శిల్ప ప్రజ్ఞలో సావజిక వాస్తవికత, లోకజ్ఞత, స్థానీయత!

: జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారి రచనా వైశిష్ట్యం!

-విహారి

అతి తక్కువ సంఖ్యలో రచనలు చేసి, చేసిన ప్రతి రచనకూ బహుమతుల, పురస్కారాలు పొంది, అత్యంత గౌరవప్రదమైన సాహితీ కీర్తిని సముపార్జించుకున్న అరుదైన రచయిత-జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారు..వారు చేసిన రచనలన్నీ గట్టి గింజలు కావటమే వారి ప్రథితకు కారణం.

మూర్తి గారి అభిజనం గొప్పది.వారి తండ్రిగారు కీ.శే. జొన్నవిత్తుల రామకృష్ణ శర్మగారు సంస్కృతాంధ్రాంగ్ల భాషా పండితులు, కవి, గాయకుడు, నాటకకర్త, విమర్శకులు. తల్లిగారు లక్ష్మీనరసమ్మ గారు విదుషీమణి.

సాహితీ క్షేత్రం మీదికి ఒక్కుమ్మడిగా వర్షాంబుదంలా వచ్చి ‘వలస దేవర’ నవలా వృష్టిని కురిపించారు మూర్తిగారు.

ఆ నవలకి ఆటావారి నవలల పోటీలో ప్రథమ బహుమతి అరవై వేల రపాయల సత్కారం లభించింది. ఆ పోటీకి వచ్చిన నవలల గుణ నిర్ణయం చేసినవారు డా. రావూరి భరద్వాజ గారు, కే.వి.యస్‌. వర్మగారు.ఇద్దర జగమెరిగిన సారస్వతేయులు!

‘వలస దేవర’ నవలలో కథని పుంగనరు జవాన్‌ చెప్తాడు.ఈ చెప్పే విధానమే నవలా శిల్పంగా రాణించింది.కథనంగా బాసించింది.రమ్యంగా కథ నడిచింది.ఏక బిగిన చదివించింది.మిత్రసమ్మతంగా కథ చెప్పటం కావ్యాలకే పరిమితమైన’రీతి’ ఔన్నత్యం కాదు.అది నవలకీ వన్నె తెస్తుందనీ, చదువరిని ఆనందింపజేస్తుందని ఈ నవల రుజువు చేస్తోంది.

‘వలస దేవర’ నేపథ్యంలో గుంపు పండగల పట్ల మనుషులకు గల విశ్వాసం కూడా ధ్వనిస్త ఉంటుంది. నవలని ఆనందించడానికి పాఠకుడి స్థాయి, చదువు, సంస్కారం, జీవిత విలువలు, తాత్వికత ఆధారమవుతాయి. ఆ విశ్వాసం పట్ల చిత్తం సవయత్తం కాగలగాలి.

చిత్తరు జిల్లా గ్రామీణ జీవనంలో కాలక్రమేణా వచ్చిన వర్పుల చిత్రణ- ఈ నవలలో ప్రధాన కథాంశం. ఈ వర్పులకి రప కల్పన చేయడానికి రచయిత మూడు తరాలకు చెందిన మనుషుల్ని తీసుకుని, వారి జీవిత చిత్రణనీ, ఆయ కాలాల్లోని సంఘ పరిస్థితినీ, వనవ సంబంధాల్లోని వైచిత్రినీ, వైరుధ్యాల్నీ నవలాత్మకం చేశారు.ఆ విధంగా సావజిక వాస్తవికతకి అత్యంత గౌరవార్హతని ఆపాదించి శిల్పీకరించారు. ఆ గ్రామం పేరు ముష్టూరు. అక్కడ మొదటి తరం వాడు పెద్దప్ప.రెండో తరం వాడు ఎర్రమ రెడ్డి. మూడోతరం మనిషి వీరమ రెడ్డి. ఈ మూడు తరాల్లోన ఒక తరం తర్వాత మరోతరం క్రమేపీ-భౌతిక స్థితి గతుల దృష్ట్యా, వనవీయంగా-ఎలాంటి పతనానికి లోనయిందో వర్ణిస్తుంది నవల.జీవన విలువల, మనిషి ప్రవర్తనా ఎంతటి సంక్లిష్టతకూ, అస్తవ్యస్తానికీ గురయిపోయయె చెప్తాడు రచయిత. తాను తెర వెనుక ఉండి, ఎంతో శిల్ప సమన్వయంతో ఈ పరిణామ క్రవన్ని సంఘటనాత్మకంగా, కథాకథన కౌశలంతో చిత్రించారు మూర్తిగారు.

వర్తవన తరంలో వచ్చిన వర్పుల్ని కొన్ని ఘట్టాల్లో ఎంతో ఉద్వేగ భరితంగా, కవితాత్మకంగా రాసుకుపోయరు.చడండి..”అమ్మ వట విచారించాను. ఆమె చుట్టపు చపుగా వచ్చింది. సాయంత్రమే వెళ్ళిపోయింది. అంతే. ఈ ఊరికి మనిషితనం చుట్టపు చపుగా వచ్చింది అంతే. ‘అవ్మ అని అరచినా ఆలకించవేమవ్మ’…నా పిల్లన గ్రోవి పాటని పేటంతా వింది, వినవలసిన అన్నపూర్ణమ్మ తప్ప”.
ఇలా సాగిపోతుంది శైలి. piercing and Incisive .”ఇప్పుడు టీ అంగళ్ల దగ్గర టీలకి వేరుగ్లాసులు లేవు. ఎవరైనా రావచ్చు. అందరితో సవనంగా కూర్చుని తినచ్చు. తాగొచ్చు.ఎవర ఎవర్నీ ఏమీ అనకూడదు. అంతా ఒక్కటే. ఎక్కువ తక్కువలు లేవు. …ఇప్పుడు కులం వట అడగకూడదు. అందర అన్ని దేవళాలకీ పోవచ్చు! పూజలు చేయించవచ్చు. ప్రసాదాలు పెట్టవచ్చు….

అంతా ఒక్కటే అయితే ఇన్ని కుల సంఫలు ఎందుకు ఎలా పుట్టుకొని వచ్చాయి.? … రానురాన ఈ మనుషులు చెప్పే వటలకీ చేసే పనులకీ సంబంధం లేకుండా పోతోంది….అంతా ఒకటిగా ఉండాలని చెప్పేదీ గవర్నమెంటే…అలా ఒకటిగా ఉన్నందున కొలువు లేకుండా చేసేదీ గవర్నమెంటే!….

ఇలా వర్తవన తరంలో వచ్చిన వర్పుల్ని నవలా దర్పణంలో చపారు మూర్తిగారు. బలుపా, వాపా? అంటారే అలా- ఇదేనా అభివృద్ధి అంటే? మనిషితనం, మంచితనం ఏవీ? మేడిపండు సవజం పొట్టవిచ్చి చస్తే..?’ చెడ్డ కాలానికి మంచి చేయడం ఏ దేవరవల్లాకాదు’ ఇదీ ఆవేదన. రచయితది వత్రమే కాదు. సవజం గురించి ఆలోచించే అందరిదీన! మూర్తిగారు చదువరిని తనలో పరకాయ ప్రవేశం చేయించి విలవిల్లాడించారు! అదే నవలా విజయం!

* * *

నవలాకారుడిగా అద్భుతమైన ‘వలసదేవర’ని సృష్టించిన మూర్తిగారు, కథకుడిగా అంతకంత అద్భుతాన్ని సాధించారు. 16 కథల్లో-12 కథలు విభిన్న పత్రికల నుంచీ బహుమతులు పొందాయంటే వారి ప్రతిభ అర్థమవుతుంది.

లోకమేమీ ఆనందధామంగా లేదు. ఆదర్శ నిలయంగాన లేదు. అంతా కల్లోల కడలి. పరివర్తనా శీలం వలన, దేశ కాల వన పరిస్థితుల వలన సంఘ జీవనం సమస్యల మయమైపోయింది. మనిషి బతుకు వేదనా మయమై పోయింది. ఈ స్థితిగతుల్ని ఆకళింపు చేసుకోగలగడమే లోకజ్ఞత. అలాంటి లోకజ్ఞతని సాధించుకుని, ఆయ సమస్యల్నీ, వాటి కారణాల్నీ పట్టి, కథలో కూర్చోబెట్టి రచన చేయటమే ఈనాటి రచయితల బాధ్యతగా వరింది., సావజిక అవసరంగాన వరింది. ఆబాధ్యతని ఎంతో నిష్ఠగా నెరవేరుస్తున్నారు శ్రీరామ చంద్రమూర్తి గారు.

”సారస్వతం బోధ చేయకూడదని నా నమ్మకం. సరియైన సారస్వతం మన ఆలోచనలను రేపి, ఆ ఆలోచనలను వృద్ధి పరచి వదిలేయలి” అంటారు కొడవటిగంటి కుటుంబరావు గారు. ఈ వాక్యాల్ని ఉదహరిస్త మధురాంతకం రాజారాం గారు కొ.కు.గురించి ఇలా అంటారు.”ఆయనవన్నీ ఆలోచన రేపే కథలు. చిత్తశుద్ధి, సాంఘిక చైతన్యం, ప్రయెజనాపేక్ష, శిల్ప మర్మజ్ఞత, వాస్తవిక దృక్పథం, కార్యకారణ విచికిత్స మొదలైన గుణాల వల్ల ఆయన కథలు పాఠకులకు నిత్య నతనంగాన, జిజ్ఞాసువులకు శిక్షణాలయలుగాన, కొత్త రచయితలకు అధ్యయనశాలలుగాన చెక్కుచెదరకుండా ఉంటాయి.”

మూర్తి గారి కథల్ని నిశితపరిశీలనతో చదివితే ఈ వాక్యాలన్నీ మూర్తిగారి కథలకీ అన్వయిస్తాయనిపించి నాకు. ఇంకా అధికంగా మూర్తి గారి కథల్లో భాసించే వండలిక భాషా సౌందర్యం, సహజమైన తెలుగు పలుకుబడీ వీరి కథల్ని మరో మెట్టుపైనే ఉంచుతాయని స్పష్టంగా ప్రకటిస్తున్నాను. ఈ సత్యాన్ని ”సమకాలము వారలు” మెచ్చి తీరాలి.

”ది డెత్‌ ఆఫ్‌ లాస్ట్‌ ఇండియన్‌ ” అన్న మూర్తిగారి కథా సంపుటి గురించి నాలుగు వటలు చెప్పుకుంటాను.
స్త్రీ అనుభవిస్తున్న వేదనల, అవస్థల, ఆమె ఎదుర్కొంటున్న సమస్యల-ఎక్కువ భాగం-సవజగతమైనవి. సావజిక శాస్త్ర జ్ఞానం ఎంత లోతుగా వున్న వారికైనా-ఒక్కొక్కప్పుడు వీటికి కారణాల, వాటి మూలాల, అన్ని సందర్భాల్లోన-విశ్లేషణకి అందవు.

అందుకనే గొప్ప రచయితలు ఆ విశ్లేషణని నేపథ్యంలో ఉంచి, కథని కథగా రాస్తారు. తాముగా భావించే కారణాల్ని చదువరుల మీద రుద్దరు. మూర్తి గారు గొప్ప రచయిత కనుక, ఈ విశ్లేషణల ఛాయలు కూడా వారి కథల్లో తోచవు.వారి కథ కథగా, కళాత్మకంగా మెరుస్త వుంటుంది. వనవీయ కోణాల్ని ఆవిష్కరిస్త ‘మనిషి’ స్వరప స్వభావాల వైవిధ్యాన్ని వెలారుస్త మనముందు నిలుస్తుంది. మన హృదయం మీద చెరగని ముద్ర వేస్తుంది.

మూర్తిగారికి ఎంతో పేరు తెచ్చిన గొప్ప కథ ‘వంజె’ ఉంది. ఇందులో ఒక స్త్రీని గొడ్రాలని సంఘం, అత్త, కడకు భర్త కూడా ఎంత వేధించారో చిత్రితమైంది. ఆమె ఆత్మఘోషగానే కథనం సాగుతుంది. తనలో ఏ లోపమూ లేకున్నా, మెడికల్‌ చెకప్‌కి నిరాకరించి, ఆమె ముందే తను ‘చెకప్‌’ చేస్తున్నానని వేరే స్త్రీతో కులుకుతాడు భర్త. కోపంతో, ద్వేషంతో రగలిపోతుందీమె.మరొక యువకుడితో తాన ‘చెకప్‌ పెట్తుంది. భర్త చస్తాడు. ఏమీ అనడు. తాను సంఫనికి తన మగతనం దాఖలాని చపుకునే అవకాశాన్ని భార్యే కల్పించిందని అంతరాంతరాల్లో అంగీకారం, ఉదాసీనత! ఆమె బిడ్డని కని కసి తీర్చుకుంటుంది. ఆ పిల్లవాణ్ణి తీసుకుని బయటికి నడుస్తుంది.! వెళ్తూ వెళ్తూ అత్తకీ-ఆమె తన ‘చెకప్‌ ‘ గురించి చెప్పే వెళ్తుంది! ‘వంజె’ విషాదాన్నీ, వనసిక వేదననీ ఎంతో ఆర్ధ్రంగా, ఆర్తితో చిత్రించారు రచయిత. ‘జల్లు గింజలు నారుపోసి నేలను తప్పులు పడతా ఉంటే సత్తవ మడి సహిస్తాదా?’ వంటి అర్థ స్ఫోరకమైన వ్యాక్య సరళితో కథంతా మెరుగుతీనుత వుంది. నైతిక విలువల్ని గురించి వట్లాడే కొందరికి కథాంశం చర్చనీయమైనదే అయినా, శైలీ శిల్పాల దృష్ట్యా కథాసాహిత్యంలో ఒక అనర్ఘరత్నం ‘వంజె’

స్త్రీ వనసిక సంఘర్షణనీ, స్త్రీ చైతన్యాన్నీ చిత్రిస్త రాసిన ఇతర కథలు-పావు, తక్కాళి, బిత్తల బోకి, అడపం, సిద్దుల మర్రి-దేనికదే ప్రత్యేకత కలిగి మంచి రచనలైనాయి.

సావజిక పరిణావల్ని అంతర్లయగా ధ్వనింపజేస్త వాటి ప్రభావం వలన మనుషుల మనస్తత్వాల్లోన, ప్రవర్తనలోన కలుగుతున్న వర్పుల్ని
పంచన్‌ లావ, తునకలు వంటి కథల్లో ప్రతిఫలింపజేశారు మూర్తిగారు.

విద్యా వ్యవస్థని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ఆశయం, ఆచరణ అటుంచి, దాని కనీస మనుగడని కూడా అస్తవ్యస్తం చేస్తున్న ప్రభుత్వ విధానాలపై ధర్మాగ్రహ ప్రకటన కనిపిస్తుంది-’ఉత్తయ్య సింహాసనం’ కథలో..ఇంతటితో తృప్తి చెందక ఈ కథ ద్వారా ఒక ఆచరణాత్మకమైన విద్యా విధాన ప్రణాళికను అందించారు, మూర్తిగారు. ఇది నిజంగా అభినందించవలసిన అంశం.”

మూర్తిగారి కథల్లోని ప్రాణ స్పందన సాహిత్య ప్రయెజనం పట్ల వారి చిత్తశుద్ధీ, నిజాయితీ, ఉన్నతమైన ఆలోచనల ప్రేరణకు చదువరిని సవయత్తం చేయలనే వాంఛ వారి కథల్లో గోచరిస్తుంది. story for story రీబిదిలి రాసినవి కావవి. రెండవ విశేషం-చిత్తరు జిల్లా వండలికం కథంతా పరచుకుని జీవద్భాషగా పరగలెత్తటం.
ఎక్కడ కథని ఎత్తుకోవాలో, ఎక్కడ దాన్ని ముగించాలో క్షుణ్ణంగా తెలుసు మూర్తిగారికి. ఈ విషయల మీద వారికి మననధారలో హోమ్‌ వర్క్‌ ఎక్కువని ఉత్తమ సాహిత్యాభినివేశం వున్న పఠితకి అర్థమవుతనే ఉంటుంది.

రచయితగా తన నిర్మోహత్వాన్ని ఆశ్చర్యకరంగా నిర్వహిస్తారు మూర్తిగారు. ‘వంజె’ వంటి కథల్లో కూడా ఎక్కడా పాత్రల కోర్ట్‌లో తాను గేమ్‌ ఆడడు. కంఠస్వరంలో objectivity చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

అభివ్యక్తిలో వాక్యాన్ని వ్యంగ్యవిలసితం చేయటం ఉత్తమ కవితాశిల్పంలో ఒక ముఖ్య లక్షణం. కథా శిల్పంలోన దీన్ని అందంగా అమర్చుకున్నారు మూర్తిగారు. కథనంలో ఈ వ్యంగ్యం రస స్ఫురణకి దోహదం చేస్తుంది. ఉదాహరణికి ‘వంజె’లో ‘చెకప్‌’ పదంలో ధ్వనింపచేసిన వ్యంగ్యం!

”సహజమైన సంఘటనను అపూర్వమైన ధోరణిలో ఆవిష్కరించి, పాఠకుడి ఊపిరికి ముకుదాడు వేసి చివరిదాకా లాక్కుపోగలిగిన ప్రతిభ కథకుడికి అత్యవసరం’ అంటారు మధురాంతకం రాజారాం గారు. ఈ ప్రతిభా భాస్వరుడు శ్రీ రామ చంద్రమూర్తి గారు. దానికి నిదర్శనం-వారి కథలే!
కథకుడిగా మూర్తిగారి ప్రతిభాస్థానం-మొదటి రెండు తరాల కథకుల పక్కనే ఉంటుంది. కథా సాహితికి అదే పెద్ద అలంకారం! మూర్తి గారి కథాకథన కీర్తికి అదే సముచిత గౌరవం!!!

సాహిత్య వ్యాసాలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో