మేఘమా! మేఘమా!

- విమల

జీవితం మేఘశకలంలా
అలవోకగా అలా గాలిలో తేలిపోతుంది
మబ్బులు కమ్మిన ఆకాశంలా


జ్ఞాపకాల క్రీనీడలు అలుముకున్న జీవితం
వర్షించని శ్రావణ మేఘంలా భారంగా కదులుతుంది.లేలేత ప్రాతఃవేళ
పచ్చటి గడ్డిమైదానాల్లోనో
ఏటివొడ్డున ఇసుక తిన్నెలపైనో పవళించి
ఆకాశంకేసి అట్లా నిర్నిమేషంగా చూడు
తెరిచిన ఆకాశం వాకిలి వెనుక
నీలి సముద్రాలు, మేఘలహరులు
రసాతలాలు, మరీచికలు
హిమవన్నగాలు, రహస్య సొరంగదారులు
జలతారు అంచులతో, వర్ణభరిత
మార్మిక మేఘాలు నన్నట్లా కౌగిలిలోకి పిలుస్తాయి.

చలివెన్నెల వెలుగుల చందమామ నీడన
నక్షత్రాల కలువపూలు రాలిన నేలపై
అలసి నిదురించిన నా జీవన లాలస
మెలమెల్లగా మేల్కొనే నా అంతః చేతన
వేనవేల అస్తిత్వ మేఘాలుగా విడివడి, కలగలిసే
జీవితం ఆకాశం అంతుపట్టని అనాది కావ్యం.

ఆకాశ శిఖరాల నుండి జలపాతాల్లా
జారి, విరిగిపడే తుషార మేఘాల సమూహాలు
వెదురు వేణువుల మేఘారావాలు
ధ్యానంలో మునిగిన పొగమబ్బులు
చివరకు అదృశ్యమవ్వక తప్పని
జీవన రహస్యాన్ని విప్పుతాయి.

తొలకరి వానజల్లులో తడిసిన మట్టి నుండి
ఒక ఆరుద్ర పురుగు మెల్లిగా పాకి
చాచిన నా శూన్యహస్తాలపై పట్టువలె, సుతిమెత్తగా
స్వప్నలిపిలో ఏదో రాసి వెడుతుంది.

నిదురించిన రాత్రులను మళ్ళీ వెలిగించి
తెగిపోయిన రాగాల్ని మళ్ళీ రగిలించి,
ఏదో తెలియని ఆనందాల సౌగంధాల్ని చల్లి
బడి నుండి బయటపడ్డ పసిపిల్లల గుంపుల్లా
మేఘాలు ఆకాశంలో చెట్టాపట్టాలేసుకు పరుగెత్తుతాయి.

ఆకాశము, సముద్రము వున్నంత వరకూ
మేఘాల రెక్కలతో ఆశల కలహంస ఒకటి
అలా ఎగురుతూనే వుంటుంది.

కవితలు

ఒక అభిప్రాయం

  1. ashok నవంబర్ 2008 1

    అమోఘం, మీ లాంటి వారు వుండబట్టె మన తెలుగు భాష ఇంకా బ్రతికి వుంది.
    నా హ్రుదయపూర్వక అభినందనలు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో