Jul2008
వీరవేణి
- ఎ.ప్రభు
రాస్తూ ఉన్న బోర్డుని ఆపి తల పైకెత్తకుండానే “ఒరేయ్ సత్తిగా ఆ పిల్ల చూసావా… యిందాకట్నుంచీ నియ్యేపే చూస్తోంది” అని లోగొంతుతో అంటూ నవ్వాడు మూర్తి.
రేకు మీద నీలం రంగు పెయింట్ వేస్తున్న సత్తిబాబు తల తిప్పి ఎదురుగా ఉన్నగుడిసె వేపు చూసాడు. ఆ ప్లిల యిటే చూస్తున్నది కాస్తా చటుక్కున తల తిప్పేసు కుంది. సత్తిబాబు మూర్తి భుజమ్మీద చేతిలో ఉన్న బ్రష్‌తో పొడుస్తూ “యెటకారం మాటలాడకెహే…” అన్నాడు.
“యెటకారం కాదురా… నేను చాలా రోజుల్నుంచీ చూస్తున్నా… ఆ పిల్ల నీ మీద కన్నేసింది. నువు గానీ కొంచెం ముందు కెళ్లావో…” వెలుగు లాంటి నవ్వు నవ్వుతూ “ఛాన్స్…” అని కన్నుకొట్టాడు. చిత్రమైన వంకర నవ్వు విసిరాడు.సత్తిబాబు పెదాలు సిగ్గుగా సాగదీసి రంగేస్తూ “చాల్లే గానీ… ఆ కోడికి దీర్ఘం ఉండాలి. కొడి పలావు కాదు కో…డి పలావు” అన్నాడు.
“ఎప్పుడో చదివిన చదువు ఎట్టా గుర్తుంటది లే గానీ… నేను చిలుగ్గురించి చెప్తుంటే నువు కోడంటావేంటి బాసూ…” అని బీడి తీసి వెలిగించాడు.
“కోళ్లమ్ముకునే నా కొళ్లకి చిలకల గొడవేట్రా” అన్నాడు సత్తిబాబు.
మూర్తి అలా సత్తిబాబు వంక చూస్తూ “నువు మరీ కన్నె కుర్రోడివిలే చిలకల్రుచి మరిగితే గానీ తెల్దు” అన్నాడు.
“యింకా గొడవొదిలై… లేదంటే నేను పోతాను”
పకపకా నవ్వాడు మూర్తి. ‘సర్సరే’ అంటూ బోర్డు రాయడంలో పడ్డాడు.
సత్తిబాబు తలొంచుకునే ఓరగా గుడిసె వేపు చూసాడు. ఆ పిల్ల ఎవరికో టీ యిస్తోంది. మాసి పోయిన కనకాంబరం రంగు జాకిట్టు అంతకన్నా మాసిన పచ్చరంగు పరికిణీతో ఆ పిల్ల చీకట్లో కలిసి పోయినట్టుంది. చూరు నుంచి వేళాడుతున్న లాంతరు వెలుగు ఆమె ముఖం మీద పడి నున్నగా మెరుస్తోంది. మళ్లీ టీ కెటిల్‌ని పట్టుకుంటూ ఆమె యిటువేపు చూసింది. చూసి చిన్నగా నవ్వినట్టనిపిస్తుండగా తల తిప్పుకున్నాడు. సత్తిబాబు.
ఇలాయి బుడ్డీని దగ్గరగా పెట్టి “చూడు బానే ఉంది కదా” అన్నాడు మూర్తి. కోడి పలావు అమ్మబడును అని బోర్డు. నీలం రంగుమీద తెల్ల అక్షరాలు వంకర టింకరగా ఉన్నాయి. కో కి దీర్ఘం మరీ పొడుగ్గా ఉండి అదే ఒక కోడిలా ఉంది. ‘పర్లేదు’ అంటూ తన బోర్డుని చూపించాడు. కోడి పకోడి అమ్మబడును. అదీ అలాగే ఉంది. అయినా పర్లేదు. కావల్సింది పలావు – పకోడీయే గానీ ఈ అక్షరాలు కాదు.
యింటి నించి పారిపోయి వచ్చి చాలా కాలమైంది సత్తిబాబుకి. విజయవాడ నించి సాయంత్రం లైలేదో ఎక్కి రాజమండ్రిలో దిగిపోయాడు. హోటళ్లలో కప్పులు కడిగీ పలావు బళ్ల దగ్గర పొట్లాలు కట్టీ నాలుగేళ్లు గడిపేసాడు. పదహారేళ్లనించి ఇరవై ఏళ్లకి పెరిగాడు. అలా కలిసాడు మూర్తి. ఆ డబ్బులూ యీ డబ్బులూ పోగేసి పలావు బండేద్దాం అన్నాడు. బిజినెస్ సెట్ అయింది. గోదావరి గట్టున పాకోటి అద్దెకి తీసుకున్నారు. పెద్ద గిన్నెలు రెండు కొన్ని ప్లేట్లూ గరిటెలు అన్నీ కొని వొంట మొదలు పెట్టారు. పలావు వొండేసి పకోడి సామాన్లు పెట్టుకొని బండిమీద వేసుకుని శ్యామలా టాకీసు సెంటర్లో అమ్మడం – సెకండ్ షో వదిలే వరకూ అమ్ముకొని మిగిలితే పలావూ – లేకపోతే హోటల్లో భోజనం చేస్సి పాక్కొచ్చి పడుకోవడం. యిదే మూణ్నెళ్లుగా చేస్తున్నారు.
యిక్కడి కొచ్చిన మొదట్లో గమనించలేదు. తరువాత్తరువాత తెలిసింది – ఎదురుగా ఉన్న గుడిసెల్లో అమ్మాయిల బిజినెస్ ఉందని. అందులో మూడు పోర్షన్లు ఉన్నాయి. ఒక దాన్లో చిన్న హోటల్ నడుస్తోంది. భర్త లేని ఆడదాయి ప్రొద్దుటి పూట ఇడ్లీలు అట్లు అమ్ముతుంది. సాయంకాలం దాకా టీ కూడా ఉంటుంది. పక్కనున్న రెండు గదుల్లోనూ ఎవరెవరో ఆడోళ్లు… పగలు ఎవరూ లేనట్టే ఉంటుంది. బాగా పొద్దోయాకా యికయికలు… పకపకలూ… ఈ హోటలావిడ దీనికి వోనరు. గదులు అద్దెకిస్తుంది. ఆమె కూడా అప్పుడప్పుడు బిజినెస్ లోకి దిగుతుంది. ఆమె కూతురు ఈ పిల్ల. చిన్న పిల్లలా కనపడాలని పరికిణీ జాకిట్లే వేస్తుంది.
ఆ పిల్ల తన్ని తదేకంగా చూట్టం రెండు నెల్లుగా తెలుస్తూనే ఉంది సత్తిబాబుకి. ఆ యిల్లూ… ఆ వాతావరణం చూస్తే మొదట్లో అసహ్యంగా ఉండేది. క్రమంగా అదిపోయి అలవాటై పోయింది. నల్లగా ఉండే ఈ పిల్ల వోర చూపులు మొదట్లో కంపరమని పించింనా మెల్లిగా సరదా పుట్టింది. తనూ అప్పుడప్పుడు చూడ్డం మొదలు పెట్టాడు. ఉండుండి చిన్నగా నవ్వేవాడు. ఆ పిల్ల మురిసిపోతూ ఉండేది. క్రమంగా పిల్ల బాగుంటుందని అనిపించింది. అదే పనిగా చూస్తుండడంతో తెలిసింది ఆమె కనపడేంత చిన్నది కాదు. వదులుగా ఉన్న జాకిట్ వల్ల తెలీడం లేదు గానీ ఎత్తయిన గుండె. ముఖం నల్లగా ఉఊన్నా అదో రకమైన ఎర్రటి పెదాలు. ఇడ్లీలు యిస్తూనో… టీ వొంపుతూనో ఆమె బాణం లాంటి చూపొకటికి విసిరేది. ఆ మెడ తిప్పే తీరూ… కనుబొమలు ఎగరేడం… పెదాలు పలకరిస్తున్నట్టు విడివడ్డం… తెల్లటి పళ్లూ… ఈ మూగ భాషంతా సత్తిబాబుకి కంఠతా వచ్చేసింది. ఈ సయ్యాట పగలంతా సర్దాగా వీండేది. కానీ రాత్రి తాము వచ్చే వేళకి ప్రక్కని రెండు గదుల్లోనూ నవ్వులు… సందుమొదట్లో తచ్చాడుతూ తాగుబోతులూ… ఏమో! ఈ పిల్ల…. ఎవరికి తెలుసు?
పక్కన మూర్తి బుసలు కొడుతూ నిర్ద పోతున్నాడు. అలా బోర్లా పడుకుని ఎదురించి వేపే చూస్తున్నాడు సత్తిబాబు. అంతా నిశ్శబ్దంగా ఉంది. టెన్స్ పాసవలేదని నాన్న బెల్టుతో బాది బాది బయిటగ్గెంటేసి తలుపులు వేసేయడం గుర్తొచ్చింది.
ఎందుకుండాలి యింట్లో…
ఎప్పుడూ నవ్వని నాన్న… ఎప్పుడూ ఏడుస్తూనే ఉండే అమ్మ… నాన్న లేని సమయాన్ని పసి గట్టి యింటి కొచ్చే అన్నయ్య… యివేవీ అర్థం కాని చెల్లి…
ఎందుకుండాలి యింట్లో…
సింహంతో పాటు గుహలో గడపడం…
బతక లేమా… బతక లేమా…
బతుకుతున్నాం… హాయిగా… మన్నిక్కడ అడిగే వాడు లేడు. కష్టపడుతున్నాం… పైసలు సంపాదిస్తున్నాం… తింటున్నాం… హోటల్ పెడతాం… పెద్ద బిజినెస్ చేస్తాం…
* * *
పొద్దుట లేచేసరికి మూర్తి ఎదుటి పాకలో బయట ఉన్న బల్లమీద కూర్చొని ఉన్నాడు. ఆ పిల్ల అతనితో ఏదో అంటూ నవ్వుతోంది. వాళ్లమ్మ పొయ్యి దగ్గర కూర్చొని అట్లు పోస్తోంది. మూర్తి మాటలు వినిపిస్తున్నాయి.
“అదిరిపోయే లానిటి కలుపట్టెయ్యమ్మా… దాని మీద ఒక గుడ్డు కొట్టి వేసేయ్… అల్లం మిర్చి జీలకర్ర బాగా తగిలించు… ఆయిలెక్కువేసి మాంచి రోస్టుగా కాల్చాలి…”
ఆ పిల్ల మూర్తితో ఏదో అంది. మూర్తి తల తిప్పి యిటు చూసి సత్తిబాబు లేవడం చూస్తూ… “సత్తిబాబూ… నీక్కూడా వేయించైనా” అన్నాడు బిగ్గరగా.
సత్తిబాబు అరుగు చివరికొచ్చి “నేనింకా గోదారి కెళ్లాల్రా వొచ్చాకా తింటాలే” అన్నాడు.
మూర్తి తలూపుతూ రెండు గ్లాసుల్లో టీ పోయించుకొని వచ్చాడు. యిద్దరూ గదిలో కూర్చున్నాకా టీ గ్లాసు సత్తిబాబు కిచ్చి
“ఆ పిల్ల పేరు వీరవేణి” అన్నాడు.
సత్తిబాబు టీని రెండు గుక్కలు తాగి అతని వంక చూస్తూ “నీకేట్రా బాబు అంత ఇంట్రెస్టు?” అన్నాడు.
మూర్తి తల అడ్డంగా వూపుతూ “అబ్బే… వూరికే… చెప్తున్నానంతే” అన్నాడు. ముఖంలో నవ్వు మాత్రం చెరగ లేదు.
యింతలో వీరవేణి ప్లేటు పట్టుకొచ్చింది. దాంట్లో వేడిగా కలుపట్టు. వాసనతోనే ఆకలి చిందులేస్తోంది. ఆమె గుమ్మంలో నిలబడి “అట్టిదుగో అన్నా” అంది.
మూర్తి ఆమెని చూసి “అప్పుడే అయిపోయిందా” అంటూ లేచి “దామ్మా…పర్లేదు” అన్నాడు.
ఆమె ప్లేటు నక్కడ పెట్టేసి ఏమీ అనకుండా ఒక్క గెంతులో అరుగుమీంచి దూకి వెళ్లి పోయింది.
పకపకా సవ్వుతూ మూర్తి సత్తిబాబు వంక చూసాడు.
సత్తిబాబు లేచి, “ఒరేయ్… నువ్వేదో నాటకమాడుతున్నావ్ రా…” అంటూ కలబడ్డాడు.
మూర్తి యింకా నవ్వుతూ… “అహలాంటి దేహేమీ లెహేదురా బాబూ” అంటూ అరుగుమీదికి వెళ్లాడు.
సత్తిబాబు దండెం మీదున్న తువ్వాలుని భుజం మీద వేసుకుని గూట్లో ఉన్న పందుం పుల్లని నోట్లో పెట్టుకొని బయటికి నడిచాడు.
ఈడేదో చెప్పాడా పిల్లకి… లేకపోతే యిన్నాళ్ల బట్టి రాంది యీ వేళ ఏకంగా గుమ్మంలోకి రాడమేంటి? అయినా… వీరవేణా పేరు… బానే ఉంది. దగ్గర్నుంచి చూస్తే యింకా బాగుందా అమ్మాయి. ఆ కంటి కింద పుట్టు మచ్చ బలే బాగుంది. ఆ పట్టీల చప్పుడు యినికా చెవుల్లో వినిపిస్తూనే ఉంది. కానీ పది రోజుల్నించీ అదే పరికిణీ… అదే జాకిట్టు… వేరే బట్టలేం లేనట్టు… ఇంకేమన్నా వేసుకోవచ్చు కదా…
అంతా గజిబిజిగా ఉండే ఇళ్లు. గుమ్మాల్లోంచీ దొడ్డలోంచీ వెళ్లాలి. ఇళ్ల ముందు రైలు బొగ్గు కుంపట్లు నల్లటి పొగల్ని చిమ్ముతున్నాయి.
అదోరకం తిక్క వాసన… యిక్కన్నించి కాస్తంత దూరంలో ఉంటుంది గోదావరి. అక్కడి కెళ్లే అదో హాయి…
… పైగా పెదాల ఎరుపు బలే చిత్రంగా ఉంది. నవ్వుతున్నప్పుడు బుగ్గలు చిన్నగా సొట్టపడతాయి కూడానీ… వీరవేణి… కరెంటు తీగని తొక్కినట్టు ఆగిపోయాడు.
ఎదురుగా ఎవరో అమ్మాయి నగ్నంగా గొంతుక్కూర్చుని స్నానం చేస్తోంది. ఆమె అటు వైపు తిరిగి ఉంది. ఎర్రమట్టి రంగు వీపు… దాని మీద పాయలు పాయలుగా జుట్టూ… భుజాల మీనిచి ఆ శరీరం అలా కిందికి దిగి నడుము దగ్గర వంకర తిరిగి మళ్లీ విశాలమై కిందిగి దిగి మూసుకని పోయింది. ఉబ్బెత్తుగా ఉన్న జఘనం మీద నీళ్లు పడి మెరుపులు మెరుస్తోంది.
పడగ ఎత్తిన తాచుపాముని చూసినట్టు గుడ్లు మిటకరించి అలా ఉండి పోయాడు సత్తిబాబు.
కళ్లు బైర్లు కమ్మేసాయి.
ఏం చెయ్యాలి?
దొరికి పోయిన దొంగలా వెనక్కా!
ఎరగని ఎర్రోళ్లా ముందుకా!
ఒక్క క్షణం ఏం చెయ్యాలో వెలగలేదు.
యింతలో ఆమె మెడ వెనక్కి తిప్పి చూసింది. సగం చందమామలు రెండూ జిగేల్ మని మెరిసినై.
“సూసింది సాలు గానీ యిక ఎల్లవయ్యా మగడా…” అంది నవ్వుతూ. ఆమె పై పెదవి మీదికి లేచిన పళ్లు తళుక్కుమ్నాయి.
బెదిరిపోయాడు సత్తిబాబు.
యించుమించు పరిగెత్తినట్టు ఆమె పక్కనించే వెళ్లాడు.
వెనక నవ్వు యింకా వినిపిస్తూనే ఉంది.
ఒక్క వూపుతో గోదారి గట్టు కొత్చీ ఆగి వూపిరి పీల్చుకున్నాడు.
ప్రొద్దుటి గోదారి గాలి… ప్రాణం లేచొచ్చినట్టయింది.
‘అమ్మబాబోయ్’ అనుకున్నాడు. యింకా కళ్ల ముందు ఆ శరీరమమే కనిపిస్తోంది. ఉడుకు నీళ్ల ఆవిరి ఆ నడుమ్మీంచి అగరు పొగలా లేస్తోంది. బుర్రంతా మత్తెక్కినట్టయి పోయింది.
ఒక్కసారి తల విదిలించుకొని పందుపుల్ల తీసి దాన్ని రెండుగా చీల్చాడు. వాటితో నాలిగ్గీసుకొని అవతలికి విసిరేసాడు. పుంతమ్మట ఒడ్డుమీదికి దిగి నదిలో అడుగు లేస్తూ కాస్త తేటగా ఉన్న నీళ్ల దగ్గరకెళ్లి ముఖం కడుక్కున్నాడు. గోదావరి మీది రైలు వంతెన మీద రైలేదో వెళ్తోంది.
అది తిరిగిన వొంపు… ఆ అమ్మాయి నడుం…
మళ్లీ తల విదిలించాడు. ఛీ… ఛీ… యిలానిటి ఆలోచన్లేంటి?
గబగబా కాలకృత్యాలు తీర్చుకొని వెనక్కి బయలు దేరాడు.
* * *
ఆదివారం పలావు బండి పరమ బిజీ… సాయంత్రం నాలుగ్గంటల్నించీ ఒకరూ ఇద్దరుగా మొదలై ఏడున్నర దాటేసరికి స్పీడుగా పొట్లాలు కట్టడం… ప్లేట్లు నింపి యివ్వడం… ఇది పదకొండింది వరకూ ఉంటుంది. రైల్వే కార్మికుల తాకిడెక్కువ. అటు అల్యూమినియం కార్మికులు… చుట్టు పక్కల ఊళ్ల నించి వచ్చే జనంతో సెంటరు కళకళ్లాడి పోతుంది. కొద్దోగొప్పో పైసలు మిగిల్తే ఆదివారాలే.
అంతా అయిపోయి బండి వోనరు కప్పగించి కోటిపల్లి బస్టాండు దగ్గరి పది రూపాయల భోజనం తినేసి పన్నెండు గంటల వేళ రైలు కట్ట దిగి పేటలోకి అడుగు పెట్టారు. ఊరంతా మాటు మణిగినా ఈ పేట మాత్రం గుణగుణ్ణాడుతూనే ఉంది. కరెంటు లేకపోవడం వల్ల చీకటిగా ఉంది. పెద్దవీ చిన్నవీ దీపాలు వెలుగుతున్నై.
“ఆ పిల్లా వాళ్లది చీకటిపట్నవంట… అదెక్కడుందో తెలీదు.” మొదలు పెట్టాడు మూర్తి.
“చూడబోతే ఆ పిల్లకి నువ్వే లైనేసేలా ఉన్నావే” అన్నాడు సత్తిబాబు
మూర్తి లెంపలు వాయించుకొని,
“పాపంరా ఎదవా… ఆ పిల్ల నన్ను అన్నయ్యా అనేసింది కదా… అళ్లమ్మని ఆళ్ల నాన్న వొదిలేసి ఎవరో మాస్టీల పిల్లతో ఎల్లి పోయాట్ట. దిక్కూ దివాణం లేని ఈళ్ళమమ్మని పక్కూరోడెవడో తగులుకుని రాజమండ్రి లేపుకొచ్చి యిక్కడెట్టాడు. కాపోతే ఆడెప్పుడో కానీ రాట్ట. పైగా ఆవిణ్ని బిజినెస్‌లోకి దింపింది ఆడేనట. కానీ ఈ పిల్ల… అదే వీరవేణి మాత్రం దూరంగా ఉండి పోయింది” అని ఆగాడు మూర్తి.
వెన్నెల అతని బట్టతల మీద నిగనిగ లాడుతోంది. అతని చిన్న కళ్లలో వెలుగు బయటికి దుంకడానికి వూగుతోంది.
సత్తిబాబు కాసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత దీర్ఘంగా చీకట్లోకి చూస్తూ,
“నేనెలాంటి రీయవ్వారాలూ పెట్టుకోదల్చు కోలేదు. అంచేత నన్ను రెచ్చ గొట్టమాట” అన్నాడు.
మూర్తి కళ్లలో వెలుగు ఆరిపోయింది. అతను బీడి వెలిగించి అగ్గిపుల్లని ఆర్పుతూ
“ఏ” అన్నాడు.
“నేను హోటల్ పెట్టాలి… పెద్ద బిజినెస్ చెయ్యాలి… డబ్బు… డబ్బు… సంపాదించాలి… అంతే అత్తప్ప ఇంకేదీ చైను… అంతే” అతని గొంతులో చిన్న ఉద్రేకం వినొచ్చింది.
మూర్తి దానికి వినిత పడుతూ,
“హోటల్ పెడతావ్… బిజినెస్ చేస్తావ్… డబ్బు సంపాదిస్తావ్… దానికీ దీనికీ సంబంధమేటి?” అన్నాడు గోదావరి యాసని అనుకరిస్తూ.
సత్తిబాబు మాట్లాడలేదు.
యిల్లు సమీపంలోకి వచ్చారు. సందు మొదట్లో గొడవగా ఉంది. ఒక లావు పాటి మగాడు ఒక ఆడావిణ్ణి జుట్ట పట్టుకు లాగుతున్నాడు… ఇంకో చిన్న పిల్ల అతడి చేతుల్లోంచి ఆవిణ్ణి తప్పించడానికి లాగుతోంది. అరుపులు… వెగటు కలిగించే బూతు మాటలు…
సత్తిబాబు అంటున్నాడు.
“యిదీ… మన జీవితం! ఆ బూతులా… ఆ తన్నులాటలూ… ఈ చీకట్లూ… చాటున ఎకసెక్కాలూ… ఏంట్రా ఇదీ.. మనుషులు యిలాగా బతకాలి? ప్రేమనీ… పెళ్లనీ… లేదా ఓ రాత్రికి పడుకోవడమనీ (అతని గొంతు వణికింది) ఏదైనా గానీ… ఈ బతుకుతో ఎలాంటి సంబంధమూ వొద్దు… యిది జ్ఞాపకం కూడా రాకూడదు…”
ఆడామెని లాగుతున్న పిల్లని లావుపాటి వ్యక్తి మూతి మీద గుద్దాడు. ఆ పిల్ల కెవ్వుని అరిచి యిటు చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మూర్తి వెనక్కి నక్కి”సంపేత్తన్నడన్నయ్యా..” అంటూ వెక్కడం మొదలు పెట్టింది.
వీరవేణి!
సత్తిబాబు కళ్లు పెద్దవయ్యాయి.
మూర్తి ఆ పిల్ల చెయ్యి పట్టుకొని వీపు తడుతూ…
“ఏంటమ్మా గొడవ?” అన్నాడు.
వీరవేణి మాట్లాడలేదు. వాళ్లిద్దరి వెనకా నక్కినట్టుగా అడుగులేసి వాళ్లద్దరి వెనదిలి నక్కినట్టుగా అడుగులేసి వాళ్ల పాక దగ్గర కొచ్చి అరుగు ఎక్కేసింది.
వీపవేణి అమ్నతీ కొడుతున్న వ్యక్తి బొంగురుగా ఉన్న గొంతుతో అమ్మనాబూతులు తిడుతూ మట్టిలోనే దభీమని పడిపోయాడు. మరి లేవలేదు. మూర్తి, సత్తిబాబు తమ గతి తలుపు తాళం తీసుకొని లోనికెళ్లి దీపం వెలిగించి బయటకొచ్చారు. ఈలోగా వీరవేణి అమ్మ చెదిరిపోయిన తలని ముడేసుకుంటూ వొచ్చి అరుగు మీద కూలబడింది. వొణుకుతున్న గొంతుతో అంది.
“దొగనా బట్ట… అణ్నీడికి రమ్మన్నదెవలూ… యిలాటి కయ్యాలాడమన్న దెవలూ… చూస్జూసి ఎప్పుడో కంఠమ్ముడి కొరికేత్తను పానం సుకం గన్నుంటది”
వీరవేణి వచ్చి ఆమె చుట్టూ చెయ్యేసి పక్కన కూర్చుంది.
“ఎవరమ్మా అతను?” అడిగాడు మూర్తి.
“ఎవడా.. ఏలుకుంటానని పక్కలో తొంగుని యేపుకుతింటున్నోడు…” కచ్చగా అంది. అని మళ్ళీ, “డబ్బులు కావలిస్తే వొచ్చిలా రచ్చ చేస్సి పోతాడు మూర్తిబాబాబూ… ఆడేవన్నా నన్ను కట్టుకున్న మొగుడా ఎప్పుడు కావాలంటే అప్పుడు పైసల్తెచ్చి ఆడి ఎదాన పొయ్‌డానికి… ఏల్నాటి శన్లా అట్టుకున్నాడు… పోరా యెదవా అంటే పోడు… చాగల్నాట్లో కూలో నాలో చేసుకొని మరియాదగా బతికే దాన్ని చీనా పూసిన మాటల్జెప్పి యిదిగో…. ఈ కొంపల్లో దింపాడు… (ఒక బూతు మాట అంది) అచ్చాలదన్నట్టు యిప్పుడిదుగో దీనికి బేరం తెచ్చాట్ట… పండబెట్టమంటున్నాడెదవ…” ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. జంతువు ఏడ్చినట్టు ఏడ్చింది.
* * *
వొద్దువొద్దకుంటూనే వీరవేణితో ముచ్చట్లు మొదలు పెట్టాడు సత్తిబాబు. రోజూ మధఆ్యహ్నం పూట ఏదో ఒక కూర తెచ్చేది. సాయంత్రం పలావు వొండుతుంటే మసాలాలు నూరిచ్చేది. సత్తిబాబు బట్టలు తీసికెళ్లి ఉతికేది. ఇంటిముందు కళ్లాపు జల్లి ముగ్గులేసేది. ముసిముసిగా నవ్వేది.
కానీ సత్తిబాబు ఉండుండి చిరాకు పడేవాడు. ఈ వ్వవహారం అతనికి శాంతినివడం లేదు. వద్దు… ఇక్కన్నించి బయట పడిపోవాలి… ఈ ప్రేమలూ దోమలూ… వొద్దు అనుకుంటాడు. మళ్లీ వీరవేణి కనబడగానే వొళ్లంతా జివ్వు మంటుంది. చిరాకు పుడుతుంది. ఆవిర్లు చిమ్ముతున్న నడుం కనిపిస్తుంది. అంతా తిక్కతిక్కగా ఉంటుంది.
ఒకసారి మూర్తి అనేసాడు.
“వురేయ్… దీని గురించెందుకురా అంతిదై పోతావ్… మనం ఇక్కడుండి పోయే వాళ్లం కాదు. ఆళ్లా… చెప్పక్కల్లేదు కదా… మాంచి మూర్తం చూసి టిక్కు పెట్టేయ్… ఏదేనా తేడా వస్తే జండా ఎత్తేద్దాం”
అవును… అంత యాజీయే… కానీ ఏ బతుకులోకి దిక్కూడదని గిలగిల్లాడుతున్నాడో అందులోకి మునిగిపోవడమే…
మునిగిపోవడం ఈజీయే… పోకపోవడమే కష్టం… ఆడోల్ని మరిగి… మందు మరిగి… బూతులు మరిగి… ఆగ్గలమా?
కాక పెళ్లే చేసుకుంటే ఈ గుడిసెల్లోనే ఈ పలాపుల్తోనో… సప్లయిర్‌గానో…
లక్షలు సంపాయించక్కర్లేదు… అస్తులు సంపాయించక్కర్లేదు… కానీ
“బయటకి పోతే బుక్కెడు బువ్వ పెట్టే దిక్కుండదురా వెధవా! గుళ్ల దగ్గరా… బస్టాండుల దిగ్గరా బాబూ… పది పైసల్… బాబూ పదిపైసల్ అంటూ అడుక్కు తిని పోతావ్ లం…” అనే తండ్రికి సమాధానం ఇవ్వాలి.
కళ్లు నీళ్లతో నిండి పోయాయి. వేళ్లతో కళ్లు నులుముకుంటూ గోదావరిని తదేకంగా చూస్తుండి పోయాడు సత్తిబాబు.. అద్దర్ని కొవ్వూరు గీతలా ఉంది. మధ్యలో లంకల్లో రెల్లు దుబ్బుల్లోంచి పొగలు లేస్తున్నాయి. ఎవరో వంటలు చేస్తున్నారు. ఆకాశంలో మేఘాలు వొంకర్లుగా ఉన్నై. వద్దనుకున్నా మళ్లీ స్నానం చేస్తున్న అమ్మాయే గుర్తొస్తోంది. నీటిలోకి దిగి ముఖం తడుపుకుని పైకెక్కాడు. గదికి తిరిగి వస్తూ దొంగ చూపులు చూసాడు. ఆ అమ్మాయి కనపళ్లేదు. గదికి వచ్చి తలుపులు తీసి చాపమీద కూర్చున్నాడు. ఓ మూల కుప్పగా పోనున్న ఉల్లిపాయలు తీసి వొలవడం మొదలు పెట్టాడు.
పట్టీల చప్పుడుతో వీరవేణి వచ్చింది. తలంటు పోసుకొటని జుట్టు విరబోసుకొని ఉంది. పసుపు రాసుకున్న ముఖం నిగనిగా మెరిసి పోతోనిది. ఆమె లోపలికి వొసూ “అన్నయ్య లేడా” అంది.
సత్తిబాబు మాట్లాడలేదు. ఆమె వంక అలా చూస్తూండి పోయాడు. వీరవేణి కూర్చుని ఉల్లి పాయలు వొలచడఞం మొదలు పెట్టింది. సత్తిబాబు లేచి మైకం కమ్మిన వాడిలా ఆమె పక్కన కూర్చొని ముఖాన్ని రెండు చేతుల్లో పట్టుకుని పెదాల మీద ముద్దుపెట్టాడు. స్పృహ తప్పినట్టని పించింది.
వీరవేణి “ఊ… ఊ…” అంటూ విడిపించుకుని మూతి తుడుచుకుంటూ “యిప్పుడా” అంది. అతని భుజం మీద గిల్లుతూ “రాత్రి” అని బుగ్గమీద ముద్దు పెట్టి చెంగున దూకి పారిపోయింది.
కాసేపు ఏమీ కనిపించలేదు. గదంతా గిర్రుని తిరిగిపోయింది. నోరు కాలిపోతున్నట్టుంది. చెవులు ఎర్రగా కందిపోయాయి. కాస్సేపటి తర్వాత లేచి బట్టలు వేసుకొని తాళం వేసి బయటికి నడిచాడు. రైలు కట్ట ఎక్కి స్టేషన్ వేపు పట్టాల పక్కనే నడవడం మొదలు పెట్టాడు. అప్పుడే రైలు వెళ్లింది. పట్టాలు వెండిలా మెరుస్తున్నై.
‘వోలమ్మో’ అని కేక వినిపించింది.
ఎవరో ఇద్దరు ఆడోళ్లు పరిగెడుతూ పాకల కేసి వెళ్తున్నారు. నాలుగడుగులు వేసి ఆగిపోయాడు.
పట్టాల మీద ఒక స్త్రీ దేహం. రైలు నడుమ్మీంచి వెళ్లిపోయింది. శరీరం రెండు ముక్కలైపోయి అవతల వేపు కాళ్ళూ…. యిటు వైపు తల…. కాళ్లలో యింకా కదలిక ఉంది. పేగులు బయట పడి… నెత్తురు మయమైపోయి…. ఆ మొహం పెదాలని తోసుకొచ్చిన పళ్లు బూడిద రంగులో ఉన్నాయి. ఆ మొహం చూసి హడిలి పోయాడు సత్తిబాబు.
‘ఆ అమ్మాయే’ అనుకున్నాడు. కడుపులో తిప్పినట్టయి కళ్లు మూసుకుంటూ వెనక్కి తిరిగాడు.
జనం ఉరుకులు పెడుతూ మూగుతున్నారు.
ఏవేవో మాటలు వినిపిస్తున్నై.
సత్తిబాబు తన చేతిని ఎవరో పట్టుకునే సరికీ కళ్లు తెరిచాడు.
వీరవేణి.
విపరీతమైన భయంతో ఆమె వొణికి పోతోంది. దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో ఆమె వెక్కుతూ ‘రాజ్జిం…. రాజ్జిం…’ అంటూ అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంది.
సత్తిబాబు ఆమె భుజం తట్టాడు.
చేతిని మెల్లిగా విడిపించుకుని వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్లి పోయాడు.
* * *
“చచ్చిపోక ఏటి చేద్ది బాబూ… చచ్చన్నా పోవాలీ లేదంటే చచ్చినట్టు బతకన్నా బతకాలి… మరేం చేస్తం? పనున్నా లేకపోయినా… దారున్నా లేకపోయినా మాడిపోడానికి కడుపు మాత్రం ఉంటది కదా…” అంటోంది వీరవేణి అమ్మ.
అరుగు మీద కూర్చోనున్నారు మూర్తి, సత్తిబాబు, వీరవేణి. బాగా చీకటి పడి పోయింది. వీరవేణి యింకా వెక్కుతూనే ఉంది. ఆ రైలు కింద బుర్రెట్టేసిన రాజ్యంకీ ఈ పిల్లకీ బాగా స్నేహవట. రాజ్యాన్ని వెనక వీధి కుర్రాడెవరో ప్రేమించాట్ట. ప్రేమించి హఠాత్తుగా మాయమైపోయాడు. ఎక్కడికి పోయాడో ఎవరికీ తెలియదు. ఆ పిల్ల నాన్న రైల్వే స్టేషన్లో వెండరుగా ఉండేవాడు. రాజ్యం చిన్నప్పుడే రైలు గుద్దేసి చచ్చిపోయాడు. వాళ్లమ్మ పేటల్లో తిరిగి ఎండు చేపలమ్ముతుంది. ఒక అన్న ఉన్నాడు గానీ వాడెప్పుడోగానీ యిటురాడు. బ్లాకు టిక్కెట్లమ్ముకొనీ… చిన్న చిన్న దొంగతనాలు చేసీ వూళ్లమ్మట తిరుగుతుంటాడు.
రెండు సైకిళ్ల మీద ఇద్దరు పోలీసులు సందులోకి వచ్చారు. సైకిలు దిక్కుండానే ఆగి “ఏం చేస్తున్నార్రా…” అనడిగాడు ఒకడు. రెండో పోలీసు సైకిలు దిగి స్టాండు వేసి అరుగు దగ్గర కొచ్చాడు.
వీరవేణి అమ్మ అరుగు మీంచి లేచి
“మా యిల్లిదే జమాను గారూ… ఏదో అలా కవుర్లాడుకుంటున్నాం” అంది.
సైకిల్ మీదున్న పోలీసు “పొద్దుట రైలు కింద బుర్రెట్టేసింది కదా… దానిల్లెక్కడా?” అని అడిగాడు.
చెప్పింది వాళ్లమ్మ.
అతను సైకిలు దిగి అరుగు మీద కూర్చున్న పోలీసు పక్కనే కూర్చుని
“ఈళ్లెవరు?” అన్నాడు.
మూర్తి అతనికి నమస్కారం పెడుతూ
“సేమలా టాకీసు కాడ పలాబండేస్తం కదండీ… రవణబాబుగారి తాలూకాండి” అన్నాడు.
చచ్చిపోయిన పిల్ల గురించి ఏవో అడిగాడతను. కాసేపు కూర్చుని వెళ్లి పోయారు.
మాటలన్నీ మర్చిపోయిన వాళ్లలా కూర్చున్నారు నలుగురూ. రైలేదో వెళ్తోంది. హఠాత్తుగా ఆ శబ్దం విపరీతంగా పెరిగి దాని కింద నలిగిపోయినట్టు ఒళ్లు జలదరినిచింది సత్తిబాబుకి.
ఛుక్… ఛుక్… ఖూ…
ఆ కూత తళతళలాడే రేకు కొరడాలా లేచి హుస్… మంటూ మీద పడినట్లని పించింది.
ఆ హోరులోంచి వినిపించింది.
“కోణార్కనుకుంటా…”
హఠాత్తుగా శబ్దం ఆగిపోయింది.
నిశ్శబ్దం.
మోకాళ్లు రెండూ దగ్గర చేర్చి వాటి చుట్టూ చేతులు చుట్టి తల వాల్చుకుని ఉంది వీరవేణి.
“దీని బతుకేటా… అని కడుపు తరుక్కు పోతూ వుంటుంది బాబూ… వోణీ లేస్తే పిల్ల వొయసు తెలుస్దని ఎయ్యనియ్యట్లేదు. గానీ ఎంత కాలం సాగుద్ది… నేను చచ్చాకా దీని బతుకేటవుద్ది” తడితడిగా తగిలాయి ఆ మాటలు.
అలా కట్రాటల్లా కాసేపు ఉండినాక లేస్తూ “రాయే వీరమ్మా… పడుకోండి బాబూ… చాలా పొద్దోయింది” అంది.
* * *
గదుల్ని అమ్మాయిల కివ్వడం మానేసింది వీరవేణి అమ్మ. అందులోకి చాలా రోజులు ఎవరూ రాలేదు. ఈ మధ్యనే ఏదో కుటుంబం దిగింది. పుష్కరాల రేపు దగ్గర మిక్సరు బండేస్తాడతను. భార్య ఓ చిన్న పిల్లాడు. తరచుగా ఆ లావు పాటి వ్యక్తి వొచ్చి గొడవ చేసి పోతుంటాడు.
యిన్నాళ్లూ బిజినెస్ చేసి కొద్దిగా డబ్బు మిగుల్చుకున్నారు మూర్తి సత్తిబాబులు. మూర్తి ఏదో పని మీద బయటకెళ్లాడు. సత్తిబాబు తలుపు దగ్గరగా వేసి చాప మీద పడుకొని డబ్బుల్లో ఏం చెయ్యాలా అని కలు కంటున్నాడు.
తలుపు తోసుకొని వీరవేణి వచ్చింది.
తల తిప్పి చూసాడు సత్తిబాబు. అతని కళ్లు పెద్దవయ్యాయి.
వోణీ వేసుకునుంది వీరవేణి. జుట్టు వదులుగా జడేసుకుంది. ఇన్నాళ్లలోనూ తనకి గుర్తున్నంత వరకూ యిది రెండో డ్రస్. ఎంత పెద్దగా ఉంది! హఠాత్తుగా పొడుగై పోయినట్టుంది. లావైపోయినట్టుంది. మెరుపైనట్టుంది.
“ఏటలా చూస్తున్నావ్… బాగుందా…” అందామె.
యింకా అలానే చూస్తూ ఉన్నాడు. పైకి లేచాడు.
ఆమె తలుపు దగ్గరగా నొక్కి సత్తిబాబు మెడ చుట్లూ చేతులేసి పెదాల మీద ముద్దు పెట్టింది. సత్తిబాబుకి మైకం కమ్మేసింది. సాంబ్రాణితో కలిసిన ఆమె దేహపు పరిమళం అతని ఊపిరిని బరువెక్కించింది.
అసంకల్పితంగా అతని చేతులు ఆమెని చుట్టేసాయి.
తలలోంచి బయలుదేరింది రైలు శబ్దం. ఖూ… ఛుక్… ఛుక్…
గదంతా హోరెత్తిపోయింది.
అతను ఊ… ఊ… అంటూ ఆమెని విడిపించుకుని వెనక్కి జరిగి మూతి తుడుచుకుంటూ ‘యిప్పుడా’ అన్నాడు. ఆమె భుజమ్మీద గిల్లి బుగ్గ మీద ముద్దాడుతూ ‘రాత్రి’ అన్నాడు.
లోపల నవ్వుకుంటూ ఆమె అతని చెంప మీద చిన్నగా కొట్టి వెళ్లి పోయింది.
* * *
మళ్ళీ వీరవేణిని చూస్తాననుకోలేదు సత్తిబాబు.
రాజమండ్రి రైల్వే స్టేషన్లో తనున్న పెట్టెలోకే ఎక్కింది. వెంట ఎవరో పెద్దావిడ ఉంది. మనిషి మారలేదు. కాపోతే చీర కట్టుకునుంది. యింకాస్త నల్లబడినట్టుంది. తన్ని చూసింది. చూసే ఎక్కిందా? అనుకున్నాడు.
అప్పుడే అయిదేళ్లు గడిచి పోయాయి. ఒకప్పుడు అంత దగ్గరైన ఆమెని యిప్పుడు చూస్తుంటే దూరం సాగిపోయి బిసాగిపోయి తెగిపోయినట్టుంది. మధ్యలో ఒక శూన్యం.
యిప్పుడు నెల్లూరులో హోటలుంది. పెద్దగా సంపాదించలేదు. అయినా హోటల్ వోనరు. యింకా పెళ్ళి చేసుకోలేదు.
ఆ రోజు రాత్రికి అన్నాడు. సాయంత్రానికి డబ్బులు పట్టుకుని మెయిలెక్కేసాడు. ఉద్రేకం తన్నెంత ముంచెత్తినా రెండు ముక్కలైన దేహం అతన్ని గడగడా వొణికించింది.
తన్ని చూసింది. గుర్తుపట్టింది. ఆమె కళ్లు చిన్నగా వెలిగి ఆరిపోయాయి. పెద్దామెతో ఏదో అంది. ఆమె బుర్ర వూపుతుండగా లేచి సత్తిబాబు దగ్గర కొచ్చింది.
ఆర్పకుండా ఆమెనే చూస్తున్నాడు సత్తిబాబు. ఆమె వచ్చి పక్కన కూర్చుంది.
“బాగున్నావా సత్తిబాబూ” అంది.
అదే గొంతు. కాపోతే పూర్వపు అమాయకత్వం లేదు.
తల వూపుతూ ‘నువ్వు’ అన్నాడు.
తళుక్కుమని నవ్వింది.
“ఎక్కడ ఉంటం’
“రాజమండ్రి… వైజాగు… అప్పుడప్పుడు బెజవ లిడ”
“అంటే…”
“అంటే ఏముంది… బిజినెస్” నవ్వు
“అదేంటి?”
“ఏటేముంది… అంటే”
రైలు కదిలింది. పెద్దగా జనం లేరు. చాలా సేపు మాట్లాడ లేదు ఎవరూ. మెల్లిగా కూడ దీసుకుంటూ అందామె.
“అలా… మాయమైపోయావే… ఆ రోజు… మూర్తన్నయ్య ఎంత బాధ పడ్డాడో…” అప్పటి రోజులు జ్ఞాపకం వొచ్చి ఆమె గొంతు కంపించింది.
సత్తిబాబు మాట్లాడ లేదు.
“మీ అమ్మ…”
“చచ్చిపోయింది… చెప్పు మాయమైపోయావే”
సత్తిబాబు ఆమె వంక చూస్తూ సన్నగా వొణుకుతున్న గొంతుతో అన్నాడు.
“మాయమైపోలేదు. పారిపోయాను. నువ్వంటే యిష్టమే. కానీ అలా బతక్కూడదనుకున్నాను. కానీ అలా బతక్కూడదనుకున్నాను. కానీ ఏం చైను… నీ మీద పిచ్చితో ఏమై పోతానో అనిపించింది. కళ్లు మూసినా తెరిచినా నువ్వే… పెళ్లి చేసుకోలేను. దాని లేదు. ప్రేమించి మాయమై పోవడం కన్నా పారిపోవడమే మంచిదనిపించింది.”
దుఃఖాన్ని గొంతులో నొక్కి విందామె. చెంపల మీదకి జారిన కన్నీటిని తల తిప్పుకుని పైటతో ముఖం తుడుచుకుంది. నన్నగా జీరవోయిన గొంతుతో
“పోన్లే… హోటల్ పెట్టావా… బిజినెస్ చేస్తున్నావా… డబ్బు సంపాదిస్తున్నావా…?”
“ఏదోలే… కానీ నువ్వు… యిలా…”
“నేను యిలా… ఎలా… యిలా కాక ఎలా ఉంటాను?” అని కొంచెం ఉక్రోషంగా అంది. అని మళ్లీ చిన్న గొంతుతోవీరవేణి
- ఎ.ప్రభు
రాస్తూ ఉన్న బోర్డుని ఆపి తల పైకెత్తకుండానే “ఒరేయ్ సత్తిగా ఆ పిల్ల చూసావా… యిందాకట్నుంచీ నియ్యేపే చూస్తోంది” అని లోగొంతుతో అంటూ నవ్వాడు మూర్తి.
రేకు మీద నీలం రంగు పెయింట్ వేస్తున్న సత్తిబాబు తల తిప్పి ఎదురుగా ఉన్నగుడిసె వేపు చూసాడు. ఆ ప్లిల యిటే చూస్తున్నది కాస్తా చటుక్కున తల తిప్పేసు కుంది. సత్తిబాబు మూర్తి భుజమ్మీద చేతిలో ఉన్న బ్రష్‌తో పొడుస్తూ “యెటకారం మాటలాడకెహే…” అన్నాడు.
“యెటకారం కాదురా… నేను చాలా రోజుల్నుంచీ చూస్తున్నా… ఆ పిల్ల నీ మీద కన్నేసింది. నువు గానీ కొంచెం ముందు కెళ్లావో…” వెలుగు లాంటి నవ్వు నవ్వుతూ “ఛాన్స్…” అని కన్నుకొట్టాడు. చిత్రమైన వంకర నవ్వు విసిరాడు.
సత్తిబాబు పెదాలు సిగ్గుగా సాగదీసి రంగేస్తూ “చాల్లే గానీ… ఆ కోడికి దీర్ఘం ఉండాలి. కొడి పలావు కాదు కో…డి పలావు” అన్నాడు.

- – -
గదుల్ని అమ్మాయిల కివ్వడం మానేసింది వీరవేణి అమ్మ. అందులోకి చాలా రోజులు ఎవరూ రాలేదు. ఈ మధ్యనే ఏదో కుటుంబం దిగింది. పుష్కరాల రేపు దగ్గర మిక్సరు బండేస్తాడతను. భార్య ఓ చిన్న పిల్లాడు. తరచుగా ఆ లావు పాటి వ్యక్తి వొచ్చి గొడవ చేసి పోతుంటాడు.
యిన్నాళ్లూ బిజినెస్ చేసి కొద్దిగా డబ్బు మిగుల్చుకున్నారు మూర్తి సత్తిబాబులు. మూర్తి ఏదో పని మీద బయటకెళ్లాడు. సత్తిబాబు తలుపు దగ్గరగా వేసి చాప మీద పడుకొని డబ్బుల్లో ఏం చెయ్యాలా అని కలు కంటున్నాడు.
తలుపు తోసుకొని వీరవేణి వచ్చింది.
తల తిప్పి చూసాడు సత్తిబాబు. అతని కళ్లు పెద్దవయ్యాయి.
వోణీ వేసుకునుంది వీరవేణి. జుట్టు వదులుగా జడేసుకుంది. ఇన్నాళ్లలోనూ తనకి గుర్తున్నంత వరకూ యిది రెండో డ్రస్. ఎంత పెద్దగా ఉంది! హఠాత్తుగా పొడుగై పోయినట్టుంది. లావైపోయినట్టుంది. మెరుపైనట్టుంది.
“ఏటలా చూస్తున్నావ్… బాగుందా…” అందామె.
యింకా అలానే చూస్తూ ఉన్నాడు. పైకి లేచాడు.
ఆమె తలుపు దగ్గరగా నొక్కి సత్తిబాబు మెడ చుట్లూ చేతులేసి పెదాల మీద ముద్దు పెట్టింది. సత్తిబాబుకి మైకం కమ్మేసింది. సాంబ్రాణితో కలిసిన ఆమె దేహపు పరిమళం అతని ఊపిరిని బరువెక్కించింది.
అసంకల్పితంగా అతని చేతులు ఆమెని చుట్టేసాయి.
తలలోంచి బయలుదేరింది రైలు శబ్దం. ఖూ… ఛుక్… ఛుక్…
గదంతా హోరెత్తిపోయింది.
అతను ఊ… ఊ… అంటూ ఆమెని విడిపించుకుని వెనక్కి జరిగి మూతి తుడుచుకుంటూ ‘యిప్పుడా’ అన్నాడు. ఆమె భుజమ్మీద గిల్లి బుగ్గ మీద ముద్దాడుతూ ‘రాత్రి’ అన్నాడు.
లోపల నవ్వుకుంటూ ఆమె అతని చెంప మీద చిన్నగా కొట్టి వెళ్లి పోయింది.
* * *
మళ్ళీ వీరవేణిని చూస్తాననుకోలేదు సత్తిబాబు.
రాజమండ్రి రైల్వే స్టేషన్లో తనున్న పెట్టెలోకే ఎక్కింది. వెంట ఎవరో పెద్దావిడ ఉంది. మనిషి మారలేదు. కాపోతే చీర కట్టుకునుంది. యింకాస్త నల్లబడినట్టుంది. తన్ని చూసింది. చూసే ఎక్కిందా? అనుకున్నాడు.
అప్పుడే అయిదేళ్లు గడిచి పోయాయి. ఒకప్పుడు అంత దగ్గరైన ఆమెని యిప్పుడు చూస్తుంటే దూరం సాగిపోయి బిసాగిపోయి తెగిపోయినట్టుంది. మధ్యలో ఒక శూన్యం.
యిప్పుడు నెల్లూరులో హోటలుంది. పెద్దగా సంపాదించలేదు. అయినా హోటల్ వోనరు. యింకా పెళ్ళి చేసుకోలేదు.
ఆ రోజు రాత్రికి అన్నాడు. సాయంత్రానికి డబ్బులు పట్టుకుని మెయిలెక్కేసాడు. ఉద్రేకం తన్నెంత ముంచెత్తినా రెండు ముక్కలైన దేహం అతన్ని గడగడా వొణికించింది.
తన్ని చూసింది. గుర్తుపట్టింది. ఆమె కళ్లు చిన్నగా వెలిగి ఆరిపోయాయి. పెద్దామెతో ఏదో అంది. ఆమె బుర్ర వూపుతుండగా లేచి సత్తిబాబు దగ్గర కొచ్చింది.
ఆర్పకుండా ఆమెనే చూస్తున్నాడు సత్తిబాబు. ఆమె వచ్చి పక్కన కూర్చుంది.
“బాగున్నావా సత్తిబాబూ” అంది.
అదే గొంతు. కాపోతే పూర్వపు అమాయకత్వం లేదు.
తల వూపుతూ ‘నువ్వు’ అన్నాడు.
తళుక్కుమని నవ్వింది.
“ఎక్కడ ఉంటం’
“రాజమండ్రి… వైజాగు… అప్పుడప్పుడు బెజవ లిడ”
“అంటే…”
“అంటే ఏముంది… బిజినెస్” నవ్వు
“అదేంటి?”
“ఏటేముంది… అంటే”
రైలు కదిలింది. పెద్దగా జనం లేరు. చాలా సేపు మాట్లాడ లేదు ఎవరూ. మెల్లిగా కూడ దీసుకుంటూ అందామె.
“అలా… మాయమైపోయావే… ఆ రోజు… మూర్తన్నయ్య ఎంత బాధ పడ్డాడో…” అప్పటి రోజులు జ్ఞాపకం వొచ్చి ఆమె గొంతు కంపించింది.
సత్తిబాబు మాట్లాడ లేదు.
“మీ అమ్మ…”
“చచ్చిపోయింది… చెప్పు మాయమైపోయావే”
సత్తిబాబు ఆమె వంక చూస్తూ సన్నగా వొణుకుతున్న గొంతుతో అన్నాడు.
“మాయమైపోలేదు. పారిపోయాను. నువ్వంటే యిష్టమే. కానీ అలా బతక్కూడదనుకున్నాను. కానీ అలా బతక్కూడదనుకున్నాను. కానీ ఏం చైను… నీ మీద పిచ్చితో ఏమై పోతానో అనిపించింది. కళ్లు మూసినా తెరిచినా నువ్వే… పెళ్లి చేసుకోలేను. దాని లేదు. ప్రేమించి మాయమై పోవడం కన్నా పారిపోవడమే మంచిదనిపించింది.”
దుఃఖాన్ని గొంతులో నొక్కి విందామె. చెంపల మీదకి జారిన కన్నీటిని తల తిప్పుకుని పైటతో ముఖం తుడుచుకుంది. నన్నగా జీరవోయిన గొంతుతో
“పోన్లే… హోటల్ పెట్టావా… బిజినెస్ చేస్తున్నావా… డబ్బు సంపాదిస్తున్నావా…?”
“ఏదోలే… కానీ నువ్వు… యిలా…”
“నేను యిలా… ఎలా… యిలా కాక ఎలా ఉంటాను?” అని కొంచెం ఉక్రోషంగా అంది. అని మళ్లీ చిన్న గొంతుతో
“యిది తప్పదని నాకెన్నడో తెల్సు సత్తిబాబూ… కానీ నేనూ రాజ్యం… గుర్తుందా… చచ్చిపోయింది కదా… అదీ – ఇద్దరం బతకాలి… లేదా చావాలి… కానీ చచ్చినట్టు బతక్కూడదని గోదారి మీద వొట్టు పెట్టుకున్నాం. అది ప్రేమించింది. ఒక రోజైతేం… నాల్రోజులైతేం… కాపురం చేసింది. ఆడు మాయమైపోయాడు. యిది రైలు కిందడి పోయింది. నేను నిన్ను ప్రేమించాను. పెళ్లీ గిళ్లీ అవుతుందని ఏనాడూ అనుకోలేదు. నీతో పడుకుని (ఆమె గొంతు బొంగురుపోయింది) నాల్రోజులు బతికి పోదామనుకున్నాను . కానీ నువు నేను చచ్చిపోతానేమో అనుకుని పారిపోయావు. నేనిప్పుడు చచ్చినట్టు బతుకుతున్నాను.”
ఆమె నిశ్శబ్ద దుఃఖం రేకు కొరడాలా తగలింది.

B.AJAY PRASAD Jul 7, 2008 1
కథలో రిపిటీషన్స్ ఉన్నాయి. సంపాదకులు దాన్ని సరిచేసుకోవాలి. కథ బాగుంది.
Chilakapati Srinivas Jul 30, 2008 2
మంచి కథ.