కాలంలో కదిలిన తెలంగాణ కథ

-డా.బి.వి.ఎన్‌.స్వామి

మొదటి నుండి నేటి దాకా తెలంగాణా కథకులు కాలంతో వచ్చే మార్పులను తెలుసుకున్నారు. మార్పు కలిగించిన ప్రభావాలను గమనించారు. మార్పుకు గల కారణాలను అన్వేషించారు. మార్పు వల్ల కుదేలైన ప్రజానీకం వైపు నిలబడి, ప్రశ్నిస్తూ ఉత్తర తెలంగాణా కథను నిలబెట్టారు.


నిజాం పరిపాలన వల్ల అస్తవ్యస్థమైన ప్రజానీకం కష్టాల పట్ల కథ అనాడు తన సహానుభూతిని ప్రదర్శించింది. భూస్వామ్య వ్యవస్థకు ప్రతినిధులైన జమీందార్లు, జాగీర్‌దార్లను కథ నిలదీసింది. తెలంగాణా దొరల దాష్టీకాన్ని ప్రశ్నించింది. తరిగబడ్డ జనం వైపు నిలిచింది. కష్టాలను, కడగండ్లను కడపులో దాచుకున్న ప్రజలు తమ బాధల్ని బాహాటంగా చెప్పుకున్నారు. ఆ చెప్పుకోవడంలోనే కథ పుట్టింది. రైతాంగం ఎంత పనిచేసినా పస్తులుండక తప్పని పరిస్థితుల్లో పిడికిలి బిగించింది. బిగించిన పిడికిలి శక్తి కథలో కూడా కనిపిస్తుంది. ఈ ధోరణిలో వచ్చిన కథ కనుకనే తెలంగాణా కథకు ఉద్యమ కథ అనే ముద్రపడింది. కాని వాస్తవంలో అది మాత్రమే నిజం కాదు. ఉద్యమ కాలంలో వచ్చిన కథ కనుక, కథలో ఉద్యమస్ఫూర్తి కనబడుతుంది. కాని అంతకు మించి ఆనాటి ప్రజల ఆర్తి, సుఖ దుఖాలు, జీవన విధాన చిత్రణ ఎక్కువగా కనబడింది. ఒక రకంగా తెలంగాణా కథను ప్రజా కథ అని పిలువవచ్చు. ఉద్యమం ప్రజల మధ్య సంఘాలను నెలకొల్పింది. ఆ సంఘాల ద్వారా ఉద్యమాలను నడిపింది. సంఘంలో మాల మాదిగ, కమ్మరి-కుమ్మరి, సబ్బండ వర్ణాలు సభ్యులుగా ఉండి, తమ సమస్యల సాధన కోసం, తమ ఉమ్మడి శత్రువైన దొర పైన తిరుగుబాటు చేయడం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే వారు తమ కష్టాలను కథలు కథలుగా చెప్పుకున్నారు. అలా చెప్పుకునే అవసరం నుండే రచయితలు పుట్టారు. వారే కలం పట్టి తమ సమస్యలను, స్పందనలను, పరిష్కారాలను కథల రూపంలో రికార్డు చేసుకున్నారు. ఇలా రాసివనారు కనుకనే వీరందరూ ప్రజా రచయితలు అయ్యారు. దొరల అణచివేతను, ప్రజల తిరుగుబాట్లను అన్ని కోణాలనుండి చిత్రించిన రచయితలు, భూ పంపిణీ జరక ముందే తమ చేతుల్లో ఉన్న భూమిని పొగొట్టుకొనడాన్ని, రైతు తన భూమికి తానే పరాయివాడు కావడం చిత్రించారు. భూమికోసం భుక్తికోసం పోరాడిన రైతాంగం, తమ పల్లెల్ని వదిలి సామూహికంగా వలస వెళ్ళడం కనబడుతుంది. హరిత విప్లవం ఈ క్రమానికి దోహదం చేసింది. ఈ వైనాన్ని అద్భుతంగా కథకులు చిత్రించారు.అలా పల్లెల్ని, భూముల్ని వదిలిన రైతు కూలీలను సింగరేణి బొగ్గుగనులు ఆహ్వానించాయి. బొగ్గుబాయి పని అంటే ఆకర్షణీయంగా కనబడింది. జీవనం కోసం బొగ్గు బాయిలోకి దిగిన వారి బ్రతుకులు బండ కింది బతుకులయ్యాయి. పాతాళం లాంటి బావుల్లోకి బొగ్గుకోసం దిగి అదే బొగ్గు కు బలికావడం నిత్యకృత్యాలయ్యాయి. పనిచేసే చోట మంచి సౌకర్యాలు లేక కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసేవి. బొగ్గు పెళ్ళలు కూలి అందులో సమాధి కావడం మామూలైంది. కార్మికుల ఆవాసలు మురికికూపాలుగా ఉండి జీవించడం దుర్భరంగా ఉండేది. పచ్చని ప్రకృతి మధ్య , శుభ్రమైన గాలి, నీరు, వెలుతురు మధ్య బ్రతికిన రైతులు, కార్మికులుగా అందుకు భిన్నమైన వాతావరణంలో బతకడం భరించలేక పోయారు. పల్లెల్లో దొరల దౌర్జన్యాన్ని భరింలేక పోరాడిన వారు, బొగ్గు బాయి యాజమాన్యం యొక్క నిరంకుశ విధానాలను సహించలేకపోయారు. వీటన్నింటికి వ్యతిరేకంగా, కనీస సౌకర్యాలైన నీరు, ఇల్లు లాంటి వాటికోసం, యాజమాన్య అణచివేతకు నిరసనగా కార్మికులందరు ఒక్కటైనారు. పల్లెల్లో సంఘకార్యకలాపాల్లో పాల్గొన్న అనుభవంతో సింగరేణిలో పోరాటాన్ని మొదలు పెట్టారు. ఆ విధంగా సింగరేణిలో కార్మికోద్యమం మొగ్గ తొడిగింది. ఈ దశలో కార్మికుల సమస్యల్ని, యాజమాన్య నిరంకుశత్వాన్ని, పోరాట క్రమాన్ని చిత్రిస్తూ కథలు వచ్చాయి. ఈ కథా సాహిత్యాన్ని సంకలనాలుగా వెలువరించారు. కథకులు స్వయంగా కార్మికులైనందున ఈ కథలన్నీ నిజ జీవన ప్రతీకలుగా నిలిచాయి.

నాగరిక సమాజానికి దూరంగా కొండలు, కోనలతో నిండిన దట్టమైన ఆరణ్యాల్లో అటవీ ఉత్పత్తులను సేకరించుకుంటూ, పోడు వ్యవసాయంతో బతుకులను గడుపుతున్న ఆదివాసిలు ప్రకృతి మధ్య స్వేచ్ఛగా, ప్రశాంతంగా జీవనం సాగిస్తుంటారు. అడవి జంతువులతో స్నేహంగానూ, వాటి పట్ల జాగరూకతతోనూ ఉంటూ కాలం గడుపుతున్న గిరిజనులు మైదాన ప్రాంతీయుల దృష్టిలో పడ్డారు.మైదాన ప్రాంతానికి చెందిన షాపుకార్లు అటవీ ఉత్పత్తులను గిరిజనుల వద్ద నుండి చౌకగా కొని వారికి తమ వద్ద ఉంటున్న సరకులను అత్యధిక ధరకు అమ్మేవారు. వినిమయ విధానమే తెలియని గిరిజనులు అమాయకంగా మోసపోయారు. అంతేగాక గిరిజనులకు డబ్బుల్చి, అనేక రెట్లు వడ్డీ వసూలు చేసేవారు. వడ్డీలు చెల్లించడంలోనే గిరిజనుల జీవితాలు పూర్తి అయ్యేవి. తండ్రి చేసిన అప్పు భూములు షాపుకార్లకు ధారదత్తం అయ్యేవి. అంతే కాకుండా మైదాన ప్రాంతీయులు గిరిజనులను అనేక రకాలుగా దోపిడికి గురిచేసేవారు. అనామతు ఖాతా రూపంలో మొదలైన వారి మధ్య బంధం, భూములు కోల్పోవడం వరకు సాగేది. అడివి కోసం, అటవీ పుత్రుల సంక్షేమం కోసం నెలకొల్పిన ప్రభుత్వ సంస్థలు వారికి ఉపయోగపడేవి కావు. తాగునీరు కోసం మైళ్ళ దూరం నడిచి వెళ్లవలసి రావడం గిరిజనులకు