అనేక విలక్షణతల తెలంగాణ కవిత్వం

- డా|| రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

సాహిత్యానికి సమాజపు అనేక పార్శ్వాలతో సంబంధం వుంది. ఈ సంబంధానికి ఒక అర్థం, ఒక ప్రయోజనమూ వుంది. అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి వీటిలో ఒక పార్శ్వం. అభివృద్ధికి, సామాజికాంశాలకు మధ్య ఒక అంతర్గత సామరస్యం వుండి తీరాలి. ఈ సామరస్యం సమతుల్యత కోల్పోయినపుడు వాస్తవికత, నైతిక విలువలు ప్రశఆ్నర్థక మవుతాయి. ఈ క్రమంలో మనిషి చేసే అన్వేషణ, వ్యక్తుల సృజనాత్మకతలో, అంతరంగంలో ప్రకాశమాన మవుతుందన్న విషయం సుంకర రమేశ్‌ సంపాదకత్వంలో వెలువడిన ”తెలంగాణ కవిత- 2007” ద్వారా స్పష్టమవుతుంది.

”నన్ను నా ఉనికిని, నా భాషను, నా సాహిత్యాన్ని
ఏళ్ళకేళ్ళు చీకట్లో బంధించిన వాడికి వత్తాసు పలికేవాడు
నాయకుడెలా అవుతాడు…”
(డా||దేవరాజు మహారాజు - రజాకారీ కవిత)

అంటూ రాజకీయ, సాంస్కృతిక, సామాజిక నియతిని ప్రశ్నిస్తాయి. దోపిడే వ్యవస్థలో అన్ని విధాలుగా వ్‌చనకు గురవ వీతున్న నేపథ్యంలో మేల్కొన్న చైతన్యం ప్రశ్నించక మానను. ఒక ప్రాంతం లేదా ఒక వర్గపు స్వార్థపూరితమైన పెత్తనం మరో ప్రాంతపు రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వనరులను ఎపుడైతే అన్యాయంగా కబళింపజూస్తాయో అపుడు ఆ ప్రాంతపు అస్తిత్వం మదిం చేయబడుతుంది. తత్ఫలితంగా ఏర్పడిన సామాజిక సందర్భంలో తలెత్తిన అసమానతలపై నిరసన స్వరాలు నినదిస్తాయి. భూమి సమస్య ప్రజా చైతన్యానికి ప్రధాన

భూమిక :
”అణచివేత ఆధిపత్యం ఒక రాక్షస క్రీడే!
అందువల్లే కదా
మా పట్టి మాన భంగానికి గురైంది…”
”భూమి ఉండేనే కదా మాకు ఉనికుండేది
ఉనికి ఉంటేనే కదా మాదైన భాషను నెత్తికెత్తుకునేది……”
(నాళేశ్వరం. శంకరం - భూమి భవిష్యత్తు కవిత)
అన్న కవి మాటలు, వివక్షకు లోపైన జీవన, శకలాల్ని యెత్తి చూపుతున్నాయి.

”నా నీళ్ళు ఎవలు కాజేసిండ్రు…”
”మా వూరు ఎటుగామండైంది
బతుకులు ఎండినాకులైనై, వూరు చంపబడింది
వలస ఏడుపు కట్టలు దెగుతుంటే
నేను బంధాలను మోస్కుంటూ, సంచార జాతినై పట్నంకొచ్చిన గిప్పుడు…”
(జూలూరు గౌరీ శంకరీ - నడిగూడెం గిట్లయిందేంది కవిత)
అంటూ స్థానిక తెలంగాణ పల్లెల దైన్యస్థితిని చిత్రీకరించడం జరిగింది.

అనేక చారిత్రక ఉద్యమాలకు ఊపిరిపోసిన తెలంగాణ నైసర్గిక - ఆర్థిక పునాది మీద ఏర్పడే సాంస్కృతిక, రాజకీయ వ్యవస్థ పునాది బీటలు వారినపుడు దానికనుగుణంగా వాటి పునాదిలో మార్పులు తీసుకువచ్చే కార్యచరణగా ‘తెలంగాణ కవిత’ రూపుదిద్దుకుంటున్నది. ఉద్యమాల వెనిట వచ్చిన సాహిత్యం గతంలోనూ గొప్ప ఆదరణ పొందింది. విమర్శలకూ గురైంది. ఇపుడు వస్తున్నటువంటి ‘తెలంగాణ కవిత’ కూడా వీద్యమ స్ఫూర్తి తోనే వస్తుంది. తెలంగాణ ప్రజల ఔన్నత్యాన్ని, భావనను, తాత్వికంగా ఆవిష్కరిస్తోంది. ఆవేదన, ఆర్తి, ఆ7లింక్ష, కోపం, దిగులు, ఆకాశం అన్నీ ఇమిడియున్న కవిత్వమిది. నిదర్శనంగా కొన్ని కవితల వాక్యాలు చూద్దాం.

”తెలంగాణనిత్తె బాలెంత పురుడు పురుడుకి నేనే పుడతా…”

- కాసుల ప్రతాప్‌ రెడ్డి

”మా నమ్మకాల నీటి చెలిమెలను మింగి / మా కాలువల్ని మాయజేసిన ఈ జెండాలు ముదనష్టంగాను సిగ్గు లేకుండా ఎగురుతున్నాయ్‌…”

- పగడాల నాగేందర్‌

”మీ ఉక్కుపాదాలు, తుపాకి గోల్ల కోరలు క్ష నదం సీకట్ల మీంచి నడిసొచ్చి / మా అడవి పచ్చల్ని బతుకు పంటల్ని ఆగం జేతద్తున్నయి… ”

- జాపాక సుభద్ర

”ఎర్రని గాయాలపై ఎగిసే విప్లవాల పచ్చదనాల కోసం క్ష కొడిగట్టిన వత్తికై నూనె చుక్కలా చేరి / ప్రజ్వరిల్లే మా అస్తిత్వం కోసం క్ష నిశ్శబ్దాన్ని ఆయుధంగా చేసుకున్న శాంతి పావురాలం…”

- డా|| రూప్‌కుమార్‌ డబ్బీకార్‌

”కడ్పు శేతులల్ల పట్కొని ఎద్దు ఏవుసం అమ్మేసి గా అరబ్బు దేశాలకు / బత్కుదెర్వుకోసం వోయి గాడ సూత్క పందొరక్క ఉశ్క తెప్పలల్ల పానాలిడ్సిరి…”

- ఏలేశ్వర, నాగభూషణాచార్య

”గతులుండి వసతులుండీ / బొండిగె పిసుక్కుంటున్న ఊరు తెలంగాణ
నదులుండీ చెరువులుండీ / దూపకు ఏడుస్తున్న భూమి తెలంగాణ…”

- జాకంటి జగన్నాథం

”మనుషుల నిక్కడ ఎండబెట్టుకుంట క్ష బలె సక్కదనంగా పారుతున్నై ప్రాజెక్టులు…”

- వేణు సంకోజు

ఇలా చెప్పుకుంటూ పోతే బలమైన వాక్యాలు ‘తెలంగాణ కవిత - 2007′ లో చాలా చూడవచ్చు. అఫ్సర్‌ - ‘నెత్తుటి నెమలీక’, వెంకట్‌ - ‘నేనెందుకు’, హనీఫ్‌ - ‘ప్రజలు పాత జ్ఞాపకాల దొంతరలను పరిచిన ఎస్వీ సత్యనారాయణ, ఆశారాజు కవితలు ఇంకా ననుమాస స్వామి, నందిని సిద్ధారెడ్డి, చైరెడ్డి కృష్ణారెడ్డి, డా||ఉదారి నారాయణ, ఉన్నవరం దేవేందర్‌. వఝుల శివకుమార్‌, తైదల అంజయ్య, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, వేముగంటి మురళీకృష్ణ, సుంకర రమేశ్‌, దర్భశయనం శ్రీనివాసాచార్య, రామచంద్రమౌళి, వ్యతిరేక పోరాటంలో తెలంగాణ ఉద్యమభాగంగా కవులు, రచయితలు, గాయకులు, మేథావి వర్గం క్రీయాశీలక పాత్ర వహించడం అందరికీ తెలిసినదే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలోని అటవీ ప్రాంతాలు, గిరిజన భూములు, పోడుభూములు, వ్యవసాయిక క్షేత్రాలు ముంపుకు గురికాబోతూ అక్కడి జనజీవన స్రవంతి చిధ్యమయ్యే దుస్థితి.

“మొన్న పులుల భయం
నిన్న మనుషుల బయం”

నేడు ప్రాజెక్టుల భయం

”ప్యాకేజిలు శవపేతీక తాతున్నపుడు / పునరామసం కాందిశఇకుల్ని చేస్తున్నపుడు ప్రాజెక్టులు ఆధునిక సమాధులౌతున్నపుడు
విల్లులా వంగుతూనే తప్ప / సంతకాలకు లొంగను … ”అంటూ పి.విద్యాసాగర్‌, ”ముంపు” కవితలో … తెలంగాణలో ”బతుకంటే అన్నీ కోల్పోయిన తనాన్ని” చూపుతాడు.
‘దోక’ శీర్షికతో తన సంపాదకీయంలో సుంకర రమేశ్‌ తెలంగాణ నేలమీద దోపిడి తనానికి ఏ విధంగా బీజాలు పడినాయో, దోపిడీ వ్యవస్థలో భాగంగా అప్పటి నిజాం పాలనే గాకుండా అంతకు ముందున్న చారిత్రక నేపథ్యం, ఆ తర్వాత వచ్చినటువంటి పెత్తందార్ల మరియు అగ్రకులాల పాత్రను చక్కగా వివరించారు. ఐతే పుస్తకం నిండా దొర్లిన అచ్చుతప్పులే కాకుండా కొన్ని కవితల్లో ఉదాహరణకు ‘గాయపడిన నిశ్శబ్దం’ (డా|| రూప్‌కుమార్‌ డబ్బీకుర్‌ కవిత) లో పదాలు, వాక్యాలు కూడా గల్లంతై అసంగతమైన కొత్త పదాలు చేరి కవిత్వానికున్న బలాన్ని, పట్టును బలహీన పరిచాయి. ఇలాంటివి జరక్కుండా ముందు ముందు జాగరూకత వహించాల్సిన అవసరమునిది. చక్కని ముఖచిత్రంతో వచ్చిన ‘తెలంగాణ కవిత - 2007′ సంపుటి తెలంగాణ ప్రజల జీవితాన్ని, చైతన్యాన్ని ప్రతిబింబింపజేసింది. ఇందుకు సంపాదకుడి కృషి అభినందించతగినది.

తెలంగాణ కవిత - 2007 : సంపాదకుడు - సుంకర రమేశ్‌, పేజీలు : 135, వెల: రూ.25/-, ప్రతులకు : పుట్ట పుస్తక శిబిరం, అలగడప, మిర్యాల గూడ, నల్లగొండ జిల్లా మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.

Share/Save/Bookmark

సాహిత్య వ్యాసాలు

2 అభిప్రాయాలు

  1. Rakesh జులై 2008 1

    ఇంకా వస్తయి… ఇట్లాంటియి..

    రియలెస్టేటు వ్యాపార్లు,, రాజకీయనాయకుల్దప్పిస్తె మిగతవాల్లందరి గుండెలనిండ.. తెలంగాణే!

  2. kranthi జులై 2008 2

    first sunkara ramesh ki abhinandanalu, elage every year telangana kavistvam book thisukuniraavali, great poetry unnadi book lo also i thank to roop kumar dabbikar gariki he is done good job

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో