స్వాతంత్రం అంటే?

స్వాతంత్రం అంటే?
స్వాతంత్రం అంటే?

‘Can we look beyond the FREEDOM that is being marketed to us?’ is the million Dollar question? (ఎందుకంటె రూపాయిల భాష ఎవరు మాట్లాడుతలేరు కాబట్టి). ఇప్పుడు ఉన్న తరం మార్కెట్ శక్తులకు ఎంత ప్రభావితం అయితుందో వేరేగ చెప్పనవసరం లేదు. ఎనభైలు, తొంభైల తరాలకన్న ఇప్పటి (ఇంటర్నెట్) తరం ఆశలు ఆశయాలల్ల చాల మార్పులొచ్చినయి. నేనుగూడ ఈ తరమోన్నే కాబట్టి వ్యాసాన్ని ఉపన్యాసం కన్న ఒక ఆత్మ విమర్శ లాగ రాయదలచుకున్న. ఈ వ్యాసం తోటి ఒక ఆరోగ్యకరమైన చర్చ పుట్టియ్యాలన్నది నా అసలు ఉద్దేశం. ఈ క్రమంల అన్ని విషయాలు ప్రస్తావించలేక పోవొచ్చు, వదిలేసిన విషయాలను చర్చల భాగం చేసుకుందాం.

ఇప్పటి ‘అరవై సంవత్సరాల స్వాతంత్ర సంబరాల’య్యే సందర్భంల, ఈ హైటెక్ తరం ‘స్వాతంత్రాన్ని’ ఎట్ల అర్థం చేసుకుంటుంది? కనుచూపుమేర దాటి, కనిపియ్యని, ఎవరు గీసిన్రో గూడ తెలవని హద్దుల అవతల జీవులు అనుభవించే స్వతంత్రాన్ని పట్టిచ్చుకునే స్థితిల ఉన్నడా?

తనకు చేసుకోనీకి ఒక ఉద్యోగం, ఉండనీకి ఒక అపార్ట్‌మెంట్, తిరగడానికి ఒక కారు, సేదతీర్సుకోవడానికి సరిపోయేటన్ని మాల్స్ ఉన్నయి కాబట్టి దేశప్రజలంత సుభిక్షంగ ఉన్నరు, అందుకే ‘ఇండియా షైనింగ్’ అని మురిసిపోతుండా? ‘అరవై సంవత్సరాల స్వాతంత్రం’ గురించి మాట్లాడుకునేటప్పుడు, ఈ తరం గురించి మనం ఎందుకు చర్చించుకోవాలె?

ఎందుకంటె ఈ తరం అవసరాల కోసమే అని చెప్పి ఎన్నో సహజ వనరులను నాశనం చేస్తున్నరు, ఎంతో మంది బతుకులు ఆగం జేస్తున్నరు! దేశజనాభాల 50% యువతీ యువకులు 25 సంవత్సరాలు, 66% వాల్లు 35 సంవత్సరాల వయసు లోపే ఉన్నరు, మంచిగ బతకాలన్నది వీల్లందరి కలగూడ ! బతకాలెగూడ ! కాని అది జరుగుతలేదు. జనాభాల సగం కన్న ఎక్కువే ఉన్నం కదా మరి ఈ స్థితిని ఎందుకు నిరసిస్తలేం? రాజకీయ, సామాజిక అవగాహన లేకపోవుడు వల్లనా ? లేక తప్పుడు సమాచారాలకు లోనై, తప్పుడు అవగాహనలు ఉండుడు వల్లనా ?

దేశం మొత్తంల జరుగుతున్న ఉద్యమాలల్ల ఈ తరం పాత్ర ఎంత? ఎన్నిటి తోటి సంఘీభావం ఉన్నది? ఎన్నిట్ల పాలు పంచుకుంటున్నది? జరుగుతున్న ఉద్యమాలల్ల పాలుగొనుడు పక్కన పెడితే – అవి కనీసం జరుగుతున్నయి, వాటికి మన అవసరం ఉన్నది అన్న సోయిల గూడ లేదు. అయితే గత పదేండ్లల్ల మన దేశం ‘అమెరికన్ డ్రీం’ దిగుమతి చేసుకున్నప్పటి నుంచి ఒక పెద్ద చట్రంల ఇరుక్క పోయి చాల విషయాలకు దూరమైతున్నం.

70% దేశ జనాభా ఇంకా రెండో పూట తిండి ఎట్లనా అని తండ్లాడుతున్నరు, ఆ కడుపు మంట సల్లారక ముందే వాల్ల కాల్లకింద భూమి కదిలి పోతున్నది, సహజవనరులన్నీ తరలి పోతున్నయి. సొంత ఊర్లనే పరాయోల్లు అయితున్నరు, గూడుగాలిన పక్షులవుతున్నరు, కాందిశీకులైతున్నరు. నర్మద, పోలవరం భారీ ప్రాజెక్టుల నిర్మాణంతోటి నిర్వాసితులౌతున్న ఆదివాసులు; నందిగ్రామ్, గోవా, పోలెపల్లి, కాకినాడ, నవీ ముంబై, కళింగనగర్ మొదలైన సెజ్‌ల వల్ల (ప్రత్యేక ఆర్థిక మండలాలు / Special Economic Zones) భూమి భుక్తి కోల్పోయిన రైతులు; అరకు బాక్సైట్ తవ్వకాల వల్ల, నల్గొండల ఫ్లోరైడ్ సమస్య యురేనియం తవ్వకాల వల్ల, ఒరిస్సాలో అల్యుమీనియమ్ తవ్వకాల వల్ల జీవనాధారం కోల్పోతున్న స్థానికులు; గంగవరం పోర్ట్ , కోస్టల్ కారీడార్ , ధామ్ర పోర్ట్ వల్ల ఉపాధి కోల్పోయే జాలరులు; నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన సమస్యగ నడుస్తున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రోద్యమం … వీళ్లందరు చేస్తున్న పోరాటాలు అసలు మన దృష్టికి వస్తున్నయా? వచ్చినా పట్టించుకుంటున్నమా? (దేశ సమస్యల చిట్టాల మచ్చుకి కొన్ని చెప్పిన, మన చుట్టుపక్కల ఉన్నయి కొన్ని ప్రస్తావిస్తున్న)

ప్రపంచ కార్మికులు కలిసి చేసిన ఉద్యమాల ఫలితంగ కనీస వేతనాలు, యూనియన్‌లు ఏర్పాటు చేసుకునే హక్కులు సంపాదించుకో గలిగిండ్రు, రోజుకు ఎనిమిది గంటల పని చట్టం అమలు చేయించుకో గలిగిండ్రు. మరి ఇప్పుడు ఐ.టి (అవుట్ సోర్సింగ్ సంబంధిత) ఉద్యోగాలల్ల ఉన్న వాళ్లకు ఇవి వర్తిస్తలేవు, ఎందుకంటే వాళ్ల కాంట్రాక్ట్ అందుకు అనుమతించదు గనుక. అవుట్‌సోర్స్ చెసిన అమెరికా లాంటి దేశాలల్ల ఆ చట్టాలు అమలు అవుతున్నయి, కాని ఆ చట్టాలు అమలు అవుతున్న దేశాల నుంచి వచ్చిన కంపెనీలల్ల పనిచేస్తున్న మన సోదరులకు మాత్రం అవి వర్తించవు! ఎందుకు వర్తించవు? ఖచ్చితంగ వర్తించాలె! ఈ పద్దతిని ప్రశ్నించాలె అన్న కనీస ఆలోచనగూడ వీళ్లకు ఎందుకు వస్తలేదు?

స్త్రీ హక్కుల ఉద్యమాల విషయానికి వస్తే ‘మేము చదువుకొని, మంచి ఉద్యోగాలు చేసుకుంట, మంచి గృహజీవనం గడుపుతున్నం మాకు ఏమి కష్టం వచ్చిందని ఉద్యమాలు చేయాలే’, అనే ఆలోచనల స్త్రీలు ఎందుకు ఉన్నరు? స్త్రీ హక్కుల ఉద్యమాలల్ల మేము ఏం చేయాలె, ఎందుకు పాలుగొనాలె అన్న ఆలోచనలతో మగవాళ్ళు ఎందుకున్నరు?

విదేశాలల్ల స్థిరప(డ్డ)డుతున్న మూడో ప్రపంచ దేశాలనుంచి వచ్చిన డయాస్పొరాలు, వాల్లకు చాతనయినంత వరకు వాళ్ల వాళ్ల దేశాలలో జరిగే ఉద్యమాల్లో పాలు పంచుకుంటున్నరు, వీలు కానప్పుడు కనీసం సంఘీభావం తెలుపుతున్నరు. కాని మన దేశ / రాష్ట్ర డయాస్పొరాలు అందుకు చాన భిన్నంగ ఉన్నరు. సినీనటులు, రాజకీయ నాయకులను వాళ్లకు కూటికి గతిలేనట్టు సాదుకుంట పుణ్యకాలం ఎల్లదీస్తున్నరు. ఎందుకంటె, ‘అభివృధ్ధి’ని ప్రశ్నించ వద్దు అన్న ఆలోచనలతో గిడసబారి పోయిండ్రు, కాని ‘ఎవరి అభివృధ్ధి’ అని మాత్రం ఆలోచించరు. బర్మా, టిబెట్, పాలస్తీనా డయాస్పోరాల కన్నా మన డయస్పోరా కొన్ని వందల రెట్లు పెద్దది, అయినా సాంఘిక సమస్యలపై మన చైతన్యం చాల తక్కువనే చెప్పాలె !

ప్రస్తుత సినీ పరిశ్రమ (హిందీ, తెలుగు తదితర) సినిమా భజన చేసే పత్రికలు, టీవీలు, వాటి సంబంధిత వ్యాపారాలన్నిటికీ, ఈ తరాన్ని అజ్ఞానంలోకి నెట్టే సంఘటిత నేరంలో పాలు ఉన్నది. ప్రేక్షకులు చూడనిదే మేము తీస్తున్నమా అనుకుంటనే సారం లేని సినిమాలు తీస్తున్నరు, వచ్చిన చెత్తనంత ఏ మాత్రం వదిలి పెట్టకుండా మన వాళ్ళు అన్నీ జీర్ణించుకుంటున్నరు. మంచి సినిమాలు వస్తలేవు, రావు అని నేను అంటలేను, కాని జన్మకో శివరాత్రి లెక్క వస్తున్నయి. సినిమాతోటి సమాజాన్ని మార్చెయ్యొచ్చు అన్న నీతిని చెప్పదల్చుకోలేదు. సమాజాన్ని మార్చే శక్తి కన్నా ఎక్కువగా అంతకన్న తొందరగ తప్పుదారి పట్టించే శక్తి సినిమాకి ఉన్నది. ఎటువంటి సినిమాను ఆదరించాలన్నది స్పష్ష్టంగా తెలువనంత వరకు ఈ వరద ఆగదు.

‘ఉద్యమం’ అనంగనే మనలో ఎక్కువ మందికి (ఇప్పటి సమాచార సాధనాల దయ వల్ల) ఆలోచనలోకి వచ్చేది, సర్కారు ఆస్తిని తగలబెట్టుడు! హింస !! నిజానికి జరిగే హింస ఉద్యమకారుల మీద అని మాత్రం గ్రహించం ఎందుకంటే టీ.విలో మనకు నిజాల పేరు మీద చూపించే కథలు వేరు గనుక. అన్యాయాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుడు ‘గాంధేయవాదం’ కాదని దుష్ప్రచారం చేస్తున్రు కనుక. మహాత్ముడు స్వతంత్రం వచ్చిన కొద్ది రోజులకే అమరుడు అయిండు గని, బతికి ఉంటే ఇంకా ఎన్ని సత్యాగ్రహాలు చేసేటోడో? గాంధీ అయినా భగత్ సింగ్ అయినా, అత్యధిక శాతం ప్రజలకు అన్యాయం చేసే ఏ చట్టాన్నయినా, నాయకుడినయినా, ప్రభుత్వాన్నయినా ఎదురించడానికే, కనీసం నిరసించడానికే, ఉద్యమాలు లేవనెత్తిన్రు . వాళ్ళ పద్ధతులు వేరు గావొచ్చు, కాని లక్ష్యం ఒక్కటే!

1857 సిపాయి తిరుగుబాటు, స్వతంత్ర పోరాటాలు, తెలంగాణ సాయుధ పోరాటం, ఫ్రెంచ్ విద్యార్థుల పోరాటం, చైనా లో తియానాన్మెన్ స్క్వేర్ విద్యార్థుల ఉద్యమం (1), నర్మదా బచావో ఆందోళన్ మొదలైనవాటి ఉద్యమ స్వభావాలు, ఫలితాలు, ప్రమాణాలు ఏవైనా… అన్నీటికీ మూలమైనదీ, ముఖ్యమైనదీ – స్పృహ !

“కొత్తతరం వేసే సహేతుక ప్రశ్నావళికి దద్దరిల్లిన పెద్దరికం పిన్నలు ప్రశ్నించటాన్నే అనాచారంగా మార్చివేసింది” అని చలం అన్నట్టు, మనకంటె వయసులో పెద్దవాళ్ళను , రాజకీయ నాయకులను, అన్నిటికంటే మించి ప్రభుత్వాలను (ధిక్కరించుడు పక్కన పెడదాం, కనీసం) ప్రశ్నించుడు కూడ అతి పెద్ద పాపం అని, రాయి పైన చెక్కని శాసనంలా మారిపోయింది. గొర్రెల మందలాగా ముందటోన్ని జూసి అందరం నోర్లు మూసుకొని ఉంటున్నం. ఏ విషయానికిగాని రెండే వాదనలు సరైనయి, తప్పు-ఒప్పు, నిజం-అబద్దం. ఆ తప్పు చేసినోడు ఎవరైన, అబద్దం చెప్పింది ఎంత మంది అయిన వాళ్ళని ప్రశ్నించే కనీస హక్కు మనందరికి ఉన్నది . కాని అది రాజ్యాంగంల ఉంటేనే సరిపోదు గద? తప్పు చేసేటోనికన్న తప్పు జరుగుతుంటే చూసుకుంట నిశ్శబ్దంగా ఉన్నోనిది ఇంకా పెద్ద నేరం! అన్యాయాన్ని ఎదురించాలె అనే స్పృహ లేనంత వరకు ఎన్ని వందల ఏండ్ల స్వాతంత్రం అయినా అది దుర్వినియోగం అయినట్టే లెక్క!

5 అభిప్రాయాలు »చౌరస్తా

5 Responses to “స్వాతంత్రం అంటే?”

  1. 1
    Siddartha Pamulaparty Says:

    JP,

    EE vyaasam chaala relevant gaa undi. Entho vaasthavam goodaa.

    Nenu IT lo pani jeyabatti 4 yendlu aithundi. Modati rendellu enduku chestunnamo kuda telvakunda 14, 16 gantalu pani chestunde. Ippatiki chestuntaa anuko appudappudu. Kaani nenu naa thoti panichesetondla tho ade matlaaduthunta…IT employees ki Human Rights undava? Personal life undadaa ani?

    Aithe chaala mandi ki telisi kuda pani chestuntaru…deeni gurinchi naa observation idi:
    First, kottalo, job dorakadame kashtamanukuntune IT lo join aitharu, manchi life, videshaalaalla pothe saving cheskovacchu ani. Kottha kadaa ani kashtapadtharu baaga, prove cheskovale, manchi books la undale, opportunity raavale ani. Atla 1,2 endlu gadichipothai. Sare gadhaa mari intha pani chestunnanduku anni anukunnatu aithaya ante kaavu. Endukante theevramaina competition, promotions aina, pay hike aina, onsite (videshaalallo) assignment ainaa anthe. Andla kontha mandiki aithai, chaala mandiki kaavu. Inka 3, 4 endlu experience vachinollu rendu theerlu: Okati: alavatu prakaramo leka natural instinctoo konthamandi atlane panichestuntaru (naaku telisina pellina vallu unnaru, chaala kashtapadtharu, personal life sacrifice cheskuntu), Rendu: chikaaku vacchi edaithe endi ani time prakaram pani cheskuntu ekkuva, vere ekkuva pattinchukokunda undetollu (chaala takkuva).
    Naa personal experience, gatha rendella nundi America la client daggara panichestunna, naaku poorthi virakthi kaligindi IT meeda. Evaro Videshee company business baagundalani, services ichukuntu, Indian company la pani cheskuntu, “cheap labour” anna feeling vachindi.
    Sare, adi oka part maatrame nee vysam laa.

    Migatha vishayaalaku vasthe, everything you said is correct.

    “Spruha” yuvathaku ledu ante daaniki kontha mana education system, mana previous generation vaallu “values” gurinchi ekkuva concentrate cheyyakapovadam, Engineering Medicine lanti professional vatiki preference ichhi, History, Literature, Cultural studies ki importance taggipovadam itla affect chesutnayyi ani nenu anukuntuuna.

    Inkokati, “Spruha” annapude, manaku chinnapatninchi nerpinche “nispruha” nE ekkuva. Politics anagane, adi manaku kaadu, chaduvu raanollaku, goonda laku rowdy laku ani oka example. Pakkanodiki edina aitundante manakenduku anukune, oka lanti pirikithanam inkoka example.

    Freedom ante, India la etluntadi, ikkada America etluntadi? Responsibiliy, Accountability kuda atlane compare cheyyale…

    The way the system has been designed was for 60 years ago. We need reforms in education especially and also in social and political systems. Andariki telusu idi kaani emi jarigedi kanipisthaledu.

    Cinemalaa gurinchi, mana vallu Monday poddune, college bunk chesi, pani vadilesi Queues la nilabadi kashtapadi maree chustaru. Antha avasarama? Adi oka pleasure kavacchu kaani picchi kaavaddu.

    Youth ki Spruha/Awareness ravalante, Schools/Colleges la, Society la, atlane domestic gaa kuda educate cheyyale, congenial enironment ni erpaatu cheyyale. Deeniki alternative “cultural” gaa try cheyyavacchu ani naa nammakam.

    What I mean is:
    1) Develop activities and programs, which are Public in nature that teach about the values , about Freedom and Rights, about Responsibility and about Accountability.
    2) Provide social platforms for cultural programs and competitions about History, Politics, Tradition, Social Justice/Injustice, philosophies of Oriental and Western origins, Literature, Music etc. This should be done at a very detail level, by probably establishing local groups, so that everyone gets an opportunity to contribute OR learn.
    3) Provide counselling facilities not only on Career Guidance, but general awareness, national integrity, future problems and possible solutions.

    I just got overwhelmed seeing in your essay on most of the things I usually think about myself and wrote all the above. Please feel free to correct me where I went wrong.

    Also, sorry Telugu ni English lo raasinanduku, I had hard time to type in the format given by eemaata.

    Regards,
    Siddartha.

  2. 2
    thesouthasian.org Says:

    Is India Really Shining ?

    We celebrated the 59th Indian Republic Day with great patriotism and fervour. At moments, I am sure our eyes must have moistened with pride, while watching the parade and tableau showcasing our achievements.
    Read complete article : http://www.thesouthasian.org/blog/archives/2008/is_india_really_shining.html

  3. 3
    daaveedu Says:

    వ్యాసం చాలా బాగుంది. ఫ్రపంచ వ్యాప్త తిరోగమనం మూలాన, గతంలో సాధించుకున్న హక్కుల్ని కూడా మానవాళి కోల్పోతోంది. యువతరం్ తమ తలితండ్రుల కంటే దారుణంగా తయారవ్వటానికి ఇది ముఖ్య కారణం.

  4. 4
    himabindu Says:

    చాలా బాగా రాసారు జెపి….

    బిందు

  5. 5
    Sitaramreddy Says:

    నమస్తే అన్నా, చానాబాగా జెప్పినవే. గొర్లకంటే, గొడ్లకంటే అధ్వాహ్నం అయిపోతుర్రు జనాలు. నీబోటోళ్ళు పొడిచినా కదిలేటట్లు లేరు.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో