Aug2008
ఆత్మీయులు
-పలమనేరు బాలాజీ
ఇంట్లోకి అడుగుపెడుతుంటే అమ్మ గబగబా ఎదురొచ్చింది. నాన్న నా వైపే చస్త హాల్లో నిలబడ్డాడు. ఆయన అప్పుడే ఆఫీసు నుండి వచ్చినట్లుంది. మొహంలో అలసట కనిపిస్తోంది.
”ఉత్తరం వచ్చిందా” అడుగుతోంది అమ్మ-నా వెహంలోకే గుచ్చిగుచ్చి చస్త. నిస్తేజంగా ఆమె వైపే చస్త అక్కడే నిలబడిపోయను. ఆమెకు బదులు చెప్పే శక్తి నాకు లేకపోయింది.
ఆమె మొహంలో ఇంకా ఏదో ఆశ మిణుకు మిణుకుమంటున్నట్లు-”ఫోన్ ఏమైనా వచ్చిందా పోనీ” ఆమె గొంతునిండా వేదన, ఆశ, కలగలసి పోయయి.
నేను అట్లాగే ఆమె వైపే చస్తుంటే-ముందు నాన్నే తేరుకున్నట్లు ఆయన నిట్టర్చి లోపలి గదిలోకి వెళ్లే ఓపిక కూడా లేనట్లు అక్కడే వున్న వాలు కుర్చీలో కూర్చుండిపోయడు.
క్యాలండర్ వైపు చసాను.
డిసెంబర్ 17కు ఇంకా వారం రోజులుంది. అమ్మ వైపు చసాను. ఆమె వెహంలో ఆవేదన, ఆందోళన.
” వ…నువ్వేం బాధపడకు..మనకు అక్కడ్నుంచి ఉత్తరం కానీ ఫోన్ కానీ వచ్చినా సరే..రాకపోయినా సరే మనందరం మదనపల్లెకు వెడతాం. అంతే..దాంట్లో వర్పేమీ లేదు. పదపద..నాకు ఆకలేస్తుంది. టిఫిన్ ఏదైనా పెట్టు…ఆఫీసులో పని ఎక్కువై మధ్యాహ్నం సరిగ్గా భోం చేయలేదు
పదవ…ఆకలి…”
నా వటలు తడబడటం నాకే తెలుస్తోంది..తవయించుకుంట లోపలికి నడిచాను. బట్టలు వర్చుకుని మళ్ళీ హాల్లోకి వచ్చాను. తల వంచుకుని ఏదో
మెల్లగా గొణుక్కుంట అమ్మ వంటగదిలోకి నడిచింది.
నాన్న వైపు చశాను. ఆయన నావైపు చడ్డం లేదు. కళ్ళు మూసుకుని వున్నాడు. ఏదో ఆలోచిస్తున్న వాడిలా వుందతడి వాలకం. ఆయన్ను పలకరించే సాహసం చెయ్యలేక పోయను. నిశ్శబ్ధాన్ని భరించలేక టి.వి. ఆన్ చేసాను.కళ్ళు టీ.వీ.వైపే వున్నాయి. కానీ ఏవేవో దృశ్యాలు జ్ఞాపకానికి వస్తున్నాయి. కళ్ల ముందర శ్రీ లేఖ రపం కదలాడుతుంటే నాకు తెలియకుండానే కళ్ల వెంట నిశ్శబ్ధంగా కన్నీరు కారిపోతోంది.
మదనపల్లె నుండి ఉత్తరం అయినా రావాలి. లేదా ఫోన్ అయినా రావాలి. అవును ఏదో ఒకటి ఖచ్చితంగా రావాల్సిందే.
ఆ కబురు అందుకున్నాక వెంటనే మదనపల్లెకు బయలుదేరటమే. ఎప్పుడొస్తుందా కబురు? అసలు వస్తుందా రాదా?
రాకపోతే? లేదు లేదు…అలా జరగడానికి వీళ్ళేదు. మేం డిసెంబర్ 17కు మదనపల్లెలో వుండాలంతే. వుండి తీరాలి.
మేం ఖాళీ చేసిన ఆ ఇంట్లో ఆ రోజు మేం అందరం కలవాల్సిందే. బెంగళూరు నుండి అన్నయ్య నేరుగా మదన పల్లెకే వచ్చేస్తానన్నాడు. శ్రీలేఖ స్నేహితులందర ఆ రోజు అక్కడికి వచ్చేస్తారు. అక్కడున్న నా స్నేహితులు కేక్, స్నాక్స్ విషయం వాళ్ళు చసుకుంటామన్నారు.
ఆ రోజు శ్రీ లేఖ పుట్టిన రోజు..
ఆ రోజు శ్రీలేఖకు ఇష్టమైన వాళ్లందర వస్తారు. అవ్మ, నాన్న, పెద్దన్నయ్య, నేను, శ్రీలేఖ స్నేహితులు అందర మేం అదివరకూ వుండి, ఖాళీ చేసిన ఆ ఇంట్లో డిసెంబరు 17న కలుస్తాం. కలవాలి. శ్రీలేఖ పుట్టిన రోజు పార్టీ
ఘనంగా ఏర్పాటు చేయల్సిందే. వచ్చిన వాళ్లకి స్వీట్స్, కేక్, ప్రూట్ సలాడ్ ఇవ్వాలంట. అది శ్రీలేఖ కోరిక. అన్నీ సరే. అంతా సరే.
ఇంతకూ శ్రీలేఖ ఏది?
***
ఆ రోజు ఇల్లు సందడిగా వుంది.
ఇల్లు సందడిగా వుందంటేనే శ్రీలేఖ ఇంట్లో వుందని అర్థం.
నాకన్నా ఏడేళ్లు చిన్నదే అయినా అన్నారేయ్ అనో, రేయ్ అన్నా అనో పిలవటం తన అలవాటు. నాకిష్టం కూడా. అట్లా పిలవకూడదని అవ్మ, నాన్న, అన్నయ్య ఎంతెంతో చెప్పి చసారు. కానీ శ్రీ లేఖ చాలా మొండిది. ఎవరేం చెప్పినా చివరికి తన వట నెగ్గాలనుకునే రకం.
మరుసటి రోజు తన పుట్టిన రోజు. ఎవరెవరు ఏమేం చెయ్యలో చెపుత తెగ
హడావిడి చేసేస్తోంది శ్రీ. పదహైదు నుంచి పదహారు మొదలవబోతోంది.అందరికంటే చిన్నది కాబట్టి ఇంట్లో అందరికీ శ్రీ అంటే విపరీతమైన ఇష్టం.
నాన్నకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. మొదటి రెండు కాన్పుల్లోన ఇద్దర అబ్బాయిలే కలిగారని అందర ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తుంటే నాన్న వత్రం
కూతురు పుట్టలేదని బాధపడిపోయడు.ఎవరెంత చెప్పినా ఆయన ఆపరేషన్‌కు ఒప్పుకోలేదు. కూతురే పుట్టాలని ఆయన మొక్కని దేవుడు లేదు.
శ్రీని అంత అపురపంగానే పెంచాడు. నాన్న అతిగారాబం చేసి ఆడపిల్లని అల్లరి పిల్లని చేస్తున్నాడని అమ్మ ఎప్పుడ దెబ్బలాడేది. ఆడపిల్లని ఆడపిల్లగానే పెంచాలని, శ్రీలేఖ ఏం చేసినా అందులో తప్పులు వెతికి సరిదిద్దుకోమని చెప్పటం అమ్మ వంతు. అమ్మ ఏం చెప్పినా శ్రీని వెనకేసుకు రావటం నాన్న వంతు.
అన్నయ్య అమ్మను నేను నాన్నను సపోర్ట్ చేసేవాళ్లం. శ్రీకి పెయింటింగ్సు అంటే చాలా ఇష్టం. ఎక్కడ ఏ తెల్లకాగితం కనపడినా బొమ్మలు గీసేది. పెయింటింగు చేసేది. అట్లా పెయింటింగు, డ్రాయింగు – అంటే శ్రీకి ఎట్లా ఎప్పటి నుంచి అభిరుచి కలిగిందో తెలియదు కానీ బొమ్మలు వేయటం అంటే శ్రీకి ప్రాణం. గంటలు గంటలు బొమ్మలు చస్తనో బొమ్మలు వేస్తనే గడిపేసేది.
ఆ విషయంలో అమ్మకు ఎప్పుడ శ్రీతో గొడవలు జరిగేవి. శ్రీ బొమ్మలు గీయటం చాలా పిచ్చిపని అని, సబ్జెక్ట్సులో మంచి వర్కులు తెచ్చుకోవాలని అమ్మ శ్రీతో దెబ్బలాడేది. రకరకాల జంతువులు, పక్షులు, అడవులు, ప్రకృతి చిత్రాలు ఇంట్లోని కాగితాల పైన ప్రాణం పోసుకునేవి.
ఆ రోజు రాత్రి చిన్నగా మొదలైందో గొడవ.
రంగులు దిద్దుత దీక్షగా పెయింటింగు వర్క్‌లో మునగిపోయక అమ్మ పిలుపు శ్రీకి వినిపించినట్లు లేదు. దాంతో అమ్మకు విపరీతమైన కోపం వచ్చేసింది. ఆవేశంగా వంటగదిలోంచి హాల్లోకి వచ్చి నిలుచుంది. అయినా శ్రీ తలపైకెత్తనైనా లేదు. ఏమిటవ్మ అని అడగన లేదు.
” ఏమిటే పిలిస్తే పలకవు. ఇంకా చిన్నపిల్లవనే అనుకుంటున్నావా? పిలిస్తే పలకాలని తెలీద? ఇప్పుడే నువ్వు నా వట వినటం లేదంటే ఇక రేపు నీవు పెద్దయినాక నా వటేం వింటావు” అమ్మ అరిచింది.
అమ్మ అరుస్తనే వున్నా శ్రీ దృష్టిలో ఆ తిట్లన్నీ దీవెనెలనే..తాను అంత కోపంగా వట్లాడుతున్నా శ్రీలో చలనం లేకపోయేసరికి అమ్మకు కోపం రెట్టింపయిపోయింది.
”ఏమిటే చెబుతుంటే ఉలుకూ పలుకూ లేకుండా అలా చస్తావ్? నీకే చెప్పేది. ఈ రోజుతో నీ పెయింటింగ్సు అన్నీ మర్చిపో. ఇంకోసారి బొమ్మలు గీస్తా కనిపించావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు..నువ్వేదో ఇంజనీరో డాక్టరో
కావాలని మేం ఆశ పడతావుంటే నువ్వేంది ఎప్పుడ రంగులు బొమ్మలంటా వుంటావ్ చెప్పు. జన్మలో ఇక బొమ్మలు గీయనని చెప్పు” దబాయించింది అమ్మ. అప్పుడే బజార్లోంచి వచ్చిన నాన్న ఏదో సర్దిచెప్పబోయడు కానీ అమ్మ కస్సుమంది.
” మీరేందండి అన్నిటికీ దాన్ని సపోర్ట్ చేస్తారు? అదేం ఇంకా చిన్న పిల్లనుకుంటా వుండారా? అది మీ కూతురు మీ కూతురని నెత్తిపైన ఎక్కించుకుంటారు కదా..చద్దాం. నిజంగా అది మీ కూతురే అయితే దాని చేత పెయింటింగ్సు డ్రాయింగ్సు వనేస్తానని మీరైనా చెప్పించండి చద్దాం ”
అమ్మ నాన్నను రెచ్చగొట్టేసరికి నాన్నకు ఉక్రోశం వచ్చేసింది.
ఎప్పుడ లేంది నాన్న శ్రీపైన విరుచుకుపడ్డాడు.
”అమ్మ చెప్పింది నీ మంచికే కదవ్మ..చెప్పు..అమ్మకు కోపం తెప్పించావెందుకు..డ్రాయింగు వనేస్తానని అమ్మకు చెప్పెయ్…’
అన్నయ్య కూడా శ్రీని అరిచేసాడు.
నేనేదో సర్దిచెప్పబోతుంటే అమ్మ నన్ను కసురుకుంది.
”వ…వర్కులు తగ్గితే అప్పుడడుగు. అంతే కానీ వూరికినే పెయింటింగు వనెయ్యల్లంటే నావల్ల కాదు..అది నా ప్రాణం” అంది శ్రీ ఖచ్చితంగా.
ఆ వట వినగానే అమ్మ మొహం కళ తప్పింది. ”చసారా మీ కూతుర్ని. అందుకే చెప్పాను. ఒద్దండీ..నెత్తిపైకి ఎక్కించుకోకండి అని..నా వటెప్పుడైనా విన్నారా? ఇదేనా మీ పెద్దరికం..అయినా ఏందే నువ్వు వ వటలు నువ్వు వినాలా మేం నీ వటలు వినాలా” అంట శ్రీ చెంపల్ని వాయించేసింది అమ్మ. అమ్మకు అంత కోపం రావటం ఎప్పుడ నేను చడలేదు కాబట్టి బిత్తరపోయి అక్కడే నిలబడి పోయను. నాన్నక్కూడా కోపం ముంచుకొచ్చి
”ఛీ..ఛీ…మొండిపిల్ల” అనేసి వీధిలోకి వెళ్లిపోయడు..” నీ మొహానికి ఈ బట్టలొకటి” అంట నాన్న శ్రీ బర్త్‌డేకని తెచ్చిన బట్టల ప్యాకెట్‌ను వీధిలోకి విసిరేసింది అమ్మ కోపంగా.
దాన్ని తీసుకు రావటానికి మేం వీధిలోకి వెళ్లి వచ్చేలోగా ఇంట్లోపల కనిపించిన దృశ్యం వ మతుల్ని పోగొట్టింది.
శ్రీ పెయింటింగ్సు అన్నీ కుప్పగా పోసి అమ్మ అగ్గిపుల్ల వెలిగించేసింది.
” ఏందవ్మ నీకేమైనా పిచ్చి పట్టిందా..” అని అరచి అన్నయ్య గది లోపలికి వెళ్ళిపోయడు. అమ్మ అక్కడినుండి విసురుగా కదిలి వంట గదిలోకి వెళ్లింది.
శ్రీ మొహంలో ఏ భావాలు కనిపించలేదు. మొహం భావరహితంగా వుంది. బేలగా నావైపు శ్రీ చసిన చపును జీవితాంతం నేను మరచిపోలేను..
***
కళ్ళు చెమర్చాయి.
అమ్మ టీ తేవటంతో ఆలోచనల్నుండి తేరుకుని టీ కప్పు అందుకున్నాను.
డేవిడ్ అని ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చాడు మేం ఖాళీ చేసిన ఇంట్లోకి.పదహారేళ్ళుగా వుండిన ఆ ఇల్లు, ఆ ఊరు ఖాళీ చేసి వస్తుంటే గుండెనెవరో పట్టి పిండినట్లనిపించింది.
ఇల్లు ఖాళీ చేసి ఊరు విడిచి వస్తుంటే ఎవరికీ కన్నీళ్లు ఆగలేదు. అక్కడే వుంటే మనసుకు చాలా కష్టం అనిపించి అమ్మ ఆరోగ్యం దృష్ట్యా నాన్న తిరుపతికి బదిలీ చేయించుకున్నాడు…
ఇక్కడకు వచ్చినా మదనపల్లె జ్ఞాపకాలు మమ్మల్ని విడవటం లేదు. అయినా జ్ఞాపకాలు మనుషుల్ని ఎట్లా విడిచిపోతాయి? అది మనుషుల భ్రమ కానీ..!
***
డిసెంబర్ 17 ఆదివారం సాయంత్రం–
డేవిడ్ వాళ్ళింటి ముందు ఆటో దిగాం. ఆ ఇల్లు చస్తుంటే అమ్మకు దు:ఖం ఆగింది కాదు. అవ్మనాన్న, అన్నయ్య నేను అందరం ఇంట్లోపలి అణువణువునీ సృశిస్త, స్మరిస్త ఇంట్లోపలికి నడిచాం.
ఎక్కడో శ్రీ నవ్వు , వటలు, కేరింతలు లీలగా వినిపిస్తున్నాయి.
రేయ్ అన్నయ్య ..అనే పిలుపు గుండె లోతుల్నుండి వినిపిస్తుంటే కళ్ల వెంట ధారాపాతంగా కన్నీళ్లు…
డేవిడ్ గారి కుటుంబం మొత్తం సాదరంగా మమ్మల్ని పలకరించింది కానీ…వాళ్లతో వట్లాడే ఓపిక కూడా లేకపోయింది వకు…ఉన్నట్లుండి అమ్మ దు:ఖం కట్టలు తెంచుకుంది.
” నేనే పోగొట్టుకున్నానవ్మ…బంగారం లాంటి పాప..ఈ పాపిష్టి చేతుల్తో నేనే పొట్టనబెట్టుకున్నాను..దాని బొమ్మలు కాల్చేసానని, నాన్న తిట్టాడని ఎంత బాధపడిందో బంగారు తల్లి..రాత్రికి రాత్రే ఉరేసుకుని చనిపోయిందవ్మ…పాపిష్టిదాన్ని..నేను పోయినా బావుండేది” అమ్మను ఓదార్చడం ఎవరివల్లా కావటం లేదు.. నాన్న మౌనంగా ఏడుస్తుండిపోయడు.
శ్రీ తన బర్త్‌డే ఫంక్షన్ ఎట్లా చేయలనుకుందో అదే విధంగా ఏర్పాట్లన్నీ చేసాం.
ఆ ఇంట్లో శ్రీకి ఇష్టమైన విధంగా తన బర్త్‌డే ఫంక్షన్ ఏర్పాటు చేయలని అందుకు దయతో అనుమతించాలని నేను డేవిడ్ గారికి ఉత్తరం రాయటం, ఆయన రండంట ఫోన్ చేయడంతో- శ్రీ కోరిక నెరవేరుతోంది.
శ్రీ తాలకు జ్ఞాపకాలు కదిలిస్తుంటే-కన్నీళ్ళొకవైపు, బాధ మరొకవైపు
మమ్మల్ని డేవిడ్ గారు లోపలి గదిలోకి తీసుకువెళ్ళి మంచినీళ్ళు ఇచ్చినప్పుడు అందరం గోడ వైపు చసాం యధాలాపంగా.
అక్కడ శ్రీ పెయింట్ చేసిన వినాయకుడు, శ్రీరాముడు నవ్వుతున్నారు. వాళ్ల మొహాల్లో ఏదో తేజస్సు వ్యక్తమవుతోంది. ఆ ఇంట్లో ఆ గోడపైన ఆ
పెయింటింగు ఇంకా వుందంటే కళ్ళు చెమర్చాయి. డేవిడ్ గారికి శ్రీ గురించి తెలిసాక ఆయన ఎందుకో దాన్ని అట్లాగే వదిలేసారట. బంధువులు కొంతమంది అభ్యంతరం చెప్పినా ఆయన వటల్ని లెక్కచెయ్యలేదట.
వాళ్ళావిడ ఆ సంగతులు చెపుతుంటే…కన్నీళ్లతో చేతులు జోడించాను..ఆయన సహృదయతకు చలించిపోత….