జులై2008
మొదటి స్నానం చివరి స్నానానికి మధ్య
- ముకుంద రామారావు
ఇంటినుండి వీధిలోకి పోయినట్టు
మా పక్కింటాయన మరణం
నేను వెళ్తున్నాను
మీకు సంతృప్తి తీరేవరకూ
ఇక్కడే కొన్నాళ్లు ఆగి రండని
చెప్పివెళ్లినట్టుచనిపోయిన అతని కోసం
చావు తప్పించుకోలెని అందరూ
ఏడుస్తున్నారు
ఇదే దారమ్మట వెళ్తామని
అతనే చెప్పేవారు
నిన్నటివరకూ అతనికీ తెలీదు
అది ఈ రోజేనని
జీవితం ఎలాగూ ముగుస్తుంది
ముగిసే వరకూ గడిచే జీవితమే
ఎవరినన్నా ఎన్నాళ్లయినా
బతికిస్తుందేమో
మిగిలిన శరీరాలకు
ఆ కాస్పేపే
ఎడతెగని ప్రశ్నలు
తప్పించుకోలేని దిగులు
kartheek జులై 2008 1
చాలా బావుంది.
kranthi జులై 2008 2
chaala bagunnadi ramarao garu mee poem
perugu జులై 2008 3
gundello guddu thayi mee kavithalu..chala baagundi
Ram
suri ఆగస్టు 2008 4
చాల బాగుంది