సాహిత్య కళారంగాలు అంతరించిపోనున్నాయా!

- డాక్టర్‌ దేవరాజు మహారాజు

ఒక జాతి రైలుబండి అయితే, భాష దానికి ఇంజన్‌ లాంటిది. ఇంజన్‌ వెంట బోగీలన్నీ వెళ్ళిపోయినట్లుగా భాష వెనకే సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, దృక్పథాలు, పరిశోధనలు అన్నీ వెళతాయి. వీటన్నిటినీ కాపాడుకోవాలన్న ఒక ధ్యాస, ఒక స్ఫూర్తి, ఒక పట్టుదల, ఒక చైతన్యం పట్టాలవంటివి. పట్టాలు బలహీనపడితే, రైలు కూలిపోతుంది. పట్టాల స్థిరత్వం మీదనే రైలు వేగం ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ సరిగా ఉన్నారైలు నడవడానికి మరొకటి కావాలి. అది ఇంధనం! ఆచరణే ఇంధనం!! అంతా సజావుగా నడుస్తున్నా తిరోగమన వాదం, పరాయీకరణ పంటి ఇబ్బందులు ప్రయాణంలో అడ్డుపడుతుంటాయి. వాటిని పునరుద్ధరించు కుంటూ (సర్వీసింగు చేసుకుంటూ) ముందుకు పోవాలి. పునరుద్ధరణ కార్యక్రమం ఎప్పటికప్పుడు జరగకపోతే జాతి వేగం తగ్గుతుంది. పరిగెత్తడం మాని కుంటినడకలు నడుస్తుంది. చివరకు ఆగిపోయితప్పుపట్టి శిథిలమవుతుంది. నేడు 57వ గణతంత్ర వేడుకలుజరుపుకుంటున్న మన జాతి అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది. ప్రపంచీకరణ, పాశ్చాత్య వ్యామోహం, ఆర్థికాంశాల వంటివి జాతి మూలాల్ని దెబ్బతీస్తున్నాయి. ముప్పయ్యేళ్ళ క్రితం వరకు పరిస్థితి వేరుగా ఉండేది. ముఖ్యంగా పిల్లల పరిస్థితి! ఐదారేళ్ళు వచ్చేవరకు వారు కుటుంబ వాతావరణంలో ఉండేవారు. ఇంటి భాష అలవడేది. కుటుంబ సభ్యుల ముద్దూ ముచ్చట, గారాభాలు, మురిపాలు, ప్రేమ, లాలిత్యం వారికి అందివి. తాతయ్య, అమ్మమ్మ, అత్తయ్య, మామయ్యల వంటి పిలుపుల్లోని మాధుర్యం వారికి తెలిసేది. బంధాలు, అనుబంధాల విలువ మొదలుకొని మానవ సంబంధాల విలువ వరకు క్రమక్రమంగా అర్థమయ్యేది. అటు ఇంట్లోను, ఇటు సమాజంలోనూ వారికి ఒక కళాత్మకమైన వాతావరణం లభించేది.

ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా తయారైంది. మమ్మీడాడీ సంస్కృతి వచ్చిన తర్వాత, ఇద్దరూ ఉద్యోగాల కోసం పరుగులు తీస్తున్న తర్వాత, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై, న్యూక్లియర్‌ కుటుంబ వ్యవస్థ అపార్టుమెంటులోకి మారిపోయిన తర్వాత, నూతన ధనస్వామ్యం గ్రామాల్ని ఛిద్రంచేసి పట్టణ సంస్కృతిని బలోపేతం చేస్తున్న తర్వాత, గతంలో విలసిల్లిన విలువలు ఎలా నిలబడతాయి? భాషని భ్రష్టుపట్టించి, విలువల్ని కూల్చివేస్తున్న తరుణంలో ఇంకా సాహిత్య కళారంగాలు పరిఢవిల్లుతాయని ఆశించడం బుద్ధితక్కువ కాదా? జానపద కళలు మరుగున పడుతున్నాయి. సంప్రదాయ కళలు చాదస్తంగా చూపబడుతున్నాయి. నాటకరంగం మీద తెరపడింది. సాహిత్యం బలహీనపడి హీన స్వరంతో ఆక్రోశిస్తోంది! కారణం? వాటి విలువ తెలుసుకుని నిలబెట్టగలిగే యువతరం లేకుండా పోయింది గనుక! మన ఇంటిని మనం పరాయివాడి ఇంటిలా మార్చుకున్నాక… మన పిల్లలు మన ఇంటి పాట ఎలా పాడుతారు? కృత్రిమ కార్పొరేట్‌ వ్యవస్థకు బలైన మన పిల్లలకు ప్రతిదీ ఇంగ్లీషులో అనువదించి చెప్పాల్సి వస్తోంది. భాష మారడంతో పాటు వేషం కూడా మారింది. గృహిణులు సైతం మాక్సీలు, జీన్‌పాంట్సూ వేసుకుతిరగడంతో కట్టూ బొట్టూ, చీర పరికిణి క్రమంగా మాయమవుతున్నాయి. మర్యాద మన్ననలో తేడా వచ్చింది. మానవ సంబంధాలలో తేడా వచ్చింది. సమకాలీన జీవితాన్ని బలీయంగా ప్రభావితం చేసే మన భారతీయ టెలివిజన్‌ ఛానళ్ళను గమనించండి. అందులో భారతీయత ఉందా? తెలుగు ఛానళ్ళలో తెలుగుతనం ఉందా? వాయ్పలిరాత్మక సినీ సందేశాలిస్తూ, తమను తాము ప్రమోట్‌ చేసుకుంటున్నాయే తప్ప, సామాన్యుడి గూర్చి ఆలోచింపజేసే ఛానల్‌ ఏదైనా ఉందా? గ్రామీణ సమస్యల మీద ఒక్కటంటే ఒక్క సీరియల్‌ ఉందా? సాహిత్య కళా రంగాలకు సంబంధించిన అంశాలు వార్తల్లో అలా చెప్పుకుపోవడం తప్ప, వాటిపై ఆధారపడే కార్యక్రమాలు ఉన్నాయా? విదేశీ ఛానల్స్‌లోని ఏంకర్లకు, మన దేశీయ యాంకర్లకు వేషంలో తేడా వుందా? వీళ్ళు మన కట్టూబొట్టు ఎందుకు వదిలేస్తున్నట్టు? ఇక వారు మూడు భాషల్ని కలిపి పచ్చడి చేస్తున్న వైనం గూర్చి మాట్లాడకపోవడమే మంచిది. అది అందరికీ తెలుసు.

తెలుగు ప్రజల్లో తెలుగుతనాన్ని హరింపజేసేందుకు తెలుగు టెలివిజన్‌ ఛానళ్ళు శాయశక్తులా కృషిచేస్తున్నా యనడంలో సందేహంలేదు. తెలుగుతనాన్ని నిలుపుకోవాలని ఇంట్లో తల్లిదండ్రులకు లేదు. బళ్ళో ఉపాధ్యాయులకు లేదు. ఆఫీసుల్లో ఉద్యోగులకు లేదు. విధి విధానాలు రూపొందించే ఉన్నతాధఇకారులకు, మంత్రులకు లేదు. తెలుగు ఔన్నత్యాన్ని చాటిచెబుతూ, తెలుగువాణ్ణి తట్టిలేపే బాధ్యత ఏ టెలివిజన్‌ ఛానలూ చేపట్టలేదు. ఇక భావి (భారత) తెలుగు పౌరుల్లో సాహిత్యాభిలాష కళాభినివేశం ఎలా సాధ్యమవుతుంది? విజ్ఞులు ఆలోచించాల్సి ఉంది. ఒకవైపు తెలుగు తనమే దెబ్బతింటున్నప్పుడు అందులోంచి పుట్టుకురావల్సిన తెలుగు సాహిత్యం, తెలుగు కళ గూర్చి ఎవరు ఆలోచిస్తున్నారు? ఇలాంటి పరిస్థితుల్లో అవి అంతరించిపోకుండా ఇంకా మనగలుగుతాయా? పరాయి దేశాలలో ఉండే తెలుగువాళ్ళలో మార్పులు రావడంలో కొంత అర్థం ఉంది. కాని స్వరాష్ట్రంలోనే తెలుగు సమాజం మారిపోతే తెలుగు సాహిత్య కళారంగాలలో మార్పులు వచ్చి, క్రమక్రమంగా బలహీనపడి, అంతరించిపోకుండా ఎలా ఉంటాయి? ఆర్థిక సంబంధాలు బలపడుతూ ప్రతిదీ వ్యాపారమైపోతున్న దశలో సాహిత్య కళారంగాలకు విలువెక్కడ? అవి వ్యాపారమై పోతేనే కదా వాటికి విలువ? ఒక్కసారి విద్యా సంస్థల గూర్చి ఆలోచించండి. జూనియర్‌ కళాశాలలన్నీ ఎంసెట్‌, ఐసెట్‌ కోచింగు సెంటర్లయ్యాయి. అక్కడ కళలకు స్థానమే లేదు. డిగ్రీ స్థాయి కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, రాజకీయాలకు, పోరాటాలకు, నిలయాలయ్యాయి. పొరపాటున ఏదైనా సాంస్కృతిక కార్యక్రమం జరిగినా అది సినిమా ప్రభావంతో రికార్డు డాన్స్‌లకు, మిమిక్రీలకు పరిమితమైపోతుంది. మన విద్యార్థులు గురజాడ, బాపిరాజు, దాశరథి, మొక్కపాటి, కృష్ణశాస్త్రి, కొడవటిగంటి వంటి పేర్లు ఎప్పుడైనా విన్నారా? వాళ్ళకు ఆ అవకాశమే లేదు. అందువల్ల రాబోయే కాలంలో తెలుగు సాహిత్య ప్రియులు ఉండే అవకాశాలు తక్కువ. ధనస్వామ్యంలో ముంచితీసిన టెలివిజన్‌ సీరియళ్ళు, సెక్స్‌, క్రైమ్‌లతో కుళ్ళు జోకులతో, ఆడ విలన్లతో వెలిగిపోతున్నాయి. సృజనాత్మకతని సమాధిచేసే అలాంటి ఛానల్ళకు, సినిమాలకూ బానిసలౌతున్న యువతరం, తెలుగుతనాన్ని ఏం నిలబెట్టుకుంటుంది? భాషాసంస్కృతులపై శ్రద్ధ కనబరచకపోతే, తెలుగువాడు మరెవడిలాగానో మనగలగాల్సివస్తుంది - జాగ్రత్త! పత్రికలు - కెరీర్‌ డెవలప్‌మెంట్‌ (వ్యక్తిగత వికాసం), బ్యూటీటిప్స్‌, ఫ్యాషన్‌ డిజైనింగు, సినిమా కబుర్లు, రాజకీయ వివాదాల చుట్టూపాఠకుల్ని తిప్పుతున్నాయి. సాహిత్య కళారంగాలకు మొక్కుబడిగా కొంత స్థలం కేటాయిస్తున్నాయి.

తెలుగు జాతి రైలు ప్రయాణం ఎంత వేగంగా, ఎంక వరకు కొనసాగనుందో చెప్పలేని. అటు డ్రైవర్‌ను, ఇటు గార్డును తమ ఆధీనంలో ఉంచుకుని, తమ గమ్యమేదో నిర్ణయించుకోవాల్సింది ప్రయాణీకులైన తెలుగు ప్రజలే!

సాహిత్య వ్యాసాలు

3 అభిప్రాయాలు

  1. prof.chandra shekar reddy జులై 2008 1

    ఈ వ్యాసము చాలా బాగుంది.ఆలొచిన్ప చెస్తుంది.అరుదైన రచన

  2. K.Rohiniprasad జులై 2008 2

    కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కనకనూ, బలమైన పెట్టుబడిదారీశక్తులు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి కనకనూ సామాజిక సంబంధాలూ, సాంస్కృతిక వాతావరణమూ మారిపోతూ ఉంటాయి. ఇటువంటి కాలుష్యం గురించి మథనపడేవారున్నంతవరకూ పరిస్థితి పూర్తిగా చెయ్యిదాటిపోదేమో.

    ఆధునిక మాధ్యమాలను కొత్త పద్ధతుల్లో వాడుకునే సదుపాయాలు వస్తున్నాయి. ఇంటర్నెట్ వచ్చాక తెలుగు పత్రికలు నడపడం, వాటికి రచనలు పంపడం సులువయింది. వ్యాపారధోరణి లేని ‘ప్యూర్’ సాహిత్యానికి మళ్ళీ అవకాశం లభిస్తోంది. అలాగే ఇంకొన్నాళ్ళకు ఔత్సాహికులు ఉత్తమ అభిరుచితో నడపగలిగిన ఇంటర్నెట్ వీడియోలు వచ్చితీరుతాయి. పనికిమాలిన చెత్త సోకకుండా కొంతవరకూ మంచి అభిరుచిని కాపాడుకోవడం, పెంపొందించడం వీలవుతుంది. టెక్నికల్ నైపుణ్యం కలిగిన సాహిత్యాభిలాషులు ఇందుకు తోడ్పడగలుగుతారు.

  3. Pasunoori Ravinder జులై 2008 3

    దేవరాజు గారి బాధ రాజమందిరం నుండి రాజ్యాన్ని చూసిన రాజుగారి బాధ లాగే ఉంది.
    అంటే మా ఉద్దేశ్యం…ప్రస్తుత సమాజాన్ని దేవరాజు గారు పైపైనే పరిశీలించారు. కేవలం ఉపరితలాన్ని మాత్రమే చూసి దుఃఖిస్తున్నారు. అయితే ఈ విషయంలో లోతేమిటంటే……ప్రపంచీకరణ దుష్ప్రభావాలు తెలుగు నేలను తాకి దశాబ్దంన్నర కాలమైంది. ప్రపంచీకరణ వల్ల పారిశ్రామిక, విద్య, వైద్యం,వ్యవసాయిక రంగాలతొ పాటు సాహిత్య, సాంస్క్రుతిక రంగాలు పూర్తిగా నీరుగారి పోయాయి. ఈ దుస్థితికి యావత్ సాహిత్యలోకం స్పందించబట్టి పదిహేను సంవత్సరాలైంది.
    ఈ నేపథ్యంలో మనలో చాలా మంది కవులు,రచయితలు కొద్దిమంది విమర్శకులకు కూడ కొన్ని ఫ్యాషన్స్ అలవాటైనాయి. అవి ఏమిటంటే….1.ప్రస్తుత రాజకీయ,ఆర్థిక,సామాజిక,చారిత్రిక పరిస్థితులను గూర్చిన అవగాహన, అధ్యనం లేకుండానే లోకం మారిపోతుందని తాను గాబర పడడమే కాక, తన పక్కనున్న వారిని ఆందోళనకు గురిచెయ్యడం.2.టీ.వి. సినిమాలు పూర్తిగా మారిపోయాయని పొద్దస్తమానం తిడుతూ లెక్చర్లు దంచడం.3.సంస్క్రుతి, సంప్రదాయాల పట్ల తనకొక్కడికే గౌరవం ఉన్నట్లు, మిగితావాళ్ళంత మారిపోయినట్లు ప్రతీ సభలోను వాపోవడం.4.తెలుగు బాష, తెలుగు ఊరు మారిపోయాయని ఒకటే బాధ పడుతూ పాతచింతకాయ పచ్చల్లను కీర్తిస్తూ కాలమెల్లదీయడం వంటి ఫ్యాషన్లు ఎక్కువైపోయాయి.
    వ్యాసంలో రచయిత ఒకచోట డిగ్రీ కళాశాలలన్ని ఉద్యమాలకు, పోరాటాలకు నిలయాలుగా మారాయని ఆవేదన చెందారు. అయితే అందుకు గల పరిస్థితుల గురించి కూడ పరిశీలిస్తె ఆ పోరాటల వెనుకున్న ఆరాటల్ని అర్థం చేసుకునేందుకు వీలుండేది.
    ఇంకొక ప్రమాదం ఈ వ్యాసం ద్వారా చాపక్రింద నీరులా విస్తరించే అవకాశం ఉంది. అదేమిటంటే కళలు సాహిత్యం కనుమరుగవుతున్నాయని రచయిత దిగులు చెందారు. కానీ వాస్తవం ఏమిటంటె…..నిజానికి సాహిత్యం కొత్త పుంతలు తొక్కుతున్నది. గతంలో సాహిత్య సృజన విశ్రాంత వర్గాలది. కాని అస్తిత్వోద్యమాల కాలమిది. ప్రతి కులం, ప్రతీ సెక్షన్ తమ జీవితాన్ని కథ రూపంలోనో, కవిత రూపంలోనో వ్యక్త పరుస్తున్నది. దాని ఫలితమే బస్తాలు మోసె కూలీ, ఆటో డ్రైవర్, దినసరి వేతన లేబర్ పుస్తకాల్ని వెలువరించగల్గుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ప్రతివారం ఏదో ఒక మూల ఏదో ఒక సంపుటి ఆవిష్కరించ బడుతున్నది. అయినా ఈ విషయం మన సాహిత్యకారులకు ఎంతకూ కనిపించదు.
    అయితే ఈ నా అభిప్రాయంలో చెప్పొచ్చేదేమిటంటే……దేవరాజుగారు ప్రస్తావించిన పరిణామాలన్ని ఔట్ డేటెడ్. ఇప్పటికే అనేకమంది విమర్శకులు, విశ్లేషకులు ఏకరువు పెట్టిన విషయాల్నే మళ్ళీ ప్రస్తావించారు. అలా కాకుండా ప్రజలు, పరిస్థితులు మారడంలో ప్రభుత్వాల పాత్ర ఎంత వరకు ఉంటుంది, ఉంది అనే కోణం నుండి ప్రస్తుతాన్ని విశ్లేషిస్తే మరింత అవగాహనని పాఠకులకు అందించిన వాళ్ళవుతారు.

    ప్రస్తుత ప్రయత్నానికి అభినందనలు. ప్రాణహితకు ధన్యవాదాలు.
    మీ
    పసునూరి రవీందర్

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Impotence Drugs and treatment It`s no secret that like to take Viagra? buy viagra here.
Family pharmacy there are many different ways to store your cheap generic viagra
New reviews of the cheap did you know that gel tab viagra so what exactly is a buy viagra cheap