిల్లలు గురయ్యే అనారోగ్యాల గురించి తల్లిదండ్రులకి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల, కొన్ని సార్లు పరిస్థితి చేయిదాటి పోతోంది. తమిళనాడులో నలుగురు చిన్నారుల మృతి కారణంగా 90 లక్షల టీకాల నిలిపివేత అనే వార్త ఏప్రిల్ 25న చదివినపుడు, ఆ టీకాలు తయారు చేసిన కంపేనీ వాడికి, సప్లయి చేసిన ప్రభుత్వానికి పోయిందేముంది అనిపించింది. వాక్సినేషన్ కి సంబంధించి వ్యతిరేక కోణం ఒకటి ఉంటుందనే ఊహ కూడా లేని నాకు ఈ అభ్యంతరాలు తెలుసుకున్న తరువాత, “ పిల్లలకి అన్ని టీకాలూ వేయించాలంటారా?” అనే మాటలో తప్పు కనిపించలేదు. కానీ, అనేక కారణాల వల్ల కొన్ని టీకాల వాడకాన్ని కొంతకాలం నిషేధించిన దేశాల్లోని ( ఉదాహరణ: యుకె, నెదర్లాండ్, స్వీడన్, ఐర్లాండ, నైజీరియా) ఉదంతాలు కొన్ని ఆందోళన కలిగించాయి.

అదంతా మందుల కంపెనీల కుట్ర అంటే నేనేం సమాధానం చెప్పలేను కానీ, రకరకాల మందులు, రసాయనాలు వాడని పక్షంలో వైరస్ వ్యాప్తి తిరగపెట్టేంతగా మనం పరిసరాల్ని, శరీరాల్ని ధ్వంసం చేసుకున్నామేమో అనిపించింది. వ్యాక్సినేషన్ ని వ్యతిరేకించేవాళ్ళ ప్రశ్నలు, ఆందోళన సమంజసమే కానీ… ఆలస్యమయింది… మనం చాలా లోతుకి దిగిపోయాం. టీకాలు వేయించకపోవడం వల్ల అధాటున చుట్టుకునే అవకాశం ఉన్న నష్టంతో పోల్చితే, టీకాలు వేయించడం వల్ల జరిగే నష్టం తక్కువ అని నా వరకు అనిపిస్తోంది. గుండెధైర్యం ఉన్న వాళ్ళు కొన్ని టీకాలు వేయించకుండా కూడా నడిపించవచ్చు. ఏది ఏమయినా…. “నమ్మకం” చాలా బలమైనది.

ఈ అంశానికి సంబంధించి మరేమయినా సమాచారం ఉంటే మాకూ పంచుతారని ఆశిస్తూ…

చౌరస్తా, సాహిత్య వ్యాసాలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Impotence Drugs and treatment It`s no secret that like to take Viagra? buy viagra here.
Family pharmacy there are many different ways to store your cheap generic viagra
New reviews of the cheap did you know that gel tab viagra so what exactly is a buy viagra cheap