కానుగ పూల వాన

- కోసూరి

kanugapula_vana.jpg

మనిషి మనిషికొక
మాధ్యమం అవసరం
ప్రపంచమ్మొత్తం వూరవుతున్న
అనివార్యమైన సందర్భంలో
మనిషికీ మనసుకీ మధ్య
మజిలీలు ఏర్పడుతున్న
కొత్త తరహా ప్రకృతిలో
మనిషి,మనిషికీ ఒక
మాధ్యమం అవసరం
మాటలు రూపాయిలుగా
మారకమవుతున్నపుడు
అక్షర రూపానికి
ఆమడ దూరంలో నిలుస్తున్నాడు

పుస్తకం చదివేవాడిపుడు
పురుగు కూడా కాదు
మునివేళ్ళతో ప్రపంచాన్ని
ముందుకూ వెనుకకూ జరుపగల యంత్రం
మనిషి మనిషికీ మధ్య ఒక
మాధ్యమం అవసరం
అది మనుషుల మధ్య
అదృశ్య వంతెనను నిర్మిస్తుంది
భావాలు పూలరధాలుగానో
నిట్టూర్పు వెచ్చదనాల పాదాలతో
పరుగుగానో , నడకగానో, బాటసారిగానో,
బతుకు చివరిదాకా ప్రయణమే
ఎన్ని వేసవులు ఎదురైనా
ఒక్క ఉగాదితో పూలనదులు పారినట్లు
వేకువకు ముందు
మాటలు కాసిని పోగేసుకుని
మంచు కురుస్తున్నపుడు.
వీధులన్నీ మాటలు మరచి
వింటున్నపుడు.
బొమ్మలు తెచ్చే తీగలన్నీ
చల్లగా నిద్దరోతున్నపుడు,
అసలు సిసలు మాటలు
ముసుగుల్లేకుండా
అరికాళ్ళతో పాదయాత్ర చేస్తున్నపుడు
మనిషి మనిషికీ ఒకే ఒక్క
భాష దిక్కవుతుంది

అది బతుకుకు భాహ్యమై మిగుల్తుంది
కానుగ పూలవానై
మనస్సమూహాల మీద కురుస్తుంది
మాటనేర్చేతనం నుండీ
మాటలు మరచిపోతున్న కాలంలో
బతుకు సాగిస్తున్నాం.
కాసిని మాటలు పంచుకుందాం.
నాలుగు అక్షరాలు
చచ్చిపోతున్న ఉత్తరాల మీద చల్లుదాం
ఫోన్ల ముందు నుంచి,
టీవీల,సిస్టంల,ముందునుంచి,రోడ్ల మీద బూజుపడుతున్న
వాహనాల మీద నుంచి శరీరాల్ని
వూరవతలి చింత తోపులోకి చేరుద్దాం.
మాటల్ని బతికించుకోకపోతే
మనిషి ముందుకెలా వెళ్తాడూ?!

(ఇంట్లో టీ.వీలకూ, కాల్‌సెంటర్‌లో కాంప్యూటర్లకూ అంటుకుపోయి మాట మరచిపోతున్న కొత్తతరం కోసం)

Share/Save/Bookmark

కవితలు

3 అభిప్రాయాలు

  1. Hrk సెప్టెంబర్ 2008 1

    పొయెం చాల బాగుంది. పరిణామాలు ‘అనివార్యమవుతున్నప్పుడు’ పాతవాటిలో మంచివి కొన్నిటినైనా కాపాడుకోడుకోవాలనే తపన బాగుంది.
    కాని, వూరవతల చింత తోపు లేదు. మొన్న వూరెళ్లాను హైదరాబాద్ నుంఛి. వూరవతల చిన్ననాడు ఆడుకున్న చింత తోపు కోసం తెగ వెదుక్కున్నాను. లేదు. అదే ప్రయాణంలో అమ్మమ్మ వూరు కూడా వెళ్లాను. అక్కడి చింత తోపు కూడా లేదు. ఇంకా ఏమైనా ఎక్కడైనా మిగిలి వుంటే, రేపటికి వుండవు.
    అన్నీ పోయినా, ‘తపన’ గొప్పదే. తపన సజీవంగా వున్నంత వరకు, మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం వుంటుంది. అది కూడా లేకుంటే ఇంకేమీ లేనట్లే.

  2. ప్రాణహిత » సెప్టెంబర్ 2008 సూచిక అక్టోబర్ 2008 2

    […] కానుగ పూల వాన : కోసూరి […]

  3. ప్రాణహిత » సెప్టెంబర్ 2008 సంపాదకీయం అక్టోబర్ 2008 3

    […] సెప్టెంబర్ సంచికలో కోసూరి‘ కానుగ పూల వాన’,డా. కె. గీత ‘ వేసవి కాలిఫోర్నియా […]

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో