చివరకు మిగిలింది

- పి.మోహన్‌

గుప్పిట పట్టిన జ్ఞాపకాలన్నీ
ఆవిరైపోయిన సంగతి
పాముకాటులా అనుభవమయ్యాక
చివరకు మిగిలిన


ఒంటరి తనమూ గొప్పదే
వ్రేమలు పల్చబారుతున్నా
వాటినే తలపోసుకుంటూ
నడిరాత్రి
రోడ్డుమీద ఒక్కణ్ణీ
నడుచుకుంటూ రావడం
నిద్రకు ముందు ఓ దుఃఖపు వ్యాయామం
అయినా ఏం పోగొట్టుకున్నానని
ఈ వేకువ జామున
రెండు కన్నీటి బొట్లను రాల్చుకోవడం
భయదస్పృహల మధ్యే అయినా
ప్రాణం పదిలంగానే ఉంది కదా
దారి మలుపులో శత్రువు
దాడి చేస్తాడన్న భయమూ లేదు కదా
రాలి పడుతున్న రాగాల పెచ్చుల ముందు
నిలువెల్లా గాయపడి
మూర్ఛపోవడంలోనూ
రవంత దుఃఖానందమేదో
అనుభవానికొస్తూనే ఉంది కదా
కరచాలనాల మెత్తని స్పర్శలో
ఒదిగిన మృతక్రీస్తు పునరుత్థానం కోసం
గుహబయట వేచి చూస్తూనే ఉన్నాను కదా


కవితలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో