ఓ నా పియ్రమైన శతువ్రా!

- షేక్‌ కరీముల్లా

అతనెవరో నాకు తెలీదు కానీ అంచెలంచెలుగా విస్తరిస్తున్న అతని రహస్యం తెల్సు అతను పడగ విప్పిన నిఘా నీడని తెల్సు అతని పేరు రాజ్యం అనీ తెల్సు
నేనో నల్లకాకినై మేడి పండ్లను తొలిచి పురుగుల్ని వర్గీ కరిస్తుంటానా జారి పడ్తున్న మేలిమి ముత్యాల్లాంటి నా గుప్పెడు అక్షరాల్ని అతను కసిగా ఏరుకోవటమూ తెల్సు
అక్షరం సూర్య కిరణమై చీకట్ల మూల మూలల్లోకి ప్రసరించటం బహుశా… అతనికి నచ్చలేదనుకుంటా! అఫ్‌కోర్స్‌…. నేను కవిత్వం రాయకుండా మానలేను
గుండెలపై కత్తుల వల విసిరాక తడి మనసు మెలి తిరిగాక కాలం బాధ కవి బాధే కదా! అయినా… నేను కాక మాసిన కుర్తా వెనుక నెర్రెలిచ్చిన
నేలతల్లి కథ ఎవరు చెప్పాలి? మొహల్లాల చుట్టూ జైలు గోడలు కడ్తున్న కుతంత్రాల చిట్టా ఎవరు విప్పాలి? కడివెడు చైతన్యం చినుకై రాలాలంటే
మనం నడి ఆకాశంలో నలుపెక్కిన మేఘమై నిలబడాల్సిందే కదా! చరిత్ర ఆనవాళ్ళను దహనం చేసిన శవసంస్కారుల కుట్రలపై నీరై పారాలంటే మనం నదిలా నర్మగర్భంగానైనా నడవాల్సిందే కదా! ఓ నా ప్రియమైన శత్రువా! నన్ను మన్నించు
నేను కవిత్వం రాస్తూనే వుంటాను కెన్‌సారో వివాలా
అక్షరమై రగులుతూనే వుంటాను ఆకు పచ్చవనంలో రగిలిన కార్చిచ్చు చల్లారేంత వరకూ

అభిప్రాయాలు లేవు »కవితలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో