Aug2008
ఆగస్టు 2008 సూచిక
- అదృశ్య దృశ్యాలన్నీ…. – కమలాకర్ బొల్లోజు
- కొండపల్లి బొమ్మ -సి.హెచ్.ఉషారాణి
- మరణ శాసనం -డా.జి.వి. రత్నాకర్
- మనుషులు వయమౌతున్నారు. – మంచికంటి
ప్రత్యామ్నాయ సాహిత్య పత్రిక
Aug2008
Aug2008
- కమలాకర్ బొల్లోజు
ఒక్కొక్క ప్పుడు బండ రాయిలా
మారిపోతున్నపుడు
నిన్న పాడిన కోయిల పాట లా
నువు పుడతావు… మొత్తం చదవండి »
Aug2008
-సి.హెచ్.ఉషారాణి
అమ్మమొఖం తెరిపిగా వుంటుంది.
కతికితే అతకదంటున్న ప్లేట్లు,
అటు, ఇటుగా తిరగబడి వున్న నా ఫొటోలు,
నన్ను దాటి పోలేదు. మొత్తం చదవండి »
Aug2008
-డా.జి.వి. రత్నాకర్
వ వల పల్లె గుండెల గాయం
పోతురాజు బండని అంకమ్మ చెట్టుని
కులదైవం చెన్నకేసులు సోమిని
నిలదీసి నాయం చేయమని అడుగుతుంది.
మొత్తం చదవండి »
Aug2008
- మంచికంటి
మనుషులు వయమౌతున్నారు.
బతికిన నాలుగుక్ష్షణాలు
సజీవంగా బతకడమే కావాలి
మనిషిగా పుట్టిన మనిషికి మొత్తం చదవండి »
Aug2008
-పలమనేరు బాలాజీ
ఇంట్లోకి అడుగుపెడుతుంటే అమ్మ గబగబా ఎదురొచ్చింది. నాన్న నా వైపే చస్త హాల్లో నిలబడ్డాడు. ఆయన అప్పుడే ఆఫీసు నుండి వచ్చినట్లుంది. మొహంలో అలసట కనిపిస్తోంది.
”ఉత్తరం వచ్చిందా” అడుగుతోంది అమ్మ-నా వెహంలోకే గుచ్చిగుచ్చి చస్త. నిస్తేజంగా ఆమె వైపే చస్త అక్కడే నిలబడిపోయను. ఆమెకు బదులు చెప్పే శక్తి నాకు లేకపోయింది.
ఆమె మొహంలో ఇంకా ఏదో ఆశ మిణుకు మిణుకుమంటున్నట్లు-”ఫోన్ ఏమైనా వచ్చిందా పోనీ” ఆమె గొంతునిండా వేదన, ఆశ, కలగలసి పోయయి. మొత్తం చదవండి »
Aug2008
-పి. అనురాధ
అమ్మో! అప్పుడే ఇంత చీకటి ఎలా అయింది? అంతేకదా నాలుగ్గంటలకి కూర్చున్నావ్. టైం చూడు అప్పుడే ఎనిమిది కావొస్తుంది. ఏమనుకున్నావ్…ఏదీ నీ కోసం ఆగదు..అమ్మ ఒడిలో ఆడుకునే పాపే ఆగలేక నేలమీద ఎప్పుడు ప్రాకాలా అని ఎగురుతుంది. అలాంటిది ఈ కాలం ఆగుతుందా నీ పిచ్చి గాని చూడు ఆకాశం ఎంత నిర్మలత్వాన్ని పొందిందో. పగలంతా భగభగమండే ఎండలో అలసిన గీతలేవీ కనిపించని ఆ ఆకాశపు అందం ఎంత బాగుందో… మొత్తం చదవండి »
Aug2008
- రమ్య గీతిక.కే
పద్దెనిమిది ఏళ్ళ వైవాహిక జీవితం లో ఒక గృహిణిగా బాధ్యతలను విజయవంతంగా నెరవేర్చాను, అన్నీ సజావుగా గడిచి పోయాయి. తన జీవితం లో తీరని కోరిక ఒకే ఒక్కటి అది తీర్చడానికి రత్నాలాంటి పిల్లలు ఉన్నారు. బంగారం లాంటి శ్రీవారి తోడు తో తన జీవితం నిశ్చింత గా సాగుతోంది ఒక మనిషికి ఇంతకంటే కావల్సింది ఇంకేముంది! సంతృప్తి గా అనుకుంది వసుధ.
“అమ్మా నీతో మాట్లాడాలి” కూతురి మాటలకి చెప్పమన్నట్లుగా చిరునవ్వుతో చూసింది.
“అమ్మా నేను హిస్టరీ చదువుతా.”
మొత్తం చదవండి »
Aug2008
లింబాద్రి బతుకంత బర్రె మీదనే. అది బర్రెంటే బర్రె గాదు గౌడి బర్రె బిందెడుపాలు. యాడాదికో ఈత.
కొన్ని బర్లు ఈనే ముందు ఆరునెలలు పాలియ్యయి. లింబాద్రి బర్రె అట్లగాదు. వారమంటే వారం రోజులే! ఆ వారం గూడా పిండుకుంటే ఇండికి సరిపడ పాలిస్తది కానీ జిగురు జిగురుంటయని లింబాద్రి పిండడు. మొత్తం చదవండి »
Aug2008
-పెరుగు రామకృష్ణ
ఇరవైయేళ్ళ క్రితం సాయంత్రం అయితే చాలు మిత్రులంతా ఒక్కో సెంటర్‌లో గుంపులుగా చేరి కబుర్లు కలబోసుకునేవారు.పదేళ్ళ క్రితం వరకూ పత్రికల్లో వచ్చే సీరియల్స్, కవిత్వం, కధల గురించి ఇంకా సామాజిక అంశాల గురించి చర్చించుకునేవారు. కంప్యూటర్ విస్తృతి ఈ దేశంలో పెరిగాక ఇప్పుడందరి కలయిక ‘నెట్ కేఫ్’లలోనే.’బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్’ వచ్చేసిందని ఒక మహాకవి అన్నట్లు ఇంటర్‌నెట్ ఇప్పుడు అందరి ప్రపంచం అయిపోయింది. మొత్తం చదవండి »
Aug2008
: జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారి రచనా వైశిష్ట్యం!
-విహారి
అతి తక్కువ సంఖ్యలో రచనలు చేసి, చేసిన ప్రతి రచనకూ బహుమతుల, పురస్కారాలు పొంది, అత్యంత గౌరవప్రదమైన సాహితీ కీర్తిని సముపార్జించుకున్న అరుదైన రచయిత-జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారు..వారు చేసిన రచనలన్నీ గట్టి గింజలు కావటమే వారి ప్రథితకు కారణం.
మూర్తి గారి అభిజనం గొప్పది.వారి తండ్రిగారు కీ.శే. జొన్నవిత్తుల రామకృష్ణ శర్మగారు సంస్కృతాంధ్రాంగ్ల భాషా పండితులు, కవి, గాయకుడు, నాటకకర్త, విమర్శకులు. తల్లిగారు లక్ష్మీనరసమ్మ గారు విదుషీమణి.
మొత్తం చదవండి »
Aug2008
నేను రాడికల్నో రెవల్యూషనరీనో అని నేను అనుకోను. అలాంటి లేబుల్సు తెల్లవాళ్లు మామీద రుద్దారు. ఎప్పుడైనా మేము కోరుకున్నదల్లా మా బతుకులు మమ్మల్ని మాకు తోచినట్లు బతకనివ్వమని మాత్రమే. పేపరు మీద మాత్రమే రాసినట్లు కాకుండా నిజంగానే మమ్మల్ని మేము పరిపాలించుకోనివ్వమని , మా హక్కుల్ని గుర్తించమని ! అలా డిమాండు చెయ్యడం రెవల్యూషనరీ అయితే నేను ఆ వర్ణనకు సరిగా సరిపోతాను. మొత్తం చదవండి »
Aug2008
- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
టెలిగ్రాఫ్ ఆపరేటర్ కోస్మెకు రెండు సూత్రాలు చాల ఇష్టమైనవి.
వాటిలో ఒకటి సోషలిజం. దాని గురించి ఆయన తన దగ్గర పనిచేసేవారి బుర్రలు తింటుండేవాడు. వాళ్లందరూ అప్పటికే ఆ సిద్ధాంతానికి సానుభూతిపరులో, కార్యకర్తలో అయినా సరే.
రెండో సంగతేమో పోస్టాఫీసులోపల పోస్టాఫీసు టోపీ పెట్టుకోవడం. మొత్తం చదవండి »
Aug2008
‘Can we look beyond the FREEDOM that is being marketed to us?’ is the million Dollar question? (ఎందుకంటె రూపాయిల భాష ఎవరు మాట్లాడుతలేరు కాబట్టి). ఇప్పుడు ఉన్న తరం మార్కెట్ శక్తులకు ఎంత ప్రభావితం అయితుందో వేరేగ చెప్పనవసరం లేదు. ఎనభైలు, తొంభైల తరాలకన్న ఇప్పటి (ఇంటర్నెట్) తరం ఆశలు ఆశయాలల్ల చాల మార్పులొచ్చినయి. మొత్తం చదవండి »
Aug2008
కొద్ది కాలంగా పుస్తకాలు / పత్రికల గుట్టలు పడుతున్నాయి,వాటిని దీక్షగా చదివిన పాపాన పోలేదు.కాస్త తెరపి దొరికింది,కూలంకషంగా చదవడం మొదలెట్టా.
Newyorker మంచి పత్రిక.న్యూయార్క్ లో ఆడే నాటకాలు, జరిగే కార్యక్రమాలే కాకుండా మంచి సమీక్షలు చోటు చేసుకుంటాయి. ప్రత్యేక సంచికలకు(వంటలు/Architecture వగైరాలు)ప్రసిద్ధి గాంచిందీ పత్రిక. FALL పుస్తకాల గురించి మంచి సంచిక వెలువడింది. రష్యన్ నవలానువాదాలు మొదట్లో ఎలా ఉండేవి?తర్వాత్తర్వాత నిపుణ మతులు ప్రవేశించాక ఏ తీరున దోస్తవిస్కీ,టాల్ స్టాయ్,తుర్గినీవ్ ల రచనలు పాఠకులకు అందుబాటులోకి వచ్చాయి..చక్కగా వివరించారు. మొత్తం చదవండి »
Aug2008
-డా//దార్ల వెంకటేశ్వరరావు
తెలుగులో దళిత సాహిత్యం కవిత్వం, కథ, నవల, నాటకం, పాట, విమర్శ తదితర ప్రక్రియలతో పరిపుష్టిగానే వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, దళిత సాహిత్యం ప్రక్రియాపరంగా కూడా ఎంతో వైవిధ్యాన్ని చాటుతోంది. ప్రజలతో, ప్రజల ఆకాంక్షలతో ప్రత్యక్ష సంబంధాల ప్రతిఫలనం కూడా దళితసాహిత్యంలో కనిపించే విశిష్టతల్లో ఒకటి. విప్లవ సాహిత్యనంతరం తమ సమస్యల కోసం ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాలు నడిపి, ఆ భావాలను సాహిత్యంగా సృజనీకరించే సాహిత్య దృక్పథం దళిత సాహిత్యంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం చదవండి »