మరణ శాసనం

-డా.జి.వి. రత్నాకర్‌

వ వల పల్లె గుండెల గాయం
పోతురాజు బండని అంకమ్మ చెట్టుని
కులదైవం చెన్నకేసులు సోమిని
నిలదీసి నాయం చేయమని అడుగుతుంది.

ఆడేపాడే నా బిడ్డ అందమైన బిడ్డ
బడికొట్టాంకెల్లి అచ్చరాలు దిద్ది
కాలేజీ కెలతన్న నా బిడ్డ ఏడయ్య
బిడ్డ కన్నుల కలలు నా కల్ల ఆశలు
అడియసలైనాయి నాయనా అంటా
ఆ తల్లి కలరోలు కాడ కన్నీరౌతుంది

అయ్యపోయిన కాన్నుంచి కలలన్నీ
నీపై పెట్టుకున్నా తమ్ముడా అంటా
మూసిన కన్నుల్ని ఆగిన గుండెని చసి
ఆ అన్న నిలువునా నీరైనాడు

ఆ వీరుల శవాల్ని కోసి కోసి
కనపడని కులాన్ని వెదికి వెదికి
అగ్రహారపు ఐరావతాల్ని వెలేసి
ఏలెత్తి చపిన పెద్దాయన సాచ్చికంగా
పెద్ద చదువు చదివిన ఆ డాక్టరు
గుండె పగిలి పొలిగిపోయినాడు

తెగిపడ్డ తలలు కత్తిరించబడ్డ నాలుకలు
అభినవ మనువులకి చాణక్య నీతులకి
వలపల్లె నడిబొడ్డున రక్తంతో
మరణ శాసనాలు రాస్తున్నాయి.

రాజ్యాంగాన్ని తిరగరాయించి ప్రజాకోర్టులో
కన్నమనీడు ఖడ్గానికి పదునుపెట్టి
పెద్దాయన చపుడేలు దారిలో
నవయనాన్ని లిఖిస్తున్నాయి

భ్రదంగా తుంగన తొక్కబడ్డ
నెత్తురు కండలు ఆటంబాంబులై పేలుతున్నాయి
కోర మీసాల్ని గాలిదువరాల్ని
పోలీసుకుక్కల్ని నల్లకోటుల్ని వెలేసి
నాయం చేయమని నిలదీస్తున్నాయి

అలీసమ్మల శోకాల్ని నెత్తుటి ఏరుల్ని
అనిలన్నల సాహసాల్ని ఆ త్యాగాల్ని
గురుతుకు తెచ్చి రచ్చబండల్ని
గర్భ గుడుల్ని బొడ్రాయిల్ని ఉరేస్తున్నాయి.

Share/Save/Bookmark

కవితలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో