చెమట చిమ్ముతూ

- చైతన్య ప్రకాష్‌

కస్తూరోని గుడ్డంల కాశెగడ్డి
ఏ పామెక్కడుందో తెల్వది
ఏ తేలెక్కడుందో తెల్వది
కరిచేదేదో కుట్టేదేదో
కట్టేలేరుతూనో పిడుకలేరుతూనో
మానేరు వాగు జాలుగాల్వలపొంట
వడ్లెగపోస్తూనో లేక నూకుతూనో
కైకిలి గంబడిలేని కరువుల
ఎంతకూ పారని పొలానికి
యాతంపోస్తూనో గూడలేస్తూనో
కొట్టే నాయినను చూసి
భయపడ్తూ మాట్లాడ్తూనే
ఎగపోస్తూ ఎంతకూ చెప్పని ఎత
చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని
దరి దొర్కని బాయిల దిగి
చెమట చిమ్ముతూ అవ్వా!
ఎంతకూ ఒడ్వని కథ
ఎల్లడ పాట అంగట్ల కొంగుల దాచుకొచ్చే
బూడాల కోసం ఎదిరి చూసిన
పొద్దుంజాము నువ్వు
తాగత్తడో తడిపత్తడో నోటికి సయి దొర్కాలె
కండ్లు మండే పొగల పొయ్యూదే గొట్టం
గద్దల్ని తన్ని పిల్లల్ని కాపాడుకునే కోడి తల్లి
గుడిసె మీద లాటీ లురిమి నపుడల్లా గుండెకాయ
ఎదురు మాట్లాడిన మొండి ధైర్నం
కదలని నోరు తినని బువ్వ తప్పని పని
ఏగిలి వారిన్నుంచి కూరుకు రాత్రి దాంక
గునుసుకుంటనే నువ్వొక మిషిని -
మాట రాకుంటేనేం సైగ ఉంది
నడువ రాకుంటేనేం సెగ ఉంది
ఏగిలి దుబ్బ మక్కచేన్ల పీసులు దీస్తూ
ఇరాం లేక ఈరజాలకు కలుపు దీస్తూ
నడుం గట్టుకొని తోక మడుక్కు కోతకోస్తూ
అవ్వా! తలచుకుంటే
కొండపురం ఒక్క వూరే కాదు
ఊర్లన్నీ అవ్వల కన్నీటి చెమట తుంపరతో
సేద దీర్చుకుంటున్న నేల -
ఒక్క పనని చెప్పరాకపాయే
అవ్వ అంటే ఆరొక్కపని
నాటేస్తూ భూమ్మీద కొత్త పురుళ్ళు
రేపటి తరానికి బువ్వ ఎగజల్లుతూ
కంటికానినంత దూరం నడుస్తూనే
మతి ఉన్నంత వరకు యాదికొస్తూనే
ఇక్కడికొచ్చి
నాలుగక్షరాలు గిలుకుడే కాదు
నాలుగు లోకాలు దిరిగే సత్తువ
పొగడ్తూ తెగడ్తూ బోలెడు కుండపోతల వాన -
అవ్వ బతుక్కోతొవ్వ
దమ్మున్నంత మేర నేనో కొండగుర్తు
ఎండుతున్న బొండిగెకు శాతాడు బొక్కెన
ఉడికి దిగుతున్న కుండకు మసిపేల్క
ఏమని చెప్పాలె… ఎట్లని చెప్పాలె?!
తిర్రేసి మర్రేసి ఒక్క తీర్గని కాదు
ఎటు చూసినా అవ్యొకతే బహురూపి
పాలిస్తూ వీపు నిమురుతూ కోప్పడ్తూ
కలువరించి నపుడల్లా జో కొడ్తూ
ఎంత పెద్దగయితేనేం గద్దరిస్తూ
అవ్వొకతే సర్వాధికారి
అలిగి పంటే లేపినుచ్చకొడ్తూ
బుదగరిచ్చి మురిపిచ్చి
అందని సందమామను సూపెడ్తూ
తొవ్వకు దెచ్చుకునే
చెమట పూల చెట్టు ఆమె
ఇపుడు నాయిన గోరి ముందు
తెరలు తెరలుగా దుఃఖాన్ని పూస్తూ
వరదలు నింపుకున్న చెరువు ఆమె.

కవితలు

2 అభిప్రాయాలు

  1. kranthi జులై 2008 1

    asaline telangana poem thanks to poet

  2. annavaram devender జులై 2008 2

    prakash…
    nee poem masthundi ,,cograts….

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో