Sep2008
అక్షరం
- అన్వర్
అక్షరం
గాయపెట్టి గాయపడ్డది
అక్షరం
కంట్లోగుచ్చుకున్న ముల్లు
గుండెలో దిగిన బాడిశ
నిలబడ్డ దేహాన్ని అడ్డంగా కోసిన రంపమైందా?
ఉద్వేగ ఉద్విగ్న ఉద్రేకాల వర్తమానాన
ఝండాగా రెపరెపలాడాల్సిన అక్షరం
అందరికోసం అర్ధరాత్రుల వరకు అల్లల్లాడే అక్షరం
మొద్దు నిద్దర్లను లేపి వెలుగును మోసుకొచ్చే అక్షరం
అసందర్భంగా పేలిన తుపాకై
ఉదయమే అనేక హృదయాలను గాయపర్చిందా?
అటుఇటు ప్రశ్నలు
అటుఇటు పరితాపాలు
అటుఇటు ధిక్కారాలు
అక్షరం పుట్టిన చోట గుండెమీద బండలు పడ్డాయి.
ఆపిందెవరు?
ఆగిందెవరు?
హృదయంలో గూడు కట్టుకున్న సమూహ సమూహాల్ని చెల్లాచెదురు
నమ్మిన జనాల మధ్య అక్షరం నిర్భంధం దిగ్భంధం
ఎవరిపోటీ ఎవరి పరుగు ఎవరి పరువు నష్టం
బరువైన ఒంటరి దు:ఖమై
రగిలిందెవరు?
నలిగిందెవరు?
అస్తమిస్తున్న వర్తమానానికి
చీకటి చేతులిస్తున్నదెవరు?
అక్షరం అరెస్టయ్యక
నలుపెవరు?
తెలుపెవరు?
ఒక దిష్టిబొమ్మ
బాణం లేనిదే కావచ్చు
పానాల మీద కూసున్నది
(కె.శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసినందుకు నిరసనగా)
October 2nd, 2008 at 6:03 am
[...] అక్షరం : అన్వర్ [...]
October 2nd, 2008 at 6:05 am
[...] కాలిఫోర్నియా కబుర్లు’, అన్వర్ ‘ అక్షరం’, పాపినేని శివశంకర్ ‘ [...]