జులై2008
నది చుట్టూ నేను
- దాట్ల దేవదానం రాజు
నది అద్దం ఆకాశ ప్రతిబింబాన్ని మేఘాలు లేని చిత్రంగా నలుపు తెలుపులుగా చూపెడుతుంది
అలల పై తేలుతున్న నా ముఖం నిండా రంగులు
తడి చూపుల నది దాహార్తిని తడుముతుంది
అ మాంతం నదిని మింగేసాక నాలో ఆకు పచ్చని చిగురులు నది చుట్టూ మొలకల నగవుల్లా ఆర్ద్రతా ఛాయలు
నదిని ముద్దాడే గాలిని పలకరిస్తే నేలను అమ్ముకుంటేనే లాభాల పంట అంటుంది కాదు నమ్ముకుంటేనే అంటాను నేను
అనుదిన ప్రవాహం పరివ్యాప్తమైన నీటి జాడలు నది చుట్టూ నేను.