సాహిత్య సహజీవనం

- జి.వెంకటకృష్ణ

ఒక మహా వాక్య సమూహంలో
అక్షర అలలపై తేలుతూ
నయనాన్ని పడవ చేసుకొని ప్రయాణం.
పదం పదం చెమ్మనింపుకొన్న


ఆర్ద్రతా కణముల నదముల సంగమం.
జీవన నదులు సంగమించే మహాప్రాంగణంలో
కాలం కాంతిమయం.
ప్రతి వాక్యం నెరిపే సత్వాన్వేషణ
ప్రతి కంటికీ ఒక సాక్షాత్కరణ.

నడచివెల్తున్న వాక్యతీరం వెనిబడి
నిను వెన్నంటిన జాడలు
సుఖజీవన ఆకాంక్షల
ఆశలశ్వాసలు.
కురుల మెత్తదనం సోకిన
చివుళ్ళ వేళ్ళ కొసన
చిరువెలుగుల చెరగు
చేలాంచల తాకిళ్ళు.

ఆ సాహిత్య సాగర తీరపు
యిసుక తిన్నెల మీద
కలసి కూచున్న జంటల వూసులు వినటం
ఒక ప్రణయం
వారి మనో ఎదపొదలలో
ఒక్కో జ్ఞాపకమై రూపు కట్టిన
ఒక్కో అనుభవమై విప్పారిన
రేకును తాకటం
మనోజ్ఞదృశ్యం
పరిమళాలు అద్దిన వులిపిరి కాగితంపై
వాళ్ళ హృదయాల్ని చిత్రించిన
కుంచెలమై మనం - పఠితులం.
రెండు జంటల పాదాలను
కలిపి నడిపించిన వాక్య ప్రస్థానం
ఒక సాహిత్య సహజీవనం.
హృదయ సముద్రాన్ని
వొడపుగా వొదిగించుకున్న
ఒక వాక్యసమూహంలో
తలమునకలవడం
ఒక సాహిత్య సంగమం.


కవితలు

ఒక అభిప్రాయం

  1. suresh Aug 2008 1

    this is great,

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో