కరగని ఒక కల

- గండికోటి వారిజ

కాలం సూచికలను
కాళ్ళకు కట్టేసుకుని పరుగెత్తే
నీకు నాకు మధ్య మిగిలేది రాత్రి
భోంచేసారా ? పాపలు నిద్రపోయారా


అని ఆవులింతతో అర్థరాత్రి
ఇంట్లోకోచ్చే నీకు
నా నిద్ర కళ్ళు ఎదురవుతాయివండుకున్నవి వార్చుకున్నవి
మిగిలి పోతాయని నేనూ
ఏదో తినాలని నీవూ మొక్కుబడిగా తినేస్తాం
మాటల మధ్యలోనే నిద్ర
మిగిలిన రాత్రి కరిగిపోతుందో
తెల్లారిపోతుందనో బెంగతో
ఇక క్షణం కూడ పక్కమీద వుండలేను

ఎంత దాచుకుందా మనుకున్నా
నా పిలుపులో తొందర గాలిభరా
దొరికి పొతూనే వుంటుంది.
నీవలా టీగ్లాసు పట్టుకుంటే చాలని
నా డ్యూటి అయిపోయిందని
ఊపిరి పీల్చేస్తా
మురిపంగా బ్రతిమలాడుతూ నేను
బద్దకంగా మరీ మరీ అడిగించుకుని
నిద్ర లేస్తూ నువ్వు
నిజంగా
ఇదంతా
కలేనా ?!

Share/Save/Bookmark

కవితలు

ఒక అభిప్రాయం

  1. Bhanu జులై 2008 1

    చాలా చాలా బావుంది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో