విభజన రేఖలు

- మంచికంటి

అనుకున్నట్టుగా అన్ని ఏర్పాట్లూ చకచకా జరిగిపోతున్నాయి. ముఖ్యమైనది ఒకటే ఏ రోజుకారోజు మిగిలి పోతూ ఉంది. ఈ రోజు చెబుదాం ఈ రోజు చెబుదాం అని రోజూ వాయిదా వేస్తూ పోతుంటే అనుకున్న సమయం మరీ దగ్గిర పడుతుంది.


ఒక్కోరోజు గడిచే కొద్దీ ఆనందం కమ్ముకొస్తోంది. ఎప్పుడెప్పుడు కమ్మని మట్టి పరిమళాలతో పులకించి పోతానో.. ఎప్పుడు చల్లని గాలుల స్పర్శశోకి తనువు మైమరచి పోతుందో… ఎప్పుడెప్పుడు ఆత్మీయుల అనుబంధాలతో పెనవేసుకు పోతాననే ఆరాటం అంతకంతకూ పెరిగి పోతుంది.మరో వైపు మధూ పరిస్థితే అర్థం కాకుండా ఉంది. తను ఎన్నో ఆశలతో ఎన్నెన్నో కోరికలతో రంగురంగుల కలల పల్లకిపై ఊరేగుతూ ఇక్కడకు వొచ్చింది. ఈ నిర్ణయం చెబితే తను కనే కమ్మని కలకు అంతరాయం ఏర్పడడం భాయం. తను తట్టుకోగ లదా! తన మానసిక ధోరణి ఎలా ఉంటుంది.

అలాగని వొదిలేస్తే పిచ్చి ముదిరి ఉన్మాదస్థాయికి చేరేటట్టుగా ఉందే! ఆ స్థితి నుండి ఎలాగైనా తనని మనిషిగా మిగుల్చుకోవాలంటే ఈ నిర్ణయాన్ని చెప్పేయాలి. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఒక్కసారిగా జీర్ణించుకోలేదు. ఏదో ఒక రోజు చెప్పెయ్యాల్సిందే కదా!

ఇలాంటి నిర్ణయం తీసుకునేముందు ఒక్క మాటైనా చెప్పాల్సిన బాధ్యత లేదా అని నిలదీస్తుందేమో! పెద్దగా అరిచి రచ్చ చేస్తుందా! కిందపడి దొర్లుతుందా! ఏదేమైనా ఇది నా జీవితాన తీకి సంబంధించిన సమస్య. నా స్వేచ్ఛకు సంబంధించిన నిర్ణయం. నా మనసుకు నచ్చిన నిర్ణయం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమైపోయినా నా నిర్ణయానికి తిరుగు లేదు.
ఈ రోజు ఎలాగైనా చెప్పాలి. ప్చ్‌… ఎంత దృఢంగా నిశ్చయించుకున్నా చెప్పడం కొంచెం బాధగానే అనిపిస్తుంది. లోలోన ఒక రకమైన అపరాధ భావనేదో వెనక్కు లాగుతుంది. ఎవరినైనా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధగానే ఉంటుంది కదా! అయినా అన్నీ ఏర్పాట్లూ జరిగిపోయాక ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు కదా అనుకునే సరికి తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు వినోద్‌.

“ఏయ్‌ వినోద్‌ ఈ మధ్యెందుకు మరీ ముభావంగా ఉంటున్నావ్‌. నా వల్ల తప్పేమైనా జరిగిందా! నేను చెప్పిన దానికి దేనికీ రెస్పాండ్‌ కావడము లేదు.” ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అడిగింది మాధవి.

ఇదే అదను. తనే హబెచ్చరిస్తుంది. ఇంక చెప్పెయ్యాల. చెప్పెయ్యాలి. ఎలా… ఎలా… ఎలా ప్రారంభించాలి! ఏదో రకంగా… ప్రారంభించాలి.
“మధూ… నీతో కొంచెం మాట్లాడాలి.” పొడి పొడిగా అన్నాడు.

“ఏంటి వినోద్‌ కొత్తగా మాట్లాడుతున్నావ్‌! కొంచెం మాట్లాడటమేమిటి? ఏందసలు విషయం నాతో చెప్పడానికి అంతలా తటపటాయిస్తున్నావు. ఏంటో అసలు విషయం చెప్పు.”
“ఇది మన జీవితానికి సంబంధించిన విషయం” ఎటో చూస్తూ చెప్పాడు. అతని వైపు పరిశీలనగా చూస్తూ, ఏంటోయ్‌ ఇవాళ నీ మూడ్‌ బాగా లేదు లాగుంది. అదేంటో చెప్పు. జీవితాలను మలుపులు తిప్పే నిర్ణయమేదో తీసుకుంటున్నట్టున్నావు. చెప్పు… చెప్పు… చెప్పవయ్యా బాబూ తొందర పెట్టసాగిందామె.
అతని ముఖం గంభీరంగా మారింది. ఏదో ఉపద్రవం ముంచుకు రానున్న సూచనలు అతని ముఖంలో స్పష్టం గా కనిపించసాగాయి.
ఆమె నిశితమైన చూపుల్తో అతన్నే పరికించ సాగింది.

ప్రిజ్‌ దగ్గర కెళ్ళి వాటర్‌ బాటిల్‌ తీసుకుని, డోర్‌ మూసేస్తూ “మధూ మనం ఇండియాకి వెళుతున్నాం” ముఖావంగా అన్నాడు.
ఆమె విన్నదేమిటో ఒక్క క్షణం ఆమెకీ అర్థం కాలేదు.
“ఏమిటి వినోద్‌ నువ్వంటున్నది?

బాటిల్‌ మూత తీసి, బాటిల్‌ పైకెత్తి నీళ్ళ తాగుతూ “నువ్వు విన్నది నిజమే మధూ మనమింక శాశ్వతంగా ఇండియాకి వెళ్ళిపోతున్నాం.”
“ఇండియాకా ఆర్యూ జోకింగు మన మొచ్చి సిక్స్‌ మంధ్స్‌ కూడా కాలేదు కదా! మళ్ళీ ఇండియాకేనిటి నీకేమైనా పిచ్చి పట్టిందా!
తల అడ్డంగా ఊపుతూ “నిజం మధూ మనమింక శాశ్వతంగా ఇండియాకి వెళ్ళిపోతున్నాం.”

పక్కన పిడుగు పడ్డట్టు అదిరి పడిందామె. “శాశ్వతంగా నా ముఖం చిట్లిస్తూ అతనివైపు చూసింది. ఇటు చూడు నా ముఖం వైపు చూసి చెప్పు. శాశ్వతంగా వెళ్ళి పోతున్నామా! ఏందట. ఇప్పుడేం జరిగిందంట. తీంత హఠాత్తుగా వెళ్ళాల్సిన అగత్సం ఏమొచ్చిందో! ఇలాంటి ఆలోచన ఎందుకు వొచ్చిందసలు నీకు?
ఎక్కడెక్కడి వాళ్ళందరూ ఏదోక విధంగా ఇకికడకు రావాలని కోరుకుంటుంటే ఇలాంటి భూలోక స్వర్గాన్ని వొదులుకుని ఇండియాకి పోవాలా! ఇది సాధ్యమయ్యే పనేనా!
“ఏముందని వేళతావక్కడికి. బ్లడీ రోగ్సు… సెన్స్‌లెస్‌ ఫెలోస్‌… ఇండియా ఇండియా అంటున్నావు. ఏముందా కల్చర్‌ లెస్‌ ఫెలోస్‌ దగ్గర. ఎక్కడ చూసినా ఏదో ఒక గొడవ తప్ప ఏముంది. టూమచ్‌ పొల్యూటెడ్‌. హూ… అలానిటి చోటికి పోతావు. ఈ హెవెన్‌ వొదులుకుని అక్కడ నువ్వు చేసేదేమిటో!

“అందుకే నువ్వలా ఆలోచిస్తున్నందుకే… నువ్వలా మాట్లాడుతున్నందుకే… నువ్వలా ప్రవర్తిస్తున్నందుకే ఇంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి వొచ్చింది. ఎక్కడ పుట్టామో ఎలా పెరిగామో మర్చిపోతూ.. మన ఊళ్ళనీ, మన వాళ్ళనీ అసహ్సించుకుంటున్నందుకే నేనీ నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ ఇంకా ఎక్కువ కాలం ఉంటే అసలు నువ్వు నువ్వుకాకుండా పోయేటట్టున్నావు. ఇండియాలో ఉండే వాళ్ళు మనుషులే కాదనే పరిస్థితికి వొచ్చేటట్టున్నావు. అందుకే… అందుకే నేను తట్టుకోలేక పోతున్నావీ.”
“ఉన్న విషయమే అన్నాను. తప్పేందంట. నేను చెప్పినవన్నీ నిజాలు కాదా!”

“అవును నిజాలే. మరి నువ్వు చేసిందేమిటి? నాన్న చనిపోయినప్పుడు ఇండియాకి పోతే… ఏం చేశావో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. అక్కడి వాళ్ళతో ఎలా బిహేవ్‌ చేశావో గుర్తు చేసుకో.”

“ఓహో అదా సంగతి. ఇండియా నుండి వొచ్చినప్పటి నుండీ అంటీముట్టకుండా ఉండున్నావు. అందుకా ఈ రాద్ధాంతమంతా. ఏం చేశాను. మీ ఊళ్ళో ఉండకుండా పోయి హోటల్లో ఉన్నాను. అదేనా నేను చేసిన తప్పు.

వాళ్ళని రాసుకోని పూసుకోని తిరగలేదంటారు. అంతేకదా! వాళ్ళతో మనకు అంత పనేందంట. మీకు తెలియదు. వాళ్ళతో మాట్లాడితే నాకది కావాతీ ఇది కావాలి అంటూ గొంతెమ్మ కోరికలు కోరతారు. మనకేమన్నా ఊరకే వస్తున్నాయా డాలర్లు. రాత్రింబవళ్ళూ కంప్యూటర్లతో కుస్తీలు పడుతుంటే వొస్తున్నాయి. అమెరికా నుండి వొచ్చాడంటే చాలు. నాకేమిస్తాడో… నాకేమిస్తాడో నని అందరూ ఎదురు చూసేవాళ్ళే.”

అదేనా ఫైట్‌ దిగినప్పటి నుండీ గమనిస్తూనే ఉన్నాను. పనీ లేదంటావు. కాదు రాలేదంటావు. మినరల్‌ వాటర్‌ తేలేదంటావు. మనుషులు డర్టీ డర్టీ. నీళ్ళు డర్టీ డర్టీ… ఛీ… ఛఈ… వెధవ ఇండియా వెధవ ఇండియా అని విన్న సార్లు అన్నావ.వీ అసలు మనం ఇండియా అని ఎన్ని సార్లు అన్నావు. అసలు మనం అక్కడికి ఎందుకు పోయామో గుర్తుందా నీకు. నా జన్మకు కారకుడైన నా తండ్రి చనిపోతే పోయామా! పుట్టెడు దుఃఖంతో ఉన్న మా అమ్మని ఓదార్చాల్సింది పోయి, అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేవు. ఎవరూ నాకు అమర్చి పెట్టలేదనడం ఏమన్నా బాగుందా!

“అవును అమెరికా నుండి ఇండియాకి పోయేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారో మీకు తెలియదా! ఎప్పుడు ఏమౌతుందోననే భయమండీ. హెత్త పాడైతే మళ్ళీ అమెరికాక తిరిగి రావడం ఇబ్బంది కదా! అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. అది కూడా తప్పేనా!”

తప్పు కాదనుకునే వాళ్ళకు తప్పుకాదు. మనం ఎక్కడ నుండి వొచ్చామో గుర్తుంటేను వ్యా విధంగా ప్రవర్తించవు మావాళ్ళు నన్ను పెనిచి పెద్ద జెయ్యడానికి, అందరితో సమానంగా చదువుకోవడానికీ ఎంత కష్ట పడ్డారో నీకేం తెలుసు. వాళ్ళు తిన్నారో తినలేదో ఆ భగవంతుడికే తెలియాలి. రెండే రెండు జతల బట్టబండేవి వాళ్ళకు. వాటితోనే సరిపెట్టుకుని, నాకు అడగకుండానే అన్నీ అమర్చేవాళ్ళు. ఎవరైనా ఏమైనా అంటే ఒక చిరునవ్వుతో కొట్టేసే వాళ్ళు.
అప్పుడు అలా కష్టాలూ కన్నీళ్ళలో బతికారు. ఇప్పుడు మీకు కావలసినంత డబ్బు తీసుకోండంటే…, మా కెందుకయ్యా మేమేం చేసుకుంటాం. నీ దగ్గరే ఉంచుకో అంటారు నవ్వుతూ… వాళ్ళేనా నీ వెధవ డాలర్లు కావాలని వెనిటపడతారంటున్నావు.

అసలు అమెరికా రావాలనే కోరికే నాకు లేదు తెలుసా!”
“అయితే ఎందుకు వొచ్చావు ఇక్కడికి? నువ్వు రాకుండా ఉంటే నిన్ను మేరేజ్‌ చేసుకునే దాన్నే రాదు గదా!” అక్కసుగా చెప్పింది మాధవి.
“మా నాన్న మాట కాదనలేక వొచ్చాను. వాళ్ళు అమెరికా వెళ్ళారు. వీళ్ళు అమెరికా వెళ్ళారని గొప్పగా ఊళ్ళో చెప్పుకుంటుంటే… నాయనా నువ్వు కూడా అమెరికా పోతే చూడాలని ఉందరా అనేవాడు. ఆయన మాట కాదనలేక ఆయన కోరిక తీర్చడానికే వొచ్చాను గానీ నాకేం అమెరికా అంటే మోజై రాలేదు.”

నీకు మోజు ఉండే వొచ్చావో లేకుండా వొచ్చావో నాకు అవసరం లేదు. అమెరికాసంబంధం అయితేనే చేసుకుంటానని పట్టుబడితే మానాన్న నీకు ఇచ్చి చేశాడు. ఇప్పుడు నువ్వు ఏదో సాకు చెప్పి ఇండియాకి రీపోదామంటే ఎలా వీలు పడుతుంది. ఇటీజ్‌ జెస్ట్‌ ఇంపాజిబుల్‌. కలలో కూడా జరగని బిపని. ఏవేవలో సాకులు చెప్పి ఇండియాకి పోవాలనడం మీనింగు లెస్‌ కదా!

“ఇంత తొందరగా నిర్ణయం తీసుకోకపోతే ముందుముందు ఇంకా అనర్థాలు జరిగే అవకాశం ఉంది.

మా ఇంటి దగ్గర ఉండలేదు సరే! మీ ఇంటి దగ్గర ఉండడానికి ఏమైంది. కన్న తల్లిదండ్రులు కూడా నీకు పరాయి వాళ్ళుగా కనిపించారంటే ఏమనాలి నిన్ను. ఇంక నువ్వు ఎప్పటికీ అమెరికా వొదిలి పెట్టి రావాలనుకోవడం లేదన్న ఊహే నాకు భరించలేనిదిగా అనిపించింది.

అరే - మరీ ఎంత అన్యాయంగా మాట్లాడావు. కాలు కింద పెడితే మట్టంటావు. పేడంటావు. దుమ్మంటావు. ధూళంటావు. నీకు ఒక విషయం తెలుసా! నేను చదువుకునేటప్పుడు ఎక్కడ కాస్తె ఖాళీ దొరికినా గేదెల దగ్గర పేడ ఎత్తేసేవాణ్ణి. పొలం పోయేవాణ్ణి. పొలంలో అన్ని రకాల పనులూ చేసేవాణ్ణి. ఇప్పబిటికీ తల్చుకుంటే మట్టి పరిమళం ఎంత మధురంగా వీంటుందో! పొలాల్లో వీచే పైరగాలి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో తెలుసా!

వీటన్నిటనీ వొదిలేద్దాం. అమ్మా నాన్నలంటే మన జన్మకు కారకులు గదా! అక్కడకువొచ్చిన మీ అమ్మా నాన్న తోనైనా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడావా! అంటీ ముట్టనట్టు వాళ్ళెవరో పరాయి వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడతావా! ఈజిట్‌ నాట్‌ ఇన్‌హ్యూమన్‌?”

“అవును నాకు అక్కడ ఉన్నన్ని రోజులు ముళ్ళమీద కూర్చున్నట్లు ఉన్నమాట నిజం. ఇక్కడ అలవాటు పడ్డ తరువాత ఇంక ఎక్కడా ఉండలేము కదా! అందరూ అంతేనా! మనమేనా! పదే పదే ఆ విషయం గుర్తు చేస్తావెందుకు? ఇప్పటికి ఎన్నిసార్లు ఆ విషయమ్మీద వాదించుకున్నాం. నువ్వెన్ని సార్లు చెప్పినా నేనింతే. ఒకసారి అమెరికాకు వొచ్చేశాం గదా! ఇంకా పదే పదే ఇండియా గురించి మాట్లాడటం ఎందుకు. అందినంత మేరా లక్సరీస్‌ అనుభవించడానికీ గదా మనుషులు నానా పాట్లూ పడేది. అలాంటి స్వర్గసుఖాలు ఇంత అందుబాటులో ఉంటే నీలాగా ఆలోచించే వాళ్ళని పిచ్చివాళ్ళని బిగాక ఏమంటారు.”

“అవును నేను పిచ్చివాడినే. మనుషులతో కలవాలనీ, మాట్లాడాలనీ, వాళ్ళతో గడపాలనీ అనుకునే వాణ్ణి కదా… నేను పిచ్చివాడినే. నువ్వేమో గొప్ప తెలివి కలిగిన దానివి. ఎంత అమెరికాలో ఉన్నా మనుషులు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తారని నిన్ను చూసిన తరువాతే తెలిసింది.

అరే… సొంత తమ్ముడు… పాపం… ఇంజనీరింగు చేరడానికి అత్యవసరంగా కొంచెం డబ్బు సర్దమని మీ నాన్న అడిగితే నువ్వేమన్నావో గుర్తు చేసుకో! ఏకన్న కూతురైనా అలా మాట్లాడుతుందని ఏ తండ్రైనా అనుకుంటాడా! వాళ్ళకిస్తే మళ్ళీ రావని ఎంత పెద్ద అబ్ధం ఆడావు ఆ రోజు. నీ సొంత వాళ్ళతోనే అంత కర్కశంగా ప్రవర్తించే దానివి ఇంక పరాయి వాళ్ళు నీకొక లెక్కా.”

“అవును… నేనంతే… అంతే… ఏందంట! నేనెలా ఉండాలో నాకు బాగా తెలుసు. అన్నీ మీ ఇష్టమొచ్చినట్టు చెయ్యాల్సిన అవసరం లేదు. నాకు తోచింది నేను చేస్తాను. ప్రతి విషయంలో మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు.”

“నువ్వు నా భార్యవు అయి ఉండి కూడా ఇంత నిర్దయగా, అమానుషంగా ప్రవర్తిస్తుంటే నేను సహించలేను. నువ్వు ఈ విధంగా ఆలోచించడమే ఊహించలేకుండా ఉన్నాను. నాకు నాదేశం కావాలి. నా ఊళ్ళు కావాలి. నా వాళ్ళు కావాలి. వాళ్ళు ఆప్యాయతా అనురాగాలు కావాలి. నా సంస్కృతీ సంప్రదాయాలు కావాలి. ఇదొట్టి విడదీసే సంస్కృతి. వాణిజ్య సంస్కృతి. సంగీతం, సాహిత్యం…జీవన విధానం అంతా వ్యాపారం… వ్యాపారం. వాణిజ్య విచ్ఛిన్నకరి సంస్కృతి. ఇక్కడ మనశ్శాంతి లేని వాళ్ళంతా మన దేశంలో స్వామీజీల్నీ, బాబాల్నీ ఆశ్రయించి అక్కడే కాలం గడపడానికి వొస్తున్నారు. ఆ విషయం తెలియడం లేదా ఇక్కడి వాళ్ళెంత అశానితితో ఉన్నారో!
నేను ఇక్కడికి వొచ్చేటప్పుడే వీలైనంత త్వరలో ఇండియాకి పోవాలనుకున్నాను. ఇంత కాలం మా నాన్న ఉన్నాడు కాబట్టే ఆయన కోసం అతి కష్టమ్మీద ఉన్నాను. ఇంక ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరంలేదు.”

“ఏ ముందండీ అక్కడ. అంతలావున మురిసిపోతున్నారు. ఎటు చూపినా అవినీతి, లంచగొండితనం, కులాల కుమ్ములాటలు, కుళ్ళురాజకీయాలు, ఎక్కడ చూపినా అభద్రిత, అసౌకర్యం, అలాంటి చోటకుపోయి ఏం చేస్తారంట.”

“ఇక్కడ ఏ నిముషంలో ఏం జరుగుతుందో… ఏ నిమిషంలో ఎవరు శతమై పోతారో ఇక్కడి వాళ్ళకే తెలియకుండా ఉంది. అయినా నా దేశానికి నేను పోవడానికి. తీవన్నీ నాకు అనావసరమైన విషయాలు.”

“ఏం చేస్తారో! అక్కడికి పోయి అంతగా సాధించేదేమిటో కొంచెం చెప్పండి చూద్దాం!”
అక్కడకు పోతే మనుషుల్తో మాట్లాడతాను. ఆప్యాయతలు పంచే స్నేహితుల్తో మాట్లాడతాను. అన్నిటికీ మించి నన్ను పెంచి, పోషించి, చదివినిచిన నా దేశం కోసం పనిచేస్తాను.

అక్కడ ఉన్నప్పుడు సంగీతం అంటే ఎంతగా పడి చచ్చేవాణ్ణి. పాటల పోటీల్లో ఎప్పుడూ ప్రైజ్‌ వొచ్చేది నాకు. బొమ్మలు ఎంత బాగా వేసేవాణ్ణి. ఎన్నెన్నో గొప్ప గొప్ప సినిమాలు చూసేవాణ్ణి. అవన్నీ ఇక్కడకు వొచ్చాక ఏమైపోయాయో! సంపాయించడం, కొనుక్కోవడం, ఖర్చు చెయ్యడం, కూడ బెట్టడం… ఇంతేనా జీవితమంటే. ఇక్కడకు వొచ్చాక ఒక్క బొమ్మ గీయగలిగానా! గొంతెత్తి ఒక్క పాట పాడగలగానా! ఏమైపోయింది నా ఆర్టంతా! ఈ యంత్రాల మధ్య, యంత్రాల వంటి మనుషుల మధ్య నలిగి నలిగి నాశనమైపోయింది.
పరుగు … పరుగు తప్ప ఏముందిక్కడ. ఎటు చూసినా యాంత్రిక జీవనమే. అటు మనుషులు ఇటు యంత్రాలు. ఏమి తేడా ఉంది? మనసు స్పందనలకి… లాలిత్యమైన హృదయానికి… అనుభూతి చెందే మనసులకు రాతి కట్టడాల మధ్య సాంత్వన ఎలా దొరుకుతుంది. ఇంక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను నేను.
నాకు శ్రమను నమ్ముకునే మనుషఉలు కావాలి. ఆత్మయంగా అల్లుకునే మనుషులు కావాలి. అందుకే నేను వెళ్ళడానికే నిర్ణయించుకున్నాను.”

“ఇది నీ ఒక్కడి వ్యవహారం కాదు. నువ్వు ఇక్కడ ఉన్నావనే నిన్ను పెళ్ళి చేసుకుందినేను. ఉన్నట్టుండి ఇండియాకి వెళతానంటే ఎలా వీలవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. నా కలల్ని కుప్ప కూల్చుకుని ఇండియాకి రాలేను.”

“పెళ్ళి చేసుకునేటప4డు అమెరికాలోనే ఉన్నాను కాబట్టీ ఉన్నానని చెప్పాను. అంతేగా నీ శాశ్వతంగా ఇక్కడే ఉంటానని ఎప్పుడూ నీతో చెప్పలేదే! అదే ఉద్యోగం పీకేస్తే అప్పుడేమి చేస్తావు?”

“ఇంకో చోట ప్రయత్నిస్తాం. అదీ పోతే ఇంకోటీ… ఎంతమంది ఇల్లీగల్‌గా ఉండడము లేదిక్కడ. అందరూ పోతే నలుగురితో పాటే మనమూలనూ… అంతేగానీ ఇప్పుడు పోవడానికి మాత్రమూ కుదరదు.

మీకు తెలుసా! నాకు పుట్టే కొడుకు ఇండియాలో కాకుండా అమెరికాలోనే పుట్టాలని అక్కడ ఉన్నప్పుడు అబార్షన్‌ చేయించుకున్నాను ఎందుకోసం. పుట్టుకతోనే నా కొడుక్కు అమెరికా సిటిజన్‌షిప్‌ వొస్తుందనే ఆశతోనే కదా నేనలా చేసింది.
“ఆ రోజు నువ్వు నన్నడిగేం ఆ నిర్ణయం తీసుకోలేదు.” నీ ఇష్టప్రకారమే అలా చేశావు.

“అన్నీ నిన్ను అడిగి చెయ్యాలా వంటి నాకూ కొన్ని అభిప్రాయాలుంటాయి. ఏదేమైనా ఇప్పుడు తీండియాకు వెళ్ళడానికి మాత్రం వీల్లేదు. అసలా మారు ఎలా అనగలుగుతున్నావు వినోద్‌. ఇప్పటికీ ఆ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను నేను.

అక్కడకు వెళ్తే నా ప్రెండ్స్‌ందరికీ నా ముఖం ఎలా చూయించాలి. ఇంక చస్తే ఇండియాకి రానని చెప్పేశాను. మా వాళ్ళతో ఎవరితో సరిగా మాట్లాడను కూడా మాట్లాడడం లేదు. ఇప్పుడు అక్కడకు పోతే వాళ్ళంతా ఎలా రివీవ్‌ చేసుకుంటారు నన్ను. నీరే ఆలోచించండి.”

అక్కడకు వెళ్తే నా ప్రెండ్సందరికీ నా ముఖం ఎలా చూయించాలి. ఇంక చస్తే ఇండియాకి రానని చెప్పేశాను. మా వాళ్ళతో ఎవరితో సరిగా మాట్లాడను కూడా మాట్లాడడం లేదు. ఇప్పుడు అక్కడకు పోతే వాళ్ళంతా ఎలా రినీవ్‌ చేసుకుంటారు నన్ను. మీరే ఆలోచించండి.”

“అందుకే ఎప్పుడూ చెబుతూ ఉంటాను నీకు. ఎంత డబ్బున్నా మనిషికి అహంకారం పెరగకూడదని. అమెరికాలో ఉంటే మాత్రం మనుషుల్తో మాట్లాడకూడదా! అంత గర్వం పెరుగుతుందా! నీకు అవసరానికి మనుషుల్ని ఉపయోగించుకుని వొదిలేయడమే తెలుసు. ఆ తరువాత వాళ్ళు ఏమైపోయినా నీకు అవసరం లేదు.”
అంతా లెక్కలు లెక్కలు… ఏ పని చెయ్యాలనాన లెక్కలు. ఏమి తినాలన్నా లెక్కలే… ఎక్కడికి వెళ్ళాలన్నా లెక్కలే… ఈ కీలిక్యులేషన్స్‌తో ఎంత విసిగి పోయాన్నేను. అందరితో ఎందుకు కలసిపోలేక పోతున్నానో తెలుస్తుందా!

ఇక్కడికి వొచ్చిన వెంటనే అర్థమైంది. ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేనని. అయినా పంట బగువున భరిస్తూ ఇంతత కాలమూ నెట్టుకొచ్చాను. అసలీ నేచర్‌లోనే అడ్జస్ట్‌ కాలేకపోతున్నాను నేను. అందరితో మామూలుగా ఎందుకు కలిసిపోలేక పోతున్నానో తెలుస్తుందా! ఒక లిమిటెడ్‌ ఏరియా. ఈ సర్కిల్లోనే గిరిగీసుకుని ఉండడం నావల్ల కాదు. విశాలమైన భారతావనిని చుట్టి రావాలని, ఎన్నెన్నో అందాలను తనివి తీరా ఆస్వాదించాలని ఎన్నో సార్లు అనుకునే వాణ్ణి, కళలకు కాణాచి అయిన నా దేశాన్ని వొదిలి ఇక్కడ ఎవరికీ తెలియకుండా ఏదో మారుమూల డాలర్లు సంపాయించుకుంటూ, కూడబెట్టుకకుంటూ, వాటిని చూసుకుంటూ బతకడం నావల్ల కాదు.

అస్సలు ఇదేనా జీవితమంటే! డబ్బుకి అతీతమైన జీవితం చాలా ఉంది. ఆ విషయం నీకు తెలియదు. కనీసం తెలుసుకోవాలని కూడా ప్రయత్నం చెయ్యవు.
నేను ఇక్కడ ఉంటున్నా నా స్నేహితులూ, బంధువులూ… అందరూ… అందరూ నా కనుసన్నల్లోనే ఉన్నారు. ఎప్పుడూ నువ్వంటుంటావు గుర్తుందా! ఎందుకండీ గంటలు గంటలు వాళ్ళతో మాట్లాడి మనీ వెస్ట్‌ చేస్తావని. అది వెస్ట్‌ అని నేనెప్పుడూ అనుకోలేదు. ఎప్పటికప్పుడూ నువ్వంటుంటావు గుర్తుందా! ఎందుకండీ గంటలు గంటలు వాళ్ళతో మాట్లాడి మనీ వెస్ట్‌ చేస్తావని. అది వెస్ట్‌ అని నేనెప్పుడూ అనుకోలేదు. ఎప్పటికప్పుడు ఇండియాలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే ఉన్నాను. నా ఫ్రెండ్స్‌ అందరూ అంత దూరంలో ఉన్నా నాతోనే ఉన్నట్టుంటారు.

ఎప్పుడెప్పుడు అక్కడకు పోతానా అని వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. పోయీ పోవడంతోనే అందరమూ కలిసి మా ఊళ్ళో చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుండీ నేను ఎంత ఆనందంగా ఉన్నానో చెప్పలేను.

మనిషికి కావాల్సింది డబ్బే కాదు. ఆనందంగా ఉండడం చాలా ముఖ్యం. మనమే కాదు మన చుట్టు పక్కల వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలని కోరుకోవాలి.”
“మీరు ఎన్ని రకాలుగానైనా చెప్పండి. నేను మాత్రం ఇండియాకి రావడం జరగదు. నాకు ఊహ తెలిసి నప్పటి నుండి నా కోరిక ఇది. ఇక్కడికి రావాలి. ఇక్కడే ఉండి పోవాలి. నా పిల్లలు పెద్దవాళ్ళయి ఇక్కడే గొప్ప వాళ్ళు కావాలి. ఈ కలల్తోనే బతికాను. అందుకే ఎంత మంచి మంచి సంబంధాలు వొచ్చినా కేవలం అమెరికా సంబంధం కోసమే ఎన్ని సంవత్సరాలో ఎదురు చూశాను.

అయినా మీరు పిచ్చివాళ్ళు కాకపోతే ఇక్కడికి వొచ్చేవాళ్ళేగానీ, తిరిగి పోయే వాళ్ళు ఎవరైనా ఉంటారండీ. మిమ్మల్నీ చూస్తుంటేనే జాలేస్తుంది పాపం…”
“నా గురించి నువ్వంత జాలి పడాల్సిన అవసరమేం లేదులే. నేను ఎట్లా ఉండాలో, ఎక్కడ ఉండాలో బాగా తెలుసు. ఎలా ఉంటే సంతోషంగా ఉంటామో కూడా తెలుసులే. సాహిత్యమూ, కళలూ, సంస్కృతితో ముడి పడిపోయిన జీవితం నాది. కేవలం కొంతకాలం అత్యవసరమైతేనే వాటన్నిటికీ దూరంగా ఉన్నాను. ఇప్పుడు ఆ అవసరం కూడా తీరిపోయింది. ఆ కలలు కన్నా మా నాన్న పోయాడు. మా అమ్మ ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది. నా అవసరం ఎక్కడ ఉందో అక్కడికీ వెళుతున్నాను.”
“సరే నువ్వు అంత గఠ్ఠిగా నిర్ణయించుకున్న తరువాత, నాకు మాత్రం అభిప్రాయం ఉండదా ఏమిటి?”
“నేనేం కాదన్లేదే! నీ అభిప్రాయం కూడా చెప్పు.” ఆసక్తిగా ఆమె వైపు చూస్తూనే అన్నాడు.

“ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు. నాది కాదనుకుని వొచ్చాను ఆదేశాన్ని. ఈ దేశంలోనే ఉండిపోవాలని నేను కన్నా కలల్ని నిజం చేసుకుంటాను.”
“అంటే నాతో రావా!”
“రావాల్సిన అవసరము లేదు. నిర్ణయం తీసుకుంది నువ్వు. నీ వెంటే బడి రావాల్సిన అవసరం లేదు నాకు.
నాకు నేను స్వతంత్రంగా బతగ్గలను. ఇంతకాలం అమెరికాలో ఉండి ఆ మాత్రం నేర్చుకున్నానులే!”
“మధూ నువ్వు ఏమాలోచిస్తున్నావో తెలుసా నీకు!”

“నాకు బాగా తెలుసు. నీకే ఏమీ తెలియదు. వొట్టి సెంటిమెంటల్‌ ఫూల్‌వి. ఇప్పుడు కాలం ఎలా ఉంది. ఎదగాలి. మనిషి పైపైకి ఎదగాలి. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదగాలి. కింద ఉన్న వాళ్ళతో నీకేం పని. నువ్వెందుకు ఆలోచిస్తావ్‌! ఆలోచించే వాడు ఎప్పటికీ పై మెట్టు ఎక్కలేడు.

ప్రపంచమంతా ఒకవైపుకు పోతుంటే పిచ్చివాడిలాగా నువ్వు మనుషులు కావాలి. మనుషులు కావాలి మనుషుల్తోనే ఉంటాను అంటూ మాట్లాడుతున్నాను. అప్పుడప్పుడూ నువ్వు చెప్తుంటే ఏమోననుకునేదాన్ని. నిజంగా నువ్వు పిచ్చి వాడివే! నువ్వు చెప్పినవన్నీ నేనూ ఆచరించాలని చెప్పేవాడివి. ఇంకానయం నీ మాటలు విని ఉంటే& నాక్కూడా పిచ్చి ఎక్కి ఉండేది. ఇండియా పిచ్చి…. అమ్మో…”

“అయితే నాతో రానంటావు. అంతేనా… ఇదే.. చివరి మాటా! మీ అమ్మా నాన్నలతో మాట్లాడింతరువాత నీ నిర్ణయం చెప్పు.”
“ఎవ్వరితోనూ మాట్లాడాల్సిన అవసరము లేదు. నేనేం చిన్న పిల్లనేం కాదు. నాకేం కావాలో… నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు.”
నువ్వు వెళ్ళిపోయినా… ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటాను.” ధీమాగా చెప్పింది.

“ఆ అవకాశం ఎంత మాత్రమూ లేదు” నవ్వుతూ చెప్పాడు వినోద్‌.
“ఏం! ఎందుకనీ! నాకు ఆ మాత్రం హక్కులేదా!” అడిగింది మాధవి.

“మన ఎస్‌ట్స్‌ ఇక్కడ ఇంకేమీ లేవు. అన్నిటినీ ఎప్పుడో సేల్‌ చేసేశాను. ఒక వీక్‌డేస్‌లో ఈ ఇంటిని వెకేట్‌ చెయ్యాలి వాళ్ళొచ్చి స్వాధీనం చేసుకుంటారు”.
“వ్వాట్‌ నిజమా!”

“యస్‌.అన్న ట్రాన్సాక్ష్‌న్స్‌ అయిపోయాయి. ణా జాబ్‌కి రిజిగ్నిషన్‌ లెటర్‌ కూడా ఇచ్చేశాను. ఇక్కడ ఇక మనదంటూ ఏమీలేదు.”

“షిట్‌ అంతపని చేశావన్న మాట. ఆమెకు నాభి నుండి ఏడుపు తన్నుకు వొచ్చేసింది. ఒక్కసారిగా ఉన్నట్టుండి చుట్టూ ఎడారి ఆవరించినట్టు అనిపించింది. అన్ని దారులూ మూసుకుపోయాయని తెలిపి భోరుమని ఏడ్చింది.

ఆమె ఉన్న పరిస్థితి చూస్తే జాలేసింది వినోద్‌కి. ఎంతైనా ఇన్నాళ్ళూ నాతో కలిసి కాపురం చేసిన భార్య కదా! తెలిసో తెలియకో ఏదో అటుంది. ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా నా వల్ల కాలేదు. ఇంక తనకు నేనేం చెయ్యగలను అనుకుంటూ దీర్ఘంగా ఆలోచించాడు.

“నా పరిధిలో నీకు ఏ సహాయం అవసరమైనా చేస్తాను. దానికి నువ్వేం మొహమాటపడాల్సిన అవసరం లేదన్నాడు.
ఆ మాటలు విని అతని వైపు చురుగ్గా చూసింది.

ఏడుపును తనలో తాను దిగమింగుకుని ఒక నిర్ణయానికి వొచ్చినట్టుగా “ఆల్‌రైట్‌” మీ ఇష్టప్రకారమే చెయ్యండి” అంటూ చెంపల మీదుగా జారిన కన్నీటిని తుడుచుకుంది.
ఎందుకలా అంటుందా అని ఆసక్తిగా ఆమె వైపు చూశాడు.

“నాకూ ఫ్రెండ్స్‌ ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరకు వెళతాను.” చివరిగా తన నిర్ణయాన్ని చెప్పేసింది.

“సరే నీ ఇష్టం నేను చెప్పాల్సిందంతా చెప్పాను. మీ వాళ్ళకు కూడా ఒకసారి ఫోన్‌ చేసి చెప్పేస్తే నా బాధ్యత తీరిపోతుంది.
ఇంకో విషయం నానీ విషయం ఇంకా ఏమీ మాట్లాడుకోలేదు మనం. నానీని నువ్వు తీసుకుంటావా! నన్ను తీసుకుని వెళ్ళమ్‌టావా! “అది కూడా నీ నిర్ణయానికే వొదిలి వేస్తున్నాను.” అవకాశాన్ని ఆమెకీ ఇచ్చాడు.

ఈ పరిస్థితుల్లో నేను ఇంకొకరిని భరించలేను. మీరే తీసుకు వెళ్ళి మీ ఇష్టానుసారం పెంచుకోండి” కొంచెం. నిష్ఠూరం ధ్వనించింది మాటల్లో.
“సరే నీ ఇష్టం అలాగే తీసుకు వెళతాను. అంతకంటే సంతోషం ఏముంటుంది! అన్నాడు వినోద్‌.

అంతా నిర్ణయమై పోయింది. అయినా తనతో తన భార్య రానందుకు కొంత బాధగా ఉంది. అయినాతన కోరిక ప్రకారం ఇండియా పోతున్నందుకు వినోద్‌ మనస్సు ఆనంద తరంగాల్లో విహరిస్తూ ఉంది. ఇండియాకి పోయి ఏమేం చెయ్యాలో ననే ఆలోచనలతో సతమతమౌతున్నాడు.

మాధవి మనస్సు కల్లోల సాగరంలా ఎగసి పడుతూ ఉంది. తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడంలో ఆమె తలమునకలైపోయింది.

Share/Save/Bookmark

కథలు

ఒక అభిప్రాయం

  1. ఆరి సీతారామయ్య జులై 2008 1

    మంచికంటి అంటేనే మంచి కథ అని అర్ధం. కాని ఈ కథ మంచికంటి గారు ఇదివరలకు రాసిన కథలకంటే భిన్నంగా ఉంది. ఇందులో పాత్రలు మూస పాత్రల్లా ఉన్నాయి. అదీగాక పాత్రల మనస్తత్వం గురించి గాఢంగా ఆలోచించలేదేమో అనికూడా అనిపించింది.

    వినోద్ ని సహృదయుడుగా చిత్రించారు మంచికంటి. కాని అతను తన భార్యకు చెప్పకుండానే ఇద్దరూ కలిసి ఉంటున్న ఇంటిని అమ్మేశాడు.

    “నానీని నువ్వు తీసుకుంటావా! నన్ను తీసుకుని వెళ్ళమ్‌టావా! అది కూడా నీ నిర్ణయానికే వొదిలి వేస్తున్నాను.” అన్నాడు వినోద్. అదికూడా అంటే? ఇంటి విషయం గురించి మాట్లాడిన తర్వాత వచ్చిన విషయం ఇది. ఇంటి విషయంలో ఆమె నిర్ణయం లేదు. మరి “అదికూడా” అనటంలో ఉద్దేశం?

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో