నువ్వు బతికే ఉన్నావా

- పి.మోహన్‌

‘నీ వాళ్ళు బతికి ఉన్నారో, చచ్చిపోయారో తెలుసుకోలేనంత బిజీగా ఎందుకు మారిపోయావో చెప్పు. లేకుంటే నీ తల కోటి తలలుగా మారుతుంది’ - అపరిచిత భేతాళుడు.


నువ్వు బతికే ఉన్నావో
చచ్చే పోయావో
తెలుసుకోడానికి సమయం దొరకట్లేదు
అబద్ధమే చెబుతున్నానుకో
నీ గురించి
ఇందాకనే ప్రమాదవశాత్తూ
ఓ మిత్రుడిని ఫోన్లో అడిగా
ఆర్నెల్ల కిందట కడప దగ్గర
రైలు పట్టాలపై తలపగిలి
నీ పేరుగల వాడెవడో చచ్చిపోయినట్లు
పేపర్లో వచ్చిందన్నాడు,
ఫోటో కూడా వేశారన్నాడు
వయసూ వివరాలూ నీవేనన్నాడు
అయిన గుర్తు పట్టలేకపోయానన్నాడు
చచ్చింది నువ్వోకాదో
తెలుసుకోడానికి వాడికీ సమయం దొరకట్లేదట
మరి నా గురించి
నువ్వు కూడా ఇలాగే అనుకుంటున్నావట
నేను బతికే ఉన్నానో చచ్చేపోయానో
తెలుసుకోడానికి నీకూ సమయం దొరకట్లేదట
నగరం నడిబొడ్డున
సిటీ బస్సు చక్రాలకింద
నా పేరుగల వాడెవడో
రోజూ తలపగిలి చస్తున్నాడని
నీకెవరో చెప్పారట
చచ్చినవాడి వయసూ వివరాలు నావేనట
అయినా
నేను బతికే ఉన్నానో చచ్చేపోయానో
తెలుసుకోడానికి నీకూ నాలాగే సమయం దొరకట్లేదట

కవితలు

3 అభిప్రాయాలు

  1. Hrk ఆగస్టు 2008 1

    చాలా కాలం కిందట నగ్నముని ‘ఉదయించని ఉదయాలు’లో ఇలాంటి పద్యమొకటి చదివినప్పుడు కలిగిన విచలత్వం మళ్లీ కలిగించింది ఈ పద్యం. రెండింటికీ ఏమీ సంబంధం లేదు. అయితే నగ్నముని పద్యం లోని వేదన కూడా దుర్భర పరాయీకరణం కల్పించినదే గాని, సందర్భం, యాటిట్యూడ్ వేరు.
    మనుషులు ఒకరికొకరు కాకుండా పోవదంలోని ఆవేదనను చాల నిగ్రహం పాటిస్తూ, ఎక్కడా ఫీలింగ్ చెడిపోకుండా చెప్పగలిగారుపి. మోహన్. నేను, నువ్వు, తాను… అని కాదు, అందరం ‘ఒకరు’ చచ్చారో బతికారో పట్టించుకోనంతగా మన (మనందరి) బతుకులు తయారయ్యాయి.
    ఒక అబ్జర్వేషన్ ని మితృలతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రాణహిత మే నెల సంచికలో ఘంటసాల నిర్మల, ఈ సంచికలో విమల, పి. మోహన్… ముగ్గురూ వేర్వేరు సందర్భాల్ని ఆసరా చేసుకుని ఒకే బాధను చెప్పారు. మూడింటిలో ఉన్నది తీవ్ర నిరాశే, క్రియాశీల నిరాశే. ఇట్టాగే ఉంటె ఇంకేమీ ఉండదు, ఇకనైనా మేల్కొందాం అనే (అన్యాపదేశమే అయినా) చాల బలమయిన హెచ్చరిక. .మనందరం కలిసి ఏదో హృద్యమైన పరిష్కారం దిశగా వేదన పదుతున్నామా? ఔననుకుంటాను…. హెచ్చార్కె

  2. GURRAM SEETARAMULU ఆగస్టు 2008 2

    నిరాశా కాకుటే ఏం ఉంటాది ?
    ఎవరికి వారె యమునా తీరె !
    కొందరు POST MODRANISTU LU అయారు ,
    మరి కొందరు NGO LU న డూపుతున్నారు,
    కొందరు కవిత కూడూ పెట్టూ ద్దా అంటూన్నరు,
    తుపాకులు వదిలి నటుల పంచ న చెరారు ,
    ఇన్కొందరు CHIRUIST LU AYYARU ,
    ఇన్కొందరు అన్ని ISAA L AKU KAALA DOSAM PATIINDANNARU
    ANTAA ABBADDAM……??????????????????????????

  3. Hrk ఆగస్టు 2008 3

    వాదం, వివాదం కాకుండా సంవాదం సాధ్యం కాదంటావా మిత్రమా?!
    నిరాశ తప్ప మరేమీ లేదనుకున్నప్పుడు; అంతా అబద్ధమే అనుకున్నప్పుడు ఇక ‘సంవాదా’నికి అవకాశం ఉండదు.
    ఆశ వుంది, నిరాశ వుంది అనుకున్నప్పుడే; అబద్ధం వుంది నిజం వుంది అనుకున్నఫ్ఫుడే సంవాదం ఉంటుంది. (అనుకోడం అంటే లేనిదాన్ని ఊహించుకోడం కాదు. వాస్తవికతను స్వీకరించడం).
    సంవాదం లేకుంటే డెమోక్రసీ ఎలా ఉంటుందో నేను ఊహించలేను.
    సంవాదం ఏమేరకు లేదో ఆ మేరకు; కార్మికవర్గం సైన్ బోర్డు కింద కూడా వట్టి నిరంకుశత్వమే ఉంటుంది.
    నేను ఇష్టపడిన ఆ మూడు కవితల్లో వాదం, వివాదపడడం దాదాపు లేవు. సంవాదానికి (చర్చకు) అవకాశం ఉంచే వైఖరి వాటిలో నిండుగా ఉంది. కవితాత్మకంగా వుంది. అందుకలోవాటిని ఇష్ట పడ్డాను.
    పోస్ట్ మోడర్న్ ఐడియాస్ ను ఇష్టపడడం, చిరు ఇస్టులయిపోవడం… అన్నీ… ఒకటే అన్నట్లు అక్యూజ్ చేయడం వల్ల… అసలు అలాంటి వైఖరి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఆలోచించండి.
    … హెచ్చార్కె

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో