సెప్టెంబర్2008
ప్రాణహిత
Mahmoud Darwish
ప్రాణహిత సెప్టెంబర్ సంచికకు స్వాగతం. గత చాలా సంచికలుగా మీకు ప్రాణహితను ప్రతినెలా మొదటి వారానికల్లా అందించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము. అయినప్పటికీ తెలుగునేల నుండి మాకు సరైన సమయానికి, సరైన లిపి (ఫాంట్) లో సాహిత్యం అందడం, దాన్ని మేము అచ్చుతప్పులు సరిదిద్ది, క్రమపద్దతిలోనుంచి మీకందించడం – ఇవన్నీ అనుకున్న కాలానికి సక్రమంగా జరగడం అన్ని వేళలా వీలుపడలేదు. అందుకే చాలా సంచికలు తీవ్రమైన జాప్యంతో – ఏమిటీ ప్రాణహిత ఆగిపోతుందా అనే ప్రశ్న పాఠకులలో ఉదయించేంతగా – వెలువడినయి. అనేక అవాంతరాలెదురైనప్పటికీ ప్రతినెలా ప్రాణహిత నందించాలనే తపన తో, స్థిర లక్ష్యంతో పనిచేసాం. జాప్యమైనా అందించగలిగాం. అయితే ఈ క్రమాన్ని ఒక నిర్ణీత సమయానికి అనుకూలంగా మార్చడానికి, అనుకున్న పద్ధతిలో ప్రాణహితను మీకు ప్రతి నెలా మొదటి వారానికల్లా అందించడానికి మేము చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. మా పరిస్థితినీ, మేమెదుర్కుంటున్న ఇబ్బందులనూ అర్థం చేసికొని, ప్రతినెలా ప్రాణహితను ఆదరిస్తున్న పాఠకులకు మేము సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇకముందు కూడా ఇట్లాగే ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
మొత్తం చదవండి »
సంపాదకీయం
సెప్టెంబర్2008
డా. కె. గీత
ఏం చెప్పను కాలిఫోర్నియా కబుర్లు-
నును వేడిమి చలిగా ముడుచుక్కూర్చుని….
ఇదేం వేసవో అర్థం కాని చలి-
గాలి సాయం లేకపోతే వీపు పగిలే సూటి ఎండ
ఏదీ- కానిస్తేనా?!
మొత్తం చదవండి »
కవితలు
సెప్టెంబర్2008
ప్రాణహిత
- కోసూరి

మనిషి మనిషికొక
మాధ్యమం అవసరం
ప్రపంచమ్మొత్తం వూరవుతున్న
అనివార్యమైన సందర్భంలో
మొత్తం చదవండి »
కవితలు
సెప్టెంబర్2008
అన్వర్
- అన్వర్
అక్షరం
గాయపెట్టి గాయపడ్డది
అక్షరం
కంట్లోగుచ్చుకున్న ముల్లు
గుండెలో దిగిన బాడిశ
మొత్తం చదవండి »
కవితలు
సెప్టెంబర్2008
ప్రాణహిత
-పాపినేని శివశంకర్
ఒక్కసారిగా ఉలిక్కిపడతా
బయటెవరో పిలిచినట్టు
బావిలోపల్నుంచి ఏదో కేక విన్పించినట్టు
ప్రపంచం బయటే ఉన్నానో
నా లోపలే నేనున్నానో
తెలీదు
మొత్తం చదవండి »
కవితలు
సెప్టెంబర్2008
ప్రాణహిత
- డాక్టర్ దేవరాజు మహారాజు

ఎవరదీ చరిత్ర చెట్టును ఊడబెరికి
తిప్పిపెట్టిందీ ?
వ్రేళ్ళను గాల్లోకి వదిలేసి
మొగ్గల్ని,పూలను,ఫలాలను
మొత్తం చదవండి »
కవితలు
సెప్టెంబర్2008
హెచ్చార్కె
సోక్రటీసు ను సోక్రటీసు గా చేయడం కోసం
ప్రపంచమంతా కుట్ర పన్నుతుంది
లోడొల్ల నిశ్చల నిశ్చితాల మధ్య
అతడికొక గయ్యాళి పెళ్ళాన్ని ఇస్తుంది
మొత్తం చదవండి »
కవితలు
సెప్టెంబర్2008
జి.వెంకటకృష్ణ
- జి.వెంకటకృష్ణ
నేషనల్ హైవే మీద కొత్త ‘ఇన్నోవా’ కారులో శేఖర్ పరధ్యానంగా డ్రైవ్ చేస్తున్నాడు. కర్నూలు నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో వున్న వూరికి అతని ప్రయాణం. ఆ వూర్లోనే అతని అక్క సావిత్రి వుండేది.
ఒక రోడ్డు నాలుగురోడ్ల హైవేగా విస్తరించడానికి, రెండు వైపులా నిర్మాణంలో వున్న రోడ్డది. దారి పొడువునా రిపేర్ లో వుంది. మొత్తం చదవండి »
కథలు
సెప్టెంబర్2008
ప్రాణహిత
- రేణుక అయెల
ఎత్తైన భవనం మీద నిల్చున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. కింద నిల్చున్న వాళ్లల్లో ఆత్రుత, ఆందోళన. తలలు పైకెత్తి చూస్తున్నారు…టి.వి. వాళ్ల కెమెరాలు పరుగులు పెడుతున్నాయి. హఠాత్తుగా అంత ఎత్తునుంచి దూకేసాడా వ్యక్తి నెత్తుటి మడుగులో కొట్టుకుంటూ…ఇలాంటి దృశ్యాలు, వార్తలు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయయి. మొత్తం చదవండి »
కథలు
సెప్టెంబర్2008
ప్రాణహిత
- ఆర్కే.కోసూరి
కవిత్వం కోసమే ఒక కరదీపికను వెలిగించుకోవటం ఎంతో గొప్ప విషయం. అనేక సాహిత్య విషయాలు స్పర్శిస్తూ, అందులో కాస్తంత కవిత్వాన్నీ అందించటం దశాబ్ధాల పత్రికా చరిత్రలో సుస్పష్టం. కానీ కేవలం కవిత్వం కోసమే ఒక ప్రయత్నం చేయటం కొత్తగా అనిపిస్తుంది.
ఇంత కవిత్వం వస్తుంది కదా ఇంకా ఈ పినాకిని అవసరమా?!. మొత్తం చదవండి »
పుస్తక సమీక్షలు
సెప్టెంబర్2008
ప్రాణహిత
-కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి
ఈ మధ్య ప్రముఖ పత్రికల్లో వచ్చిన సాహిత్య వ్యాసాలు చదువుతుంటే కొన్ని ప్రక్రియల్లో కవిత్వం లేదు..అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈనాడు కవిత్వం పద్య రూపంలోనూ వచన కవితా రూపంలోనూ, మినీ కవితలుగాను, హైకూలు, నానీలుగాను, పుంఖానుపుంఖాలుగా వెలువడుతుంది. మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
సెప్టెంబర్2008
వేలూరి వెంకటేశ్వర రావు
- వేలూరి వెంకటెశ్వర రావు
Mahaprasthanam, Sri Sri
నిజంగానే నిఖిల లోకం
నిండు హర్షం వహిస్తుందా?
మానవాళికి నిజంగానే
మంచికాలం రహిస్తుందా?
అని శ్రీశ్రీ సందేహం (?) వెలిబుచ్చుతూ వ్రాసినప్పుడు (1941?) రెండవ ప్రపంచయుద్ధానికి నిజమైన అంకురార్పణ మొదలైయిందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
మొత్తం చదవండి »
చౌరస్తా
సెప్టెంబర్2008
బెల్లంకొండ సంపత్ కుమార్
-బెల్లంకొండ సంపత్ కుమార్
పల్లె సంస్కృతి నుండి ఎదిగిన కవికి వస్తుదారిద్య్రం ఉండదు. కవిత్వంలో టెక్నిక్‌ని సొంతం చేసుకుంటే కవి మెరుపు తీగలాగా దూసుకొని ముందుకెళ్లగలడు.
‘మట్టిపాట’ పల్లె జీవన శతకాన్ని ప్రచురించిన కవి ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణా నేపథ్యం గల పల్లె వాతావరణం నుండి క్రమంగా ఎదిగాడు. మొత్తం చదవండి »
సాహిత్య వ్యాసాలు
సెప్టెంబర్2008
మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత
నన్నడిగితే వూండెడ్ నీ సంఘటన రాపిడ్ సిటీలో మొదలయ్యిందని చెబుతాను. ఇది జాన్ వైన్ల * దేశం. ఆ వూరిలోని తెల్లవాళ్లందరూ మార్ల్ బరో అడ్వర్టైజుమెంటులోని హీరోలా వుండడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పటికి నేను ఇంకా క్రౌ డాగ్ ను పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో నేనొక యువకుడితో ప్రేమలో వున్నాను. అతడిలో మంచి నాన్న అయ్యే మాట అటుంచి, ఒక భర్త అయ్యే లక్షణాలు ఏ కోశానా లేవు. మొత్తం చదవండి »
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం
సెప్టెంబర్2008
ఎన్. వేణుగోపాల్
- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్)
దూరం నుంచి పాబ్లో నెరూడా రావడాని సారాకొట్టులో ఉన్న ఒకేఒక్క పల్లెకారుడు చూశాడు. నెరూడా వెంట ఒక తోలు సంచీ వేసుకున్న కుర్రాడెవడో కూడ ఉన్నాడు. అది చూడగానే ఆ పల్లెకారుడు కొత్త పూటకూళ్లమ్మ చెవిన ఆ మాట వేశాడు. చూడు, చూడు ఎవరో మంచి ఖాతాదార్లు, కనీసం వారిలో సగం మంది మంచి ఖాతాదార్లు, వస్తున్నారు అని. మొత్తం చదవండి »
అనువాదాలు, ద పోస్ట్ మాన్, ప్రపంచ సాహిత్యం
సెప్టెంబర్2008
ప్రాణహిత
నీవు లేవు నీ మాట ఉంది…
- గుఱ్ఱం సీతారాములు.
వైద్యవృత్తినివదిలి సమాజానికి శస్త్రచికిత్స చేయడం కోసం ప్రాణాలర్పించిన డా|| చాగంటి భాస్కరరావు త్యాగం గూర్చి మనకు తెలుసు. పౌరహక్కుల ఉద్యమంలో రాజ్యం కసాయి తనానికి బలి అయిన డా|| రామనాధం కూడా తెలుసు. వారి స్ఫూర్తితో శాస్త్రీయ అవగాహన, సేవానిరతి, త్యాగం అలపర్చుకొని ప్రజలకు వైద్య సేవలందిస్తూ వచ్చిన ఖమ్మం పట్టణ ప్రముఖ వైద్యులు డా|| కానూరి హరీష్ మనకికలేరు. వారు సెప్టెంబర్ 22, 2006న కన్నుమూసారు.
మొత్తం చదవండి »
సంస్మరణ
సెప్టెంబర్2008
ప్రాణహిత
Hari Purushotthama Rao
ఆగస్ట్ 14వ తేదీన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన భవనంలో ప్రముఖ మార్క్సిస్ట్ సాహిత్య విమర్శకులు హరిపురుషోత్తమ రావు సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన రచనల్ని ‘విభిన్న’ అనే పేరుతో పర్స్పెక్టివ్ ప్రచురణ సంస్థ వారు ఒక పుస్తకాన్ని వెలువరించారు. మొత్తం చదవండి »
సంస్మరణ
సెప్టెంబర్2008
ఎన్. వేణుగోపాల్
హరి గురించి రాయాలంటే ఎన్నెన్నో రాయాలి. కలిసినప్పుడల్లా తన మాటలతో ఒక మెరుపు మెరిపించే, ఒక వెలుగు విరిసే, ఒక చారిత్రక అనుభవ శకలం వివరించే, ఒక కొత్త చూపు విశ్లేషణను ప్రసరించే హరిని దాదాపు ముప్పై సంవత్సరాలుగా చూస్తున్నాను. హరి, రహి, వసుధ వంటి అనేకపేర్లతో ఆయన చేసిన రచనలను చదువుతూ, వేదికలమీద కొన్ని డజన్లసార్లు, ఏకాంత, సామూహిక సంభాషణల్లో కొన్ని వందలసార్లు ఆయన మాటలను వింటూ పొందిన ఆశ్చర్యాలకు ఇక ముగింపు. మొత్తం చదవండి »
సంస్మరణ
సెప్టెంబర్2008
ప్రాణహిత
కేవలం తెలుగు పుస్తకాలు చదివి, వాటి గురించి మాట్లాడుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పదేళ్ళపాటు నిర్విఘ్నంగా, నిర్విరామంగా కొనసాగుతుందని ప్రారంభంలో ఎవరూ ఊహించి ఉండరు. నిజానికి ఈ సమావేశాలు 1998లో మొదలైనప్పుడు ఏదో నలుగురైదుగురు అప్పుడప్పుడూ కలుస్తుండేవారు. మొత్తం చదవండి »
సాహిత్య ప్రకటనలు