చెందిన విషాదం. ఆ ప్రయాణంలో అడవి జంతువుల బారిన పడడం వారికే పరిమితమైన వాస్తవం. అటివీ శాఖకు చెందిన సూపర్‌వైజర్ల, ఉద్యోగుల నియంత్రణ గిరిజనులపై అత్యంత పాశవికంగా ఉండేది. అటివీ శాక రక్షకుల దమనకాండ, గిరిజనులను భయ భ్రాంతులను చేసింది. ఈ విధంగా గిరిజనులు క్షణమొక యుగంగా బ్రతుకును వెళ్ళదీసేవారు. నిజాం నవాబును ఎదరించి పోరాడిన కొమురం భీం వారసత్వం వారిలో ఉన్నా, వారిని ముందుండి సమస్యల పరిష్కారం కోసం నడిపించేవారు లేకపోవడం నిజం. రైతాంగ, కార్మిక ఉద్యమ నాయకత్వం ఈ వాస్తవాన్ని గ్రహించి ”పొరకల సార్లు”గా అడవీ ప్రవేశం చేంది. మైదాన ప్రాంత జులుంకు వ్యతిరేకంగా, ప్రభుత్వాధికారులు అణచివేతకు వ్యతిరేకంగా గిరిజనుల్ని చైతన్య వంతున్ని చేసింది. అప్పుడే అడవిలో జరగుతున్న అన్యాయాలు బయటి ప్రపంచానికి తేలిసాయి. అలా తెలవడానికి వాహికగా కథ పని చేసింది. అడువుల్లోకి ఉద్యమ కార్యకర్తలుగా వెళ్ళిన యువకులు గోండు భాష నేర్చుకొని, వారి సంస్కృతి, ఆచారాలను, సమస్యలను మొదలగు వాటిని కథలు, కథలుగా మలిచి ప్రపంచానికి అందజేసింది. రైతాంగ, గిరిజన, కార్మికోద్యమానికి తన వంతు సహాయాన్ని అందజేసింది. రైతాంగ, గిరిజన, కార్మికోద్యమాలు మూడూ కూడా ప్రజల్ని సమస్యల నుండి విముక్తుల్ని చేయడమే కాకుండా, సాహితీ వేత్తలను, రచయితలను కూడా తయారు చేయడం గమనార్హం.

సమాజంలో వచ్చిన అనేక మార్పుల వల్ల మధ్యతరగతి పెరిగింది. అక్షరాస్యత అన్ని వర్గాల వారికి అందింది. ఎవరికి వారు, తాము ఏ పరిస్థితిలో ఉన్నామో, తమకు కావలిసిందేమిటో అవగాహనకు వచ్చారు. దాంతో వర్గ సృహ స్థానంలో అస్తిత్వ ఆకాంక్షలు పెరిగాయి. ఉనికి కోసం, మెరుగైన జీవిక కోసం అస్తిత్వ పోరాటాలు ప్రారంభమయ్యాయి. అందులో దళితవాదం ప్రముఖంగా చెప్పుకోదగింది. భూస్వామ్య వ్యవస్థ బలంగా ఉన్న తెలంగాణాలో దళితులు అణిచివేయబడ్డారు. భూ పోరాటాలు ఫలించిన సమయంలో కూడా దళితల పరిస్థితిలో మార్పు రాకపోవడం వల్ల ఇక్కడ దళిత వాదం బలంగా వినిపించింది. అక్షరాస్యత దళితుల్లో కూడా వ్యాప్తి చెందినందువల్ల, దళితులు తమ అనుభవాలను, పరిస్థితులను, జీవన స్థితిగతులను వర్ణిస్తూ కథలు రాశారు. తెలంగాణాలో దళితులే కాదు, దళితేతరులు కూడా దళిత వాద స్పృహతో కథలు రాశారు. ఈ దశలో కులం ప్రధాన ఎజెండాగా మారడం గమనించదగిన విషయం. ఎవరి అనుభూతుల్ని వారు కథీకరించుకోవడం వల్ల కథ శక్తి వంతమవుతుందనే వాదం ఒకటి ఈ రోజుల్లో బలంగా వినబడింది. ఈ విషయమై అనేక వాదోపవాదాలు బయల్దేరాయి. మొత్తానికి దళిత చైతన్యం, ప్రజాస్వామిక స్పృహకు బలం చేకూర్చింది. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే, తెలంగాణాలోని దళితుల పరిస్థితి భిన్నంగా ఉంది. అంటరానితనం అనే సాంఘిక నేరం ఒకటే కాక, దొరల పెత్తనం కింది నలిగిపోవడం అనే మరొక దుస్థితి వీరికి ప్రాప్తించింది. కనుక తెలంగాణాలో వచ్చిన దళిత కథల్లో కూడా దొరకుసంబంధించిన విషయాలు అనేకం చర్చించబడ్డాయి. అందుకో తెలంగాణా నుండి కథలు రాసిన వారవరైనా దొరతనం గురించి కాని, దొర గురించి గాని రాయకుండా ఉండలేక పోయారు. ఈ కథల వల్ల దళిత కులాల మూలాలు స్పృశింపబడ్డాయి. తరతరాల వారి వేదన,వ్యక్తిగత దుఖంగా ప్రకటించబడింది. ఆ మేరకు కథకు ఇదొక అడిషన్‌గా భావించవచ్చు.

ప్రపంచీకరణ అనేది చాపక్రింది నీరులా సమాజంలో పాకి పోయింది. ప్రభుత్వాలు అంతర్జాతీయంగా వరల్డ్‌ బ్యాంక్‌, డబ్ల్యుటివోలతో కుదుర్చుకున్న ఒప్పందాలు,వివిధ వేదికలపై చేసిన సంతకాల వల్ల దేశంలోని మారుమూల పల్లెటూళ్ళు సైతం మార్పుకు గురి అయ్యాయి. ఈ మార్పులు సమాజంలో గణనీయమైన మార్పును కలిగించాయి. వేష భాషల్లోనూ, సంస్కృతీ సంప్రదాయాల్లోనూ, అచార వ్యవహారల్లోనూ, ఆలోచనా విధానంలోనూ మనుషులు తమ పూర్వ విధానాలకు దూరం అయ్యారు. ప్రపంచ ఒక కుగ్రామంగా మారాలన్న అదర్శం వల్ల భిన్న సంస్కృతులకు సమాధి కట్టడం జరిగింది. ఆ విధంగా ప్రపంచమంతా ఒకే సంస్కృతి వ్యాప్తి చెందడానికి బలమైన పునాదుల పడ్డాయి. అంతిమంగా అది అమెరికనైజేషన్‌కు దారి తీసింది. గ్లోబలైజేషన్‌ వల్ల పల్లెల్లోని కుల వృత్తులు కూలిపోయాయి. వ్యవసాయ విధానం మార్పులకు గురి అయింది. సాంప్రదాయ వృత్తులు, వ్యవసాయం అడుగంటాయి. దాని వ్లల జరిగిన అభివృద్ధి కొందరికి మాత్రమే పరిమితం అయింది. సమాజంలో అంతరాలు పెరిగాయి. ఈ విషయాన్ని స్పృశిస్తూ అనేక కథలు వెలువడ్డాయి. ఈ స్థితి మరింత ముందుకు సాగి ఆత్మహత్యలకు దారితీసింది. వీటికి గల కారణాలను వివరిస్తూ అనేక కథలు రాశారు. నీరు వ్యాపార సరుకుగా మారడాన్ని, సంస్కృతి పరాయికరింపడడాన్ని చిత్రిస్తూ శక్తివంతమైన కథలు వచ్చాయి. చదువుకున్న విద్యావంతులు ప్రపంచీకరణ వల్ల జరుగుతున్న విధ్వంసాన్ని నిబద్ధతతో చిత్రిక పట్టారు. పెరుగుతున్న వినియోగదారి సంస్కృతి పట్ల నిరసన తెలుపుతూ అనేక కథలు వచ్చాయి. పరాయి భాష తమ జీవితాల్లో వేసుకున్న పెద్ద పీటను గమనించి, స్వభాషాభిమానాన్ని తెలుపుతూ కథలు వచ్చాయి. మనిషి యొక్క సకలాన్ని గ్లోబలైజేషన్‌ ప్రభావితం చేసింది. అంతిమంగా మనిషి పరాయీకరింపబడడం జరిగింది. ఈ క్రమాన్నంత కథలు నిక్షిప్తం చేశాయి. ఆ క్రమంలో తెలంగాణా కథకులు ముందు వరుసలోనే ఉన్నారు.
ఉద్యమాలు తెలంగాణా కథకు వెన్నెముకగా నిలిచాయి. అయినా కథ సిద్ధాంత ప్రచారం కోసం కాక ప్రజల జీవన వేదనలను రికార్డు చేయడం కోసం నడుం కట్టింది. ప్రజల నైతిక విలువలు, కట్టుబాట్లు, సామాజిక చిత్రణ, బతకు కోసం ప్రజలు చేసిన ప్రయత్నాల పరంపర ఇవన్నీ కూడా కథల్లో మనకు కనిపిస్తాయి. కథకు ఉండాల్సిన ప్రధాన లక్షణమైన క్లుప్తత, సూటిదనంలకు తెలంగాణ కథ పెద్ద పీట వేసింది. కథల్లో ఎత్తుగడ, ముగింపు, సన్నివేశాలు, సంఘటనలు, భాష నాటకీయత, వర్ణనలు, అలంకారాలు, నేపథ్యం, సంఘర్షణ, పాత్రలు అనుభూతి, వస్తువైక్యత, క్లుప్తత, కథాంశం మొదలగున్నవి కూడా సమపాళ్ళలో కూర్చబడ్డాయి. ప్రజల కోసం రాసిన కథలు కనుక మాండలికాలకు కథకులు పెద్ద పీట వేశారు. ఇన్ని హంగులతో ప్రజా శ్రేయస్సే పరమావదిగా కథ వెలువడింది. కనుక తెలంగాణ కథను ”ప్రజాకథ”గా పేర్కొనవచ్చు. తెలంగాణా కథ కేవలం ఉద్యమ కథ కాదు. ప్రజా కథ అనీ ప్రజారాసుల కష్ట ఫలితమనీ నిరూపితమయింది. మాండలిక భాషలో మౌఖిక సంప్రదాయాలతో తెలంగాణా కథ మరింత వన్నెదేలింది. అశు సంప్రదాయాల్ని రక్షించుకున్న ఈ కథ దేశీయ కథన రీతులకు పెద్ద పీట వేసింది. చరిత్ర రచనకు లిటరరీ సోర్స్‌గా తెలంగాణ కథ నిలిచింది. తక్కువగానే అయినా కేవలం శిల్పం పట్ల మమకారంతో ప్రయోగాల కోసం కథలు రాసినవారు కూడా తక్కువగానే ఉన్నారు. అటువంటి కథలు కూడా ఏదో ఒకచోట సామాజిక స్పృహను చిందిస్తాయి. దానికి కారణం ఈ నేల యొక్క గుణం, ఈ ప్రాంతం యొక్క చైతన్యం అని నిర్ధ్వంద్వంగా చెప్పవచ్చు. ఆ చైతన్యంతోనే దశాబ్ద కాలంగా సాగుతున్న ఉద్యమాన్ని అస్తిత్వ స్పృహతో కథలు చిత్రించాయి. తెలంగాణలోని నీళ్ళు, భూమి, భాష, సంపద ఏ విధంగా ఇక్కడి వారికి అందకుండా పోతున్నాయో కథ చిత్రిక పట్టింది.


సాహిత్య వ్యాసాలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో