రాతి పుస్తకం

చెప్పలేను
కట్టు విప్పలేను
వరదలెత్తిన రోడ్డు
అందదు తాడు
జువాలజీ ల్యాబ్
స్కాల్పెల్ నీడ
టిక్ టిక్ కప్ప గుండె
మురిక్కాల్వలో రక్తం
మిద్దె మీద చింత చెట్టు
రెండు కళ్లు ఒక దిగులు
తెల్లని బురదలో పుస్తకాలు
పుస్తకాల్లో నల్లని బురద
హర్డిల్స్ హర్డిల్స్
దూకుతున్న కిటికీలు 
లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్
తలలు లేని కలలు
ప్రిన్స్ టన్ వర్సిటీలో
బోర విడిచిన శిల్పాలు
క్యాంపస్ లో పిల్లలు
మొలకెత్తుతున్న రొమ్ములు
పుస్తకంతో పాటు
రాయిగా మారిన కుర్రాడు
కొంచం కొరికిన శాండ్విచ్
సీక్వెన్సు చూడకు
రామ్ములక్కాయల్లేవు
అంబలి కడవల్లేవు
కంపతారకు గడ్డివామికి మధ్య
సిన్నత్తా, ఇచ్చెమల్లె సెట్టు లేదు
ఒక కొలోనియల్ ఇల్లు
విరబోసిన తెల్ల కురులు
విలపిస్తున్న చెర్రీ
పలగాడి తీసి చూస్తే
పిచికలు లేని లోయ
పాదాల నుంచి పైకి
పాకుతున్న శూన్యం
కిలిమంజారో మంచు
ఎత్తుకెళ్లే ఉపశమనం
‘కిల్లర్స్’ లో ఒకడు
తెల్లని పిర్ర నల్లని కత్తి
యుద్ధం యుద్ధం
పిల్లి సరే, తెలివైంది
రెండు గొర్రె పిల్లలు 
ఎగరడం రాని చిలకలు
కూలబడిన ముసిలోడు
నుదురు పుల్లల గూడు
గుక్క పట్టిన దేశం
ఒళ్లోకి లాక్కుని
చెవులు గట్టిగా ముయ్
ఒకే ఒక్క బురుజు
బురుజు చుట్టూ ఊరు
ఊరిని మోసే కొండ
కొండను మోసే చేలు
చేలను కోసె వాగు
చద్ది విప్పి తింటుంటే
చేతికి అతుక్కుని వదలని
వీధి కుక్క కన్ను
దేన్నీ మోయలేవు
ఎవర్రా నువ్వు
దేన్నీ మరవలేవు
ఏందిరా నువ్వు
చేతిలో స్కాల్పెల్
టిక్ టిక్ కప్పగుండె
కదిలించెడి వాడు
కలడో లేడో తెలియడు
పెట్టని తోట పుట్టని పాప
జోల పాడుతున్న ఊయల
రెక్కలు నొప్పెడుతున్న పిట్ట
ఫొటో మధ్యలో నీడ
దయ్యం కాదు… నేనే
అల్ ఫతా హోటల్
టేబుల్ మీద టీ మరక
సంతకం… నాదే
హోరుగాలి
పెనుగులాడుతున్న అణువులు
చిమ్మ చీకట్లో సముద్రం
కొనదేలిన డాల్ఫిన్ ముక్కు
మెరుస్తున్న పెదిమ
ఎంతకీ వాన కురియని రాత్రి
జేబులో బరువుగా పువ్వు
ప్రియా, దిగులు పడకు
నువ్వు నన్ను కంటావు
నేను నిన్ను కంటానంతే
ఏదీ ఏదీ తిరిగి రాదు
తలలు లేని కాళ్లు
దిశను మార్చలేవు
కాళ్లు లేని తలలు
ఎక్కడికీ వెళ్లలేవు
రావు రామ్ములక్కాయలు
అంబలి కడవలు
లోయల పిచికలు
ఏవీ ఏవీ రావు రావు
స్కాల్పెల్ నీడ లోంచి
కప్ప ఎప్పటికీ గెంతదు

3 అభిప్రాయాలు »కవితలు

3 Responses to “రాతి పుస్తకం”

  1. 1
    desaraju Says:

    చాలా చాలా బాగుంది

  2. 2
    vimala Says:

    మనల వెన్నంటె వేదన ఆగదా?? మీ భాద నా భాద కూడా అవుతుందెందుకు??

  3. 3
    Pranahita May-2008 Issue Released « Flat Forum Says:

    [...] TerarisTu neksTu kamnUnisTu‘, Jvalita ‘oka jIvanmaraNa jIvadRshyam’, and hechchArkE ‘raati pustakam’ in the poetry [...]

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో