Aug2008
మాల పంతులమ్మకు సెలవు కావాల్నా?
-పి. అనురాధ
అమ్మో! అప్పుడే ఇంత చీకటి ఎలా అయింది? అంతేకదా నాలుగ్గంటలకి కూర్చున్నావ్. టైం చూడు అప్పుడే ఎనిమిది కావొస్తుంది. ఏమనుకున్నావ్…ఏదీ నీ కోసం ఆగదు..అమ్మ ఒడిలో ఆడుకునే పాపే ఆగలేక నేలమీద ఎప్పుడు ప్రాకాలా అని ఎగురుతుంది. అలాంటిది ఈ కాలం ఆగుతుందా నీ పిచ్చి గాని చూడు ఆకాశం ఎంత నిర్మలత్వాన్ని పొందిందో. పగలంతా భగభగమండే ఎండలో అలసిన గీతలేవీ కనిపించని ఆ ఆకాశపు అందం ఎంత బాగుందో…నీవు చూడు ఉదయం నీళ్ళు పట్టాలన్న తొందరలో నిద్రమత్తులోనే ఆదుర్ధాతో మొదలుపెట్టిన దినచర్య తాలకు ఆందోళన, ఆలోచన మరో కొత్త ఉదయనికి సిద్ధపడుతున్న రాత్రి అవుతాన్నా ఇంకా మాసిపోలేని ఆ గీతలు మొహం నిండా ఎలా కమ్ముకుని ఉన్నాయె చడు. కాలానికి ఆకాశాన్ని, భమిని, ప్రపంచాన్ని శాసించే, చల్లబరిచే శక్తి ఉన్నా మనిషి మనసులోని భావాన్ని, మస్తిష్కంలోని బడబాగ్నిని చల్లార్చే మార్చే శక్తి లేదనుకుంటాను. హూ…ఆ శక్తి దేనికుంది? అవును దేనికుంది అని ఆలోచిస్త అలాగే ఆ ఆదివారాన్ని ముగించింది నిషిత…
హలో! సుజాత నేను నిషితని.
ఆ నిషితా. చెప్పు ఏమిటి? ఎందుకు ఫోన్ చేశావ్? ఆం..ఏం లేదు. సెంటర్‌కి ఎన్నింటికి వస్తున్నారని చేస్తున్నాను. అయ్యె ఈ రోజు సెంటర్ వుంది కద, చూడు మర్చేపోయిన. చాలా పనులు పెట్టుకున్నాను. ఎట్లారాను. ఈ రోజు రాలేననుకుంటా. నువ్వే ఎలాగో వ్యనేజ్ చెయ్యవా.
సరేమరి ! నేను ఉంటాను అంట ఫోన్ పెట్టేసి ఒక నిట్టర్పు విడిచింది నిషిత. ఇంతలో అక్కడ ఎప్పుడు ఫోన్ దొరుకుతుందా అని నిషితనే చస్త చాలా మంది క్యూలో నిలబడ్డారు. వాళ్లని చసి పక్కకు జరిగింది. మళ్ళీ ఏదో జ్ఞాపకం వచ్చినదానిలా ఫోన్ పుస్తకం తీసి నంబర్ వెతుకుతుండగా బస్ రానే వచ్చింది. వెంటనే పుస్తకం బ్యాగులో పడేసి ఫుట్‌బోర్డుపైనే నిలబడగలిగింది బస్‌లో. పొరపాటున కాలు కదిపితే మళ్ళీ కాలు పెట్టడానికి వీలు లేని విధంగా ఉందా బస్సు. ఇంతలో లేడీస్ హాస్టల్ బస్‌స్టాప్ రాగానే నలుగురు దిగి పది మంది ఎక్కారు. ఒక పెద్దావిడ చేతిలో రెండు పెద్ద సంచులతో ఆయసంగా ఉంది. బస్సు ఎక్కగానే నిషితని ఎగాదిగా చసి నువ్వు ఫలానా రాములు బిడ్డవు గద అని గట్టిగా అరిచినట్లే ప్రశ్నించింది.
ఆ…అవును మీరు ఎవరో గుర్తుపట్టలేదు…గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్త మెల్లిగా అంది నిషిత…మేము మీ బస్తీలోనే కోమటోళ్ల వీధిలో కిరాయికి ఉండేవాళ్లం. నువ్వు షాపుకొచ్చినపుడు చసేదాన్ని. నీపెళ్ళి జరిగి అప్పుడే నాలుగైదు సంవత్సరాలు అయినట్లుంది. ఎంతమంది పిల్లలు ? ఆ మధ్య ఏవో గొడవలు జరిగాయని విన్నాను..ఇంతకీ నువ్వు మీ ఆయనతోని ఉన్నవా లేదా.? ఇప్పుడు ఎక్కడికెళుతున్నవ్….అంట దీర్ఘాలు తీస్త బస్సులో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆసక్తి కలిగి నిషితపై దృష్టి సారించేలా ప్రశ్నించింది ఆ నడివయస్సు కొమటామె.
అంతకు ముందు నిషితను మామూలు ఉద్యోగం చేసే స్త్రీలా గమనించిన వారందర ఇప్పుడు ఇంకా ఆసక్తిగా ఏం చెప్తుందా అని చడసాగారు..నిషిత అలాంటి ప్రశ్నలకి ఎలా జవాబు చెప్పాలో ఆలోచించాల్సిన పని లేకుండా ప్రతిరోజులాగే అదేం లేదండీ..నేను బాగానే ఉన్నాను..ఒక సెంటర్‌లో టీచర్‌గా చేస్త కొన్ని పత్రికలకి రాస్త ఉంటాను. మీరు ఎక్కడ ఉంటున్నారు? అని తాపీగా ఎదురు ప్రశ్న వేసింది…ఆమె ప్రశ్నకు సరైన జవాబు వచ్చిందో రాలేదో తెలుసుకునే లోపలే నిషిత దిగాల్సిన స్టాప్ వచ్చింది.
నిషితా నీ రిపోర్ట్ ఇంకా నాకు ఇవ్వనేలేదేంటి? అంట ఆఫీస్‌లో అడుగుపెట్టగానే అడిగింది రమ.అయ్యె అదేంటి 4శినీ న ఇవ్వమనగానే ఆ రోజు సాయంత్రం మీకు చపించాను..దాన్ని బీరువాలో పెట్టమన్నారు, మరిచిపోయరా అయెమయంగా అడిగింది నిషిత..అరే..సరే…నే చస్తాలే అంట మరి ఆ రివ్యూ సంగతి ఏంటి? రాసావా ఈ సారి కాస్త నెమ్మదిగా ప్రశ్నించింది రమ.ఆ…రాస్తున్నాను..దానికి ఇంకా కొన్ని పాయింట్స్ చేర్చాలి.
అందుకే ఇంకా పూర్తి కాలేదు అని అన్నది..
ఓకే. అంట తన రంకి వెళ్ళింది రమ.
నిషిత తను చెప్పదలుచుకున్న పాయింట్స్ అన్నీ రాయడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల క్రితం నిషిత అభిమాన రచయిత రాసిన నవల రిలీజ్ అయ్యింది. ప్రతిసారిలాగే తను పని చేస్తున్న పత్రికలో దాని రివ్యూ రాయడం మొదలుపెట్టింది. అందులో ఎన్నో అనుభవాలు, భిన్న రపాల్లో దర్శనమిచ్చాయి. ఎంతోమంది ప్రతిరోజూ అనుభవించే ఘర్షణ, ఆలోచన, పరిష్కారం కనీ కనిపించని సమస్యలు అన్నీ యధార్థంగా ఉన్నాయి. తల్లి
ప్రేమను ఏ రపంలో అర్థం చేసుకోవాలో తెలియని ఒక కూతురు మానసిక వేదనని, పరిస్థితుల ప్రభావంతో మనుషుల మధ్య ఉన్న బంధాల్లో వచ్చే మార్పులని చాలా గొప్పగా చిత్రించారు. ఒక్కోసారి బంధాలన్నీ చాలా గొప్పగా ,విడదీయరానివిగా చిన్నప్పటి నుంచి ప్రతి సంబంధమూ ఎంతో ముఖ్యమైనదిగా చెప్పబడుత కుటుంబంలోని ప్రతి ఒక్కర మనల్ని నడిపించే ిరథ సారథులే అని అనుకునేట్లు పెంచబడుతాము. అలాంటి వాతావరణంలో పెరిగి చివరికి ఒక్క సమయంలోనే అవన్నీ మనం ఏర్పరుచుకున్న, ఊహించుకున్న ఊహలేనని, ప్రతి సంబంధము పరిస్థితిని బట్టి దాని ఉనికిని అది కాపాడుకుంటుందని అర్థం అవుతున్న క్రమాన్ని ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరి పాత్రలో చపించగలిగారు..ఆర్ధిక సంబంధాలన్నీ మానవుల మధ్య సహజ సంబంధాలుగా ఎట్లా రపొందుతాయె అర్థం చేసుకునే అద్భుతమైన వాస్తవంలాగా ఆ నవల రాయబడింది. నిషిత తనకున్న సంబంధాల్లో సమాజంలో ఆర్ధిక అసమానతల పాత్రని అర్థం చేసుకుంట ఆ పాయింట్స్ రాయలనుకుని రాస్త ఉండగా…హలో..హాయ్… గుర్తున్నానా అంట నిషితకు ఎదురుగా వచ్చి కూర్చుంది జయ. అబ్బా ఎన్ని రోజులకి జయ ఎలా ఉన్నావ్ సంతోషంగా పలకరించింది నిషిత. ఆ బాగానే ఉన్నాను…నీవెట్లా ఉన్నావ్? అస్సలు కలవడం, మాట్లాడ్డం ఏమీ లేదు. అంతగనం ఎన్ని పైసలు సంపాదిస్తున్నావ్? నిష్ఠురవడింది జయ.
చాలా పైసలు సంపాదిస్తున్న. ఇంటికొస్తే చపిస్త. ఎప్పుడొస్తవో చెప్పు. ఈ రోజు నుండి జమ చేస్త నవ్వుత జవాబు చెప్పింది నిషిత.అబ్బ మాటలు బాగా నేర్చుకున్నవ్..నీ ఆరోగ్యమెట్లా వుంది…సెంటరు ఎట్లా నడుస్తుంది..? ఆ బాపనోళ్ళు బతుకనిస్తున్నరా? మొన్న మీ సెంటర్ నుండి వచ్చిన రిపోర్ట్ చసిన..గింత బ్రాహ్మణ భావజాలంల గీ నిషిత యడ కనవడ్తది, ఆమె పనులేడ కనవడ్తయి అని అనుకున్న అంది జయ.ఆ…సరేలే వాళ్ళు నన్ను
బతకనిచ్చుడేంది. వాళ్లనే నేను బతికిస్తున్న. సెంటర్ బతికున్నంత కాలం వాళ్ళూ బతికుంటరు గద. సరే మళ్ళీ మాట్లాడుదాం. టైం అయ్యింది. నేను బయలుదేరుత మళ్లీ బస్సులుదొరకవ్ నువ్వు రేపు మీటింగుకి వస్తున్నావ్ కదా కలుస్తాను అంట అన్నీ సర్దుకొని మళ్ళీ రోడ్డు మీదికొచ్చింది నిషిత.
బస్‌స్టాప్‌లో ఎవ్వర లేరు. అప్పటికే బస్సులన్నీ వెళ్లుంటాయి.అనుకుంది. ఇంకా జయ మాటలే వినిపిస్తున్నాయి. నిజమే నా స్థానం ఎక్కడ? సెంటర్‌లో ఇన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నా నా పరిస్థితి ఎలా ఉంది అనుకుంటుండగానే ఒక వందమందితో బస్సు వచ్చింది. అందులో నేనొకదాన్ని అనుకుంట ఫుట్‌బోర్డుపైనే నిలబడి సెంటర్‌కి చేరింది నిషిత. పిల్లలందర బయటే కూర్చున్నారు. అప్పటికి ఇంకా టీచర్లు ఎవ్వర రాలేదు. నిషితని చడగానే పిల్లలందరికి ప్రాణం లేచి వచ్చింది. అక్కా…అంట దగ్గరికి వచ్చారు. తాళం తీయగానే కొందరు నీళ్లు తాగడానికి, కొందరు బాత్రమ్‌కి వెళ్లినారు.కొంతమంది అందర కూర్చోవడానికి జంపకానా పరుస్తున్నారు. నిషిత గబగబా ఒక రంకి వెళ్ళి బాక్స్‌లో ఉన్న రెండు ముద్దల నోట్లో పెట్టుకుంది.తరువాత సుజాతా టీచర్ గ్రప్‌కి ఇవ్వవలసిన లెక్కల కార్డ్స్ తీసింది. ఇంతలో వనజా టీచర్ హలో…అంట వచ్చింది.వనజా! నిన్న నీకు ఇచ్చిన టాపిక్ ఎలా జరిగింది? పిల్లలకి అర్థం అయిందా? నీకుచెప్పడానికి ఏదైనా ఇబ్బంది కలిగిందా నెమ్మదిగా అడిగింది నిషిత. బాగానే జరిగింది, కొద్దిగా మళ్ళీ ఈ రోజు రిపీట్ చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. మళ్లీ వాళ్లని మీరు తీసుకున్నప్పుడు మీకూ తెలుస్తుంది. అప్పుడు ఒకసారి మళ్లీ మీర చెప్పండి అంది వనజ. అది సరే, ఎలాగైనా నేను చెప్తాను. నీకెలా అనిపించింది అని నేను అడుగుతున్నాను. పిల్లలకి అది ఎక్కువా లేక ఓకేనా అని ..ఆ…అర్థం అయింది. బాగానే విన్నారు. వాళ్లకేం ఎక్కువ కాదు. సరే ఐతే ఈ రోజు సుజాత టీచర్ రావడం లేదు..నేను కొంచెంసేపు తీసుకుంటాను. తరువాత ఏదైనా పని ఇద్దామనుకుంటున్నాను. నీవు ఏదైనా వాళ్లతో చేయించేది ఉందా?
అడిగింది నిషిత…అవునండీ మొన్న నేను చెప్పిన పాఠంలో ప్రశ్నలు రాయలేదు..అవి రాయమని చెప్పండి. పుస్తకంలో ఉన్నవా లేదా మీరు ఏవైనా సొంతంగా ఇచ్చారా? అహ నేను ఇవ్వలేదు. పుస్తకంలోవే..సరే ఐతే చస్తాను. నేనే ఏదైనా చిన్న ఎక్సైజ్ ఇస్తాను. వాళ్లని వీళ్లని తీసుకుంటాను. మీరు మీ పిల్లల్ని చసుకోండి. ఆరోజు నిషితకి అలా గడిచిపోయింది. మరునాడు ప్రెస్ క్లబ్‌లో బాల కార్మిక వ్యవస్థ-కారణాలు అన్న అంశం మీద మీటింగుకి ఒక చిన్న స్పీచ్ తయరుచేసి మాట్లాడింది నిషిత. మీటింగు తర్వాత జయ తను కలిసి బయట లంచ్ చేయడానికి వెళ్లారు.ఊ…ఐతే చెప్పు ఎలా ఉంది స్పీచ్? చస్తున్నావ్‌గా నా టైమంతా ఎలా గడుస్తుందో. కాబట్టి ఇక నాపై నిష్ఠూరాలు మానేసెయ్. సరేనా అబ్బా…సరేలే మానేస్త నీ స్పీచ్ చాలా బాగుంది. ముఖ్యంగా నువ్వు ఎన్నుకున్న అంశం బాగుంది. కుటుంబ హింసకి-బాలకార్మిక వ్యవస్థకి ఉన్న సంబంధాన్ని చక్కగా విశ్లేషించావు. కొన్ని విషయలు పైకి కనిపించకుండా మిగిలిన ఎన్నో విషయలపై ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఒక కుటుంబంలో స్త్రీల మీద హింస జరుగుతుంది అంటే అది కేవలం కుటుంబ హింస కింద మాట్లాడే అవకాశం ఎక్కువుంది. కానీ దానిలో పిల్లలపై ఆ హింస ప్రభావం ఎలా ఉంటుంది, ఎట్లా పిల్లలు వెట్టి చాకిరికి గురి అవుతున్నారు? బాల కార్మికులుగా ఎట్లా మారుతున్నారు అన్నది బాగా వచ్చింది. భార్యభర్తల మధ్య ఉన్న సంబంధాలు పిల్లల జీవితాల్ని ఎట్లా ప్రభావపరుస్తాయన్నది బాల కార్మిక వ్యవస్థ ఎక్కువవ్వడానికి ఎట్లా కారణమైతున్నదన్న వివరణ బాగుంది. ఇంకా నువ్వు ఇలాంటి మీటింగ్సుకి ఎక్కువ రాగలిగితే బాగుంటుంది. ఇవన్నీ కూడా రాసి పెడుతుండు. అవున మీ సెంటర్ నుండి ఎవ్వర రాలేదేంటి? ఎవ్వరికీ ఇంట్రెస్ట్ లేదా? వస్తే బాగుండేది కదా అంది జయ. ఆ అంత టైం ఎవరికుంది. ఏదో ఈ రోజు సెలవు రోజు కాబట్టి , నేన అవకాశం ఉండి
రాగలిగాను. నా ఆలోచనలు పంచుకోగలిగాను.దానికే ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చిందో ఏం చెప్పాలి. రోజురోజుకూ నా పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంటుంది. అన్ని విషయలు అందరికీ అర్థం కావు. అందరికీ అన్నింట్లో ఇంట్రెస్ట్ ఉండదు. ఉన్న వాళ్లని అర్థం చేసుకోరు. ఇవన్నింటిలో ఏదో నా స్వార్థం కోసం పాల్గొంటున్నట్టుగా నాకేదో చాలా శక్తి ఉండి అన్నీ చేస్తున్నట్టుగా, దీని వలన నాకు గొప్ప పేరు వస్తుందన్నట్టుగా ప్రవర్తించే వాళ్లకి ఏం చెప్తాం.? ఎట్లా అర్థం చేస్తాం? నా అనుభవం పరోక్షంగా ఆ సంస్థలకే ఉపయెగపడుతుందన్నది వాళ్లకి తెలియనప్పుడు మనం ఎంతగనం మాట్లాడుతాం? అప్రయత్నంగానే కంటనీరు పెడుతున్న నిషితని చసి ఆశ్చర్యపోయింది జయ. ఏ..ఏంటిది? ఏదైనా పెద్ద ప్రాబ్లమా? పోనీ వేరే జాబ్ చడనా నీకు జాబ్ దొరకదన్న దిగులొద్దు. ఈ క్షణం నిన్ను తీసుకోవడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. ఏంటిది ఎందుకు బాధపడాలి నువ్వు? నిన్ను అర్థం చేసుకోకపోవడం వాళ్ల కర్మ. ధైర్యాన్ని చెప్తూ, చెప్పు వేరే జాబ్ చేస్తావా ఓదార్చుత అడిగింది జయ.
అక్కడ మాత్రం ఈ సమస్యలుండవా? అన్ని సంస్థల నడుపుతున్నది ఎవరు? మనమే ఈ సంస్థల్ని కొత్తగా అర్థం చేసుకోవాలి. మన పనిని మనం కొత్త ధైర్యంతో కొనసాగించాలి. ఓపిక ఉన్నంతవరకు ప్రయత్నిద్దాం అనుకుంటున్నాను. ఐనా నా పిచ్చి గానీ ఏ సంస్థలోనైనా దళితులు ఎక్కువ శాతం చెప్పిన పనిని చేసే స్థితిలోనే ఉన్నారు గానీ ఇతరుల చేత పని చేయించే స్థితి ఎక్కడుంది వాళ్లకి? ఎప్పటికీ ఎవ్వరికీ పని చెప్పకుండా ఉండే పరిస్థితులే వాళ్లకి కల్పించబడతాయి. ఆ పరిస్థితుల్నే మనం అర్థం చేసుకోగలుగుతుంటే ఎప్పటికో మంచి సమయం రాకపోదు. ఎంతో ఆశతో చెప్తున్న నిషితకి ఇంక తనేమి చెప్పనక్కరలేదని సంతోషంగా అనిపించింది జయకి. సరే మరి బెస్ట్ ఆఫ్ లక్ నీ ఆరోగ్యం జాగ్రత్త. కొంచెం రెస్ట్ తీసుకుంట ఆ మంచి సమయం
కోసం ప్రయత్నిస్త ఎదురు చస్త ఉంటావా మరి అంట ఒక చిన్న చురక వేసి సెలవు తీసుకుంది.
ఆ రోజు సెంటర్‌లో పిల్లల దినం. ఆ పిల్లల పనికి ఒక గౌరవ సూచకంగా ఆ రోజు అన్ని పనుల టీచర్స్ చేయలి. గత 15 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా ఆ నియమం ఉల్లంఘించబడలేదు. ఆ నియమంలో పిల్లల వ్యక్తిత్వానికి వాళ్ల పనికి, వాళ్ల కోర్కెలకి మనస్ఫర్తిగా గౌరవాన్ని, ఒక విలువను అందివ్వడం చాలా గొప్పగా అనిపించేంది నిషితకి. నిజంగా ఆ సెంటర్‌లో ఉన్న కొన్ని విలువల పట్ల గౌరవంతోనే కొంత అనుబంధాన్ని ఆ మనుషుల పట్ల అనురాగాన్ని పెంచుకుంది. ఆ విలువలు అలా కొనసాగడానికి తన వంతు పూర్తి సహాయన్ని అందివ్వడానికి సిద్ధపడింది. కానీ ఏ విలువైనా ఆ విలువలు పాటించే మనిషి అధికారంలో ఉన్నంతవరకే బతికుంటాయని , అవి అందరిచేతా పాటించబడతాయని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటుంది. ఆ మనిషి లేనందుకు ఈ రోజు సెంటర్‌లో పిల్లల దినోత్సవం ఏ ప్రత్యేకత లేకుండానే గడిచింది.
మీ పనులకి మేము విలువివ్వడం మొదలుపెడితే మా పనులు ఎలా సాగుతాయి..? మా గౌరవం ఎక్కడ నిలబడుతుంది? ఐనా ఈ పనులే చెయ్యడానికి పుట్టిన మీకు ప్రత్యేక దినమేంటి? ప్రత్యేక సంబరాలేంటి? దొరికిన ఈ అవకాశమే ఎంతో గొప్ప. అంత గొప్ప కార్యాన్ని నిర్వహిస్తున్న మేము ఎంతో గొప్ప. ఇంక ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా చచ్చినట్టు మీ అభిమానాన్ని మా దగ్గర తాకట్టు పెట్టుకుని దొరికింది చాలనుకొని నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకుని బతుకులు వెళ్లదీయండి అంతే…ఇవే ఆలోచనలు.ఇలాంటి ఆలోచనలో లేక నాకు తెలియని కొత్త రహస్యాలు ఏమైనా ఉన్నాయె అనుకొని ఆ రోజు జరిగిన విధానానికి 15 సంవత్సరాల అనుభవంతో కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలిగా డైరీలో ఈ నాలుగు మాటలు రాసుకుని ఆ రోజుకి ఆ ఆలోచనలతో నిద్రపోగలిగింది ఇక చాలన్నట్లు. మళ్ళీ ఈ రోజు అదే
పరిస్థితి. ఆరోగ్యం బాగాలేక ఒక వారం రోజులు సెలవు పెట్టాలని నిర్ణయించుకుంది. అదే విషయం సెంటర్‌లో చెప్పినపుడు….టీచర్స్ అందరి ఆవెదం ఉన్నప్పుడు, అంతేకాక వారం రోజుల నీపని ఎవరైనా ఇంకో టీచర్‌ని బతిమాలి చెయ్యమని చెప్పగలిగినపుడు, అందరికీ అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఏ టీచరైనా సెలవు తీసుకోవాలి అన్న కొత్త రల్స్ బయటికొచ్చాయి. అదే వనజా టీచర్‌కి బంధువులున్నారని సెలవు తీసుకున్నా, లేదా సుజాత టీచర్ కొడుకు అమెరికా వెళుతున్నందుకు ఇరవై రోజులు రావట్లేదని మాట వరస కన్నా చెప్పకుండా రేపటి నుండి నేను రాను అని డిక్లేర్ చేసినా, మరొక టీచర్ కూతురికి ఎక్సామ్ అని రాకపోయినా ఈ రల్స్ ఎక్కడా కనిపించలేదు. కానీ మరి నాకెందుకు ఇన్ని రల్స్ అమల్లోకి వచ్చినాయి? నేను అందర చెప్పే కారణాలు చెప్పలేకపోయినందుకా?లేక నేనెప్పుడ ఎక్కువ రోజులు సెలవు పెట్టనందుకా ..పెట్టడానికి వెనకా ముందు ఆలోచించినందుకా ఎందుకు? ఎందుకు? అంతులేని ఈ ప్రశ్నలతో సతమతమైపోతున్న నిషితకి పరిస్థితుల్ని కొత్తగా అర్థం చేస్త కుండ బద్దలైనట్లుగా పచ్చినిజం బైటికొచ్చింది. అదే ”మాల పంతులమ్మకి సెలవు కావాల్నా?” ఈ ఆలోచన తొలగించినపుడే నీవు ఎదురుచస్తున్న ఆ కొత్త సమయం, ఆ మంచి సమయం ఆసన్నమవుతుందని…