ఆగస్టు2008
కొండపల్లి బొమ్మ
-సి.హెచ్.ఉషారాణి
అమ్మమొఖం తెరిపిగా వుంటుంది.
కతికితే అతకదంటున్న ప్లేట్లు,
అటు, ఇటుగా తిరగబడి వున్న నా ఫొటోలు,
నన్ను దాటి పోలేదు.
వెలసిన అమ్మ జరీ చీరలా వాతావరణం
గుటకేసేలోపే కుట్రలేవో జరిగిపోతున్నాయి.
నేను అటుగా వెళ్ళినప్పుడల్లా ఆగి మొదలవుతున్న వటలు.
వీధిలో బలుబు ఇంకా వెలుగుతనే వుంటుంది.
అమ్మ వివరాలుగా కొబ్బరికోరుతనే
ఊపిరి బిగబట్టి మునిగిపోదాం అంటుంది
తన పోలికలుగా మిగులున్న నాలో అదృష్టాన్ని వెదుకుత నాన్న,
నాది అన్నప్పుడల్లా గాలి విసురులా వచ్చి
చపుల్తో గట్టిగానే వక్కాణిస్త తమ్ముడు.
దగ్గరవుతున్న శిక్షను దిగులుగా లెక్కిస్త పరికిణి మడతల్లో తలదాస్త చెల్లీ
కదులుతున్న ఇత్తడి గొలుసులా నెమ్మదిగా అలుముకున్న రహస్యం.
సది మొనలుగా గుచ్చుత అమ్మముందు అందర ఆవిష్కరించిన ప్రశ్నే ఇది.
చాలా రోజులుగా చర్చనీయంశమే ఇది.
అమ్మమ్మ ఇచ్చిన జుంకాలు పెట్టితీసిన అమ్మ
సర్వం ముడుపు కడదాం అనే నిర్ణయనికొస్తుంది.
సరిపోని ఆస్థి కొలవనంలో నాన్న నిబ్బరం రజనురజనుగా రాలుతుంటుంది.
అదేవరలో కత్తిని తీసి పెడుత అమ్మ
నేనింకా ఇగుర్లేసిన జీవితం మీద కలల్ని రాసుకోనేలేదు.
అందరిలానే వలలో పువ్వులానే గొంతు బిగించే సన్నాహాలు చేస్తుంటారు.
నా ప్రమేయల మీద ఏ స్పర్శల తాకవు.
తన పాత ముక్కెర నాకు బిగిస్త అమ్మ
చివరగా అందర సంబంధం ఖాయం అంటారు.
పలుచటి నైలాన్ పొర కళ్లముందు కదులుత…
ఎప్పటినుండో ఎదురుగా తలవూపుతున్న
కొండపల్లి బొమ్మ.
John Hyde ఆగస్టు 2008 1
ఉషారాణికి అభినందనలు
ప్రాణహిత సంపాదక వర్గానికి
తప్పులు చాలా దొర్లాయి
గమనించగలరు