Jul2008
జర భద్రం బిడ్డో
- స్వాతి శ్రీపాద
జర భద్రం బిడ్డో
పెళ్ళైన క్షణం నించే
పుత్ర పౌత్రాభిరస్తూ అంటూ
మగ పక్షపాతం ఆశీస్సులు అందించే
ఈ చీకటి లోకం లో
ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్నావు
జర భద్రం బిడ్డోస్కానింగ్ లో ఏమాత్రం ని ఆచూకీ దొరికినా
ముక్కలై పోతావు నీ ఉనికిని కోల్పోతావు
మగబిడ్దనే కనాలని నీ తల్లిని బెదిరించే నీ తండ్రి
కఱకు కసాయి గా మారతాడు
జరభద్రం బిడ్డో-నీ ఆడతనాన్ని దాచుకో
బుడిబుడి నడకల సొబగుల్లో
సౌ కుమార్యమ్ సౌందర్యం పేరిట
స హస్ర అలంకారా ల్ను ఆపాదించి
నీన్నో చెక్కిన శిల్పం లా ప్రదర్శించే
ఈ వైణికుల మనసు నించి జర భద్రం బిడ్డో
ఆరునెలలో అరవై ఏళ్లో అణువణూవునా
ఆడతనమే బేరీజు వేసే కాంక్షా క్రౌర్యపు
చూపుల కత్తులనించి జరభద్రం బిడ్డో
వయసుడిగి పోయిందని క్షణం ఆదమరచి
జీవన సంధ్యా సమయం లో
పాలుమారక
నీముక్కెర మూడు రూపాయలకోసమో
నీ కొంగు ముడి నుండే పావలాకోసమో
కొడుకే యముడవుతాడు
జరభద్రం బిడ్డో
తాడేపల్లి Jul 2008 1
“తండ్రి శత్రువు !
అన్న శత్రువు !!
మొగుడు శత్రువు !!!
అసలు మగవాళ్ళంతా దుర్మార్గులే.”
ఏమిటీ ప్రచారం వల్ల ప్రయోజనం ? ఇది ఎవరిని బాగుచేస్తుంది ?
ఏమిటిందులో ఉన్న జెండర్ సెన్సిటివిటీ ?
ఇటువంటి మాటలు ఆడవాళ్ళ గురించి మగవాళ్ళు రాస్తే మీరు సహిస్తారా ?
swatee Aug 2008 2
ఇది ఎవరినో దూషిస్తూ వ్రాసినది కాదు. ద్వేషం ఎక్కడాలేదు. కాదంటే ప్రతి సంఘటన జరిగినవి చూసినప్పుడు మనసు స్పందించి ఓ చిన్న హెచ్చరిక జగ్రత్తగా వుండమని అంతే
k ramulu Aug 2008 3
ఇదొక పిచ్చి కవిత. ఇంత చవకబారు కవిత్వం ఎక్కడా చదవలేదు. అంతా చెడే ఉందని చెప్పేబదులు మంచిని ఫోకస్ చేయచ్చుకదా. మన రచయితలు స్టీరియో టైప్ లోకి తొందరగా పడిపోతారెందుకో.
కె.మహేష్ కుమార్ Aug 2008 4
కవిత ఉద్దేశం నెరవేరినట్లు లేదు. కేవలం మగాడ్ని తెగడడం మాత్రమే ఏకైన అజెండాగా కలిగిన స్త్రీవాదం కనబడుతోంది. ఈ తరహా వలన అటు ఆడవాళ్ళకూ ఇటు మగవాళ్ళకూ మొత్తం మానవజాతికే ఒరిగే ప్రయోజనం కనిపించడం లేదు.
సమస్యలున్నాయి, వాటికి కారణం మగవాడు మాత్రమే కాదు. పూర్తి వ్యవస్థ. అందులో స్త్రీలూ భాగస్వాములే. కలిసి సమస్యని తీర్చడానికి పాటుపడదామా? లేక ఒకరినొకరు కడతేర్చుకుంటూ, సమస్యని ‘ఖతం’ చేద్దామందామా?
perugu Aug 2008 5
కవిథలొభావాలు కొన్ని వాస్థవాలె..
నిజమ్ నిస్తురంగనె వుంతుందెమొకదా?
వెంకట్ Aug 2008 6
మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశమంతా ఒకటే పద్దతి. మనలో ఎంత మంది “బాధితులు” ఉన్నారంటె, గెలుస్థున్నవారెవరో తెలీదు. దళిత సాహిత్యం, స్త్రీ సాహిత్యం, మైనారిటి సాహిత్యం,… ఇలా అందరూ బాధితులే. విచిత్రం.
వెంకట్