ఆగస్టు2008
మనుషులు వయమౌతున్నారు.
- మంచికంటి
మనుషులు వయమౌతున్నారు.
బతికిన నాలుగుక్ష్షణాలు
సజీవంగా బతకడమే కావాలి
మనిషిగా పుట్టిన మనిషికి
జంతు తలలు పుట్టుకొస్తున్నాయి
మట్టిలో మొలకెత్తిన మనిషి
శిశిరాల్ని వెసుకు తిరుగుతున్నాడు
జ్వలించే శక్తిలా మండిన మనిషి
వెలుతుర్ని తోసేసి
వేకువల్లోనే బండబారి పోతున్నాడు
మనిషిగా బతకమంటేనే
మండిపడి పోతున్నాడు
మనుషుల మమతల
ఆత్మీయతల దొంతరల
అవసరమే లేనట్టు నటిస్త్తున్నాడు
బ్రతుకుని నిర్జీవంగా చేసి భ్రమిస్తున్నాడు
కన్నీటి ఊటల్లో కత్తులు దించుకుని
రాక్షసంగా నలుదిక్కులకూ విన్తరిస్తున్నాడు
తల్లిమీద అంత ప్రేమ చయించలేడు
చెల్లికింత అనురాగం పంచలేడు
పిల్లల్నీ ప్రేమగా అక్కున చేర్చుకోలేడు
ప్రేమించిన ప్రియురాల్నో
కట్టుకున్న భార్యనో
తనివితీరా మనసారా కౌగిలి కెరటాల్లో
ముంచెత్తన లేడు
పుష్పిస్తున్న ఒక అందమైన పువ్వును
సుతారంగా స్పృశించన లేడు
ఉదయిస్తున్న సర్యోదయల్ని
కళ్ళల్లో కాంతులు విరజిమ్మేలా చడన లేడు
దారిన పోతపోత చెయిజాపే పైరగాలిని
హాయిగా వొడిలోకి ఆహ్వానించి సేదతీరలేడు
వమిడాకు తోరణాలు కట్టిన పందిళ్ళలో
హాయిగా కూర్చుని ఒక విందునీ ఆరగించలేడు
శవం పోయిన ఇంటిలో కూడా
ఒక వెచ్చటి కన్నీటి బొట్టును చిందించలేడు
మనుషులిప్పుడు తెలియకుండానే
ఎవరికి వాళ్ళే వీపులకు శిలువలెత్తుకుని
తలల శిలలపై ముళ్ళ కిరీటాలు తగిలించుకుని
ఎవరి చేతుల్తో వాళ్ళే కొరడా దెబ్బలు కొట్టుకుంట
సైతానులా సాగిపోతున్నాడు.