అవేర్నెస్…!

నా స్నేహితురాలు ఒకామె ఈ మధ్య పింక్ బ్యాండ్ ఒకటి ప్రజంట్ చేసింది. అప్పుడప్పుడూ తను ఆ బ్యాండ్ చేతికి ధరించడం నాకు పరిచయమే, అలాగే తను వేసుకునే డ్రస్ ల మీద కూడా పింక్ రిబ్బన్ పెట్టుకోవడాన్నికూడా చాలా సార్లు గమనించాను. ఏదో ఒక “అవేర్నెస్ “తో ఇలా బ్యాండ్లు ధరించడం అనే కాన్సెప్ట్ తెలిసినప్పటీకీ, ఆమెని నేను ఎప్పుడూ అడిగే ప్రయత్నం చెయ్యలేదు. పైగా కొట్టొచ్చినట్టు, కలర్ఫుల్ గా, ట్రెండీగా తయారవడం తనకు అలవాటు కనుక, ఏదో ఫ్యాషన్ కోసం పెట్టుకుంటోందనుకుని పొరపాటుపడ్డాను కూడా. ఏదైనా మన దాకా వొస్తేకానీ ప్రశ్నలు వేసుకోవడం సాథారణంగా జరగదు కాబట్టి, ఆ బ్యాండ్ ఇచ్చినప్పుడు కానీ దాని అర్ధం, పరమార్ధం గురించి ఆమెని అడగలేదు. అప్పుడే తెలిసింది, తనో బ్రెస్ట్ కాన్సర్ పేషెంట్ అని, ప్రస్తుతం కీమో తీసుకుంటోందని, తను ఇచ్చిన పింక్ బ్యాండ్ ఇటువంటి పేషెంట్ల మద్దతుగా ధరించేదని…. ఆవిడ అలా ట్రెండీగా తయారు కావడం వెనుక ఆమె అనారోగ్యం కూడా మరో కారణం అని తెలిసినపుడు చెప్పలేనంత శూన్యంగా అనిపించింది.

నాకిప్పటికీ గుర్తే….అమెరికాలో దాదాపు 30 సంవత్సరాలుగా ఉన్న మా అమ్మ కజిన్ పదేళ్ళ క్రితం ఇండియాకి వొచ్చినపుడు, ఆవిడ స్కర్ట్ వేసుకుందని, విగ్గు పెట్టుకుందని బుగ్గలు నొక్కుకున్న వాళ్ళందరూ, ఆవిడ తిరిగి అమెరికా వొచ్చిన తరువాత కాన్సర్ తో చనిపోయిందనే విషయం తెలిసి హతాసులయ్యారు. ఆవిడ విగ్గు వెనుక కీమోధెరపీ తాలూకు సమాచారం ఉందని అప్పుడు వారికేం తెలుసు! ఇవ్వాళ్రేపు కాన్సర్ ని జయించగలుగుతున్న సందర్భాలు, జయిస్తున్న పేషెంట్లూ పెరుగుతున్నప్పటికీ, ఆ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న కోణం. ఇదే మాటని నా స్నేహితురాలితో అన్నప్పుడు, “నీకో విషయం తెలుసా,…బ్రెస్ట్ కాన్సర్ పేషెంట్ల విషయంలో, ప్రస్తుతం మనం ఉంటున్న మెరైన్ కౌంటీ(కాలిఫోర్నియా) అమెరికా మొత్తం మీద, బహుశా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. దీనికి కారణం ఏమిటి… అని ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. అయినా నీరు, వాతావరణం, పరిసరాలు రాను రాను కలుషితం అవుతున్నాయి, అది వరకు పొలాలకే పరిమితమైన పురుగుమందులు ఇంటి పెరడుల్లోను వాడుతుంటే కాన్సర్ లాంటి వ్యాధులు రాక ఏం చేస్తాయి” అన్నదామె.

ఆమె ఆ మాట అనగానే రేచల్ కార్సన్ “సైలెంట్ స్ప్రింగ్ “ లో లేవనెత్తిన అనేక ప్రశ్నలు గుర్తొచ్చాయి. పర్యావరణానికి సంబంధించిన సమస్యలపై గత అరవై సంవత్సరాలుగా ప్రభావితం చేస్తున్న ఈ పుస్తకంలో, మనిషి పర్యావరణంలోని సమతుల్యతని దెబ్బతీస్తుండటంతో, దెబ్బతిన్నపర్యావరణం మనిషిని తన గుప్పిటిలో బిగించే రోజులకు దారితీయవచ్చనే ధోరణిలో సాగిన విషయాలున్నాయి. అవి గుర్తొచ్చి, అందుకే కాన్సర్ లు పెరుగుతున్నాయేమోననే భయం కూడా వేసింది.

మేనెలలో అనుకుంట ! తెహల్కా డాట్ కామ్ లో పంజాబ్ లోని రైతుల గురించిన కధనం ఒకటి వొచ్చింది. అధిక దిగుబడి కోసం రసాయనాలు విరివిగా వాడి పంటలు పండిస్తుండటంతో, ఆయా పంటలకు చెందిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కాన్సర్ బారిన పడుతున్నామని అక్కడి రైతులు చాలా మంది భావిస్తున్నారట. దాంతో, వారు మార్కెట్లో అమ్మకానికి మాత్రం రసాయనాలు ఉపయోగించిన పంటను పండించి, కుటుంబ వినియోగానికి “ఆర్గానిక్ “ తరహా పంటను పండించుకోవడం మొదలుపెట్టారనేది సారాంశం. ఇది చదివినపుడు, సైలెంట్ స్పింగ్ ముందు మాటలో “Production and profit are tied to pollution.” అని అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అల్ గోర్ రాసిన వాక్యాలూ నిజం అనిపించాయి.
ఏది ఏమయినప్పటికీ, రకరకాల రసాయనాల్లాగానే, కాన్సర్ లూ వివిధ రకాలు, వాటి కారకాలకు సంబంధించిన పరిశోధనలన్నీఇంకా ఒక కొలిక్కి రాకపోయినా, కొన్ని పరిశీలనలు బయటికి వొచ్చాయి. ఉదాహరణకి నేను ఉంటున్న ప్రాంతంలో బ్రెస్ట్ కాన్సర్ అధికంగా ఉండటానికి సంబంధించి అనేక అధ్యయానాలు నిర్వహించడం జరిగింది. మెరైన్ కాన్సర్ ప్రాజక్టు పేరుతో జరిపిన ఒక సర్వేలో పాల్గొన్న మూడొంతుల మంది పేషెంట్స్ పర్యావరణ అసమతుల్యతలే ఈ ప్రాంతంలో బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణంగా చెప్పగా, జన్యుపరంగా కూడా ఇవి వొచ్చేందుకుఅవకాశం లేకపోలేదన్నారు పరిశోధకులు. ముఖ్యంగా Ashkenazi Jews, Icelanders and the Dutch లాంటి వర్గాల వారిలో జన్యుపరంగా ఈ లక్షణాలు అగుపిస్తున్నాయట. విషయంలోకి ఇంకా లోతుగా వెళితే, కారణాలు ఇవి అని ఇంకా నిర్ధారించనప్పటికీ, బ్రెస్ట్ కాన్సర్ చాలా వరకు సంపన్న వర్గాలు, విద్యా వంతులైన మహిళల్లోనే అధికంగా ఉందట. సామాజిక, ఆర్ధిక కారణాలతో పాటు, ఆధునిక జీవన విధానం ఇందుకు ప్రభావితం చేస్తోందనే కోణాన్ని ఈ సమస్యని అధ్యయనం చేస్తున్న రీసెర్చ్ సైంటిస్టులు చెపుతున్నారు.

ఈ కౌంటీలో ధనవంతులైన మహిళలు ఎక్కువగా ఉండటంతో పాటు, వారిలో చాలా మంది ఆలస్యంగా పిల్లలని కనడం, తల్లి పాలు ఇవ్వకపోవడం, హార్మోనల్ సప్లిమెంట్స్ వాడటం లేదా hormone replacement therapy ని చేయించుకోవడం, అధికంగా మద్యాన్ని తీసుకోవడం, అందంగా ఉండటం కోసం కాస్మటిక్ సర్జరీలు, లేజర్ ట్రీట్ మెంట్లు తీసుకోవడం వంటి అనేక ధోరణులు లేదా కారణాల వల్ల కాన్సర్ అవకాశాలు పెరుగుతున్నాయట. నిపుణులు చెపుతున్న ఈ అంశాలను తెలుసుకున్నప్పుడు మాత్రం సగం తెలిసీ తెలియక, మనం చేతులారా సమస్యని పెంచుకుంటున్నామేమోనని, అలాగే…అత్యాధునిక ఆవిష్కారాలు వాటి ఆధారంగా నిర్మితమవుతున్న జీవన విధానాల వల్ల మరింత విధ్వంసం తప్ప అంత గొప్ప మేలేం జరగటం లేదనిపించింది.

పర్యావరణ కాలుష్యం కారణంగా మన శరీరాల్లోకి రసాయనాలు ప్రవేశించాయంటే దానికి పూర్తి బాధ్యులం మనం ఒక్కళ్ళమే కాదు. మన వెనుకటి తరాలవారు, ప్రభుత్వాలు, కంపెనీలు, ప్రపంచ దేశాల విధానాలు, అణు పరీక్షలు…ఇలా ఎన్నో కారణం. కానీ అందంగా కనిపించాలనో, యవ్వనం ఒడిసి పట్టుకోవాలనో, సరికొత్త రుచులు తెలియకపోతే వెనుకపడిపోతామనో, మరో ఫ్యాన్సీ కోసమో శరీరానికి క్రృత్రిమ అవసరాలు ఏర్పాటు చేయడం కోసం తాపత్రయపడితే మాత్రం స్వయంగా శరీరంలోని సహజమైన నిర్మాణాలని, వాటి వ్యవస్థని, సమతుల్యతని ధ్వంసం చేయడానికి పూనుకున్నట్టేననే “అవేర్నెస్ “కి కారణమైన నా స్నేహితురాలికి కృతజ్నతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను.
(01 జూన్ 2008)

Share/Save/Bookmark

చౌరస్తా

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో